Sunday, October 11, 2026

జ్ఞానం ఉన్నవారు జీవితంలో గెలవలేరు || ప్రొఫెసర్ కాశీం

జ్ఞానం ఉన్నవారు జీవితంలో గెలవలేరు || ప్రొఫెసర్ కాశీం

Author Name:Prof Kaseem

Youtube Channel Url:https://www.youtube.com/@profkaseem8854

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p-KT921BNL8





Title: జ్ఞానం ఉన్నవారు జీవితంలో గెలవలేరు || ప్రొఫెసర్ కాశీం

Author Name: Prof Kaseem

Description: జ్ఞానం ఉన్నవారు జీవితంలో గెలవలేరు
In this video, Prof. Kaseem Sir discusses the relationship between knowledge, practical life, decision-making, and success. The discussion explores why having knowledge alone may not always translate into success in life.
Prof. Kaseem Sir explains how knowledge needs to be combined with practical understanding, action, experience, and the ability to make timely decisions. The video encourages viewers to think about what truly contributes to success in life.
Public Awareness Disclaimer:
This video is intended for educational and public-awareness purposes. The views expressed are part of the discussion and should be understood in the appropriate context.
👉 Watch the full video for the complete discussion.
👍 Like | Share | Comment | Subscribe
#ProfKaseem #KaseemSir #Knowledge #SuccessInLife #LifeLessons #KnowledgeAndSuccess #Education #PracticalKnowledge #LifeSkills #Success #Motivation #TeluguMotivation #TeluguEducation #TeluguContent #TeluguYouTube #Telangana #TelanganaNews #PublicAwareness #EducationalContent #SelfImprovement #PersonalDevelopment #LifeExperience #DecisionMaking #KnowledgeIsPower #SuccessMindset #MotivationalSpeech #TeluguSpeech #KaseemSirAnalysis #Inspiration #Learning #Wisdom #StudentMotivation #YouthMotivation #LifeAdvice #TeluguMotivationalVideo

Transcript:
(00:07) [సంగీతం] గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ ఈ ఛానల్ ను చూసి ఈ వీడియోలను ఆదరించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనమందరం తప్పక నిత్య జీవితంలో పాటించవలసిన ఒక విషయం గురించి చర్చించుకుందాం. చాలా ముఖ్యమైనది చిన్నప్పటి నుంచి చివరి వరకు మనిషికి బుద్ధి తెలిసినప్పటి నుంచి మరణించే వరకు తప్పనిసరిగా మనం వినే మాట మనం మాట్లాడే మాట క్రమశిక్షణ మనిషికి క్రమశిక్షణ ఉంటే విజయతీరాలను చేరుకుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు.
(00:42) చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు చెప్తుండేవాళ్ళు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం. క్రమ్యముగా, మర్యాదగా, శిరస్సు వంచుకొని, క్షణం క్షణం నడుచుకునే వాళ్లే క్రమశిక్షణ ఉన్నవాళ్ళు అని చెప్పేవాళ్ళు పెద్దలు. క్రమ్యముగా మర్యాదగా శిరస్సు వంచుకొని క్షణం క్షణం నడుచుకునే వాళ్ళు అని మనుషులకి చాలా మందికి జ్ఞానం ఉంటుంది కానీ ఆ జ్ఞానం సరైన పద్ధతిలో వెళ్ళాలంటే సరైన పద్ధతిలో జ్ఞానం వికసించాలంటే అందాలంటే జ్ఞానం ఒక్కటే సరిపోదు సరైన క్రమశిక్షణ కూడా ఉంటేనే విజయాన్ని అందుకోవడానికి మార్గం సులభం అవుతుంది.
(01:17) క్రమశిక్షణ అంటే తనకు తాను వేసుకున్న నియమాలను లక్ష్యాలను కష్టపడి నిబద్ధతతో పాటించడం అని అర్థం. ప్రతి ఒక్కరికి కొన్ని నియమాలు ఉండాల్సింది. వ్యక్తికి నియమాలు ఉంటాయి కుటుంబానికి నియమాలు ఉంటాయి సమాజానికి నియమాలు ఉంటాయి ఇవన్నీ ఎందుకోసం అంటే వ్యక్తి, కుటుంబం సమాజం వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఆ లక్ష్యాలను చేరే క్రమంలో పడే కష్టం ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతది? క్రమశిక్షణతో సాధ్యమవుతది. నిబద్ధతతో సాధ్యమవుతుంది.
(01:45) అంతర్గత శక్తి చాలా మందికి ఉంటుంది. ఆ అంతర్గత శక్తి బయటికి వచ్చి సమాజానికి ఉపయోగపడాలంటే అనుకున్న ఫలితం సాధించాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ నుండి తీరవాల్సిందే. ప్రతి ఒక్కరం అనుకుంటాం ఉదయం ఐదు గంటలకు లేవాలని అనుకొని పడుకుంటాం. పడుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలు కాగానే దుప్పటి మూసుకొని మళ్ళీ పడుకుంటాం.
(02:07) చలి పెడుతుందని వర్షం వస్తుందని పడుకుంటాం. చలి పెట్టినా వర్షం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా ఐదు గంటలకు లేవాలి అనుకుంటే లేవటమే ఆ నిద్ర నుంచి మేల్కొని వాకింగ్ చేయాలి రన్నింగ్ చేయాలి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే ఐదు గంటలకు లేవటమే అది క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ అంటే మనకు నచ్చినప్పుడు మనం చేయటం కాదు చేయవలసినప్పుడు చేయటం అని అర్థం నీకు నచ్చినప్పుడు లేదా నాకు నచ్చినప్పుడు ఒంటి గంటకు అన్నం తింటా అంటే కాదు నీకు నచ్చినప్పుడు నాకు నచ్చినట్లు 10 గంటలకు ఎగజామ్ ఉంటే 11 గంటలకు సెంటర్ కి పోతా అంటే కాదు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మనం తయారు కావటము అని వర్షం
(02:45) పడుతున్న ఎంత అలసిపోయినా జిమ్ కు వెళ్ళాలి అంటే వెళ్ళటమే వ్యాయామం చేయాలి అంటే చేయటం రేపు పరీక్ష అంటే ఈరోజు చదవడం క్రమశిక్షణ కాదు ఆరు నెలల తర్వాత సెమిస్టర్ పరీక్ష ఉందంటే ఆరు నెలల ముందే చదవటం ప్రారంభించటం క్రమశిక్షణ రోజుకు ఒక పేజీ చదువుకుంటూ వెళ్ళండి ఆరు నెలల్లో నెలకి 30 రోజులు ఆ లెక్కలో రోజుకు మీరు ఒక పేజీ చదివితే ఒక 500 పేజీల పుస్తకాన్ని సులభంగా చదివేయొచ్చు.
(03:12) పరీక్షలో సులభంగా రాసేయొచ్చు. ఒకేసారి 600 పేజీల పుస్తకం చదివి మెథడ్లో గుర్తుపెట్టుకొని పోయి ఎగ్జామ్ రాయడం అనేది ఏ మనిషికి సాధ్యమయ్యే పని కాదు. మనిషికి సమయం, ఆరోగ్యం, ఆలోచనలు, అధ్యయనం, డబ్బు, పని, మానవ సంబంధాలు, భావోద్వేగాలు ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. ఆయా రంగాల్లో వీటన్నిటిని కంట్రోల్ లో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళటం అంటే వెళ్ళాలంటే మనిషికి క్రమశిక్షణ అనేది తప్పనిసరిగా వస్తది.
(03:40) ప్రతి నెల ఎంతో కొంత జీతం వస్తది. 10,000 వచ్చే వాళ్ళు ఉంటారు 5000 వచ్చే వాళ్ళు ఉంటారు 15,000 వచ్చేవాళ్ళు ఉంటారు 50,000 వచ్చేవాళ్ళు ఉంటారు లక్ష వచ్చేవాళ్ళు ఉంటారు 4 లక్షలు వచ్చే వాళ్ళు ఉంటారు. ఎవరికీ తోచినంత వాళ్ళు ప్రతి నెల తమ జీతంలో ఒక 10% 20% హీన పక్షంలో 5% ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక పద్ధతి. ఆ ఇన్వెస్ట్ చేయటం మూలంగా ఇవ్వాళ మీరు చేసిన ఇన్వెస్ట్ 10 ఏళ్లకి 20 ఏళ్లకి అది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది.
(04:08) చాలామందికి వివిధ సందర్భాల్లో కోపం వస్తది. బంధువుల మీద కోపం వస్తది మిత్రుల మీద కోపం వస్తది సమాజంలో తోటి మనుషుల మీద కోపం వస్తది. కోపం వచ్చినప్పుడు కోపాన్ని బయటికి వెళ్లగతే అవతలి వాళ్ళు రియాక్ట్ అవుతే ఘర్షణ ఏర్పడితే మానవ సంబంధాలకి గండి పడుతుంది. అదే ఆ 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మౌనంగా అటు నుంచి కొద్ది దూరం వెళ్ళిపోతే అనేక సమస్యలకు అదే పరిష్కారం అదే క్రమశిక్షణ జ్ఞానం కేవలం మ్యాప్ లాంటిది.
(04:37) క్రమశిక్షణ ఆ మ్యాప్ ను చూసి నడుచుకోవటం లాంటిది జ్ఞానం ఉంటే సరిపోదు ఆ జ్ఞానం ఉన్నటువంటి మనిషి సరిగ్గా నడవటం అనేది క్రమశిక్షణ చాలామంది ఈ మధ్యకాలంలో హోటల్ తిండికి బాగా అలవాటు పడ్డారు పట్టణాల్లో చిన్న చిన్న పట్టణాల్లో కూడా వ్యాపించింది అంటే నియోజక వర్గాలు మండల హెడ్ క్వార్టర్లో కూడా వ్యాపించింది. హైదరాబాద్ లాంటి నగరాల్లోన అయితే కుటుంబాలు వారంలో మూడు నుంచి నాలుగు రోజులు బయట హోటల్లో తిట్టున్నారు.
(05:00) కనుక విపరీతంగా హోటల్లు పెరిగిపోయినాయి. టోటల్ బిజినెస్ లాభదాయకమైన బిజినెస్ గా మారింది. ఇంట్లో కూర్చొని కాళ్ళు కదపకుండా సోఫా సెట్ లో కూర్చొని సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని స్విగ్గీలో ఆర్డర్ చేస్తే మన ఇంట్లోకి బిర్యానీ వచ్చి పడుతుంది. మన ఇంట్లోకి పిజ్జాలు వచ్చి పడుతుంది. అవి తిని తమ వయసుకి మించిన బరువు ఎక్కిపోయి ఉన్న స్థితి చూస్తున్నాం.
(05:21) ఎప్పుడో ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతాం. బరువు తగ్గండండి అని చెప్తాడు డాక్టర్ ఆ డాక్టర్ చెప్పగానే ఇంటికి వచ్చేసి ఆ రోజు రాత్రి అన్నం తినకుండా ఇక ఈరోజు నుంచి బరువు తగ్గాలే అని చాలా గట్టిగా నిర్ణయించుకుంటారు. బరువు తగ్గాలంటే రోజు పొద్దున గంట సేపు వాకింగ్ చేయాలని అనుకుంటా అనుకుంటే సరిపోతుందా? ఆ ఉదయం ఆ ఉదయం అట్లా ఒక మనిషి ఏదైనా ఒక పనిని 40 డేస్ చేస్తే అది జీవితంలో ఒక అలవాటుగా మారిపోతుందని సైన్స్ చెప్తుంది కనుక క్రమశిక్షణ అంటే అనుకోవటం కాదు క్రమశిక్షణ అంటే అనుకున్నదాన్ని అమలు చేయటం చాలామంది పుస్తకాలు చదవాలి అనుకుంటారు పుస్తకాలు చదవాలి కదా చదవాలంటే
(05:55) ఎలా సాధ్యం అవుతది అనుకుంటే సాధ్యం కాదు జ్ఞానం ఉన్నవాడు ఏమి చేయాలో తెలుసు కానీ చెయ్యరు ఎందుకు చేయరు క్రమశిక్షణ లేకపోవటం మూలంగా చేయరు క్రమశిక్షణ ఉన్నవాళ్ళు చేయాల్సిన పని పనిని తప్పనిసరిగా చేస్తారు. సమయానికి చేస్తారు కొందరు బిజినెస్ చేస్తారు. గొప్ప తెలివితేటలు అక్కర్లేదు ఒక మంచి పథకం ఉండాలి దానికి ఒక మంచి వ్యూహం ఉండాలి స్ట్రాటజీ అని అంటాం కదా అలా అది తెలిసి ఉండాలి అంతే అలాంటి తెలిసిన వ్యక్తి చాలా రోజుల నుంచి వ్యాపారంలో ఉన్న వాళ్ళ కన్నా చాలా వేగంగా కస్టమర్లని ఆకర్షించి మంచి వస్తువులని అమ్మి వ్యాపారంలో ముందంజలో ఉంటారు. ఎలా
(06:32) సాధ్యమైంది వారికి ఉండే క్రమశిక్షణ వలన అది సాధ్యమైంది. జ్ఞానం స్టాటిక్ లాంటిది క్రమశిక్షణ డైనమిక్ లాంటిది చిన్న చిన్న చర్యల ద్వారా మనం పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు. ఒకేసారి కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకుంటారు కొందరు ఏ నేను ఐఏఎస్ ఆఫీసర్ నేనే అవుతా అని కూర్చునటోళ్ళు ఉంటారు. నేను సినిమా తీస్తే రాజమౌలి సినిమాను దాటిపోవాలనుకుంటుళ్ళు ఉంటారు.
(06:55) అలా సాధ్యం కాదు జీవితంలో ఎప్పుడు కూడా అవి రేర్ కేసులు ఉంటాయి కొన్ని ఒకటో రెండో అట్లాంటి ఉదాహరణలు చూస్తాం. చిన్న పని నుంచే మనం ఉన్నత శిఖరలకి ఏదైనా 100 మెట్లు ఎక్కాలంటే మొదటి మెట్టున కాలు పెట్టాల్సిందే కదా కనుక అది క్రమశిక్షణతో పని చేయాల్సింది ఉదాహరణకి రోజు ఒక 10 పేజీలు మనం చదవటం మొదలు పెట్టామ అనుకోండి ఒక సంవత్సరంలో 3650 పేజీలు చదువుతాం అట్లే రోజుక ఒక శాతం మెరుగు పడటం అనేది పెట్టుకుంటే అతి కొద్ది రోజుల్లోనే మనం 20% 30% మన జీవితంలో మెరుగు వస్తుంది.
(07:24) కనుక ఎక్కడైనా ప్రాథమిక స్థాయి నుంచే భూమి మీద నుంచే ప్రారంభం కావాలి చాలామంది జ్ఞానం ఉన్నవాళ్ళు ఉంటారు మన చుట్టూ కానీ ప్రతి పనికి ఆలస్యం చేస్తారు ఎందుకు ఆలస్యం చేస్తారు ఉదాహరణకి ఒక ఉపన్యాస పోటీలో పాల్గొనాలి ఉపన్యాస పోటీలో పాల్గొనాలంటే జ్ఞానం ఉండాల్సిందే క్విజ్ పోటీలో పాల్గొనాలంటే జ్ఞానం ఉండాల్సిందే ఉపన్యాస పోటీ ప్రారంభమయ్యే సమయానికి అక్కడ చేరుకుంటేనే నీకున్న జ్ఞానం అక్కడ ప్రదర్శించబడుతుంది లేకపోతే నీకు ఉండే సోమర్తనం వలన ఆలస్యంగా వెళ్తే ఆపో పోటీలో ఉండలేము ఆ పోటీకి బయట ఉండిపోతాం.
(07:56) క్రమశిక్షణ ఉన్నవాళ్ళు ఏ పనినైనా సరే ప్రారంభం చేస్తారు దాన్ని కంటిన్యూగా కొనసాగిస్తూ ఉంటారు. కొద్దిమంది ఏదైనా చేస్తే మనం ప్లాన్ చేసినమంటే ఇంకొకడు వేలు పెట్టి చూయించే అవకాశం ఉండకూడదు అంటారు ప్లానే చేయరు అసలు అంటే అతి ఎక్కువ పర్ఫెక్షన్ కోరుకుంటారు కొందరు అది సాధ్యం కాదు నెలల తరబడి ఉత్తమమైన దానికోసం ఆలోచించడం కంటే 50% 60% మన ఆలోచనలో ఉన్నదాన్ని ఆచరణలో పెట్టుకుంటూ పోతే మనకు ఒక మార్గం ఏర్పడుతుంది.
(08:27) ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి. ఫలితంగా వాటిని సరిదిద్దుకొని విజయం వైపు ప్రయాణం చేస్తాం. విజయం ఒక్క రోజులో నీ చెంతకు రావాలని కోరుకోవటం అత్యాశ రాదు కూడా అది రోజు చేయటం మూలంగానే సాధ్యమవుతుంది. బిడ్డ పుట్టగానే పరిగెత్తాలని అనుకోవటం ఎంత నిరాశనో ఇది కూడా అలాంటిదే క్రమశిక్షణ మన ప్రతి చర్యని సుసంపన్నం చేస్తుంది.
(08:50) ప్రతి చర్యని పరిపక్వం చేస్తుంది. ప్రతి చర్యకి ఫలితాన్ని ఇస్తుంది. కొందరు రచయితలు కావాలనుకుంటారు. గొప్ప రచయితలు కావాలనుకుంటారు. పుట్టుకతో గొప్ప రచయితలు అవుతారా ఎవరన్నా రాస్తూ పోతూ ఉంటే రాతలో అనగ అనగ రాగమతి చేయించును తినగ తినగ వేము తీయగుండును పెద్ద మనిషి చెప్పాడు కదా అలా రాత రాస్తూ ఉంటే నీ రాతలో 10 వస్తుంది. ఒక గొప్ప రచయిత రోజుకు ఒక 500 పదాలు రాస్తే ఒక సంవత్సరంలో అది ఒక పుస్తకం అవుతుంది.
(09:17) అదేవిధంగా రోజు ఒక గంట ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే ఒక 40 రోజుల్లో చాలా మార్పు కనిపిస్తుంది. దాన్నే కన్సిస్టెన్సీ అంటాం. ఏవైనా క్రీడలు ప్రాక్టీస్ చేసినా లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసినా కంప్యూటర్ ప్రాక్టీస్ చేసినా ఏ నైపుణ్యం అయినా సరే నిరంతరం క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేయటం మూలంగా అందులో మనకు నిపుణత వస్తుంది.
(09:39) జ్ఞానం లేకుండా క్రమశిక్షణ ఉన్నా నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు. కొందరికి జ్ఞానం తక్కువ ఉండొచ్చు. ఆ జ్ఞానం నిరంతరం పని చేయటం మూలంగా, ఆలోచించడం మూలంగా, చదవటం మూలంగా, గమనించటం మూలంగా, పరిశీలించటం మూలంగా జ్ఞానం వస్తది. కానీ ఆ పని చేయాలంటే ఏముండాలి క్రమశిక్షణ ఉండాలి ఒక మామూలు సామెత ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు బుద్ధి ఉన్నోనికి ఎద్దు ఉండదు అంటారు ఎందుకంటారు ఈ మాట నీ బుద్ధి నీకు ఉన్నా ఆ ఎద్దును సరైన సమయంలో పని చేయించేటటువంటి ఒక పద్ధతి కలిగి ఉండాలి క్రమశిక్షణ లేకుండా జ్ఞానం ఉంటే వెన్నెల రాత్రుల్లో మిద్య మీద పడుకొని కలలు కంటాం ఏం కలలు గోరక్పూర్
(10:17) ఐఐటీ లో సీట్ వచ్చినట్లు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసినట్లు మెయిన్స్ పాస్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లు ఇంటర్ ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు యూపీఎస్స ఫలితాల్లో మొదటి ర్యాంక్ వచ్చినట్లు నీ జిల్లాకి నీవు కలెక్టర్ గా వచ్చినట్లు ఆ కలల వలన ఏమి రావు అవి కలలు అయిపోతాయి. కనుక చదువు తక్కువగా ఉన్నా డిగ్రీలు లేకపోయినా హార్డ్ వర్క్ చేసినటువంటి వాళ్ళు ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయ్యారు.
(10:43) కనుక హార్డ్ వర్క్ అనేది దేని వలన సాధ్యమవుతుంది క్రమశిక్షణ వలన సాధ్యమవుతుంది. డిగ్రీలు కేవలం కాగితాలు జ్ఞానం క్రమశిక్షణ రెండు ఉంటేనే డిగ్రీ పనికొస్తుంది. ఒక్కొక్కసారి డిగ్రీ లేకపోయినా బల్బును కనిపెట్టిన వాళ్ళు, ఫ్యాన్ కనిపెట్టిన వాళ్ళు, విమానాన్ని కనిపెట్టిన వాళ్ళు, రైళ్లు కనిపెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఏం డిగ్రీలు చదువు ఆనకట్టలు కట్టిన వాళ్ళు ఆపిల్ పండు పై నుంచి కిందకి ఎందుకు పడుతుంది కింద నుంచి పైకి ఎందుకు పోతలేదు అని ఆలోచించిన వాళ్ళు తొట్టిలో ఉండే నీళ్లు ఆ నీళ్ళలోకి మనిషి వెళ్ళేసరికి ఆ నీళ్లు బయటికి ఎందుకు పోయినాయి అని ఆలోచించిన వాళ్ళు వీళ్ళేం
(11:15) పెద్ద పెద్ద పిహెచ్డిలు చేయలేదు. పరిశీలన వలన క్రమశిక్షణ వలన తాము అనుకున్న వాటిలో విజయవంతంగా ప్రపంచాన్ని జయించారు. ప్రపంచానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చారు. క్రమశిక్షణ ఒకసారి మన జీవితంలో భాగమయిందంటే అది నిరంతరం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అది రోజు ప్రాక్టీస్ చేసే ఒక అలవాటుగా మారాలి. క్రమశిక్షణ ఉండాలి అనుకుంటే సరిపోదు.
(11:37) దాన్ని పాటించడం వలన మాత్రమే అయితే రోజు చేసే ఏవైనా చిన్న చిన్న పనులైనా సరే మన ఉజ్వలమైన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ప్రతి రోజు మనిషి ఓ 20 నిమిషాలో 30 నిమిషాలో యోగ చేయాలనుకున్నారు అనుకోండి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని అనుకున్నారు అనుకోండి ఆ పని చేస్తేనే నీకు ప్రశాంతత వస్తుంది తప్ప చెయ్యాలి అని మనసులు అనుకుంటే ప్రశాంతత రాదు కనుక చిన్న చిన్న లక్ష్యాలని నిర్ణయించుకోండి ఒక పేపర్ తీసుకొని రాసుకోండి వాటిని సాధించామా లేదా అని రివ్యూ చేసుకోండి మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోండి ఆ తర్వాత మీ జీవితంలో ఊహించని మార్పు వస్తుంది కనుక మా టీచర్ చెప్పినట్లు దాని
(12:13) అర్థం దాని విశ్లేషణ వ్యాకరణబద్ధంగా చూడకండి క్రమ్యముగా మర్యాదగా శిరస్సు వంచుకొని క్షణం క్షణం నడిచే వాళ్లే క్రమశిక్షణ ఉన్నవాళ్ళు అని ఆ చిన్నప్పుడు నేర్చుకున్న మాటను మళ్ళీ గుర్తు చేస్తుంది ఆ అక్షరాలని ఆ అర్థంలోనే కాకుండా అందులో ఉండే ఒక స్థూలమైన భావాన్ని మాత్రం తీసుకోవాలి తప్పనిసరిగా ఒక క్రమ పద్ధతి ఉండాలి మనం ఎదుటి వాళ్ళకు మర్యాద ఇస్తేనే ఎదుటి వాళ్ళు మనకు మర్యాద ఇస్తారు శిరస్సు వంచుకొని నడవాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్లు తలెత్తుకొని నా దేశంలో నేను తిరగాలి అన్నాడు కదా ఇక్కడ శిరసు ఉంచుకొని నడవటం అంటే క్రమశిక్షణకి శిరసు ఉంచుకొని
(12:47) అని అర్థం అక్కడ ఎవరికో వ్యక్తులకి శిరసు ఉంచుకొని నడుచుకోవటం నిరంతరం ఒక ప్రాక్టీస్ లో ఉండటం అనేది తప్పనిసరిగా మీ జీవితంలో మీరు పాటించండి అద్భుతాలు మీరు చూస్తారు 10 ఏళ్ల వయసు అప్పుడు నిర్ణయం చేసుకోండి. 25 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఈ ప్రపంచం నీ కాళ్ళ ముందు ఉంటుంది.

No comments:

Post a Comment