Thursday, January 26, 2023

పశ్చాత్తాపం

 3009.  1-3.   270123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                    *పశ్చాత్తాపం*
                    ➖➖➖✍️


*నగరంలోనే పేరు మోసిన అపార్ట్మెంట్ అది. ఒక్కో ఫ్లోర్ కు ఒక ట్రిపుల్ బెడ్రూం, ఇంకో డబుల్ బెడ్రూం మాత్రమే వుంటాయి.   విశాలమైన పార్కింగ్ ఏరియాతో, ఖరీదైన సెంటర్ లో కట్టారు.  చూడటానికి చాలా హుందాగా, రిచ్ లుక్ తో కనిపిస్తూ వుంటుంది.  అందులో ట్రిపుల్ బెడ్రూం     ఫ్లాటు కొనొక్కొని వుంటున్నాడు మోహనరావు.  రెవెన్యూ శాఖలో పెద్ద ఉద్యోగం చేసి, రెండు చేతులా దండిగా సంపాదించి, రిటైర్ అయ్యాక తన ఫ్లాట్ ను      సర్వాంగ సుందరంగా చేసుకొని భార్యతో నివాసం ఉంటున్నాడు.     చీకు చింతా లేదు. పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. రిటైర్మెంట్ డబ్బులు, ఇతరత్రా డబ్బులు బ్యాంక్ ఖాతాలో మూలుగుతున్నయి. తన ఆడి కార్ కు డ్రైవర్, ఇంట్లో వంట మనిషి, ఇతర పనులకు ఒక పని మనిషి కూడా మెయింటైన్ చేస్తూ దర్జాగా భార్యతో కాలం వెళ్లదీస్తున్నాడు.*

*ఉదయం నుంచి విసుగు వస్తుంది. కోపం నషాళానికి అంటింది. ఎదురుగా వున్న డబుల్ బెడ్రూం ఫ్లాట్ లో నుండి దగ్గుతున్న శబ్ధం వినిపిస్తుంది. కొంపతీసి కోవిడెమో అని అనుమానం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలతో ఈ మధ్యనే వచ్చి వుంటున్నారు. ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. ఈ అపార్ట్మెంట్ లో ఉండగలిగే స్థాయి వాళ్ళది కాదని మోహన్ రావు చికాకు. పైగా వారం రోజుల నుండి ఎవరూ బయట కనిపించడం లేదు. ఎవరో సరుకులు గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళడం గమనించాడు. ఖచ్చితంగా కరోనా అనే నిర్దారణ చేసుకొని, ఆ ఫ్లాట్ ఓనర్ కి ఫోన్ చేసి వాళ్ళని అర్జెంట్ గా ఖాళీ చేయించమని గొడవ చేశాడు.*

*అపార్ట్మెంట్ కమిటీ మీటింగ్ సాయంత్రం పెట్టించి, వచ్చే ఒకటవ తారీఖు కల్లా ఖాళీ చేయమని ఫోన్లో చెప్పించాడు. అప్పటికి కాని ఆ మిడిల్ క్లాస్ మీద వున్న కోపం కొద్దిగా శాంతించ లేదు. హమ్మయ్య ఒకటో తారీఖు తరవాత వీళ్ళ గోల వుండదని ప్రశాంతంగా నిద్ర పోయాడు ఆరోజు.*

*చూస్తుండగానే నాలుగు రోజులు అయ్యింది. ఐదో రోజు…!        రోజూ వచ్చి కనిపించే డ్రైవర్ రాలేదు. ఫోన్ చేసాడు మోహన్ రావు. మొన్న "హైదరాబాద్ వెళ్లి వచ్చాం కదండీ. వచ్చిన దగ్గర నుండి జలుబు, జ్వరంగా వున్నాయి. టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది సార్" అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు డ్రైవర్. తను కూడా డ్రైవర్ తో కలిసి హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. గతుక్కుమన్నాడు మోహన్ రావు. సాయంత్రానికి తనకి, భార్యకి జ్వరం, తలనొప్పి, వంటి నొప్పులు, దగ్గు ప్రారంభం అయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేస్తే, కరోనా టెస్ట్ కిట్ తో ఒక కుర్రాడు వచ్చి, శాంపుల్స్ తీసుకొని వెళ్ళాడు. తెల్లవారి ఉదయం డాక్టర్ ఫోన్ చేసి చెప్పాడు భార్యభర్త లిద్దరికి కరోనా పాజిటివ్ అని, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ, 15 రోజులు క్వారంటైన్ కావాలని, వాడుకోవడానికి మెడికల్ కిట్ పంపించాడు..*

*మోహన్ రావుకి ఏం చేయాలో తోచలేదు. వంట మనిషి, పని మనిషీ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే, తన కొచ్చిన కరోనా భయానికి నెల వరకూ రావడం కుదరదని తెగేసి చెప్పేశారు. వాచ్మెన్ కూడా తన ఫ్లాట్ కు రావడానికి భయపడుతున్నాడు. మిగతా ఫ్లాట్ ఓనర్స్ వెళ్లవద్దని కూడా చెప్పారట. అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు తామేమీ సహాయం చేయలేమని చెప్పేశారు. బంధువులకు కాల్ చేస్తే అందరూ రాలేమని అంటున్నారు. పిల్లలేమో ఎక్కడో అమెరికాలో వున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు మోహన్ రావుకి..!*

*నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కాలింగ్ బెల్ శబ్ధం వినిపించింది. డోర్ తీసి చూసాడు మోహన్ రావు. ఎదురుగా ఎదురింటి మిడిల్ క్లాస్ మాన్.. ‘పర్వాలేదు సర్, నన్ను లోనికి రానివ్వండి. నాకు కరోనా తగ్గిపోయి రెండు రోజులు అయ్యింది. నాకు కరోనా రెసిస్టెంట్స్ వుంది. భయం లే’దంటూ, వేడివేడి ఆహార పదార్థాల క్యారేజీ అక్కడ పెట్టి, తినే వరకు వుండి, వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేయించి, పట్టుకోవాల్సిన ఆవిరిని పట్టించి, ఖాళీ క్యారేజీని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా ఉదయం, సాయంత్రం అతనే వచ్చి, అన్ని రకాల సదుపాయాలు అమర్చి, భోజనం, మందులు అన్నీ తనే చూసుకుంటూ 15 రోజులు సహాయం చేశాడు.* 

*క్వారంటైన్ కాలం అయిపోవడం వలన ఆ సాయంత్రం ఫ్యామిలీ డాక్టర్ పంపిన అబ్బాయి వచ్చి శాంపుల్ తీసుకెళ్ళి పోయాడు.*

*తెల్ల వారింది. ఉదయం 8 గంటలకు డాక్టర్ ఫోన్ చేసి, కరోనా నెగటివ్ వచ్చిందని అభినందనలు తెలియజేసి, ‘ఇక ఏం భయం లేదు, మీరు బయటకు రావచ్చ’ని చెప్పాడు.* 

*ప్రశాంతంగా అనిపించింది మోహన్ రావుకు.. చావు భయాన్ని చాలా దగ్గరగా చూసినట్టు అనిపించింది.. ఎన్ని అస్తులున్నా, ఎంత మంది బంధువులున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అన్ని సార్లు ఉపయోగ పడవని అర్థం అయ్యింది.  ఇన్ని రోజులు ఇంత సహాయం చేసిన ఆ మిడిల్ క్లాస్ మనిషికి కృతజ్ఞతలు చెప్పాలని, జీవితంలో మొదటి సారి అనిపించి మెయిన్ డోర్ ఓపెన్ చేసాడు మోహన్ రావు. ఎదురు ఫ్లాట్ ఖాళీగా కనిపించింది. వాచ్మెన్ ను పిలిచి ఎదురు ఫ్లాట్ వాళ్ళు ఏమైయ్యారని అడిగాడు. ఇవ్వాళ ఒకటో తారీఖు కదండీ, వాళ్ళు రాత్రి ఖాళీ చేసి, వేరే ఊరు వెళ్లిపోయారని వాచ్మెన్ సమాధానం విని ఉలిక్కి పడ్డాడు మోహన్ రావు.*

*అప్పుడప్పుడు ఖాళీగా కనిపించే ఎదురు ఫ్లాట్ ను ఇవ్వాళ చూడాలంటే భయం వేసింది. పశ్చాత్తాపంతో కళ్ళు నేల చూపులు చూశాయి. దూరంగా మోగుతున్న గుడి గంటలు మోహన్ రావు చెవులకు మనుషుల్లో మహాత్ములు కూడా వుంటారని చెప్తున్నట్లు అనిపించింది. తన జీవితంలో తొలి మార్పుకు ఆ గుడి గంటలు శ్రీకారం చుడుతున్నాయి. మోహన్ రావు లోని ఇన్నాళ్లు దాగున్న మనిషి మొదటి సారి కన్నీళ్ళ రూపంలో బయట పడ్డాడు. అతనిలోని మానవత్వానికి ఇదే పునాదయ్యింది.*

*దైవం మానుష రూపేణ అనే మాటకు భావం ఇప్పుడే అర్థమయ్యింది...*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

అతిథి దేవోభవ!

 0710.   1-3.  270123-6. 
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              *అతిథి దేవోభవ!*
                ➖➖➖✍️

_-[‘ఆతిథ్యం’ అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు.]-_

*ఆత్మీయంగా ఆదరించడం ఆతిథ్యంలోని ప్రధానాంశం. ఇంటి ముందుకొచ్చి అర్థించిన ముష్టివాళ్ళక్కూడా ఆహారం పెడతాం. కానీ, అది ఆతిథ్యం కాదు.*

*ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదంటుంది యోగవాసిష్ఠం.* 

*సకలమూ బ్రహ్మస్వరూపమే. ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు... రూపంలో భేదాలే తప్ప ఇద్దరిలోనూ ఒకే అంతర్యామి కొలువున్నాడు కదా ! కనుక భేదం లేదు.*

*ప్రపంచంలో చెట్ల కన్నా మించిన ఆతిథ్య ధర్మం చూపగలవారు ఉండరు!ఎవరో నాటుతారు. ఇంకెవరో నీరు పోస్తారు. అవి కాలంతోపాటు చెలిమి చేస్తూ ఎదిగి వృక్షాలవుతాయి. పువ్వులు పూస్తాయి. కాయలు కాస్తాయి. పక్షులకు ఆశ్రయం, ఆహారం సమకూరుస్తాయి. బాటసారులకు నీడనిస్తాయి. చివరకు కట్టెలుగా మారి మనిషికి అక్కరకొస్తాయి.*

*ఇంతటి సేవాధర్మం నిర్వర్తిస్తూ, మౌనంగా జీవితం ప్రారంభించి, మౌనంగానే నిష్క్రమిస్తాయి.* 

*దత్తాత్రేయ గురుచరిత్రలో ఒక అవధూత, ప్రకృతిలో ఎందరో తనకు గురువులుగా చెబుతాడు.* 

*ప్రతి ప్రాణీ జీవితంలో ఉండే మౌన సందేశాలను అవధూత ఆకళింపు చేసుకుంటాడు. అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత చూడలేం. *

*ప్రాపంచిక దృష్టితో చూస్తే ఏదీ గొప్పగా అనిపించదు. వస్తువుల్ని, వ్యక్తుల్ని మన కొలబద్దతోనే కొలుస్తాం. మన దృష్టిని బట్టే అంచనాలు వేస్తాం.*

*శిలను శిల్పంగా మార్చినప్పుడు విలువ పెరుగుతుంది. బంగారం నగగా రూపొందినప్పుడూ అంతే. కొందరు సామాన్యులుగానే కనిపిస్తారు. కానీ, వారిలో అసమాన ప్రజ్ఞ దాగి ఉంటుంది.*

*వివేకానందుడు అమెరికా వెళ్లినప్పుడు ఆయన రూపం, వేషంకేసి అందరూ చులకనగా చూశారట. ఒక మహిళ ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. వివేకానందుడి తొలి సంబోధనతోనే సభ హర్షధ్వానాలతో దద్దరిల్లి పోయిందని చెబుతారు. ఆయన జ్ఞాన జ్యోతి. కొన్ని తరాలకు సరిపడా జ్ఞాన సంపదను ఆయన జిజ్ఞాసువులకు వదిలి వెళ్ళాడు.*

*ప్రపంచంలో జీవితావసరాలు లభిస్తాయి. కానీ, జ్ఞానం అంత సులువుగా లభించదు.*

*నచికేతుడి కథలో యముడు ఎన్ని విధాల ప్రలోభపెట్టినా, పట్టుదలగా అతడు జ్ఞానభిక్షనే కోరుకున్నాడు. అంతవరకు నిరాహారంగా, అతిథి మర్యాదలను తిరస్కరించాడు.*

*ప్రాణాధారమైన అన్నపానాలను గృహస్థు అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించడాన్నే అతిథి యజ్ఞం అంటారు. అంటే, అతిథిని సంతృప్తిపరిస్తే యజ్ఞఫలం దక్కుతుందని అర్థం చేసుకోవాలి. అతిథి రూపంలో ఇంద్రుడు వచ్చి బీదగృహస్థు రంతిదేవుణ్ని పరీక్షించిన కథ సుప్రసిద్ధం.*

*కుచేలుడికి కృష్ణుడు కేవలం స్నేహ వాత్సల్యమే చూపలేదు. అనితర సాధ్యంగా ఆతిథ్యమిచ్చాడు. స్వయంగా పాదాలు కడిగాడు. తన అష్టదేవేరుల చేత సేవలు చేయించాడు. అష్టైశ్వర్యాలూ అనుగ్రహించాడు.*

*ఇక్కడ మనం గమనించాల్సింది- ఆతిథ్యంలోని ఆత్మీయ భావనకున్న విలువ.* 

*ఆదిశంకరులకు      గృహిణి ఒక్క ఉసిరికాయను భక్తితో సమర్పించి, కనకధారా స్తోత్రానికి ప్రేరణనిచ్చింది. అదే ప్రపంచానికి కల్పవృక్షమైంది.*

*అతిథి తృప్తిపడినప్పుడు “అన్నదాతా సుఖీభవ” అన్న ఒక్క మాటకున్న విలువ అమూల్యం. ఆ మాటను అంతర్యామి ఆశీస్సుగానే భావించాలి.*

*అతిథికి ఆకలి, దాహం తీర్చగల ఆహార పానీయాలు సమకూర్చగలిగితే చాలు. అవి ఖరీదైనవా, సామాన్యమైనవా అనే ప్రసక్తి తలెత్తదు.*

*సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను భావించినట్లే అతిథిని దైవ స్వరూపంగా భావించి ఆదరించడమే భారతీయ సంప్రదాయం.* 

*అతిథికి కులమతాలతో, జాతితో ఎలాంటి దుర్విచక్షణా చూపకూడదు. అప్పుడే అది అసలైన ఆతిథ్యం అవుతుంది !✍️*

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

నేను ఎవరు ?--- ఆదిశంకరుల భజగోవిందం నుండి...*

 1210.  1-2.    270123-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                *నేను ఎవరు ?*
                ➖➖➖✍️


 *కా తే కాంతా కస్తే పుత్రః* *సంసారోఽయమతీవ విచిత్రః*
 *కస్య త్వం కః కుత ఆయాతః*
*తత్త్వం చింతయ తదిహ భ్రాతః||*

*--- ఆదిశంకరుల భజగోవిందం నుండి...*

*నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.*

*1) కాతేకాంతః...*

*నీ భార్య ఎవరు..? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ వివాహానికి ముందు ఒకరి కుమార్తె. ఆమె పుట్టుకలోగాని, పెరగటంలోగాని నీకు ఏ ప్రమేయమూ లేదు. ఆమె ఎక్కడో పుట్టింది. నీవు ఎక్కడో పుట్టావు. అయినా పెళ్ళితో మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది. పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా.. చివరిదాకా ఇలా కలిసే ప్రయాణిస్తారా..? అదేం లేదు. ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు. ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి. అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు. వెళ్ళిపోవటం కూడా ఒక్కసారిగా జరగటం లేదు. ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను, కొంతకాలం కలసి మెలసి జీవిస్తారు అంతే.*

*ఇదంతా రైలు ప్రయాణం లాంటిది. ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు. కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.* *లోకాభిరామాయణంతో ప్రారంభమై రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంతో ఆత్మీయులయ్యారు. మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం.*

*భార్యాభర్తల సంబంధం కూడా ఇలాంటిదే. అందుకే తత్త్వ విచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది.*

*2) కస్తే పుత్రః...*

*అలాగే నీ కుమారుడెవరు..? అని కూడా విచారించు. పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో ప్రేమాస్పదుడైన కుమారుడు. మరి.. అంతకుముందు..? అతడు నీ భార్య గర్భంలో పిండం. అంతకు ముందో..! అతడు నీలో బీజరూపం..! ఆ బీజం ఎలా వచ్చింది..? నీవు తిన్న ఆహారం ద్వారా నీలో తయారైంది..! మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది..? భూమిలో నుండి వచ్చింది. అంటే మట్టి అనేక మార్పులు చెంది, ఆహారంగా మారి, ఆ ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి, అది వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది.*

*అంటే మట్టి యొక్క చివరి రూపమే నీ కుమారుడు అన్నమాట. మరి నీవు ఎవరు..? నీవూ అంతే.. కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో నీవు ముందున్నావు. నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే. ఈ లెక్కన చూస్తే కదులుతున్న ఒక పెద్ద మట్టి ముద్ద మరొక చిన్న మట్టి ముద్దను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, ప్రేమను పెంచుకుంటుంది. విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు విల విలలాడి పోతుంటుంది. దూరంగా ఉండి ఈ రెండు మట్టి ముద్దల నాటకాన్ని మనం తమాషాగా చూస్తున్నాం అనుకోండి. నవ్వకుండా ఉండలేం. కాని అదే నాటకంలో మనం పాత్రధారులమై ఎంతో సీరియస్ గా ఆ మట్టి ముద్దల పాత్రలను పోషిస్తున్నాం. ఇదే భ్రమ, ఇదే మాయ, ఇదే అజ్ఞానం.*

*ఉన్నది ఉన్నట్లుగ చూడలేక…                    'నాది - నాది' అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. ఎంత చిత్రం.. అందుకే ఈ సంసారం అతి విచిత్రం, తమాషా అయినట్టిది. ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవు ఎవరు..? ఎవరి వాడవు..? ఎక్కడి నుండి వచ్చావు..? ఈ విచారణ ముఖ్యమైనది. వేదాంతంలో నేనెవరు..? అని విచారణ చేయటమే మానవ జీవిత సార్థక్యానికి ఏకైక ఉపాయం.* 

*సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతమే ఈ "నేనెవరు..?" అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం.*

*నేనెవరు..? నేను ఈ శరీరమా..? కాదు... ఇదొక గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా..? కాదు... అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే. అవీ జడమే. వాటిని నేను ఉపయోగించు కుంటున్నాను.* 

*మరైతే నేనెవరు..? దేహంలో కూర్చొని, మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసే జీవుడను. అయితే జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను..? ఎక్కణ్ణించి వచ్చాను..? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను. నేను వచ్చింది అక్కణ్ణించే. * 

*మరి ఎక్కడకు వెళ్ళాలి..? ఆ పరమాత్మ వద్దకే...!   పరమాత్మ నుండి వచ్చిన జీవుడు కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో సుఖదుఃఖాలు అనుభవించి చివరకు ఆ పరమాత్మలో చేరిపోవాలి. అప్పుడే పరమశాంతి, శాశ్వతానందం...!*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలు లేఖ 138 (138) సమాధి

 శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలు

లేఖ 138

(138) సమాధి

8 సెప్టెంబర్, 1947

ఈ ఉదయం, భగవాన్ ముందు కూర్చున్న ఒక యూరోపియన్ ఒక వ్యాఖ్యాత ద్వారా ఇలా అన్నాడు: “సమాధి అంటే యోగ యొక్క 8వ మరియు చివరి దశ కూడా అనుభవిస్తే తప్ప, ముక్తి లభించదని మాండూక్యోపనిషత్తులో చెప్పబడింది ) ఎంత ఎక్కువ ధ్యానం (ధ్యాన) లేదా తపస్సు (తపస్సు) చేస్తారు. అవునా?" భగవాన్: “సరిగ్గా అర్థం చేసుకున్నాము, అవి ఒకటే. మీరు దీనిని ధ్యానం లేదా తపస్సు లేదా శోషణ లేదా మరేదైనా పిలిచినా ఎటువంటి తేడా లేదు. చమురు ప్రవాహంలా స్థిరంగా, నిరంతరాయంగా ఉండేది కాఠిన్యం, ధ్యానం మరియు శోషణ. ఒకరి స్వంతంగా ఉండటమే సమాధి.” ప్రశ్నకర్త: "అయితే ముక్తిని పొందే ముందు తప్పనిసరిగా సమాధిని అనుభవించాలని మాండూక్యోపనిషత్తులో చెప్పబడింది." భగవాన్: “అలా కాదని ఎవరు చెప్పారు? ఇది మాండూక్యోపనిషత్తులోనే కాకుండా అన్ని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడింది.

కానీ మీరు మీ ఆత్మను తెలుసుకుంటేనే అది నిజమైన సమాధి. నిర్జీవమైన వస్తువులా కొంత సేపు కదలకుండా కూర్చుంటే ఏం లాభం? మీరు మీ చేతికి మరుగు వచ్చి దానిని క్లోరోఫామ్ కింద ఆపరేట్ చేశారనుకుందాం; ఆ సమయంలో మీకు ఎలాంటి బాధ లేదు, అయితే మీరు సమాధిలో ఉన్నారని అర్థం? దీని విషయంలో కూడా అలాగే ఉంది. సమాధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. మరియు మీ స్వీయ గురించి తెలియకుండా మీరు దానిని ఎలా తెలుసుకుంటారు? స్వయం తెలిస్తే సమాధి స్వయంచాలకంగా తెలిసిపోతుంది.” ఇంతలో, ఒక తమిళ భక్తుడు తిరువాచకం తెరిచి "సాంగ్స్ ఆన్ పర్స్యూట్" పాడటం ప్రారంభించాడు. చివర్లో, “ఓ, ఈశ్వరా, * మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు, * ఈశ్వరుడు వ్యక్తిగత దేవుడిని సూచిస్తుంది.

కానీ నేను నిన్ను గట్టిగా పట్టుకున్నాను. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళగలరు మరియు మీరు నా నుండి ఎలా తప్పించుకోగలరు? ” భగవాన్ చిరునవ్వుతో ఇలా వ్యాఖ్యానించాడు: “కాబట్టి అతను పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది మరియు వారు అతనిని గట్టిగా పట్టుకున్నారు! అతను ఎక్కడికి పారిపోవచ్చు? ఆయన ఎక్కడ లేడు? ఆయన ఎవరు? ఇదంతా ఒక ప్రదర్శన తప్ప మరొకటి కాదు. అదే పుస్తకంలో మరో పది పాటల సీక్వెన్స్ ఉంది, అందులో ఒకటి, 'ఓ మై లార్డ్! నా మనసును నీ నివాసంగా చేసుకున్నావు. నీవు నాకు నిన్ను అప్పగించి, ప్రతిగా నన్ను నీలోనికి తీసుకున్నావు. ప్రభూ, మనలో ఎవరు తెలివైనవారు? నీవు నాకు నిన్ను ధారపోస్తే, నేను అంతులేని ఆనందాన్ని పొందుతున్నాను, కానీ నాపై నీ అనంతమైన దయతో నా శరీరాన్ని నీ ఆలయంగా చేసుకున్నా, నేను నీకు ఏమి ప్రయోజనం? ప్రతిఫలంగా నేను మీ కోసం ఏమి చేయగలను? నా స్వంతం అని పిలవగలిగేది ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు.' అంటే 'నేను' అన్నది లేదు. దాని అందం చూడండి!

--కాళిదాసు దుర్గా ప్రసాద్. 

రండి కాఫిర్లారా( అవిశ్వాసులారా ) తెలుసుకోండి శాంతి మతం గురించి . మరింత సమాచారం కోసం కామెంట్ సెక్షన్ చూడగలరు. ఇస్లాంలో తెలుసుకోవలసిన కొన్ని పదాలు

 రండి కాఫిర్లారా( అవిశ్వాసులారా ) తెలుసుకోండి శాంతి మతం గురించి . మరింత సమాచారం కోసం కామెంట్ సెక్షన్ చూడగలరు.

ఇస్లాంలో తెలుసుకోవలసిన కొన్ని పదాలు
___________________________________

ఇస్లాంను అర్థం చేసుకోవడానికి, దాని నిజస్వరూపాన్ని చూపడానికి ఖురాన్, హదీస్లను తెలుసుకోవడంతోపాటు మహమ్మద్ ప్రవక్త తన జీవితకాలంలో ఇస్లాంను ఎలా వ్యాప్తి చేశాడో కూడా గ్రహించాలి. దీనికోసం ఇస్లాంలోని మౌలికమైన అంశాల్ని తెలుసుకోవాలి. ఇస్లాంలో కొన్ని ముఖ్యమైన పదాల అర్థాలు పరిశీలించడం చాలా ముఖ్యం. ఇస్లాం మత పరిభాష అరబ్బీలో ఉంది. కొన్ని ముఖ్యమైన పదాల అర్థాలు చూద్దాం. 

1. అల్లాహ్

ఇస్లాం పుట్టుక ముందు అరబ్బులు అనేకమంది దేవతలను కొలిచేవారు. అప్పుడు అల్లాహ్ అనే పదాన్ని దేవుడు (God) అని వారిలో ఏ దేవుడికైనా వాడారు. తరువాత మహమ్మద్ దాన్ని ఏకైక దేవుడు (The God) గా మార్పు చేశాడు (See Prophet of Doom by Craig Winn). ఇస్లాం దేవుడి పేరు అల్లాహ్. అతని వాక్యం కల్మా. కల్మా వాక్యం ఇలా అంటుంది - "లా ఇలాహ్ ఇల్లలాహ్ ముహమ్మద్ ఉర్ రసూలుల్లాహ్ '. అంటే 'అల్లా తప్ప మరెవరూ భగవంతుడు కాడు. మహమ్మద్ ఆ దేవుడి ప్రవక్త'. ఖురాన్ కూడా 'లా ఇలాహ్ ఇల్లలాహ్ ' (2-163) (3-2) అని చెపుతోంది. దీనినిబట్టి ఇస్లాం మొదటి నుంచి ఇతర మతాల అస్తిత్వాన్ని నిరాకరిస్తుందని, ఇతర మతాలను దేవుడి మరొక రూపమని నమ్మడాన్ని ఖండిస్తుందని, అలా ఇతర మతాలను విశ్వసించేవారిని అవిశ్వాసులుగా పరిగణిస్తుందని స్పష్టమౌతుంది. ఖురాన్ ఎంతవరకూ చెప్పిందంటే ఎవరైనా దేవుడి ఇతర రూపాలను అల్లాహ్ సమానంగా పరిగణిస్తే వారిని అల్లాహ్ అత్యంత కఠోరంగా శిక్షస్తాడని (2-165) హెచ్చరించింది.

2. ఇస్లాం (దాస్యం)

ఇస్లాం అంటే అల్లాహ్ దాసుడవడం. (ఖురాన్ 2-131, 132, 3-20) ఖురాన్ ప్రకారం ఇస్లాం మాత్రమే నిజమైన మతం (3,19,30). తక్కిన మతాలేవీ అసలు మతాలే కాదు. ఇస్లాం తప్ప మరే ఇతర మతాన్ని నమ్మేవారికైనా మరణదండన తప్పుదు. ఎందుకంటే ఖురాన్ ప్రకారం, ఆ తరువాత నరకంలో అత్యంత క్రూరమైన శిక్ష పడుతుంది. 

3. ఖురాన్

ఖురాన్ ఇస్లాం మూలగ్రంథం. క్రీ.శ. 610 నుంచి 628 మధ్యకాలంలో అల్లా గాబ్రియల్ అనే దూత ద్వారా తన సందేశాలను మహమ్మద్కు పంపాడని, ఆ సందేశాల సంకలనమే ఖురాన్ అని ముస్లిముల విశ్వాసం. ఖురాన్ దేవుడు స్వయంగా అందించిన గ్రంథమని (ఖురాన్ 11-1, 2, 32 మరియు 36-5) కూడా ముస్లిములు నమ్ముతారు. ఖురాను నమ్మి ఎవరు అందులో చెప్పినవిధంగా జీవిస్తారో వాళ్ళని మరణం తరువాత స్వర్గానికి పంపడం ద్వారా సత్కరిస్తానని అల్లా చెప్పాడు (35-11).

మహమ్మద్ ఖురాన్ సందేశాన్ని కొంత మక్కాలో, మిగిలినది మదీనాలో పొందాడు. 622 సంవత్సరంలో మహమ్మద్ మక్కా వదిలి మదీనాకు పారిపోయాడు. దీనినే 'హిజ్రా' (నిష్క్రమణ లేదా పలాయనం) అంటారు. పలాయనానికి ముందు మహమ్మద్ మక్కాలో ఉన్నప్పుడు అక్కడ అతనికి అనుయాయులు ఎవరూ లేరు. అందుకనే హిజ్రాకు ముందు అతను చెప్పిన ఆయాత్లలో తీవ్రత కనబడదు. అవి సాధారణంగా ఉంటాయి.

మదీనాకు వెళ్ళిన తరువాత మహమ్మద్ బలగం క్రమంగా పెరిగింది. దానితో ఆయాత్లో కఠినత్వం, తీవ్రత కూడా పెరిగాయి. అయితే హిజ్రా తరువాత వచ్చిన ఈ ఆయాత్లు అన్నీ మదీనాలోనే లభించలేదు. కొన్ని మక్కాలో కూడా పొందాడు. ఇక జిహాద్ విషయానికి వస్తే మదీనా ఆయాత్లు మక్కా ఆయాత్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ముస్లిమేతరుల పట్ల దయాదాక్షిణ్యాలు చూపవచ్చన్న మక్కా ఆయాత్లను మదీనా ఆయాత్లు పూర్తిగా తిరస్కరించాయి (ఖురాన్ 2-106, 13-39, 16-103). 4. 

4. ముసల్మాన్

అల్లాహ్కు దాసుడై ఆదేశాల్ని పూర్తిగా పాటించేవాడు, అతడికి పూర్తిగా తలవంచేవాడు. అల్లాహ్ ను మాత్రమే కొలిచేవాడు (ఇబాదత్) ముసల్మాన్ (ఖురాన్ 39-11, 12).. 

5. ముస్లిమ్

ఇది ముసల్మాన్కు సమానార్థక పదం. ఎల్లప్పుడూ అల్లా ఆజ్ఞల (అదుపు) లో ఉండేవాడు. అల్లా మార్గంలో నిరంతరంగా సంఘర్షణ చేసేవాడు. ఎల్లప్పుడూ అల్లా ప్రార్థన చేసేవాడు. జకాత్ చెల్లించేవాడు ముస్లిం. అల్లాయే ముస్లిముల సంరక్షకుడు (ఖురాన్ 22-78).

6. మోమిన్

ఇస్లాం మత విశ్వాసి, అల్లాహ్ మతాన్ని మాత్రమే విశ్వసించేవాడిని 'మోమిన్' అంటారు. ఇది ముస్లిం, ముసల్మాన్లకు సమానార్థకమైన పదం. ఖురాన్, హదీస్ లో ముస్లిం, ముసల్మాన్ అనే పదాలకు బదులు ఈ మోమిన్ అనే పదాన్ని అనేకచోట్ల ప్రయోగించడం కనిపిస్తుంది (డిక్షనరీ ఆఫ్ ఇస్లాం, టి.పి. హ్యూజ్, పుట. 419). ఖురాన్ అనువాదంలో మోమిన్ పదానికి 'విశ్వాసుడు' అని అనువదించారు. ఖురాన్ ప్రకారం విశ్వాసుడు అంటే కేవలం అల్లాహు మాత్రమే విశ్వసించేవాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతర మతాలను నమ్మేవాడు ఇస్లాం ప్రకారం నాస్తికుడు. అతడిని కాఫిర్ లేదా ముష్రిక్ అంటారు. ఈ విషయం కల్మాను పరిశీలించినా స్పష్టమవుతుంది. అందులో 'అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు. మహమ్మద్ మాత్రమే ఆ దేవుడి ప్రవక్త' అని ఉంది. అల్లాహ్ తప్ప మరో దేవుడు లేనేలేనప్పుడు ఇస్లాం తప్ప మరో మతాన్ని నమ్మే అవకాశం కూడా ఉండదు. అలాగే ఏ ఇతర మతాన్ని స్వీకరించేందుకు అల్లాహ్ ఎవరికీ, ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఖురాన్ స్పష్టంగా చెప్పింది. (3-45) 

7. దీన్

దీన్ అంటే పంథా లేక సంప్రదాయం. ఖురాన్ ప్రకారం ఇస్లాం మాత్రమే అసలైన 'దీన్', మిగిలిన మతాలన్నీ బూటకం. ఇతర మతాల అనుయాయులంతా పాపులు. వారందరినీ నరకంలో కాల్చుతారు (16-20, 21, 32–13, 98-6).

8. గాజీ

ఇస్లాం వల్ల, ఇస్లాం కోసం నిరంతరం పోరాడేవాడిని గాజీ అంటారు. విధర్మీయుల హత్య చేసే నాయకుడు లేదా యోధుడు గాజీ. గాజీ గురించి ఇస్లాం ఇలా చెపుతోంది - 'అల్లాహ్ సంతోషం కోసం అల్లాహ్ మార్గంలో ఎవరు పోరాటానికి సిద్ధపడతాడో అతన్ని స్వయంగా దేవుడే మెచ్చుకుంటాడు. అతను పోరాటంలో చనిపోకుండా తిరిగి వస్తే దోపిడి సొమ్ముతోపాటు బహుమతిని కూడా తెచ్చుకుంటాడు. ఒకవేళ పోరాటంలో చనిపోతే స్వర్గమే బహుమతిగా పొందుతాడు' (నిష్కత్ - గ్రంథం - 17, ప్ర. 1), (ఇస్లాం శబ్దకోశం - టి.పి. హ్యూజ్ ).

ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ముస్లిం శబ్దానికి బదులు గాజీ పదాన్ని ఉపయోగించారో అక్కడ అది ఎవరిని ఉద్దేశించి వాడారో వారు లేదా వారి పూర్వజులు జిహాద్లో పాల్గొన్నారని, ముస్లిమేతరులను వధించారని అర్థం చేసుకోవాలి.

9. షిర్క్

షిర్క్ అంటే అనేకమంది దేవతల్ని నమ్మడం అల్లాహ్ తోపాటు వారిని పూజించడం. (ఇస్లాం శబ్దకోశం - టి.పి.హ్యూజ్).

10. ముష్రిక్

ముష్రిక్ అంటే విగ్రహారాధకుడు. ఎవరు విగ్రహారాధన చేస్తారో, ప్రకృతిలోని ఏ రూపాన్ని లేదా తత్వాన్ని (అల్లాతోపాటు లేదా అల్లాహ్ కాకుండా) పూజిస్తారో వారు ముష్రిక్ అవుతారు. ఖురాన్ ప్రకారం ముష్రిక్ అతి నీచ ప్రాణి. అలాంటి వారికి రెండే మార్గాలు ఉన్నాయి. అవి - ఇస్లాంను స్వీకరించడం లేదా మృత్యువును అంగీకరించడం. టి.పి. హ్యూజ్ ప్రకారం ముస్లిములు నేడు ఈ ముష్రిక్ అనే పదాన్ని విగ్రహారాధకులతో పాటు క్రైస్తవులకు కూడా ఉపయోగిస్తున్నారు (ఇస్లాం శబ్దకోశం). 

11. ఖమ్స్

ఆస్తి (అది దోపిడి సొమ్ము కూడా కావచ్చు) లో 1/5 వంతు బైతుల్ మాబ్ లేక కోశాగారానికి (public treasury) జమచేసిన మొత్తం. (8-41)

12. జజియా

ఒకరకం పన్ను. ఇస్లాం రాజ్యంలో ముస్లిమేతరులు తమ అస్తిత్వాన్ని కాపాడు కునేందుకు, రక్షణ పొందేందుకు చెల్లించే పన్ను. కానీ బూటకపు సెక్యులరిస్టు చరిత్ర కారులు మాత్రం జజియా అంటే ఇస్లాం రాజ్యంలో హిందువులు తీర్థయాత్రలు చేయడానికి చెల్లించే మతపరమైన పన్ను అంటూ వక్రభాష్యం చెపుతారు. నిజానికి జజియా అంటే ఇస్లాం రాజ్యంలో ముస్లిమేతరులు ప్రాణాలు కాపాడుకునేందుకు (వివిధ అవమానాలు ఎలాగూ తప్పవు) ముస్లిం పాలకులకు కట్టే పన్ను. 

13. ఖరజ్

ముస్లిం రాజ్యంలో ముస్లిమేతరులు భూమిని కలిగి ఉండడానికి కట్టాల్సిన పన్ను ఇది. ముస్లిం పాలకులకు ఖరజ్ చెల్లిస్తే కాస్త భూమిని కలిగి ఉండే అనుమతి లభిస్తుంది. ఇది జజియాతోపాటు అదనంగా చెల్లించాల్సినది. ఖరజ్ చెల్లించలేకపోతే అలాంటి ముస్లిమేతరుల భూమి స్వాధీనం చేసుకోవడమేకాక వారిని శారీరిక హింసకు గురిచేసేవారు. జజియా మాదిరిగానే ఖరజ్ కూడా కేవలం ముస్లిమేతరుల నుంచే వసూలు చేసేవారు (హిదాయా ఖండం - 2).

14. దిమ్మీ లేదా జిమ్మీ

ఇది అరబ్బీ శబ్దం. ఎక్కువగా జిమ్మీ అనే ఉపయోగిస్తుంటారు. అరబ్ దేశాల్లో దీనిని ముస్లిమేతరులను (యూదులు, క్రైస్తవులు) ఉద్దేశించి ఉపయోగిస్తారు. జజియా, ఖరజ్ పన్నుల్ని చెల్లించిన ముస్లిమేతరులు ముస్లిం రాజ్యంలో జీవించడానికి అనుమతి  పొందుతారు. జమ్మీలు రెండవ తరగతి పౌరులుగా గడిపేవారు. వారికి ఎలాంటి హక్కులు ఉండవు. పైగా వీళ్ళు అనేక నిబంధనలు, ముస్లిం పాలకుల ఆజ్ఞలు  పాటించి తీరాలి.  భారత్లో పాలన ప్రారంభించిన ముస్లిం రాజులకు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న హిందువుల్ని (ముష్రిక్లు) పూర్తిగా అణచివేయడం, చంపివేయడం, పూర్తిగా ఇస్లాంలోకి మార్చడం సాధ్యపడదని తెలిసింది. దీనితో హిందువులను ఆర్థికంగా చితికిపోయేట్లు చేసి వారిని జిమ్మీలుగా పరిగణించడం ప్రారంభించారు.

15. షహీద్ షహదత్

ముస్లిమేతరులతో పోరాడుతూ (జిహాద్) ప్రాణాలు కోల్పోవడం షహదత్. అలాంటి ముస్లిము షహీద్ అవుతాడు. షహీద్ ఉత్తముడైన ముస్లిం. అలాంటివాడికి స్వర్గంలో భగవంతుని దగ్గర స్థానం నిశ్చయమైపోతుంది. 

16. కాఫిర్

ఇస్లాం కాకుండా మరే ఇతర మతాన్నైనా అనుసరించేవాడు కాఫిర్ అవుతాడు.

17. మునాఫిక్

మునాఫిక్ అంటే మోసకారితనం. మహమ్మద్ కాలంలో పైకి ఇస్లాం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఇస్లాంను ప్రచారం చేస్తూ లోపల మాత్రం ఆ మతాన్ని నమ్మనివారికి ఈ పదం ఉపయోగించేవారు. ఆధునిక కాలంలో కూడా ఖురాన్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఇతర మత విశ్వాసాలను కలిగినవారిని మునాఫిక్ అంటున్నారు. ఇస్లాం ఆక్రమణ, హింసను విశ్వసించదని, అది ఇతర మతాలను గౌరవిస్తుందని కొందరు ముస్లిం పండితులు చెపుతూ ఉంటారు. కానీ వారి వాదనకు, ఖురాన్ చెప్పే విషయాలకు అసలు పొంతనే లేదు. ఖురాన్ 3-85 ప్రకారం అల్లా ఇచ్చిన ఇస్లాం తప్పించి మిగతా ఏ మతాన్ని అనుసరించరాదు. అలాగే 6–19 ప్రకారం అల్లా ఇతర మతాలపై విజయం సాధించేందుకే మహమ్మద్ను పంపాడు. దీనినిబట్టి ఇస్లాం ఇతర మతాలను గౌరవిస్తుందని, సహనం వహిస్తుందని భావించే ముస్లిము ముస్లిం కాకుండాపోతాడు. పైగా మునాఫిక్ అవుతాడని అర్థమవుతుంది. జిహాద్లో పాల్గొనడానికి నిరాకరించే ముస్లిం కూడా మునాఫికే అవుతాడు, అతనికి కాఫిర్లకు విధించే శిక్షే వర్తిస్తుంది. ఈ విషయాన్ని ఖురాన్ పదేపదే పేర్కొంది. 

18. ముత్రాద్

మతం మారడాన్ని ముత్రాద్ అంటారు. ఎవరైనా ముస్లిం ఇతర మతాన్ని విశ్వసించినా, ఆ మతాన్ని పుచ్చుకున్నా అది ముత్రాద్ అవుతుంది. అలాంటివాడిని చంపివేస్తారు. ఎందుకు? ఇస్లాంను వదిలి మరో మతాన్ని పుచ్చుకున్న నేరం చేసినందుకు. ఇస్లాం ఇతర మతాలకు చెందినవారిని బలవంతంగానైనా మతం మార్చవచ్చును కానీ ముస్లిములు మాత్రం ఇస్లాం తప్ప మరే ఇతర మతాన్ని అనుసరించడం గానీ, కనీసం మెచ్చుకోవడం గానీ చేయడానికి వీలులేదు.

19. ఉమ్మా లేదా మిల్లత్

ఉమ్మా అంటే ప్రపంచవ్యాప్త ముస్లిం సముదాయం. ప్రపంచంలో ముస్లిములదే ఏకైక జాతి. దీనినే ఉమ్మా అంటారు. దీనికే మిల్లత్ అని కూడా పేరు. ఈ ఉమ్మా మరే ఇతర జాతీయత, భాష, ఇతర సరిహద్దుల్ని అంగీకరించదు. ఇస్లాం ప్రకారం ప్రపంచం మొత్తంలో కేవలం రెండు జాతులు మాత్రమే ఉన్నాయి. ఒకటి, అల్లాను అంగీకరించే జాతి. మరొకటి, ఇతర దేవతల్ని పూజించే జాతి. ఒక దేశంలో ఉండే ముస్లిం తన దేశంలోని ముస్లిమేతరులను కాకుండా ఇతర దేశాల్లోని ముస్లిములతో, ఆఖరుకు శతృదేశంలోని ముస్లిములతో కూడా సహోదరత్వాన్ని పాటిస్తాడు. తన దేశంలోని ముస్లిమేతరులతో మాత్రం విరోధం పాటిస్తాడు. ఇది ఇది ఖురాను ఆదేశం. 

20. ఖలీఫా

ఇస్లాం ఉమ్మాకు చెందిన అత్యున్నత మతపరమైన, పాలనాపరమైన నాయకుడినే ఖలీఫా అంటారు.

21. జిహాద్

ముస్లిమేతరులలో ఇస్లాం మత వ్యాప్తి, దోపిడి కోసం ముస్లిమేతరులపై నిరంతర యుద్ధం చేయడం జిహాద్.

22. ముజాహిద్

ముస్లిమేతరులకు వ్యతిరేకంగా, వారిని నాశనం చేయడం కోసం జరిగే యుద్ధంలో సైనికుడిగా పాల్గొనేవాడు (మరింత సమాచారం కోసం ఆరవ అధ్యాయం చూడండి). 

23. అన్సార్

 ప్రవక్త మహమ్మద్ మక్కా నుండి మదీనాకు వెళ్ళినప్పుడు (హిజ్రా) ఆయనతోపాటు వెళ్ళి, సేవలు చేసినవారు. కానీ ఇప్పుడు అన్సార్ అంటే జిహాద్ సాగిస్తున్న ముస్లిములకు సహాయపడేవారు, వారికి సేవ చేసేవారని అర్థం. దేశవిభజన సమయంలో ముస్లింలీగ్ భారత్ వైపుకు వస్తున్న హిందువుల నుండి విలువైన వస్తువుల్ని దోచుకునే పనిని అన్సారీలకు అప్పచెప్పింది. ఈ అన్సారీలు చాలామంది హిందూ స్త్రీలను అపహరించారు కూడా. 

24. మాల్ ఎ గనీమత్ (ఘనీమా)

యుద్ధంలో ముస్లిమేతరుల నుంచి దోచుకున్న సొత్తు. ఇలా దోచుకున్న సొత్తులో 1/5 వంతు దోపిడీదారుల నాయకుడికి చెందుతుంది. మిగతాది దోపిడీదారులు పంచుకుంటారు. దోపిడీ సొత్తులో డబ్బు, విలువైన వస్తువులేకాదు, పశువులు, ఆఖరుకు ముస్లిమేతర స్త్రీలు కూడా ఉంటారు. 

25. హదీస్

మహమ్మద్ ప్రవక్త పేర్కొన్న విధులన్నీ హదీస్ లో ఉంటాయి. ముస్లిములకు ఖురాన్ తరువాత హదీస్ కూడా చాలా ముఖ్యమైనది.

26. షరియా

సంపూర్ణ ఇస్లాం చట్టమే షరియా. ఖురాన్ తోపాటు మహమ్మద్ సంప్రదాయ సందేశాలను కలిపి షరియా అంటారు. ఇది ముస్లింల మతచట్టం.

27. జన్నత్ (స్వర్గం)

దీనినే అల్-జన్నాహ్ (ఉద్యానవనం) అని అంటారు. ఖురాన్లో ఎనిమిది స్వర్గాల ప్రస్తావన ఉంది. అవి వివిధ దశలలో లభ్యమవుతాయి. జన్నత్ సకల శారీరిక భోగాలు లభిస్తాయి.

28. అమన్ (శాంతి)

జజియా లేదా పన్ను చెల్లించేవారికి ముస్లిం ఆక్రమణదారు ఇచ్చే రక్షణ, భద్రత. 

29. అజాన్ (ప్రకటన)

నమాజ్ (ప్రార్థన) కోసం మువాజిన్ (అరిచి పిలిచేవాడు) ఇచ్చే పిలుపు. మసీదు పక్కనుండి లేదా ద్వారం నుండి లేదా పెద్ద మసీదుల్లో మీనార్ నుండి ఈ అజాన్ వినిపిస్తారు. ఈ అజాన్ అర్థం సంక్షిప్తంగా - "అల్లాహ్ (దేవుడు) అత్యంత గొప్పవాడు. ఈ దేవుడు తప్ప మరో దేవుడు లేడని నేను పేర్కొంటున్నాను. మహమ్మద్ ఆ దేవుని దూత అని పేర్కొంటున్నాను. నమాజుకు రండి. మోక్షానికి రండి. దేవుడు అత్యంత గొప్పవాడు. ఈ దేవుడుతప్ప మరొక దేవుడు లేడు”. తెల్లవారుఝామున చేసే నమాజ్కు ఇచ్చే అజాన్ (పిలువు) లో 'నమాజ్ నిద్రకంటే మంచిది' అనే వాక్యం కూడా ఉంటుంది. అజాన్ వినిపించిన వెంటనే ముస్లింలు ఎక్కడున్నా వెంటనే నమాజ్ కోసం మసీదువైపు రావాలి. అలాగే అజాన్ వింటున్నప్పుడు ప్రతి వాక్యాన్ని తాము కూడా చెప్పాలి. అజాను అత్యంత శ్రద్ధగా వినాలి. అజాన్ను తాగుబోతులు, పిచ్చివాళ్ళు, స్త్రీలు ఇవ్వడానికి వీలులేదు. 

30. రజ్ (రాళ్ళతో కొట్టి చంపడం)

అక్రమ సంబంధాలు పెట్టుకున్న మహిళలకు విధించే శిక్ష, నేరం ఋజువైతే మహిళను చుట్టూ చేరి రాళ్ళతో కొట్టి చంపుతారు. కొన్ని సందర్భాల్లో రాళ్ళతో కొట్టి చంపకుండా వంద కొరడా దెబ్బలు కూడా విధించవచ్చును. అయితే అక్రమసంబంధం కలిగిన పురుషులకు మాత్రం వంద కొరడా దెబ్బలు మాత్రమే శిక్ష అని మహమ్మద్ తీర్పునిచ్చాడు.

31. సున్నహ్

'ఒక మార్గం, దారి, జీవనపద్ధతి. ' మహమ్మద్ చెప్పినది లేదా చేసిన చూపిన విషయాలే ముస్లిం జీవనపద్ధతి లేదా సున్నాహ్. సంప్రదాయ చట్టాన్ని 1) సున్నాతుల్ ఫిల్ - మహమ్మద్ చేసిన పనులు, 2) సున్నాతుల్ కుల్ - మహమ్మద్ అంగీకరించినవి, 3) సున్నతుల్ తక్ర్ - మహమ్మద్ అంగీకారం కలిగి ఆయన సమక్షంలో చెప్పినవి, చేసినవి.

32. ఖిన్ ర్ (బహువచనం - ఖనాజర్)

పంది మాంసం ముస్లింలకు నిషిద్ధమని ఖురాన్లో సురాలు ii 168, v4, vi 146, xvi 116 లలో చెప్పబడింది.

33. తకియా

'స్వీయ రక్షణ'. ఇది షియాలు పాటించే పద్ధతి. తన మత ప్రత్యేకతలను కాపాడుకునేందుకు షియా ముస్లిం ఎలాంటి పద్ధతినైనా అనుసరించవచ్చును. వివక్షను, అణచివేతను తప్పించుకునేందుకు సున్నీలమని చెప్పుకోవచ్చును.

తకియాకు సమానమైన పద్ధతి సున్నీలలో ముదారత్. మతాన్ని రక్షించుకునేందుకు అబద్ధం చెప్పవచ్చును.

34. తవారియా

ఒక విషయాన్ని ఎలాగైనా వ్యాఖ్యానించి, మార్చుకునే విధంగా చెప్పడం. దీనివల్ల 'అబద్ధం' చెప్పినట్లు నిరూపించే వీలు ఉండదు.

హిందువుల పెళ్లి తంతులో తారసపడే ఘటనలు.

 హిందూ సంప్రదాయ వివాహ  :

1. కన్యావరణం:
2. పెళ్ళి చూపులు
3. నిశ్చితార్థం:
4. అంకురార్పణం:
5. స్నాతకం:
6. సమావర్తనం:
7. కాశీయాత్ర:
8. మంగళస్నానాలు:
9. ఎదురుకోలు:
10. వరపూజ:
11. గౌరీపూజ:
12. పుణ్యాహవాచనం:
13. విఘ్నేశ్వరపూజ:
14. రక్షా బంధనం:
15. కొత్త జంధ్యం వేయడం:
16. గౌరీ కంకణ దేవతాపూజ:
17. కౌతుక ధారణ:
18. కంకణ ధారణ:
19. మధుపర్కము:
20. వధువును గంపలో తెచ్చుట:
21. తెరచాపు
22. మహా సంకల్పం:
23. కన్యాదానం:
24. వధూవరుల ప్రమాణములు:
25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:
26. స్వర్ణ జలాభిషేకం:
27. చూర్ణిక:
28. వధూవర సంకల్పం:
29. యోక్త్రధారణం:
30. మాంగల్య పూజ:
31. మాంగల్య ధారణ:
32. అక్షతలు-తలంబ్రాలు:
33. బ్రహ్మముడి:
34. సన్నికల్లు తొక్కడం:
35. కాళ్లు తొక్కించడం:
36. పాణి గ్రహణం:
37. సప్తపది:
38. లాజహోమం:
39. యోక్త్రవిమోచనం:
40. స్థాలీపాకం:
41. ఉంగరాలు తీయడం:
42. బొమ్మని అప్పగింత:
43. నాగవల్లి:
44. ధ్రువనక్షత్రం:
45. అరుంధతి నక్షత్ర దర్శనం:
46. అప్పగింతలు:
47. అత్తమామలకు వధువు పూజ:
48. ఫలప్రదానం:
49. పానుపు:
50. మహదాశీర్వచనం:
51. వధువు గృహప్రవేశం:
52. కంకణ విమోచన:
53. గర్భాదానం:
54. పదహారు రోజుల పండుగ
55. అల్లెం.
____
హిందువుల పెళ్లి తంతులో తారసపడే ఘటనలు.
-----------------------------------
 తెలుసుకుంటే మన పిల్లల పెళ్లికి ఉపయోగపడుతుంది.
 🙏

శ్రీరమణీయం: ఆశ లేకుంటే శాంతి వస్తుంది అంటున్నారు, మరి చేసే ప్రతి పనిలో ప్రతిఫలం ఆశించటం సహజం కదా ?

 💖💖💖
       💖💖 *"450"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"ఆశ లేకుంటే శాంతి వస్తుంది అంటున్నారు, మరి చేసే ప్రతి పనిలో ప్రతిఫలం ఆశించటం సహజం కదా ?"*

*"మనలోని ఆశను తగ్గించుకుంటూ పోయేకొద్దీ శాంతి వెల్లివిరుస్తుంది. స్వీటు మనం తయారు చేసుకుని తిన్నా, మరొకరు చేసి ఇచ్చినా అదే తియ్యదనం ఉంటుంది. అలాగే కోరికలేని స్థితిలోనే పరమశాంతి ఉన్నదని మనం ధ్యానంలో తెలుసుకోలేక పోయినా, అది తెలుసుకుని బోధించే గురువుగారి పట్ల విశ్వాసంతో ఈ విషయాన్ని పాటించినా సరిపోతుంది. అడగటం అనేది మన అల్పత్వం. ఆ అల్పత్వం పోయిన తర్వాత ఉండే అద్భుత మానసిక స్థితిపేరు ధ్యానం. బాహ్య జీవనంలో 'వస్తువులేని ఫలం, ఫలంలేని క్రియ' ఉండవు. మనం క్రియ చేస్తున్నామంటేనే ఏదో ఒక ఫలాన్ని ఆశిస్తున్నామని అర్థం. ఇలా ప్రతివస్తువును ఫలంతో ముడిపెట్టి ఆలోచిస్తాం. ఫలం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. కనుక అశాంతి తప్పదు. శాంతి చెడకుండా వస్తువులతో ఎలా ఉండాలో మన అంతరంగంలో (ధ్యానస్థితిలో) తెలుసుకొని అలా మసలు కోవటమే నాగరికత !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

శ్రీ రమణాయ అధ్యాయము 39 ( భగవాన్ శ్రీ రమణ మహర్షి అవతారము ముగించుట )

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
అధ్యాయము 39 

( భగవాన్ శ్రీ రమణ మహర్షి అవతారము ముగించుట ) 

      భగవాన్ శ్రీ రమణ మహర్షి తన 16 వ యేటనే ఆత్మ జ్ఞానమును పొందినారు . వారు దేహము అశాశ్వతమైనప్పటికి ఆ నశించే దేహములోనే శాశ్వతమైన అమృత తత్వమున్నదని “ నేను ” అనే ఆత్మ చైతన్యం ఒక శక్తిగా శరీరంలో నడుస్తూ ఉన్న శక్తికి కేంద్రమని ఆ నేను ఆ శక్తి ప్రవాహం వల్ల అన్నీ వారు చేస్తున్నారని గ్రహించారు . ' నేనెవరు ' అనే విచారణ తమ 16 వ యేట వారు భౌతిక దేహము మరణించినదని వారి దేహము ఒక శవములాగా పడివున్నా భగవాన్ తను జీవించి ఉన్నట్లు స్పష్టముగా తమ ఉనికి స్ఫురణలోనే ఉన్నారు . వారు నేను అని పలుకకుండా మరియే ఇతర పదాలను కూడా పలుకక తమ నోరును గట్టిగా మూసి ఉంచినప్పటికి నేను ఉన్నాను , *నేను శబ్దం ఉంది . నేను అనేది ఉన్నది అని ' నాలోనే నాకు అనుభూతి పూర్తిగా ఉన్నది అదేమిటి ? అది ఒక శక్తి లేక ప్రవాహంగా తన శరీరాన్ని పనిచేయిస్తున్న శక్తికి కేంద్రముగా శరీరము జడమై గట్టిగా ఉన్నప్పటికి దానితో ఆ శరీరము పనిచేస్తున్నా దానితో సంధింపబడి ఉన్నట్లు అనిపించింది . ఆ శక్తి ప్రవాహం కేంద్రమే నేనుగా నన్ను కదిలిస్తుంది . పనిచేయిస్తుంది* " అని భగవాన్ గ్రహించారు . ఈ అభిప్రాయము తెలుసుకున్న తరువాత భగవాను మరణం గురించి భయం పోయినది . దానికి మరణము లేదని ఇక భయపడనవసరములేదని భగవాన్ తెలిపారు . కావున భగవాన్ మరణించే ఈ అధ్యాయము తెలుసుకునే ముందు *భగవాన్ స్వయముగా వారే ఆత్మజ్ఞానము పొందిన తరువాత మరణమే లేదని కావున భయానికి ఇక చోటెక్కడని చెప్పినారు . కావుననే భగవాన్ మరణించలేదు . కాబట్టే నిర్యాణము , సమాధి అని కూడా అనకుండా ఈ అధ్యాయానికి భగవాన్ శ్రీ రమణ మహర్షి తమ అవతారమును ముగించినారని చెప్పబడినది* . 


      ఇలపై అవతరించిన మహాపురుషులు తమ కార్యములను నెరవేర్చిన పిదప ఏదో ఒక కారణమును చూపి వ్యాధి కలిగించుకుని తమ శరీరములను వదిలివేయుదురు . అది మాయా ప్రభావము తప్ప నిజానికి అటువంటి మహాపురుషులకు వ్యాధులు సోకవు . కానీ సోకినట్లుగా చూపి ఏదో ఒక నెపముతో వారి శరీరములను విడిచెదరు . అలాగే మన భగవాన్ శ్రీ రమణ మహర్షి వ్యాధిగ్రస్తులై తమ ఆరోగ్యము రోజు రోజుకి క్షీణింపచేసుకుని 1947 వ సం || ములో మొదలైనవి వారి బాధలు . వారికి కీళ్ళవాతము , నడుముకి వీపుకి వ్యాపించి బాధపడుతుంటే భగవాన్ “ *ఈ దేహమే ఒక వ్యాధి . ఆ వ్యాధికి నివారణ చూడాలి కాని ఈ వ్యాధికి నివారణ దేనికి ?* అని అంటూ ఏ మందులు వేసుకొనక మౌనముగానే ఉండేవారు . అలా ఒక సం || ము కీళ్ళవాత బాధతో ఉండి 1948 వ సం || మున భగవాన్ ఎడమ చేతికి ఒక కురుపు వచ్చి అది పెరిగి పెరిగి వస్తూ ఉంటే భక్తులు భగవాన్ ని దాని గురించి అడిగితే " *లింగం పుట్టినదని అది స్వయంభూలింగమని ” అనేవారు . డాక్టర్లు శస్త్ర చికిత్స చేయాలంటే భగవాన్ “ ఎదిగితే ఎదుగుతుంది . మనకేమి దాని పని అది చూసుకుంటుంది . మనమెందుకు కదల్చటం* ” అని అనేవారు . భగవాన్ ని బలవంతముగా ఒప్పించి శస్త్ర చికిత్స చేశారు . ఐనా ఆ కురుపు మళ్ళీ పెరిగి పెద్దదైనది . అసలు భగవాన్ ఇంత జరిగినా నొప్పితో బాధపడుతున్నట్లుగాని అసలు వారి శరీరముపై కురుపు ఉందని కాని శస్త్ర చికిత్స బాధగాని పడినట్లు కనపడలేదు . అసలువారు ఒక శరీరమని అనుకుంటే కదా . రెండవసారి ఆపరేషన్ పెద్ద డాక్టర్లు చేశారు . భగవాన్ దానికి ఒప్పుకుని మళ్ళీ వస్తే చూచుకుందాంలే అన్నారు . ఆపరేషన్ ఐన తరువాత కూడా భగవాన్ కి ఎటువంటి గుణము కనబడలేదు . ఆ పుండు మానకపోగా రక్తం కారుట మొదలైనది . చివరికది విషగ్రంధి అని నిర్ణయించారు . *ఒక డాక్టరు భుజంతో సహాకోసి వేయాలన్నారు . అప్పుడు భగవాన్ “ ఇది తలపై లేచిన తలను కొట్టి వేయుదురు కాబోలు ” అని అన్నారు* . పుండుకు ఎన్నో చికిత్సలు చేసినా తగ్గలేదు . ఒకరు భగవాన్ ను ఇట్లు ప్రశ్నించారు , “ *మీరు సంకల్పం చేసుకుంటే తగ్గిపోదా ? ” దానికి జవాబుగా “ దానిని నేను రమ్మంటినా పొమ్మనుటకు ” అన్నారు భగవాన్* . ఇంత బాధ పడుతున్నా చమత్కారం చేస్తూ వారికి చీమ కుట్టినట్లు కూడా అనిపించేది కాదు . వారి భావన వ్యాధి శరీరానికే కాని వారు శరీరము కాదని ఆత్మ అని తెలిసికొనుటచే వారు ఆ విషగ్రంధి తమ చేతిపై వచ్చినా ఎటువంటి బాధపడలేదు . కన్నీరు కార్చలేదు . భక్తుల బాధలను ఓర్చుకొనలేక వారి తృప్తి కొరకై శస్త్ర చికిత్స చేసుకున్నారు . వైద్యశాస్త్రము చదివిన డాక్టర్లను నొప్పింపక వారికోసము ఆపరేషను చేయించుకున్నారు తప్ప వారికి ఎటువంటి మోహము తమ శరీరముపై లేదు . 


       భగవాన్ బాధలను చదువుతుంటేనే మనకి ఎంతో బాధ కలుగుతున్నదే , మరి అంత బాధను స్వయముగా అనుభవించిన భగవాన్ మాత్రము ఏ చలనము లేకుండా ఆత్మ నిమగ్నులై యున్నారు . అటువంటి జ్ఞానము , నిబ్బరము , ధైర్యము , ఓర్పు , దేహ వ్యామోహము లేకుండుటలాంటి మహోన్నత శక్తిని ప్రసాదించమని భగవానుని వేడుకుందాం . 


ఓ రమణా నీవే మాకు శరణాగతి . 

అరుణాచల శివ. 

🧘‍♂️90 - శ్రీ రమణ మార్గము *జాఫ్నా మనిషి:-*

 *🧘‍♂️90 - శ్రీ రమణ మార్గము

*జాఫ్నా మనిషి:-*

అరుణాచల రమణుడి జీవిత కాలంలో ఆయనకు సేవ చేసిన వారిని తలచు కోవడం కూడా మన మనస్సుకు ఎంతో సంతోషన్నిస్తుంది. శ్రీరామచంద్రుడికి సేవ చేసిన వారి భాగ్యమెటువంటిదో, ఈ రమణుడి సేవకుల భాగ్యం కూడా అటువంటిదే.

రమణుడు విరూపాక్ష గుహ వద్ద నివసిస్తున్న రోజుల్లో ఆయనకు తోడుగా కందస్వామి అనే భక్తుడొకడుండేవాడు. ఆ కాలంలో అక్కడ దగ్గరలో నీటి సదుపాయం ఉండేది కాదు. వంట చేయడానికి తగిన వసతి కానీ, మనుషులు నివసించే చోటు గానీ లేదు. ఆ ప్రాంతంలో నీటి ఊట ఒకటుంటే దానిచుట్టూ ఉన్న రాయి రప్పా తీసి, నీరు లభించేట్లు చేశాడు కందస్వామి. పెరిగిఉన్న ముళ్ళ చెట్లూ, దుబ్బూ అంతా తెగ్గొట్టి, పెకలించి వేశాడు. అక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించి ఆ చుట్టూ ఉన్న నేలనంతా చదును చేశాడు. మామిడి, పనస, కొబ్బరి వంటి ఫలవృక్షాలు నాటాడు. పెరుమాళ్ స్వామి అనే మరో భక్తుడి సాయంతో ఇప్పుడక్కడ ఉన్న ఇటుక నిర్మాణాన్ని పూర్తి చేసి శ్రీ రమణుల వారిని అక్కడికి వచ్చి నివసించమని ఆహ్వానించాడు. రమణుడితో అక్కడే కొన్నాళ్ళు కలిసి జీవించి ఆ తర్వాత తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరువణ్ణామలై తిరిగి రాలేదు. అటు తర్వాత అతడిని గురించి ఏ వర్తమానమూ లేదు. అతడు ఎంతో శ్రమించి నిర్మించిన ఆశ్రమానికి శ్రీ రమణులు అతడి పేరే పెట్టించారు. ఈ స్కందాశ్రమం ఈనాటికీ అక్కడ ఉన్నది. రమణాశ్రమ నిర్వాహకులే దానిని చూస్తుంటారు. రమణ భక్తులు ఈ స్కందాశ్రమాన్ని ఆసక్తితో వెళ్లి చూచి వస్తుంటారు.

సేవా ధర్మాన్ని పాటించిన వారిలో శ్రీలంకలోని జాఫ్నా నుంచి వచ్చిన అమృతానంద అనే మరో వ్యక్తి ఉండేవాడు. రమణుడి ఔన్నత్యం గురించి వినిన అమృతానంద, తిరువణ్ణామలై వచ్చి స్కందాశ్రమంలో కొంతకాలం నివసించాడు. కంద స్వామిలాగే ఇతడు కూడా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. బాటల మీద రాలిన చెట్ల ఆకులూ, చెత్తా చెదారం అన్నిటినీ ఊడ్చి అవతల పారేస్తుండేవాడు. 

ఆవు పేడతో తగిన ప్రదేశాలన్నీ అలికి చక్కగా ఉంచుతుండేవాడు. రమణుడు తిరుగాడే చోటంతా6.   అమిత పరిశుభ్రంగా ఉండాలని అతడి భావన. అమృతానంద ఎప్పుడైనా ఒకసారి తిరువణ్ణామలై వెళ్ళి అక్కడ రెండు మూడు రోజులు ఉండిపోయేవాడు. ఆ సమయాల్లో బాటల మీద, రాయీ రప్పా, చెట్ల కొమ్మలూ, చెత్తా కనిపిస్తే రమణుడు చిరునవ్వుతో "జాఫ్నా పెద్దమనిషి ఆశ్రమంలో లేదా ఏమిటి?” అని అంటుండేవారు.

ఒక రోజున అమృతానంద నీళ్ళలో ఆవుపేడ ఎక్కువగా కలిపి, బాటలన్నీ అలికే సరికి, వాటిపై నడచివెళ్ళిన వారి కాళ్ళకి, కొద్దిగా పేడ అతుక్కొన్నది. పెరుమాళ్ స్వామికి అమృతానంద మీద చెడ్డ కోపమొచ్చి, “ఈ జాఫ్నా మనిషి ఆవుపేడతో ఈ ప్రదేశాన్నంతా ఖరాబు చేస్తున్నాడు. అతడికిక్కడ ఇక అన్నం పెట్టకండి" అన్నాడు తోటి వారితో.

రమణుడు అమృతానందను 'జాఫ్నా జంటిల్మన్' అని ఎంతో ఆదరంగా వ్యవహరిస్తే, పెరుమాళ్ స్వామి అతణ్ణి 'జాఫ్నామాన్' అనే వాడనేది పాఠకులు ఈపాటికే గ్రహించి ఉంటారు. దీనిని బట్టి రమణుడికి అమృతానంద పట్ల ఎలాంటి అభిప్రాయం ఉండేదో, పెరుమాళస్వామి వంటి వారికి అతణ్ణి గురించి ఎలాంటి భావముండేదో తెలియడమే కాక, “ఆశ్రమంలో అన్నం పెట్టకండి" అనేటంతటి శిక్షకు అమృతానంద అర్హుడేనా అనే విషయం కూడా పాఠకులు ఆలోచించవచ్చు.

మరికాసేపటికి అమృతానంద ఆశ్రమంలో కనిపించలేదు. అందరూ అతడి కోసం వెతుకనారంభించారు. అమృతానంద చివరికో కొబ్బరిచెట్టు మీద మట్టల వెనుక కనిపించాడు. పెరుమాళ్ స్వామి, అతణ్ణి కిందికి దిగిరమ్మని అన్నాడు. అమృతానంద ఇతడికే సమాధానమూ చెప్పకుండా, తన చేతికందిన లేత కొబ్బరికాయలు కొట్టి, అందులోని నీరు తాగనారంభించాడు. పెరుమాళ్వామి 'ఇతడికి అన్నం పెట్టవద్దని' శాసించగలిగాడే కానీ, ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్ళను తాగడాన్ని అంత సులభంగా ఆటంకపరచలేడు కదా?

పెరుమాళ్వామి అమృతానందను దిగి రమ్మని మళ్ళీ పిలిచాడు. అక్కడున్న వారంతా కూడా, ‘దిగిరావయ్యా' అని ఎంతగానో అభ్యర్థించారు. కానీ అతడు ఎవర్నీ
లెక్క చేయలేదు. ఎవరి మాటా పట్టించుకోలేదు. మధ్యాహ్న భోజనవేళకు అమృతానంద హాజరు కాలేదనే విషయం గమనించిన శ్రీరమణులు 'అతడేడీ?' అని అడిగాడు. అమృతానంత చెట్టెక్కి కూచున్నాడనీ, అందుకు సంబంధించిన వృత్తాంతమంతా రమణుడికి చెప్పారు.

శ్రీ రమణుడు బయట చెట్టు వద్దకు వెళ్ళి, అమృతానందను దిగిరమ్మని పిలిచాడు. ఆశ్రమంలో మరెవర్నీ లెక్కచేయని అమృతానంద, రమణుడు పిలవగానే, మారు మాటాడకుండా, చిన్న పిల్లవాడివలె ఆయన చెప్పినట్లు చేస్తూ, దిగివచ్చాడు. శ్రీ రాముడు ఆజ్ఞ ఆంజనేయుడికి శిరోధార్యమైనట్లే, శ్రీ రమణుల మాట మీద అమృతానందకు అంత గురి ఉండటంలో ఆశ్చర్యమేముంది?

అతి సామాన్యుడిగా కనిపించే ఈ అమృతానంద, మహా గురువుగా గుర్తింపడిన శ్రీ రమణుల వారి మధ్య ఉన్న ఈ పరస్పర ఆదరాభిమానానికి కారణమేమిటో !

శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలు లేఖ 137 (137) మూడు రాష్ట్రాలకు ఆవల

 శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలు

లేఖ 137

(137) మూడు రాష్ట్రాలకు ఆవల

6వ తేదీ సెప్టెంబర్, 1947

గత నెలలో, మా కోడలు ఇక్కడ ఉన్న సమయంలో, ' విచార మణి మాల ' (స్వీయ విచారణ) తెలుగు వెర్షన్‌కు సంబంధించిన రుజువులు లభించాయి. మధ్యాహ్నం భగవాన్ వాటిని సరిచేసి నాకు అందించాడు. వాటిని చదివిన మా కోడలు నన్ను స్వప్నత్యంత నివృత్తి అంటే అడిగారు . నేను వివరించడానికి ప్రయత్నించాను, కానీ నాకు ఖచ్చితంగా తెలియకపోవడంతో, నేను ఆమెను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాను. అది గమనించిన భగవాన్, “ఏమిటి? ఏదైనా పొరపాటు ఉందా?” నేను బదులిచ్చాను, “లేదు. ఆమె స్వప్నత్యంత నివృత్తికి అర్థం అడుగుతోంది .

భగవాన్ దయతో అన్నాడు, "ఇది సంపూర్ణమైన, కలలు లేని నిద్ర."
నేను అడిగాను, “జ్ఞానికి కలలు లేవని చెప్పడం నిజమేనా?”
భగవాన్: "అతనికి కలల స్థితి లేదు."
నా కోడలు ఇంకా సంతృప్తి చెందలేదు, కానీ ప్రజలు ఇతర విషయాల గురించి మాట్లాడటం ప్రారంభించడంతో, మేము విషయాన్ని అక్కడితో వదిలివేయవలసి వచ్చింది. రాత్రిపూట మాత్రమే ఆమె ఇలా చెప్పింది, “వసిష్టం [1] లో ఒక గ్రహింపబడిన ఆత్మ చర్యలు చేస్తున్నట్లుగా పేర్కొనబడింది, కానీ అవి అతనిని ఏమాత్రం ప్రభావితం చేయవు. దీని అసలు అర్థమేమిటో మనం భగవాన్‌ని అడగాలి.”

మరుసటి రోజు ఉదయం ఆశ్రమానికి వెళుతున్నప్పుడు, భగవాన్ అప్పుడే సుందరేశ అయ్యర్‌కి విషయాన్ని వివరిస్తున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నా కోడలు మళ్లీ ఇలా అడిగారు, “స్వప్నత్యంత నివృత్తి అంటే సంపూర్ణమైన, కలలు లేని నిద్ర అని భగవాన్ చెప్పారు. అంటే జ్ఞానికి కలలు లేవని అర్ధం అవుతుందా?”

[1- యోగ వాసిష్టం అనేది యోగాపై వశిష్ట మహర్షి రచించిన పుస్తకం.]

భగవాన్: “ఇది స్వప్న స్థితి మాత్రమే కాదు, మూడు స్థితులూ జ్ఞానికి అసత్యమైనవి. ఈ మూడు స్థితులలో ఏదీ లేనిదే జ్ఞాని యొక్క నిజమైన స్థితి.”
నేను అడిగాను, "మేల్కొనే స్థితి కూడా కలతో సమానం కాదా?"
భగవాన్: “అవును, ఒక స్వప్నం కొద్దికాలం ఉంటుంది, అయితే మేల్కొనే స్థితి ఎక్కువ కాలం ఉంటుంది. అదొక్కటే తేడా.”
నేను: “అప్పుడు గాఢ నిద్ర కూడా కలలా?”
భగవాన్: “లేదు, గాఢనిద్ర అనేది ఒక వాస్తవం. మానసిక కార్యకలాపాలు లేనప్పుడు అది కల ఎలా అవుతుంది? అయితే, ఇది మానసిక శూన్యత స్థితి కాబట్టి, ఇది అజ్ఞానం (అవిద్య) కాబట్టి దానిని తిరస్కరించాలి. నేను పట్టుదలతో, “అయితే గాఢనిద్ర కూడా కల స్థితి అని చెప్పలేదా?”

భగవాన్: “కొందరు పరిభాష కోసం అలా చెప్పి ఉండవచ్చు, కానీ నిజంగా విడిగా ఏమీ లేదు. చిన్న లేదా దీర్ఘకాలం అనేది కల మరియు మేల్కొనే స్థితికి మాత్రమే వర్తిస్తుంది.
ఎవరైనా ఇలా అనవచ్చు: 'మేము చాలా కాలం జీవించాము మరియు ఈ ఇళ్లు మరియు వస్తువులు మాకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి, ఇది ఖచ్చితంగా కల కాదు'. కానీ కలలు కూడా అవి చాలా కాలం పాటు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అవి కొద్దిసేపు మాత్రమే ఉండేవని నిద్రలేచినప్పుడే అర్థమవుతుంది. అదే విధంగా, ఒక వ్యక్తి సాక్షాత్కారం (జ్ఞానం) పొందినప్పుడు, ఈ జీవితం క్షణికమైనదిగా కనిపిస్తుంది. Dreamless sleep nescience అర్థం; అందువల్ల ఇది స్వచ్ఛమైన అవగాహన స్థితికి అనుకూలంగా తిరస్కరించబడుతుంది."

అప్పుడు నా కోడలు ఇలా చెప్పింది, “గాఢనిద్రలో కలిగే ఆనందాన్ని సమాధి స్థితిలో అనుభవిస్తారని అంటారు [2] అలాగే, కానీ గాఢనిద్ర అనేది ఒక అజ్ఞాన స్థితి అనే ప్రకటనతో ఎలా రాజీపడాలి?"

[2- సమాధి అంటే ధ్యానం యొక్క ఒక వస్తువులో, అంటే పరమాత్మ (యోగం యొక్క 8వ మరియు చివరి దశ)లో సంపూర్ణమైన ఆలోచనను గ్రహించడం.]

భగవాన్: “అందుకే గాఢ ​​నిద్రను కూడా తిరస్కరించాలి. గాఢనిద్రలో పరమానందం ఉంటుందనేది నిజమే కానీ దాని గురించి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత నిద్ర లేచి బాగా నిద్రపోయానని చెబితేనే తెలుస్తుంది. సమాధి అంటే మెలకువగా ఉండి ఈ ఆనందాన్ని అనుభవించడం.
నేను: "కాబట్టి దీని అర్థం మేల్కొనడం లేదా స్పృహతో కూడిన నిద్ర?"
భగవాన్: "అవును, అంతే."

అప్పుడు నా కోడలు ఆమెను ఆందోళనకు గురిచేసే ఇతర సహసంబంధమైన ప్రశ్నను లేవనెత్తింది: “వశిష్ఠుడు చెప్పినట్లు, గ్రహించిన ఆత్మ ఇతరులకు వివిధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అతను వాటి వల్ల అస్సలు ప్రభావితం కాదు. వారి భిన్నమైన దృక్పథం వల్ల ఇతరులకు అలా అనిపించిందా లేదా అతను నిజంగా ప్రభావితం కాలేదా?”
భగవాన్: "అతను నిజంగా ప్రభావితం కాదు."
నా కోడలు: “ప్రజలు కలలో మరియు మేల్కొని ఉన్నప్పుడు అనుకూలమైన దర్శనాల గురించి మాట్లాడుతారు; ఏమిటి అవి"?
భగవాన్: "సాక్షాత్కారమైన ఆత్మకు అవన్నీ ఒకేలా కనిపిస్తాయి." అయినప్పటికీ ఆమె పట్టుబట్టింది, “గణపతి ముని తిరువొత్తియూర్‌లో ఉన్నప్పుడు మరియు భగవాన్ తిరువణ్ణామలైలో ఉన్నప్పుడు భగవాన్ దర్శనం పొందాడని మరియు అదే సమయంలో, భగవాన్ నివాళులర్పించిన అనుభూతిని కలిగి ఉన్నాడని భగవాన్ జీవిత చరిత్రలో పేర్కొనబడింది. అలాంటి వాటిని ఎలా వివరించవచ్చు? ”
భగవాన్ నిగూఢంగా సమాధానమిచ్చాడు, "ఇలాంటివాటినే దైవ దర్శనం అని నేను ముందే చెప్పాను." అతను ఇకపై చర్చను కొనసాగించడానికి ఇష్టపడనని సూచిస్తూ మౌనంగా ఉన్నాడు.

--కాళిదాసు దుర్గా ప్రసాద్ 

శివపురాణం -40🌹 🌷పార్వతీ కళ్యాణము – పార్ట్ 8🌷 *చివరి భాగం*

 🌹శివపురాణం -40🌹

 🌷పార్వతీ కళ్యాణము – పార్ట్ 8🌷
*చివరి భాగం*

కళ్యాణం కోసమని శివుడు పీటల మీదకు వచ్చి కూర్చుంటున్నాడు. అది గొప్ప చారిత్రాత్మకమయిన కళ్యాణము. కాబట్టి శివుడు పీటల మీదికి వస్తుంటే మేఘముల లోంచి వృష్టి పడిపోయిందా అన్నట్లుగా పువ్వులు జల్లేశారు. అయ్యవారు పెద్దపుష్ప వృష్టితో పెద్ద మేళతాళముల ధ్వనులతో గణాధిపులు అందరూ నిలబడి ఎక్కడ చూసినా జయజయశంకర హరహర శంకర అని జయజయ ధ్వానాలు చేస్తుంటే పీటల మీదికి వచ్చి కూర్చున్నాడు. పార్వతీదేవి గౌరీతపస్సు చేసింది. ఆవిడే ఆవిడ గురించి తపస్సు. ఎందఱో ధన్యులు అయినవారు, దిక్పాలకులు, ఇంతమంది మధ్యలో నిలబడి కొలుస్తుండగా చుట్టూ ఒకపక్కన సరస్వతీదేవి, మరొక పక్కన లక్ష్మీదేవి, అరుంధతి శచీదేవి వీళ్ళందరూ వెంట వస్తుంటే అమ్మవారు పెళ్ళి పీటల మీదికి బయలుదేరి వస్తోంది.
ఎన్నడూ అలా వెళ్ళవలసిన అవసరం లేని శంకరుడు పార్వతీదేవి అడిగిందని కన్యాదాత గారింటికి తానే వచ్చాడు. హిమవంతుడి ఇంటికి వచ్చి లోపల పొంగిపోతూ సంతోషంగా ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు పూర్ణ చంద్రుడు అవుతుంటే కళలు పెరుగుతుంటే సముద్రంలో పోతూ పెరుగుతుంది. పెళ్ళి పీటల మీదకి స్వామివస్తుంటే పౌర్ణమి చంద్రుని చూసిన సముద్రం పొంగిపోయినట్లు జనం అందరూ ఆ దేవసార్వభౌముడిని జగదంబతో పీటల మీద చూస్తున్నాము మా కలలు పండిపోయాయి. మాకు కన్ను ఉన్నందుకు ఇన్ని కోట్ల జన్మల తరువాత మా నేత్రములు సార్ధకత చెందాయి’ అని పరవశించి పోతున్నారు.
ఇపుడు హిమవంతుడు శంకరుడిని తీసుకువచ్చి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి మహానుభావుడు శంకరుడు నాకు అల్లుడు అవడానికి తనకు పిల్లనివ్వమని కబురు చేయడం మాని తానే వచ్చాడని పొంగిపోయి వినయ విధేయతలతో ఆ పెళ్ళికొడుకు కాళ్ళు కడిగాడు. పార్వతీ పరమేశ్వరులకు మధ్యలో తెర కట్టారు. తెరకు అటువైపు శంకరుడు, ఇటువైపు పార్వతీదేవి కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరులవి శరీరములు రెండు, కానీ మనస్సు మాత్రం ఒక్కటే. ఇద్దరి మనస్సులో ఒక్కటే కోరిక ఉంది. ఇది లోకంలో ఏ దంపతుల మధ్యనయినా ఉండేదే. అబ్బ మధ్యలో ఈ తెరను ఎప్పుడు తీసేస్తారా అని అనుకుంటున్నారు. అనగా ఇద్దరి మనస్సులలోను ఒకటే కోర్కె దంపతులకు అలా ఉండాలి.
ఇపుడు హిమవంతుడు కన్యాదానం చేయడం కోసమని చెప్పి మేనకాదేవి కలశంతో నీళ్ళు పట్టుకొనగా శంకరుని పాదములు కడగడం కోసమని సిద్ధపడ్డాడు. అక్కడ బ్రహ్మగారు యాజ్ఞీకం చేస్తున్నారు. ఆయన అన్నారు ‘పిల్లవాడి ప్రవర చెప్పాలి కదా ఎవరికి తెలుసండి’ అని అడిగారు. అపుడు అక్కడ ఉన్నవారిలో ఒక పెద్దాయన ‘నీవు చతుర్ముఖ బ్రహ్మవి – బ్రహ్మ స్థానంలో ఉన్నవాడివి. అటువంటి వాడివి నీకే తెలియక పోతే ఎవరికీ తెలుస్తుంది? పోనీ లక్ష్మీ నారాయణులను అడగండి. అన్నారు. అపుడు నారాయణుడు నేను ఆయన వామభాగంలోంచి పుట్టాను నాకన్నా ముందు ఉన్నాడు ఆయన. నాకు ఆయన సంగతి తెలియదు అన్నాడు. మరి ఎవరిని అడిగితే తెలుస్తుందా అని పరికిస్తే అక్కడ పొంగిపోతూ వీణ వాయిస్తున్న నారదుడు కనిపించాడు. నారదుని అడుగగా మహాత్ముడికి ప్రవర ఏమిటి? నిర్గుణ నిష్కలంక నిరంజన అని ప్రవర చెప్పేయండి అంతే అని చెప్పేసరికి సభలో ఉన్నవారు పొంగిపోయి శంకరుడికి ప్రవర అలా చెప్పండని అన్నారు.
అప్పుడు అల ప్రవర చెప్పి హిమవంతుడు మేనకాదేవి పార్వతీ దేవిని కన్యాదానం చేస్తున్నారు. అప్పుడు తెరతీసి శుభముహూర్తంలో జీలకర్ర, బెల్లం పెట్టిస్తున్నారు. తెర పైకెత్తినపుడు కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి. తెర తీసివేయగానే ఆవిడ ఆయనను, ఆయన ఆవిడ చూసుకుంటారు. ఆ శుభ ముహూర్తంలో కళ్ళు కళ్ళు కలుసుకుంటే జీవితాంతం మనస్సులు ఏకీకృతం అవుతాయి. ఇద్దరి మధ్య అనురాగం అంకురిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వారు లోకమునకు పాఠం చెప్తున్నారు.
ఇపుడు తలంబ్రాలు పోసుకోమన్నారు. కోరికలు పోస్తోందా అన్నట్లు అమ్మవారు తలంబ్రాలను పోస్తోంది. అన్నీ తీరుతాయి అన్నట్లుగా పున్నమి చంద్రుడి వంటి ముఖము ఉన్న పార్వతీదేవి తలమీద తలంబ్రాలను శంకరుడు పోశాడు. అలా ఇద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్న ఘట్టం చూసి లోకం అంతా పొంగిపోయింది. తరువాత పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణమునకు శక్తిమంతమయిన మంత్రం చెప్తారు. తరువాత విడిది గృహప్రవేశం చేయించాలి. అప్పుడు వారిని బయటకు తీసుకు వచ్చి పీఠంమీద విడిది గృహప్రవేశం చేయించారు. తదుపరి లాజహోమంతో కార్యక్రమం పూర్తిచేస్తారు. అప్పుడు దేవతలందరూ వచ్చి ‘అయ్యా, పూర్వం మీరు రతీదేవికి అభయం ఇచ్చారు. దయచేసి మన్మథుని బ్రతికించండి’ అని అడిగారు. అపుడు శంకరుడు పార్వతివంక సంతోషంగా చూశాడు. అంతే మరల మన్మథుడు పుట్టేశాడు. మళ్ళీ జగత్ సృష్టి ప్రారంభం అయింది.
హిమవంతుడు పొంగిపోయి పార్వతీదేవిని దగ్గరకు పిలిచి ‘అమ్మా ఎంత అదృష్టం నీకు తండ్రిని అయ్యాను. నువ్వు ఈవేళ ఒక ఇల్లాలివి అయిపోయావు, నిన్ను అత్తవారింటికి పంపిస్తున్నాను అని తలమీద నెమ్మదిగా జుట్టంతా రాస్తూ పదిమంది చూస్తుండగా కన్నుల నీరు కార్చేశాడు. ఇప్పుడు అప్పగింతలు పెడుతూ పార్వతీదేవికి సుద్దులు చెప్తున్నారు. తరువాత పార్వతీదేవి వద్దకు చెలికత్తెలందరూ వచ్చారు. అమ్మా నీకు సారె పెడతాము అల్లుడు గారికి కూడా సారె పెట్టాలని ఉంది. కానీ అల్లుడు గారికి సారె పెడదామంటే మా దగ్గరే కాదు ఇంత ఐశ్వర్యవంతమయిన హిమవత్పర్వతం దగ్గరే కాదు శంకరుడికి ఇవ్వగలిగిన వస్తువులు ఎవరి ఇంట్లోనూ ఉండవు అన్నారు. చెలికత్తెలు పరిహాసం ఆడినట్లూ ఉంది, శంకరుడికి ఇవ్వలేనితనమును చెప్తున్నారు. హిమవంతుడు తన ఐశ్వర్యమునకు తగినట్లు కూతురు అత్తవారింటికి వెడుతోందని ఎన్నో కానుకలను ఇచ్చాడు. ఎన్నో పట్టు చీరలను, ఎన్నో బంగారు నగలను, అనేక మత్తగజములను, అనేక అశ్వములను, అనేక పల్లకీలను, అనేక భూములను, పురములను, పుష్పములను, సారెగా ఇచ్చి పంపాడు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనం ఎక్కి కైలాసమునకు బయలుదేరారు. వెనక సరస్వతీ దేవి, చతుర్ముఖ బ్రహ్మ, వారి వెనుక లక్ష్మీ నారాయణులు, శచీదేవి, ఇంద్రుడు బయలుదేరారు. ఇంతమంది దేవతలు కైలాసమును చేరుకున్నారు. పార్వతీ దేవి వచ్చింది కాబట్టి ఇప్పుడు కైలాసంలో నిత్యోత్సవములు ప్రారంభం అయ్యాయి. తరువాత ఆ దేవతలు అందరూ శంకరుని వద్దనుండి కానుకలు, తాంబూలములు పుచ్చుకుని స్వస్థానములకు వెళ్ళిపోయారు.

పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాస పర్వతం మీద కూర్చుని అక్కడి నుండి ఎప్పుడూ తమను నమ్మినవారిని, కొలిచిన వారిని, తమకు నమస్కరించినవారిని అలా చూస్తూ, కాపాడుతూ, జగత్తుకి తల్లిదండ్రులై విరాజిల్లుతున్నారు.

కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్సురదనుభవాభ్యాం నతిరియమ్!!

అంటారు శంకరభగవత్పాదులు.
 కోరి కొలిచిన వాళ్ళకి ఇక్కడే ఉండి రక్షించే ఆ మాతాపితరులు లోకములను చల్లగా చూస్తున్నారు.

ఈ పార్వతీ కళ్యాణ ఘట్టమును, ఈ శివమహాపురాణ ప్రవచనమును ఎవరు విన్నారో, ఎవరు చదివారో, వాళ్ళకు సర్వ కాలములయందు పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది.

*సర్వం ఉమామహేశ్వర పాదపద్మరవిందర్పణమస్థు*

              🌹ఓం నమఃశివాయ🌹

శ్రీరమణీయం: అసలు ధ్యానం ఎందుకు చేయాలి ? అలా మనసును కష్టపెట్టకుండా ఆ స్థితి సహజంగా తెలియదా !?

 💖💖💖
       💖💖 *"449"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"అసలు ధ్యానం ఎందుకు చేయాలి ? అలా మనసును కష్టపెట్టకుండా ఆ స్థితి సహజంగా తెలియదా !?"*

*"ధ్యానం ఎందుకు చేయాలంటే మనకి కోరిక లేని స్థితిలో ఉండే ఆనందం తెలియడం కోసం. వస్తువులతో, విషయాలతో వచ్చే ఆనందమే మనకి తెలుసు. అది వాటితో సంబంధం పెట్టుకుంటే గాని రాదు. కానీ ఏ సంబంధమైనా శాశ్వతంగా ఉండదు. కనుక ఆనందం కూడా శాశ్వతంగా ఉండటంలేదు. ధ్యానంలో ఏమీ కోరాలనిపించదు. ఎందుకంటే అక్కడ అనుభవం తప్ప ఆశలేదు. ఇప్పుడు మనం దేన్నయితే నేను, నేను అంటున్నామో అది మనలోని ఆశపరుడికి మనం పెట్టుకున్న పేరు. ఆశపరుడు లేకపోయినా అనుభవం ఉంటుంది. అదే ధ్యానస్థితిలో జరుగుతుంది. మనలోని ఆశపరుడే నేనుగా, అహంకారంగా, మాయగా ఉన్నాడన్న విషయం మనకు ధ్యానంలో తెలుస్తుంది. సృష్టిలో వస్తువుల నుండి ఏది ఆశించకపోయినా మనకు వచ్చే శాంతి మనకి అందుతూనే ఉంది. ఈ విషయం సాధకుడు ధ్యానస్థితిలో తెలుసుకుంటాడు. ప్రతి ఒక్కరూ సాధన చేసి ఈ విషయాన్ని తెలుసుకోలేక పోయినా దాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, బోధించే గురువు మాటలు విశ్వసించి అనుసరించినా చాలు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

🧘‍♂️89 - శ్రీ రమణ మార్గము🧘‍♀️* *మహాత్ముల మహిమలు:-*

 *🧘‍♂️89 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*మహాత్ముల మహిమలు:-*

మన ‘మంచితనం’ అనేది, తరచూ స్వార్థంతో కూడుకొని ఉంటుంది. ఏదో ఒక ఫలితం ఆశించ కుండా మనం 'మంచి'గా ఉండలేము. మంచితనం మన సహజ స్వభావం కానంతవరకూ, అనగా అది మనలో నుండి 'స్పాంటేనియస్'గా పుట్టుకు రానంతవరకూ, దాని మూలం ఎప్పుడూ స్వార్థంతోనే ముడి వేసుకుని ఉంటుంది. అలాంటి మన సాధారణ 'మంచితనానికి', మనలో కొందరు  ధనాన్ని ఆశించవచ్చు; మరి కొందరు సంఘంలో కీర్తి ప్రతిష్ఠలను, లేదా ఇతరుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని, ఏదో ఒకటి ఆశించవచ్చును. ఆశించకుండా ఉండలేము.

మన మెరిగిన ఈ 'మంచితనం' కాక మరో మంచితనం ఉన్నది. అది ఆలోచనాత్మకమైనది కాదు. అది కరుణలో నుండి జనించేటువంటిది. కరుణ, ప్రేమ ఆకారణమైనవి. అవి ఎవరిపై ఎప్పుడు జనిస్తాయనేది ఎవరూ నిర్ధారించలేరు. కరుణాళువులైన మహానుభావుల్లో అరుణాచల రమణులు ఒకరు. ఆయన స్వయంగా పూనుకొని ఏ మహిమలూ ప్రదర్శించే వారు కాదు. 'పాపులారిటీ' కోసం పాకులాడాల్సిన అవసరం ఆయనకి ఏనాడూ కలుగలేదు.

కానీ ఆయన సమక్షంలో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతుండేవి. వాటి గురించి ఆయనతో ఎవరైనా ప్రస్తావించినా కూడా, ఆయన ఏమీ వ్యాఖ్యానించే వారు కాదు. 'ఏదో సంభవించిందనీ, అది అవతలి వారి బాధను నివారించిందనీ, ఆయనకు తెలుసు. కానీ అందుకాయన కర్తృత్వ బాధ్యత స్వీకరించడం గానీ, ఆ విషయాన్ని మరో సందర్భంలో అనడంగానీ జరిగేది కాదు: చూచి వూరుకునే వాడు.

శ్రీ రామస్వామి పిళ్ళె అనే శిష్యుడు రమణుణ్ణి గురించి ఇలా చెప్పుకొస్తాడు: “నేనిప్పుడు చెప్పబోయే సంఘటనలో రమణుడు నాటకీయంగా ఏదో సిద్ధిని ప్రదర్శించాడని అనుకోవద్దు. కానీ ఈ విషయాన్ని గనక జాగ్రత్తగా పరిశీలిస్తే, రమణుడు ఎంత నెమ్మదిగా ఎంత సహజ సిద్ధంగా కొన్ని కార్యాలు నిర్వహించాడో తెలుస్తుంది.

తిరువణ్ణామలై సమీపంలోని ఒక ఊర్లో మనిషి ఏదో తీవ్రమైన జ్వరం వల్లనో, ‘అమ్మవారు’ పోయడం వల్లనో రెండు నేత్రాల దృష్టిని కోల్పోయాడు. రమణాశ్రమం వెళ్ళి రమణుణ్ని సందర్శిస్తే మళ్ళీ దృష్టి కలుగుతుందని ఎవరో తమ విశ్వాసం కొద్దీ అతడితో చెప్పగా, మరొక మనిషి తోడు తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. శ్రీ రమణులు ఎక్కడ కూచోనుంటారు అని అక్కడున్న వారిని విచారిస్తున్నాడు.

అంతకు మునుపు కొద్ది రోజుల క్రితమే రమణుని దర్శనానికై ఇద్దరు యువ డాక్టర్లు ఆశ్రమానికి వచ్చారు. ఆ ఇద్దరికీ రమణునిపై ఎంతో గౌరవ భావం ఏర్పడింది. 

దర్శనం, ఆశ్రమ నివాసమూ పూర్తి చేసుకొని మద్రాసుకు తిరిగి వెళ్ళడానికి తమ కారుతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. రమణుని వద్ద సెలవు తీసుకొని బయట తమ కారు వద్దకు బయలుదేరుతూ, వెళ్ళేముందు ఒక్కసారి రమణ రూపాన్ని తనివితీరా చూచిపోదామని మళ్ళీ హాలు వద్దకు వచ్చారు. ఈలోగా హాలులోనికి ప్రవేశించిన ఆ దృష్టిహీనుడు, ఏదో విధంగా తనకు దృష్టిని ప్రసాదించమంటూ రమణుణ్ణి వేడు కుంటున్నాడు. రమణుడు వింటున్నాడు కానీ ఏమీ మాట్లాడడం లేదు. ఇదంతా చూచిన ఆ ఇద్దరు డాక్టర్లు, ఆ వ్యక్తిని తమతో మద్రాసుకు తీసుకువెళ్ళి కంటి ఆపరేషను చేయిస్తామని అన్నారు. చివరకు ఆ వ్యక్తి ఆ డాక్టర్లతో కలిసి కారులో మద్రాసుకు వెళ్ళడం జరిగింది.

కొన్ని నెలల తర్వాత నేను శ్రీ రమణుల వారి చెంత కూచోనున్నప్పుడు, ఒక వ్యక్తి వచ్చి రమణుల ముందు ఒకటే సాష్టాంగ పడుతూండడం చూశాను. ఒక కంటికి చూపు కలిగిందనీ, ఇదంతా రమణుని కరుణేననీ అతడు పదే పదే చెప్పుకుంటూ ఉండడం చూశాను. ఆ డాక్టర్లు అప్పుడు అతణ్ణి మద్రాసుకు తీసుకువెళ్లి, ఆపరేషన్ వగైరా చేయించి, రెండు కళ్ళకూ దృష్టివచ్చేట్లు చేద్దామని గట్టి ప్రయత్నం చేసి, అది సాధ్యం కాకపోగా ఒక్క కంటికి మాత్రం దృష్టి వచ్చేట్లు చేయగలిగారట. శ్రీ రమణులు చెప్పినదంతా వింటూ మారుపలక్కుండా వుండిపోయారు. ఈ విషయంలో తనకేమీ సంబంధం లేనట్లు కూచున్నారు.

రమణుని సమక్షంలో అడపాదడపా ఇలాంటి మహిమాన్వితమైన సంఘటనలు జరుగుతుండేవి. కానీ రమణుడు ప్రతిపాదించిన నిశితతత్వ విచారణ ముందు ఈ వచ్చిపోయే అనుభవాల ప్రాధాన్యమేపాటిది?” అని ముగిస్తాడు శ్రీ రామస్వామి పిళ్ళె.

బొంబాయి నగరంలో జీవించి తరించిన నిసర్గ దత్త మహరాజ్ సమక్షంలో కూడా మనుషులకు 'మంచి' జరుగుతుండేది. ఆయన చెంత వచ్చి కూర్చున్న వారు అక్కడ జరిగే సంభాషణలు విన్నందువల్ల చిత్తశాంతిని పొందేవారు; జ్ఞానం సముపార్జించు కునేవారు. వారి వారి ప్రాప్తాన్ననుసరించి లౌకికంగా కూడా కొంత మేలు జరుగు తుండేది.

అందుకే ఆయన ఒక వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తూ “నీవు నీ లక్ష్యాన్ని అందుకున్నందువల్ల నీకు స్వస్వరూప జ్ఞానం ఉదయించగానే, భూమిపై నీ ఉనికే మనుష్యుల కొక మహాదీవెనగా పరిణమిస్తుంది. 

ఆ విషయం నీవు ఎరుగకపోవచ్చు; ఒక్కోమారు 
లోకానికి కూడా తెలియకపోవచ్చును. అయినప్పటికీ నీ నుండి సహాయం నాలుగు వైపులా విస్తరిల్లనారంభిస్తుంది. లోకంలోని రాజకీయవేత్తలు, ధర్మదాతలు అందరూ కలిసి చేయగలిగిన మేలుకన్నా, ఎక్కువ లోకోపకారం చేసే సాధు పురుషు లున్నారు. 

ఏ విజ్ఞానమూ లేని వారైనప్పటికీ, ఉద్దేశ రహితంగా ఇలాంటి సజ్జనులు, దశదిశలా వెలుతురును ప్రసరింపచేస్తుంటారు. ఇటువంటి పుణ్య పురుషులు చేసిన ‘మహిమలను' గురించి ఎవరైనా వారికి వెళ్ళి చెప్పినప్పుడు, అందరితోబాటు వారు కూడా ఆశ్చర్యపడుతుంటారు. కానీ ఇవేవీ తమ స్వంతమనుకోరు. కాబట్టి, వారికి గర్వమూ ఉదయించదు. పేరు ప్రతిష్ఠలకై పాకులాడే ప్రసక్తి లేదు. వారు తమ కోసం తాము కోరేదంటూ ఏదీ వుండదు; ఆఖరికి మరొకరికి సహాయ పడుతున్నామనే ఆనందం కూడా వారికి అక్కర లేదు.

 అన్నిటికీ ఆ భగవంతుడి దయే కారణమని పూర్తిగా ఎరిగి ఉన్నవారు కాబట్టి, వారి హృదయమెప్పుడూ శాంతంగానే ఉంటుంది" అంటారు శ్రీ నిసర్గదత్త మహరాజ్.

గణతంత్ర దినోత్సవం" గురించి తెలుసుకుందాం.

 గణతంత్ర దినోత్సవం" గురించి తెలుసుకుందాం.

ఈ రోజే గణతంత్ర దినోత్సవం...
ఘనులైన త్యాగధనులను
గుర్తు చేసుకొనే దినం...
తరతరాల బానిసత్వానికి 
శాశ్వతవిముక్తి కలిగిన దినం..

రాజ్యాంగం సృష్టి కర్త
బహుజనుల నుదిటి రాత
దేశాధినేత ఇచ్చిన రాజ్యాంగంతో
అందరూ మెచ్చివచ్చిన 
స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవం..!!

దేశభక్తి అందరిలో ఊపిరై నిలువుగా...
భరతమాత గుండెల్లో
మూడురంగుల జెండాగా ఎగరగా...
స్వాతంత్ర్యం సాధించిన
సంబరాలు జరపగా....

చెరసాలలో చిక్కిన్నోళ్లను...
ఉరికంబమెక్కిన్నోళ్లను...
గుర్తు చేసుకొందాం!!... 
గుండెల్లోనిలుపుకొందాం...

ఎన్నిజన్మలెత్తినా తీర్చకోలేము వీరి రుణం....
కులం కుళ్ళు పక్కకు తోసి..
మతం ముళ్ళు గుండెల్లోంచి తీసివేసి...
స్వాతంత్ర్యసాధనలో...
తెగింపుతో త్యాగమై నిలిచారు...
ఎందరో ప్రాణాలను వదిలారు....
తెల్లవారి కుటిల నీతి ఉక్కుపాదాల క్రింద.. 
ఎందరెందరో నలిగిపోయారు...

గాయమైన కాయాన్ని చూసి
కాలం కన్నీరు కార్చింది!!...
తెల్లదొరల ఆగడాలకు పట్టపగ్గాలులేవు!!...
చూపులను మోయలేని...
గుఱ్ఱపుడెక్కల కింద నలిగిన భరతజాతి...
నిశ్చలంగా..నిర్భయంగా
నిలబడిన త్యాగధనులు!!....

జీవితం పోయినా 
పట్టువిడువని పరాక్రమవంతులు 
భారతీయులు!!...
మహాత్ములు ఎందరెందరో
నేలకు ఒరిగారు!!....

నెత్తుటితో తడిసిన ఈనేల పైనే...
భారతఖ్యాతి నిలిపిన తేజం...
ఈదేశం గాలిపీల్చిన ప్రతిఒక్కరికీ....
ఓ చైతన్య స్ఫూర్తి రగిలిస్తోంది...
 
ఈ నేలపై నున్న ప్రతివ్యక్తిలో
పౌరుషం ఉప్పొంగుతుంది...
అవి ఓ అద్బుతక్షణాలు...
గతాన్ని తవ్వితే ఘనకీర్తి ఎంతో...
ఈనాటి వర్తమానం అన్నీట్లో వ్యర్థమే..

నాడు కర్తవ్యానికి కట్టుబడి ఉండేవారు...
సత్యం...ధర్మం..ముందుకు నడిపించింది....
తెగువతో కదంతొక్కారు...
రణం వైపు నినాదం... 
యుధ్దభేరి మ్రోగింది....
విజయం వెనుక పరుగులుతీశారు!!...
తెల్లవారిని తరిమికొట్టారు!!...

అంబటి నారాయణ
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం.👏

*కీర్తి సంపాదన*ఎలా ఉండాలో తెలుసుకుందాం.

 *కీర్తి సంపాదన*ఎలా ఉండాలో తెలుసుకుందాం.

కుండలను పగలగొట్టి అయినాసరే బట్టలను చించుకొని అయినా సరే, గాడిదలా అరచి అయినా సరే, ఏదో ఒకవిధంగా అందరి దృష్టినీ ఆకర్షించే మనుషులు లోకంలో ఉన్నారని ఒక నీతికారుడు అన్నాడు. ఇది కొందరి విషయంలో నిజమే అనిపిస్తుంది. అందరూ తననే చూడాలని, తన గురించే మాట్లాడుకోవాలని మనిషి ఆశిస్తాడు. ఇది అతడి బలహీనత, మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవడం కష్టం కనుక, చెడుపనులను అయినా చేసి ఏదో విధంగా అందరి కళ్లలో పడితే, తమకు విస్తృత ప్రచారం లభిస్తుందనుకుంటారు కొందరు.

బలవంతంగా కీర్తిని లాక్కోవాలని ప్రయత్నించడం కీర్తికండూతి అవుతుంది. కండూతి అంటే దురద కీర్తి సంపాదన అనేది సహజసుందరంగా లభించేది. అయితే మనిషికి ఆభరణంలా రాణిస్తుంది. బలవంతంగా ఈడ్చుకొని తెచ్చే కీర్తి కేవలం ఆ వ్యక్తికే ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప ఇతరులకు కాదు. లోకంలో ఉదార చరిత్ర గల మహానుభావులు ఎప్పుడూ కీర్తికోసం తపించలేదు. తాము నమ్మిన మంచిపనులను చేసుకుంటూ పోయారు. అలాంటివారు ఏదీ ఆశించకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. వారికి కీర్తిపై ఆసక్తి లేదు.

మహనీయులకు మనసులో ఒక భయం ఉంటుంది. అదేమిటంటే ఒకసారి కీర్తి వచ్చిందంటే దాన్ని నిలుపుకోవడం అనేది ఒక పరీక్ష వంటిది. వచ్చిన కీర్తిని నిలుపుకోవడం కోసం శ్రమించవలసి వస్తుంది. ఇదంతా ఒక లంపటం కనుక కీర్తి. కాంక్ష లేకుంటేనే మంచిదని వారు ఆశిస్తారు. కీర్తి కాంక్ష ఒక వ్యసనమే పెద్దల మాట. వ్యసనం మంచిదైనా, చెడుదైనా మనిషిని వెంటాడుతుంది. నిత్యం అశాంతికి గురి చేస్తుంది.

పూర్వం చక్రవర్తులు మొదలుకొని సామంత రాజులదాకా ఎందరో కీర్తికోసం తపించేవారు. దానశీలురుగా ప్రఖ్యాతిని పొందాలనుకొన్నవారు కొందరైతే, వీరాధివీరులుగా కీర్తిని గడించాలని కోరుకున్నవారు కొందరు.
నిత్యం ఎదుటివారిని పొగుడుతూ పబ్బం గడివేవారు కొందరైతే, తాము ఇతరులను పొగిడి, ఇతరుల వల్ల పొగడ్తలను ఆశించేవారు కొందరు. ఇలా పరస్పరం ఒకరి వైభవాన్ని మరొకరు పొగుడుకుంటూ ఆత్మసంతృప్తిని పొందేవారెందరో కనిపిస్తారు. ఇలాంటివారిని చూసి పూర్వం ఒక విమర్శకుడు- 'ఒంటెల పెళ్ళికి వచ్చిన గాడిదలు ఒంటెలను చూస్తూ ఆహా! ఏమి మీ అందం వర్ణనాతీతం' అని పొగిడాయట. వెంటనే ఒంటెలు ఊరుకుంటాయా! ఓ మిత్రులారా! ఆహా! ఏమి మీ కంఠధ్వని... ఎంత మధురంగా ఉందో? అని ప్రశంసించాయట.
కీర్తికాంక్ష, కీర్తి కండూతి. ఇలా పదాలు వేరైనా వాటి స్వరూపం ఒక్కటే! ఒక రూపాయి దానం చేసి, వేయి రూపాయల కీర్తిని కాంక్షించేవారు కొందరైతే, కోట్లాది రూపాయలను దానం చేసి కూడా తమ పేరు ప్రకటించవద్దని కోరే మహనీయులు కొందరు! _వచ్చిన కీర్తి చెడిపోకుండా ఉండాలంటే మనిషి నీతిగా బతకాలి. ఎన్నో చేసినా, చేసింది. అణుమాత్రమే అనుకోవడం మంచిది. నిజం కూడా ఆదే. మనిషి కీర్తికాముకుడు కాకూడదు. సహజ కీర్తి కిరీటధారి కావాలి.

డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ. సేకరణ మీరామిరెడ్డి మానస సరోవరం👏

నేటి ఆణిముత్యాలు.

 నేటి ఆణిముత్యాలు.

*ముందు చిన్న చిన్న ఆనందాలను*  *ఆస్వాదించడం నేర్చుకోండి. తర్వాత అద్భుతాలు* 
*కోరుకోవచ్చు.*

*కొన్ని సార్లునీకు నువ్వే భుజం* *తట్టుకోవాలి.కొన్ని సార్లు నిన్ను* *నువ్వే నవ్వించుకోవాలి.కొన్నిసార్లు నీకు* *నువ్వే స్నేహితుడు అవ్వాలి.బ్రతకాలి అంటే తప్పదు. కొన్నిసార్లు నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి.*

*మన జీవితాన్ని మించిన ప్రయోగశాల ఇంకొకటి లేదు. ఇక్కడ నీ ప్రతీ నిర్ణయం, నువ్వు వేసే ప్రతీ అడుగు, నువ్వు ఎదుర్కునే ప్రతీ సమస్య ఒక ప్రయోగమే.*

*అర్థం చేసుకున్న వారే మనతో ఉంటారు అనుకుంటాం,కానీ అవసరం ఉన్న వారే మనతో ఉంటారు.అందరూ కాకపోయినా ప్రస్తత సమాజంలో ఎక్కవ మంది యిలాగే ఉన్నారు.*

*Every new day is another chance to change your life.*

*మనస్సు కు ఎంత భారంగా  ఉన్నా గడిచినగతం నాదే. ఎంత కటినంగా ఉన్నా,ప్రస్తుతం నడుస్తున్న వాస్తవం నాదే.*


ఎపుడైతే నీవు ఇది "నేను చేయలేను" అనిఅనుకుంటావో నీ మెదడు పని చేయడం ఆపివేస్తది.
ఎపుడైతే నీవు "నేను ఇది ఎలా చేయగలను" అని ఆలొచిస్తావో మెదడు చురుకుగా అన్వేషణ మొదలు పెడతది.ఎపుడైతే "నేను ఇది చేసి తీరాలి " అని నిర్ణయించుకున్నావో ఇక నీ మెదడు కు వేరే ఆప్షన్ లేదు.
సాధించి తీరుతుంది ఏదయినా
మనం అనుకోవడంలోనే ఉంది
మనలోనే ఉంది బలమూ బలహీనత రెండూ మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది.

శుభోదయం తో మీ రామిరెడ్డి మానస  సరోవరం👏

*దేని కోసం ఇదంతా!* ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం.

 *దేని కోసం ఇదంతా!* ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం.
                           
అడవికి రాజైన సింహం దగ్గర ఒక ఉడుత సేవకుడిలా ఉండేది. ఏ పని చెప్పినా చిటికలో  చేసేసి రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకుంది. ఉడుత పనికి మెచ్చుకుని, సింహం ఒక మంచి బహుమానం ఇస్తానని ప్రకటించింది. "ఏమిటా బహుమానం. మహారాజా?" అని ఆత్రుతగా అడిగింది ఉడుత. "నువ్వు పదవీ విరమణ చేసే సమయానికి నీకు ఓ బండెడు బాదం గింజలు ఇప్పిస్తాను. అదే బహుమానం" అంది సింహం.

బహుమానం తెలుసుకుని ఉడుత మహా సంబరపడిపోయింది. అందరూ ఆహారం కోసం కష్ట పడుతున్న సమయంలో తను సుఖంగా ఇంట్లో కూర్చుని హాయిగా జీవితాంతం తింటూ గడపవచ్చని ఆనందించింది. తనంత అదృష్టం ఇంకెవరికి రాదని, మిగతా ఉడుతలు జీవితాంతం కష్టపడినా అన్ని బాదం పప్పులు కూడబెట్ట లేవని అది చాలా సంతోషించింది. రోజూ తనకు పట్టిన అదృష్టాన్నే తలచుకుంటూ కాలం గడిపేది. అలా అలా కాలం గడిచి, ఉడుత ముసలిది అయింది. ఇక పదవీ విరమణ చేసే సమయం వచ్చింది.

పదవీ విరమణ చేసే రోజున సింహం తనమాట ప్రకారం ఒక బండెడు బాదం గింజలను ఉడుతకు ఇచ్చింది. ఆనందంగా బండి నిండా ఆహారాన్ని పెట్టుకుని ఇంటికెళ్ళిన ఉడతకు మిగతా ఉడుతలన్నీ స్వాగతం పలికాయి.

స్నానపాదులన్నీ పూర్తి చేసి, ఇక బాదం పప్పులు తిందాం అనే సమయానికి తనకు ముసలితనం వల్ల పళ్ళన్నీ ఊడిపోయాయన్న విషయం గుర్తుకొచ్చింది. బాదం గింజలపై ఎంతో కాలంగా ఆశ పెంచుకున్న అవి ఇప్పుడు నిరుపయోగంగా ఎదురుగా ఉన్నాయని చాలా బాధ పడింది..

బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.

*ఏందుకు ఇలా జరుగుతున్నది అనేందుకు బహుచక్కని ఉదాహరణ చెపుతాను వినండి*
ఒక అడవిలో ఒక కుందేలు, ఒక సారి కొబ్బరి కాయల  చెట్టు కింద నిద్ర పోతూన్నప్పుడు చెట్టుపైనుండి ఒక టెంకాయ తెగి ’దబ్బు’మని క్రింద పడింది. 

కుందేలు ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూడగా ఏమీ కనబడలేదు. "ఏమీటో లే’ అని అట్లాగే మళ్లీ పడుకున్నది.

 కొంచెం సేపు అయ్యిందో లేదో మళ్లీ ’దబ్బు’ మని శబ్దం వచ్చింది. 

కుందేలు కళ్లు తెరిచి చుట్టూ వెతికింది. 

పైన ఆకాశం నీలంగా కనబడుతున్నది. ’అమ్మో ఆకాశం విరిగి మీద పడుతున్నది’ అనుకున్నది కుందేలు. 

మరుక్షణంలో అది పరుగుతీయటం మొదలు పెట్టింది.

అంతలో దానికి ఓ జింక ఎదురయ్యింది. ’ఆగాగు! ఎందుకు పరుగెత్తుతున్నావు, కుందేలూ’ అని అడిగింది అది.

 అయ్యో, ఆకాశం విరిగిపడుతోంది, నువ్వూ పరుగెత్తు’ అని ఉరుకెత్తింది కుందేలు. జింక దాని వెనకనే పరుగు పెట్టింది. 

అలా పరిగెడుతున్న కుందేలు, జింకలకు పులి ఎదురైంది. 

పులి అడిగింది ’జింకా, కుందేలూ ఎందుకు పరుగెడుతున్నారు?’ అని. ’అయ్యో, ఆకాశం విరిగిమీద పడుతోంది, నువ్వూ పరుగెత్తు’ అన్నై జింకా, కుందేలూ. పులి కూడా వాటితో పాటు కలిసి పరిగెత్తటం మొదలు పెట్టింది.

అంతలో వాటికి ఓ ఏనుగు ఎదురయ్యింది. "ఏమర్రా, ఆగండి ఆగండి. ఎందుకు పరుగెత్తుతున్నారు?’ అంటే అవి ’ఆకాశం విరిగిపడుతోంది నువ్వూ పరుగెత్తు పరుగెత్తు త్వరగా’ అని అవన్నీ ఉరుకెత్తాయి అటూ ఇటూ చూడకుండా. ఇక ఏనుగుకూ వాటి వెనక పరుగెత్తక తప్పలేదు.

ఇలా ఇవన్నీ పరుగెత్తుతుంటే వాటికి ఓ సింహం ఎదురైంది.వాటిని ’ఎందుకు పరుగెత్తుతున్నారు? ఏమైంది?’ అని అడిగింది. ఏనుగు చెప్పింది రొప్పుతూ- ’ఆకాశం విరిగిపడుతున్నది. అందుకే పరుగెత్తుతున్నాం’ అని. కానీ సింహానికి ఇది విచిత్రంగా తోచింది. ’ఆకాశం విరిగిపడితే నువ్వు చూశావా?’ అని అది ఏనుగును అడిగింది. ’నేను చూడలేదు. నాకు పులి చెప్పింది’ అని అంది ఏనుగు.

’ఏం పులీ, ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూశావా?’ అని సింహం పులిని నిలబెట్టి అడిగింది. ’లేదు, నాకు జింక చెప్పింది’ అన్నది పులి......
అప్పుడు సింహం జింకను నిలదీసింది: ’ఆకాశం విరిగిపడితే నువ్వు చూశావా?’ అని. ’లేదు, నాకు కుందేలు చెప్పింది’ అంది జింక. ’సరే’ అని సింహం కుందేలును అడిగింది. ’నేను కొబ్బరి కాయల చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దబ్బుమని శబ్దం వినిపించింది. ఆకాశం విరిగిపడింది’ అంది కుందేలు.

 ’ఆ టెంకాయ చెట్టు కిందకు వెళ్లి చూద్దాం అంది సింహం. అన్నీ కలిసి టెంకాయ చెట్టుకిందికి వెళ్లి చూశాయి. అక్కడ నేలమీద ఒక పెద్ద టెంకాయ కనిపించింది. అంతలో దబ్బుమని మళ్ళీ ఒక టెంకాయ పడింది. వెంటనే కుందేలు ’అదిగో, ఆకాశం విరిగిపడుతోంది, పరుగెత్తండి!’ అంది. సింహం అప్పుడు వెళ్ళి క్రిందపడిన టెంకాయను చూపిస్తూ ’ఇదేనా, నీ ఆకాశపు ముక్క?’ అని అడిగింది. కుందేలుకు సంగతి అర్థమై సిగ్గుపడింది. మిగిలిన జంతువులన్నీ నవ్వాయి.

గమనించారా బ్రమ తో కూడిన భయం జంతువులను ఎలా పరిగులు పెట్టించినదో అదే విధంగా సంపద లేకపోతే బ్రతకలేం అనే భయం తో మనం కూడా జంతువుల వలె పరుగు మొదలుపెట్టాం.

ఆ పరిగెడుతున్న కుందేలు 
మన పూర్వీకులు, ఆ జింక మన తల్లిదండ్రులు, ఇంకా ఆ
ఏనుగు మన గురువులు, మరి ఆ పులి మన సహోదరులు, చివరి గా అందరిని నిలువరిస్తూన్న  
ఆ సింహం మనమే.

పూర్వం వస్తుమార్పిడి పద్దతి ఉండేది అది కొంచెం కష్టతరం కావడంతో, వస్తూ మారకం కొరకు డబ్బులు సృష్టించడం జరిగింది.
 
దీన్ని సృష్టించిన తరువాత వ్యవహారాలు సులభతరం అయ్యాయి. దీనితో డబ్బు ఎవరు ఎక్కువగా దాచుకుంటే వారిని ధనవంతుడు అని పిలవడం మొదలు పెట్టారు. ఇక దీనితో డబ్బు అనే జబ్బు బాగా ముదిరిపోయింది, ఇప్పటివరకు దీనికి మందు లేదు. అందరిని తన వశం చేసుకుంది.

దీని మాయలో పడి తన మన అనే తారతమ్యం లేకుండా అందరినీ మోసం చేస్తూ చివరకు మనం మోసపోతున్నాం. యవ్వనంలో కష్టపడి సంపాదించుకుంటే వృద్ధాప్యంలో హాయిగా తిని ఉండొచ్చు అనుకుంటున్నాం. దీనితో దైవ నామ స్మరణ కూడా మరచి, తీరికగా 
వృద్ధాప్యంలో చేసుకోవచ్చు అనుకుంటున్నాం. అది సాధ్యం కాదు అనడానికి  ఉడుత బహుమతి  గా పొందిన 
బండేడు బాదం గింజలు మంచి ఉదాహరణ. 
శరీరం సహకారించని స్థితిలో స్థితప్రజ్ఞ కొరకు ప్రకులాడటం చూసువారికి నవ్వులాటగా ఉంటుంది.  ముక్తి కోసం కాక భుక్తి కోసం బ్రతుకు సాగిస్తున్నాం. ఇంకా ఈ కర్మ నుండి మనలని ఆ దేవదేవుడే రక్షించాలి.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

ఇట్లు ఒక మానవ జీవి ధ్యాన పిపాసి అహింసా వాసి అన్ని జీవరాశుల శుభాభిలాషి శాకాహార అభిలాషి

 విజయవాడ పట్టణంలో 108 రోజులు శాఖాహార ర్యాలీలు అద్భుతంగా జరిపి నేడు విజయోత్సవం జరుపుకోబోతున్న పిరమిడ్ మాస్టర్స్ కి వందనం అభివందనం.

ఒక జీవిని చంపి
మెడ కోసి
తల నరికి
వెంట్రుకలు పీకేసి
కాళ్ళు మెలేసి
పేగులు లాగేసి
ముక్కలు ముక్కలుగా చేసి
 కారం పూసి
నిప్పుల్లో కాల్చి
మంటల్లో మాడ్చి
ఉప్పు దట్టించి
మసాలాలు పట్టించి 
నూనెలో వేయించి
కూర పేరుతో
దేవుడి పేరు పెట్టి
దేవత పేరు చెప్పి
ఎంతో పరమ పవిత్రమైన
మనిషి పొట్టలో వేయ వచ్చా?
మనిషి పొట్ట ఏం స్మశానమా?

ఒక జీవిని మరో జీవి తింటే
అది హింస కాదా 
రోగం రాదా
భాధలు కలగవా
దుఖాలు రావా
కష్టాలు కూడవా
నష్టాలు రావా
కరోనా భాదించదా ?

ఏ చట్టం చెప్పింది తినమని
ఏ దైవం కోరింది నాకు పెట్టమని
ఏ గ్రంధంలో రాసి వుంది 
ఒక జీవిని మరో జీవి తినమని
భైబిల్ లో రాశారా 
ఖురాన్ లో కనిపించిందా
భారతంలో చెప్పారా ?


ఓ మానవా ఇకనైనా ఆలోచించవా
మూగ జీవిని కరుణించవా
ఒక్కసారి వినవా
కళ్ళు మూసుకుని 
హాయిగా కూర్చుని
ద్యానించవా ?
ఇది న్యాయమని
ఇది ధర్మమని 
ఇది సత్యమని
నీకు తప్ప మరే జీవికి తెలుసు?
నిజమనిపిస్తే మానేయి
కాదనిపిస్తే వదిలేయి !

                 ఇట్లు
ఒక మానవ జీవి
ధ్యాన పిపాసి
అహింసా వాసి
అన్ని జీవరాశుల శుభాభిలాషి 
శాకాహార అభిలాషి 
🍇🍇🥒🥒🍉🍉🥑🥑🍅🍅🍇

కాసేపు నవ్వుకుందాం.

 కాసేపు నవ్వుకుందాం.

మొన్నో, ఇంకేదో ఈమధ్యనో ట్విట్టర్‌లో ఒక మెసేజ్ చూసా. నువ్వు చిన్నప్పుడు టూత్‌పేస్టు ట్యూబు చివరికంటా నొక్కి వాడావా, సబ్బంతా అరగదీసాక మిగిల్న ముక్క కొత్త సబ్బుకతికించావా, బొగ్గుల బాయిలర్లో వేణ్ణీళ్ళు కాచుకున్నావా, సరుకుల కొట్లో బెల్లం ముక్కడిగావా, కిరసనాయిలు కోసం క్యూలో నించున్నావా... ఇలా. ఇవన్నీ చేసుంటే నువ్వు డెబ్భైలు ఎనభైల్నాటి మిడిల్ క్లాసు తెలుగోడని అర్థం! నవ్వొచ్చింది. ఆశ్చర్యం కూడా! 
ఏడిసినట్టుంది. ఇవన్నీ చెయ్యనోడూ, సినిమాల్చూడనోడూ తెలుగు నేల మీద పుట్టటమెందుకూ? 

అసలు వీటన్నిటికన్నా మిడిలెస్టు క్లాసు కథ అప్పట్లో ఇంకోటుంది, చెప్పనా? పండగనో, బళ్ళు తెరుస్తుండంగాన్నో కొత్త లాగూ చొక్కాలు కుట్టీటం. దీ వరస్టంటే అదే!

ఎదిగే వయసు, ఊరూర్కెనే బట్టలు చిన్నవైపోతాయని, బాఘా దిట్టంగా ఐదులో తొడుక్కున్న లాగూయే ఎనిమిదిలో కూడా సరిపోయేట్టు; మోకాళ్ళకి నాలుగించీలు కిందికీ, నడుం ఎనిమిదంగుళాలు ఎక్కువుండేట్టు ఇంత పెద్దగా లుడంగం మోస్తరు కుట్టీటం. 

ఈ విషయంలో అమ్మలన్నీ ఉత్తర కొరియా నియంతలకన్నా కనాకష్టం! ఇదిగో, తీరా షాపుదాకా వెళ్ళాక ఈ బడుద్ధాయి గునిసాడనో, ఫాషనుగా లేదన్నాడనో రెడీమేడు లాగూల్లాగా తొడల్దాకా టైటుగా కుట్టిచ్చేరు గనక. అయినా అంతంత పోసి కొని, సంక్రాంతిక్కుట్టిచ్చినవి శివరాత్రికే పొట్టివైపోతే ఏవిట్సుఖం? బట్ట దండగా కుట్టుకూల్దండగా తప్పిచ్చీ, అని పెద్దంతరం చిన్నంతరం యంతమాత్రవూ పాటిచ్చకుండా, యావండీగారంటే శ్రీ. ప్రత్యక్ష D అన్న సంగతి కూడా పట్టిచ్చుకోకుండా తమ యజమానిగారిమీన్నే ధాష్టీకం! ఇక మనకీ మనోబీగార్లనేకవుంటాయనీ, సాటి మనిషిగా మన చొక్కాలాగూలు ఎలా వుండాలన్నది మన పెరసన్లనీ విషయం అసలు ఎరగనట్టే ఉంటాయవి. (అవంటే మొత్తంగా అమ్మలన్నీ అంతే!) చిన్నవయసులోనే జై ఆంధ్ర ఇంకిలాబ్ జిందాబాద్ అని గట్టిగా మనసులోనే అరిచావంటే, అందులో నీ తప్పేం లేదన్నమాటే.

సరే, ఎంతేనా మననాన్న కదా మన పక్షం వుంటారన్నమ్మేవో, ఖాళీయే. ఆయనేవోఁ, కుట్టీమన్నదొకరూ, కుట్టేవాడింకొకడూ, తొడుక్కుతిరిగే చెవలాయ వీడొకడూ, మజ్ఝిన మనకేలన రొష్టనే  మెట్టవేదాంతం మాటునో, లేక మొన్న హాఫెర్లీకి లెక్కల్లో పంతొమ్మిది మార్కులే వొచ్చాయిగనుక వీడికీ శాస్తి జరిగి తీరాల్సిందనే అన్‌డాడీ లైక్ నిర్దాక్షిణ్యం వల్లనో,  మన్ని దీ న్యూ ఫాషన్ టైలర్స్ అనబడే వీరయ్య కొట్లోకి తీసుకెళ్ళి ఇదిగో చొక్కా లాగూ గుడ్డలని వాడికిచ్చేసి, మన్ని వాడి ముందుకు తోసేసి, ఏదో రేపే దాఖల్చెయ్యాల్సిన యమర్జెంటు కోర్టు కాయితాల్చదూతున్నంత పోజుగా నిన్నటి ఆంధ్రప్రభో, మొన్నటి ఈనాడు సంపాదకీయం వెనకో దాక్కోటం!

ఈవీరయ్యగాడున్నాడే.. పరమ నాస్టీఫెలో. అసలు వీడో టైల్రే కాదు నన్నడిగితే. చెవులో ఒకేపు నీలం ఇంకో వైపు ఎరుపూ ఉంటాయే, అట్టాంటి రెండు రంగుల పెన్సిలు, మెళ్ళో కండవా రీతిన టేపూ తగిలిచ్చుకోని, వెధవ పోజు మళ్ళీ! మనం, చొక్కా నడుంకి ఒక్క అంగుళం కిందికి లాగూ మోకాలుకి రెండగుళాలు పైకి ఉంచాల్రా అని ముందే సీక్రెట్గా ఇన్ట్రష్షన్ ఇస్తామా, ముందంతా పరమ నైసుగా, నాకు తెల్సు కదా బాబూ అంతా కొత్త ఫాషనుగా కుట్టి పెడతాగా, లాగూ ఎనికిట జోబు కూడా ఉంటాది నీకెందుకు చూడంటాడా, నాన్నొచ్చి మరీ అంత పైకేంటయ్యా ఎదిగే పిల్లాడు కదా అనంగాల్నే టేపు ఏడంగుళాలు సర్రున కిందికి జారుస్తాడు... మాట నిలకడలేని కుంక!! ఇంక లాగూ కొలతలు. రామ రామ! అది వాడి నడుమూ మన్నడుమూ కలిపి కొలిచేసి, ఈ మాత్రం చాల్లెండి అయగారూ, కాళ్ళకాడ మాత్రం ఒక రెండంగుళాలు ఇదిగో ఈ మాత్రముంచీ, ఇంకొంచం లోపటికి మడిచి కుట్టేస్తా. నడుమూ, కాళ్ళూ ఇంకా ఎక్కువ కొలతైతే బాగా లూజయిద్దని మనేపు చూసి కన్నుమలపటం, అక్కడికేదో మనల్ని ఉద్ధరిచ్చినట్టు. డబ్బు కోసం గడ్డితింటవంటే ఇది కదూ... దొంగ భడవ. 

రెండోసారి కూడా మనం వెళ్ళి అడిగిన ఆర్రోజులకి ఆ లాగూలు మన్చేతికి రావటం. ఎలా ఉన్నా, ఇవి కొత్తవీ అచ్చంగా మనవీనన్న ఆదర వాత్సల్య సంతోషాది భావాలతో చిరునవ్వు మన మొహాన విరబూస్తుండగా, ఇంటికెళ్ళి ఆ కొత్త వలువలు తొడుక్కునే ప్రయత్నం! 
అద్గద్దీ విషయం... సరిగ్గా అక్కడొస్తుంది, శాక్యమునికొచ్చినంత జ్ఞానం, మనకి కూడా!

జేబులో చేతులు పెట్టుకున్నా సరే, నీపాదాల చెంత నాకు చోటివ్వు దేవదా అని కాళ్ళంటుకున్న పారోకిమల్లే, ఆ లాగూ లంపటం మనం నించున్నకాడి దక్షిణం వెంపు జారిపోటమే కాని పైకిరాన్దే!! మరిహను దాన్తోటి జనబాహుళ్యంలోకి మనవంటి సిగ్గరి, పరూగల్లా మోమాటస్తుడుగారెలా రాడవంటే, దానికి మరో నీచతుచ్ఛత్యంతమర్రేత్తక్కూపాయవోటి మనం గుడ్లనీళ్ళు కక్కుకుంటూ డెబ్భైమార్లు ఛీయన్చిందుల్తొక్కినా సరే, ఏడిశావులే కుంకాయా, చొక్కాకిందనుండేదానికెలా ఏడుస్తే ఏం, దానికింతేడుపేవిటనంటూ, అటో రెండూ ఇటో రెండూ పిన్నీసులు పెట్టడం! 

దీనికన్నా అధ్వాన్నం మనకంటే ఓ రెండేళ్ళో మూడేళ్ళో ముందు పుట్టినందుకు అదో పేద్ధ అక్కగారైనట్లు మనమీద అక్ఖలేని అధికారజులుం ప్రదర్శించే అక్కరాక్షసిలుంటాయే, వాటి వెలిసిపోయిన పచ్చరిబ్బనో, మాసిపోయిన తెల్ల పీటీ యూనీఫాము రిబ్బనో మన లేని నడుం నెప్పెట్టీదాకా బిగిచ్చీ, ఇహపో వెధవాయా అని మనల్నే కసురుకోని బడికి పంపీటం! 

వీటన్నిటికంటే అతి దారుణ పరమభయంకర ఒవరికీ చెప్పుకోలేని మజ్ఝాతిమజ్జతరగతి ఓటుంటుంది. అంటే, నీ లాగూ జారిపోతుంటుంది కదా. దాని కోసం, నీ మొల్తాడిప్పి దానికి ఒక నులకతాడు ముడేసి లాగూ బిగిచ్చటం. లాపోతే మీ అన్నయ్య పైజామానో అక్కయ్య పరికీణీయో చిరిగిపోయేకా ఆ బొందు (చదూరానోళ్ళు నాడా అంటార్లే..) దాచి పెడుతుందిగా మీ అమ్మ! బట్టల బీరువాలో ఏ మూల్నించో దాన్ని తెచ్చి గుండ్రాయితో నాలుగు మోది ఓ మూరెడు ముక్క తెగ్గొట్టి అదేసి నడుంకి కట్టటం!

నువ్వొళ్ళు పొగర్తోనో, శ్ట్రాటజీ ప్లానింగుల్లో వీకు అయినందువల్ల అగ్నానంకొద్దీ ముందస్తుగా ఒకటో కాసినో అక్కల్నీ అన్నల్నీ సంపాయిచ్చుకున్నాక వెళ్ళితే ఒక్కగానొక్క ఆఖరి కొడుకన్న మర్యాదా గౌరవం గారాబం దక్కుతాయన్న రాంగ్కాల్క్లేషన్తో తాపీగా మరికాస్త సోమరసం, మరొక్క రంభ డాన్సు అనుకుంటూ లేటు చేసావో, తరవాత అతి తీవ్ర దుఃఖద పరిణామాలుంటయి. తస్మాజ్జాగర్త.
నీ జారిపోయే లాగూక్కట్టిన రిబ్బనూ, నులకతాడూ చూసి నీ మీదాళ్ళెవ్వరూ నీమీద్జాలి పడరు. మొహం గంభీరంగా పెట్టటం అంతా వుట్టుట్టి నటన. అటుతిరిగి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, ఏదో పుట్టిములిగిపోతున్నట్లు పెరట్లోకి ఉరికి కసిగా నవ్వుతుంటారు. పాపం వెర్రి వెధవ, మరీ ఏంటమ్మా, లాంటి ఒకటో అరో వాక్యం వినిపించినా దాంట్లో హానెష్టీ శాతం ఎంతన్నది, ఆవెంట వినపడే వికటాట్టహాసాల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయించుకో.

మజ్ఝతరగతి మిడిలు క్లాసిళ్ళల్లో ఏకైక చివరాఖరి మగపిల్లడై పుట్డవంత దుర్భర భయానక సీను అగ్గిరాముడు సినిమాలో కూడా ఉండదు! మగాడై పుట్టేకంటే అడవిలో మానై పుట్టటం మేలన్న సామెత విన్లా? ఇందుకే!

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం

నేటి ఆణిముత్యాలు .

 నేటి ఆణిముత్యాలు .

నీది అయినది 
ఎప్పటికీ  నిన్ను వీడదు
నీది కానిది 
ఎప్పటికీ నీకు దొరకదు

చావు పుట్టుకల మధ్య ఉన్న  జీవితంలో నీవు ఎంత వరకు నీ జన్మకు న్యాయం చేశావు అన్నదే పరిగణనలోకి వస్తుంది

మనిషిగా పుట్టడం ఉన్నతమైనది దాన్ని జీవిచడంలో నీ పాత్ర మహోన్నతమైనది

ఉన్నంతలోనే జీవిచడం అవమానకరం కాదుఉన్నతంగా ఉన్నంతలోనే 
జీవిచడం ఆనందకరం..

జన్మనివ్వడం తల్లిదండ్రులది
దాన్ని ఒక చక్కటి భావాలతో ఇతరులను నొప్పించక జీవించగలగాలి 
అదే జీవితము.

గత జన్మలో మనకి, మన ఖర్మలకి సంభంధం  వున్న వాళ్లే  మనకు ఈ జన్మ లో పరిచయం  అవుతారు.
అందుకే ఎన్నో కోట్ల  మంది వున్న ఈ భూమి మీదకేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితం లోకి వస్తారు.ఒక స్నేహితునిలా, ఒక సోదరి లా, ఒక సోదరునిలా, ఒక ఆత్మీయునీలా.. ఇలా  ఎన్నో బంధాలు అనుబంధాలు..
ప్రతి పరిచయం  వెనుక మన మనస్సుకి,  మన మేధస్సు  కి  కూడా అంతు చిక్కని అంత రార్ధం  వుంటుంది.

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

మెడికల్ స్టోర్లలో అందు బాటులో లేని ఔషధాల రకాలు మీకు తెలుసా.....!

 *మెడికల్ స్టోర్లలో అందు బాటులో లేని ఔషధాల రకాలు మీకు తెలుసా.....!*

💐💐

*యోగ*  ఔషధం.

*ప్రాణాయమం* ఔషధం

*ధ్యానం* ఔషధం

*ఉదయం/సాయంత్రం నడక*  ఔషధం.

*ఉపవాసం*  ఔషధం.

*కుటుంబం తో కలిసి భోజనం చేయడం*  ఔషధం.

*నవ్వు మరియు హాస్యం* కూడా  ఔషధం.

*గాఢ నిద్ర*  ఔషధం.

*అందరితో మెలగడం* ఔషధం.

*సంతోషంగా  ఉండాలని నిర్ణయించుకోవడం*  ఔషధం

*మనస్సులో  సానుకూలత*  ఔషధం.

 *ధ్యానం  మంచి ఆధ్యాత్మిక వ్యాయామం;   మరియు ఔషధం*

*అందరికీ  మంచి జరగాలని కోరుకోవడం*  ఔషధం.

*ఇతరుల కొరకు ప్రార్థించడం*  ఔషధం.

కొన్నిసార్లు, *నిశ్శబ్దం* ఔషధం.

*ప్రేమ*  ఔషధం.

*మనశ్శాంతి*  ఔషధం.

_ఈ ఔషధాలన్నీ …. 
పూర్తిగా ఉచితం...._

*ప్రతి “మంచి”  స్నేహితుడు* ఒక ఖచ్చితమైన *మెడికల్ స్టోర్.*

ఆరోగ్యంగా   మరియు సంతోషంగా ఉండండి!

నేటి మంచి మాట.

 నేటి మంచి మాట.

 మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించేకన్నా,మన గురించి మనం ఏమి ఆలోచిస్తున్నామనేది మనకు ముఖ్యం.ఎందుకంటె, మన జీవితం  మనదే.మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి,
చుట్టూ వున్న ఎ ఒక్కరు కారు.
గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ,తృప్తి గా జీవించడం మన చేతుల్లోనే ఉంది.

*జీవితంలో*💐సంతోషాలు తక్కువ..  బాధలుఎక్కువ వున్నాయని బాధపడకూడదు...
చెట్టులో ఆకులు ఎక్కువ..కానీ పూచే పూలు తక్కువ..
అందరూ పూలనే చూస్తారు కానీ..ఆకులను పట్టించుకోరు..అలాగే జీవితంలో కూడా సంతోషం తక్కువగా అనుభవించినా...అది మిగిల్చే అనుభూతి మాత్రం జీవితాంతం ఉంటుంది.

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

“త్రుటి’లో తప్పిన ప్రమాదం’ అంటాం. ఏమిటీ త్రుటి?‘

 “త్రుటి’లో తప్పిన ప్రమాదం’ అంటాం. ఏమిటీ త్రుటి?‘

అంతా కాలమహిమ’ అని తేల్చేస్తాం. ఏమా మహిమ? ‘కాలం కలిసివచ్చింద’ని సంబరపడతాం. కలిసివచ్చేదేంటి? ఒకే కాలం.. ఎన్నో ప్రమాణాలు. అదే కాలం.. మరెన్నో ప్రయాణాలు. మహాకాలుడి కేశపాశాలే కాలజాలం అని వేదాలు పేర్కొన్నాయి. కాలచక్రంలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈ సమయంలో కాలం కథను పరికిద్దాం.
‘కాలం అనంతం’ అనే మాట సర్వత్రా వినిపిస్తూనే ఉంటుంది. అంతం లేనిది అనంతం. అంతం లేనిదైతే దానికి ఆది కూడా ఉండకూడదు. ఆద్యంతాలు లేనివాడు పరమాత్మ ఒక్కడే. పరమాత్మ కాలస్వరూపుడని రుషులు పేర్కొన్నారు. మృత్యువును శాసించే యమధర్మరాజును ‘కాలుడు’ అని పేర్కొన్నారు. సృష్టి, స్థితి, లయములను శాసించే పరమశివుడికి మహాకాలుడు అని పేరు. పరమాత్మ ఏకకాలంలో సర్వవ్యాపి, నిశ్చలుడు. మార్పులేనివాడు. మార్పులకు లోనుకాని వాడు. అవాఙ్మానస గోచరుడు. అంటే వాక్కుకు, మనసుకు అందనివాడు.
రాత్రింబవళ్ల వల్ల కాలం మనకు తెలుస్తున్నది. కాలంలోని మార్పులు రుతువుల కారణంగా అనుభవంలోకి వస్తున్నాయి. అహోరాత్రులకు ఆద్యంతమున్నది. ప్రకృతిలోని షడ్వికారాలు కాలగమన సూచికలే! కాలం గమిస్తున్నది. మార్పులకు లోనవుతున్నది. తత్కాల ఆద్యంతాలు స్పష్టమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాలం పరమాత్మ స్వరూపమని నమ్మడం ఎలా? కాల గమనం ఆభాస (పైకి కనబడుతూ లోపల లేకపోవడం). భూమిపై ఉన్న వారికి సూర్యోదయ, అస్తమయాలు ఉన్నాయి. రాత్రింబవళ్లు ఉన్నాయి. అంతరిక్షంలో కాలం నిశ్చలం. ఖగోళాలకు ఉన్న చలనాన్ని వెలుగునీడల ఆధారంతో లెక్కిస్తున్నాం. కాబట్టి కాలానికి చలనం ఉన్నట్లు భావిస్తున్నాం. చలనం అంతరిక్షంలో ఉన్న గోళాలది కానీ, కాలానిది కాదు. భూమిపైన నివసిస్తున్న మనం భూ గమనాన్ని అంతరిక్షంలోని జ్యోతిస్సులతో పోల్చి లెక్కగడుతున్నాం. మిక్కిలి వాడిగల సూదితో తామరాకు మీద బెజ్జాన్ని చేయడానికి పట్టే సమయాన్ని ‘త్రుటి’ అంటారు. వేయి మహాయుగాల కాలాన్ని కల్పం అంటారు.

 ఈ రెండిటి మధ్య అనేక రకాలైన విభజనలతో కూడిన కాల ప్రమాణాలకు వివిధ పేర్లున్నాయి.
భారతీయుల కాలగణన సూత్రం వర్తులాకారంతో ఉంటుంది కాబట్టి, కాలానికి ఆద్యంతాలు లేవు. అహోరాత్రాలు ఒక వర్తులం. శుక్ల, కృష్ణ పక్షాలతో కూడిన మాసం మరో వర్తులం. ఆరు రుతువులతో లేదా పన్నెండు సంక్రాంతులతో కూడిన ద్వాదశాదిత్య చక్రం ఇంకొకటి. పన్నెండు రాశుల ‘భ చక్ర’ గమన వర్తులం మరొకటి. ఇలా కాలచక్రాలు అనంతాలు.
వ్యోమం అంటే ఆకాశమని, అంతరిక్షమని అర్థాలు. మహాకాలుడైన పరమశివుడికి వ్యోమకేశుడు అని పేరున్నది. అంతరిక్షాన్ని కేశాలుగా కలిగిన వాడని అర్థం. అంతరిక్షం శూన్యం కాదు. శిరోజాలను పోలిన సన్నని కణ సముదాయాల వరుసలు అనేకాలు అంతరిక్షం అంతటా పరచుకొని ఉన్నాయి. ఏ వెంట్రుకలోని సమాచార ప్రసారం ఆ వెంట్రుకకే పరిమితం, మరొక వెంట్రుకలోకి అది చొరబడలేదు. ఈ విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొనే కృత్రిమ ఉపగ్రహాల సాయంతో ఆధునిక సమాచార వ్యవస్థ ప్రకృతిని శాసించే స్థాయికి చేరుకోగలిగింది. ఇంతటి విజ్ఞాన ఖనిని వేదం ‘వ్యోమకేశ’ నామంతో సరిపెట్టిందన్న విషయాన్ని భారతీయులు గుర్తించవలసి ఉన్నది.

సేకరణ మీరామిరెడ్డి మానస సరోవరం👏

నేటి మంచి మాట.

 *నేటి మంచి మాట.

చీకటి దాటి కదలాలంటే* 
 *ఓపిక ఉండాలి...* 

 *అలుపే ఎరుగక అడుగులు* 
 *ముందుకు సాగాలి.* 

 *ముళ్ళూ పూలూ ఏవైనా* 
 *ఒకటే  తీరున వేగం ఉండాలి.* 

 *గాయం చూస్తూ గమనం ఆపితే* 
 *గమ్యం చేరే దెప్పటికి?* 

 *రాలిన పూలే చెట్టును చేరవు* 
 *కొత్త చివురులే రావాలి* 

 *మనసు గడియ తీసి* 
 *మేలు  ఘడియలు గడపాలి* 

 *మధువనం పరిమళం* 
 *పంచినట్టుగా మంచితనం పంచాలి* .

 *మబ్బుల్లో నీళ్ళన్నీ* 
 *నేలపైనే కురిసినట్టు  ప్రేమను* *పెంచాలి* 

 *సృష్టి లోని అందాలన్నీఆస్వాదిస్తే* 
 *ఆనందపు మకరందాలే* *జీవనమంతా* 

 *నవ్వుతూ నవ్విస్తూ* 
 *ఆడుతూ పాడుతూ జీవితముంటే* 
 *నిరంతరమూ  వసంతాలే!* 

 *జీవన పయనపు సారం పెంచి* 
 *జీవించడంలో స్వారస్యం  నింపే* 
*ప్రశాంతమైన ఉదయానికి* 

స్వాగతం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం

*** *🍁 మనందరి కధ🍃🥀🍁*

 *🍁 మనందరి కధ🍃🥀🍁* 
      
నేను గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను..
       పెద్దగా ఆస్తులు.. చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు..సమాజంలో హోదా..సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చిక్కగా వుండేవి..
      ఒకరికి ఒకరు చేదోడుగా..నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..
          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం..అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..
          కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..
       మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు..మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..
       కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో..ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో..ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ..కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..
     మొదట్లో వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు..మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు..తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..
             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో..ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో..వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..
              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు..పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది..
        ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు.. కొన్న ఆస్తులు... చేయించుకున్న నగలు..వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్..వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప.. వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..
       నా చిన్న నాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..
 తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..
  రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..
       ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా..చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము
అని మర్చిపోతున్నారు.
 అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి..తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..
      పారదర్శక సంబంధాలు కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..
        అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా..  ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..
        నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ..అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..
       వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..
      నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు..వీళ్లకు పెద్ధతనం..ఒంటరి తనం..అనారోగ్య సమస్యలు..మనిషి తోడు అవసరం..
 అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు..విపరీతమైన తామసం..పక్క వాడి నీడ కూడా సహించడం లేదు.   చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..
      వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 
        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..
       బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..
      చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..
  నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..
      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని..  మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..
      నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..
      అందరూ కొద్దిగా ఆలోచించండి..మన కుటుంబాల్ని
 మనమే ఎడం చేసుకుంటూ..మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..
      ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి..మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 
           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు..మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..
           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం అతిశయం వదిలి వెద్ధాము..మన తరువాత కూడా మన పిల్లలకి మన కుటుంబ అనుబంధాలు వారసత్వంగా ఇద్దాము..
    ఒక అనుభవజ్ఞుడు కొన్ని వందల కుటుంబాలను చాలా సమీపంగా చూసి.. ప్రత్యక్షంగా అనుభవించి రాసిన వ్యధ..

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

పాప_ప్రక్షాళన ఎలా అవుతుందో చూద్దాం

 పాప_ప్రక్షాళన ఎలా అవుతుందో చూద్దాం

ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది.. 

‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది. 

ఈశ్వరుడు చిరునవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండు ముతైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది.

ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది. 

ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘ చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది.  పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు.దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుందన్నది నిత్య సత్యం

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

మనిషి లక్ష్యం కోసం లక్ష్య సాధన కోసం జీవించాలి. అది ఎలాగో తెలుసుకుందాం.

 మనిషి లక్ష్యం కోసం లక్ష్య సాధన కోసం జీవించాలి. అది ఎలాగో తెలుసుకుందాం.

 సింహం గొప్ప పరాక్రమం కలిగిన జంతువు.  అది అడవి రాజు. అయినా ఆహారం కోసం గుహ నుండి బయటకు వెళ్ళవలసిందే. అంతే తప్ప జంతువులు తమంతట తాముగా సింహం నోట్లో చొరబడి ఆహారం కావు కదా! అలాగే ఏ కార్యాన్నయినా సాధించాలంటే మన వంతు ప్రయత్నం చెయ్యవలసిందే. ప్రయత్నం లేకుండా... ఆ కార్యం జరగాలని మనసులో అనుకుంటూ కూర్చుంటే విజయం సాధించలేమని ఈ సుభాషితం అర్థం. అప్రకటితమైన దేవుడిని నిత్యం తలుస్తూ.. ఆయన గుణగణాలను ప్రతిఫలాపేక్ష లేకుండా అనునిత్యం సంకీర్తన చేయటమే నిజమైన భక్తి. ఆధునిక ప్రపంచంలో ఈ భక్తిని నలుదిశలకు ప్రసారం చేయటం ఒక ముఖ్యమైన కార్యం.
‘నేను’ ఎవరిని? ఈ జీవితం ఎందుకోసం? మన లక్ష్యం ఏమిటి? లక్ష్య సిద్ధి కోసం మనం చేయాల్సిన ప్రయత్నం ఏమిటి? వైజ్ఞానికపరంగా ఎంత పురోగతి సాధించినా, సిరిసంపదలు కూడబెట్టినా, కీర్తి ప్రతిష్టలు సాధించినా... సత్యమైన ఆనందం, అనుభూతి పొందగలిగామా? వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహా భారతాలతో మన లక్ష్యాన్ని చేరడానికి దారి చూపడానికి ప్రయత్నించిన మాట నిజమే. కానీ దైవచింతన, ధర్మచింతనతో జీవించేవారు సైతం కలికాలపు ప్రభావంతో డబ్బు వ్యామోహంలో పడిపోతున్నారు. దానికి దాసోహమై, స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. విలువలు మట్టిపాలయ్యాయి. ప్రాపంచిక సుఖాల వెంపర్లాటలో మనిషి పతనం అయ్యాడు.
ఈ పరిస్థితి మారాలంటే మనిషిలోని దైవీ గుణాలు, శక్తులు బహిర్గతం కావాలి. సింహం గుహ నుంచి బయటకు వచ్చినట్టు మనిషిలోని శక్తులు, దైవీ సంపద జాగృతం కావాలి. శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం, ఆత్మీయత అనుబంధం అనురాగం... ఇవన్నీ మన సహజ గుణాలు. ఇవి మళ్ళీ మనలో చిగురించాలి. మనిషి పరివర్తన చెంది, సమాజ పరివర్తనకు సహకరించాలి. అప్పుడే నూతన సమాజ నిర్మాణం జరుగుతుంది.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం

మృత్యువు వెంటాడుతుంది* *పరోటా రూపంలో* ..

 *మృత్యువు వెంటాడుతుంది*
 *పరోటా రూపంలో* ..

 గత నాలుగు నెలల్లో చెన్నైలో మరణించిన వారి వయస్సు 33/31/34/35/37/39/41/43/46
 వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది..... -:
 
దయచేసి ప్రతిరోజూ *పరోటా*తినవద్దు.
 
 పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టపడే చవకైన విషపూరితమైన ఆహారం పరోటా.
  
పరోటా దుకాణాలు తమిళనాడు అంతటా విస్తృతంగా కనిపిస్తాయి.
 ఇందులో ఎన్ని రకాలు?
 బన్ పరోటా
 విరుదునగర్ పరోటా, తూత్తుకుడి పరోటా , క్లస్ట పరోటా ... చిలిప్ ప్రోటా
 *గుడ్డు పరోటా* 
 * *సిలోన్  పరోటా*  యువతను తనవైపు తిప్పుకునే అసంఖ్యాకమైన పరోటాలు ఉన్నాయి .... దీని అమ్మకాలు రోజురోజుకు దూసుకుపోతున్నాయి.
 అయితే ఈ ప్రొటీన్ శరీరానికి హాని కలిగిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

 మైదా వల్ల కలిగే నష్టాలపై కేరళలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఐరోపా, యూకే, చైనా వంటి దేశాలు మైదా ఉత్పత్తులను నిషేధించాయి.  

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమల కొరత కారణంగా, పిండితో చేసిన ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభమైంది.  పరోటా కూడా ప్రాచుర్యం పొందింది.పరోటా లో  ఫైబర్ లేదు.  కాబట్టి మన జీర్ణశక్తి తగ్గిపోతుంది.  ముఖ్యంగా (రాత్రిపూట) ప్రోటా తినడం మానేయండి.  *దీంతోపాటు మైదా పిండితో చేసిన రొట్టెలు, కేకులను తినడం మానేయాలి.* 
 లేకుంటే మనం పరోటా ద్వారా చంపబడతాము 

 మెత్తగా రుబ్బిన గోధుమ పిండి లేత పసుపు రంగులో ఉంటుంది మరియు చపాతీలతో కలిపి తినవచ్చు.  కానీ దాన్నుంచి మైదా తయారు చేసేందుకు *బెంజాయిల్ పెరాక్సైడ్* అనే రసాయనాన్ని గోధుమ పిండిలో కలుపుతారు.
 ఈ రసాయనమే మనం జుట్టుకు వేసుకునే రంగులోని రసాయనం.  ఈ విష రసాయనం, మైదాలోని ప్రొటీన్లతో కలిసి క్లోమగ్రంధిని దెబ్బతీసి మధుమేహాన్ని కలిగిస్తుంది.
 
 అదనంగా, పిండిని మెత్తగా చేయడానికి మరియు సింథటిక్ పిగ్మెంట్‌గా చేయడానికి  *అలోకాన్*  అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు.
 మినరల్ ఆయిల్, టేస్ట్ మేకర్, సాకర్
 అజినోమోటో లాగా పంచదార కలిపితే పరోటా మరింత ప్రమాదకరంగా మారుతుంది.

  భారతదేశంలో మైథా ఎక్కువగా తింటారు.
 ప్రపంచవ్యాప్తంగా మధుమేహం మన దేశంలోనే ఎక్కువగా ఉంది.

  కిడ్నీ, గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు.

 కృష్ణకుమార్ నేతృత్వంలోని *మైదా వర్జన సమితి* కేరళలో ఈ విషయంపై అవగాహన కల్పించడంలో స్వచ్ఛంద సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
 మైథా దుష్ప్రవర్తనపై పాలక్కాడ్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు.  పలు జిల్లాల్లో ప్రచారం కొనసాగుతోంది.  ఇక నుండి మన సంప్రదాయ ఆహారాలు జీడిపప్పు, రైస్, మొక్కజొన్నతో_విదేశీ ఆహారమైన మైదా అనే ప్రోటా మిక్స్‌డ్ కెమికల్‌ని ఏరి పారవేస్తాం._ 

 
        ఇప్పుడు తెలుసిందా
 ఎందుకు  మధుమేహం  వేగంగా
వ్యాపిస్తుందో..?

నేడు…శ్రీ పంచమి సందర్భంగా...* *అక్షరాభ్యాసం*

 0502. 2-6.   260123-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నేడు…శ్రీ పంచమి సందర్భంగా...*

                 *అక్షరాభ్యాసం* 
                  ➖➖➖✍️

*’వసంత పంచమి’ నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం.* 

*యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అని రాసి దిద్దిస్తారు.*

 *అక్షరాభ్యాసం ఎలా చేయాలి?* 

*విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం.     ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ.*

*పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో              ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం.*

*సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి లభిస్తుంది. ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లోగానీ,  దేవాలయంలోగానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు.*

*మన సంప్రదాయంలో విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థిచేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలనూ తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యాదేవతలుగా పూజిస్తారు.*

*ఆ తరువాత ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది.*

*విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం.*✍️
                                 …సేకరణ.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏