*ప్రేమ వివాహాం గొప్పదా.. పెద్దలు కుదిర్చిన వివాహం గొప్పదా..*
*ఏది ఐతే ఏంటి.. వివాహామే గొప్పది..*
*ప్రేమ ఆత్మీయత అనుబంధం ఉన్నప్పుడు ఏదన్నా* *బాగుంటుంది.. లేనప్పుడు ఏది ఉండదు..*
*ఇక్కడ ఒక సందేహం.. ఒక వయసుకు వచ్చాక పుట్టే ప్రేమ గొప్పది.. మరి ఆ వయసును ఇచ్చిన వారి ప్రేమ..*
*అయితే అనచ్చు.. కులం మతం హోదా అంతస్తు.. ఇవి పెద్దలు ఒప్పుకోరు..*
*తెలిసినప్పుడు మరి ఎందుకు..*
*ఏమో ప్రేమ ఎందుకు పుడుతుంది తెలీదు.. లెక్కలు చూడడానికి అది వ్యాపారం కాదు కదా..*
*సో దానికి ఏం తెలీవు.. ఒక్క ప్రేమ తప్పా.. నేను కూడా ఒప్పుకుంటా..*
*జీవితాంతం కలిసి ఉండేవారి విషయంలో ఏం చేసినా తప్పు లేదు.. ఎదిరించచ్చు.. వెళ్లిపోవచ్చు..*
*లేకపోతే ఇష్టం లేని పెళ్లి చేసుకొని నిరంతరం రోదిస్తూ. కన్నీరు దాచుకుంటూ బ్రతకచ్చు..*
*అంతే ప్రేమ వివాహంలో కన్నీళ్లు ఉండవా.. కన్నవారు లేరు అని ఆ కళ్ళు మళ్ళీ మళ్ళీ లోలోపల ఏడవవా..*
*సరే ఇంతకీ నీ భాధ ఏంటి.. నువు దేనికి సపోర్ట్..*
*ప్రేమ ఉండాలి.. జీవితం గెలవాలి..*
*నా దృష్టిలో నమ్మి వచ్చిన వారి కళ్ళలో కన్నీటికి స్థానం ఇవ్వకుండా చిరునవ్వులు పూయించే వివాహం అత్యంత గొప్పది.. అది ఏది అయినా..*
*నమ్మకం .. ఉంటే అడుగు ముందుకు.. ధైర్యం ఉంటే చాలు..*
*ఎంతో మంది పెద్దలు ఆరంజ్డ్ మ్యారేజ్ చేసుకొని ఎన్నో వసంతాలు హ్యాపీగా ఉన్నారు..*
*ప్రేమ పెళ్లి ... పెద్దలు కుదిర్చిన వివాహం.. ఏదైనా సరే..*
*వివాహా వ్యవస్థకి గౌరవం ఇస్తూ అనుబంధాలను చిగిరిస్తూ జీవితపు వెలుగులు అందించే అందరికీ హృదయపూర్వక వందనం...*
No comments:
Post a Comment