💐💐💐 *నమ్మకం* 💐💐💐
ఒక చిన్న గదిలో
*నాలుగు మైనపు దీపాలు*
వెలుగుతూ ఉన్నాయి......
ఇంతలో పెద్దగా గాలి
రావడం మొదలయింది.....
*ప్రశాంతత అనే మైనం:-*
ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని
బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.
*ప్రేమ అనే మైనం:-*
కూడా ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను
నేను ఆరిపోతానేమో అని అనడంతో
రెండో దీపం కూడా ఆరిపోయింది......
*తెలివి అనే దీపం:-*
నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో
అని భయపడుతూ ఆ గాలికి ఆగిపోయింది.
*నాలుగో దీపం మాత్రం:-*
నేను ఎలాగైనా ఈ గాలిని ఎదిరించి
వెలుగు ఇవ్వాలి ఆరిపోకూడదు అని
తన వంతు ప్రయత్నం తాను చేసింది.
ఆ గాలిని ఎదిరించి వెలిగింది.......
దీపాలు ఉన్న గదిలోకి చిన్న పిల్లవాడు
వచ్చి అయ్యో మూడు దీపాలు ఆరి
పోయాయే అని బాధ పడ్డాడు.....
బాధ పడుతున్న అబ్బాయిని
చూసి దీపం ఇలా చెప్పింది.....
బాధపడకు నేను ఉన్నా కదా నా నుండి
ఆ మూడు దీపాలు వెలిగించుకో అన్నదట.
సంతోషంతో ఆ పిల్లవాడు ఆ నాలుగో
దీపాన్ని నీ పేరేంటి అని అడిగాడు......
నా పేరు *నమ్మకం* అని చెప్పింది...
*ఆ దీపం.*
*🙏అన్నీ పోగొట్టుకున్నా మన పైన మనకు నమ్మకం ఉంటె చాలు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం.....🙏*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment