*_"కష్టాన్ని నమ్ముకొన్న వారు ఎన్నడూ నష్టపోరు."_*
_(ఇది అక్షర సత్యం అని నిరూపించే కథ)_
🌈🌈🌈🌈🌈🌈🌈🌈
*ఇంద్రుడు ఒక రోజు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతూ కనిపించాడు.. 'నేను రోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే ? మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు' అని సందేహము కలిగింది. వెంటనే మారు వేషంలో రైతు దగ్గరకు వెళ్ళి అడిగాడు.*
*రైతు _"నాకెందుకో ఈ రోజు వర్షం కురుస్తుంది అనిపించింది, అందుకే దున్నుతున్నాను"_ అన్నాడు.*
*ఇంద్రుడు విని, "ఇక దున్నవద్దు, వర్షం రాదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ రైతు దున్నడం మానలేదు.*
*ఇంద్రునికి కోపము వచ్చింది.*
*వరుణుడి ని పిలిపించి, "అక్కడ వర్షం పడకూడదు" అని చెప్పాడు.*
*వరుణుడు.. "సరే కానీ చల్లని గాలి వీస్తే మాత్రం నేను ఏమీ చేయ్యలేను" అన్నాడు.*
*పవనుడిని పిలిపించి "అక్కడ చల్లని గాలి వీచకూడదు" అని చెప్పాడు.*
*దానికి పవనుడు.. "సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రం నేను ఏమీ చెయ్యలేను" అన్నాడు.*
*ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు.*
*కప్పల నాయకుడు.. "మేము ఈ రోజు అస్సలు అరవము... కానీ మిణుగురు పురుగులు మిణుకు మిణుకు మని కనిపిస్తే మాత్రం మేము ఏమీ చెయ్యలేము" అన్నాడు..*
*ఇంద్రుడు వాటినీ పిలిపించి "ఈ రాత్రి మీరు బయటకు రాకూడదు" అని చెప్పాడు.*
*అవి.. "సరే మేము అస్సలు ఈ రాత్రి బయటకు రాము" అని చెప్పాయి.*
*ఇంద్రుడు 'ఇంక వర్షం ఎలా కురుస్తుందో చూద్దాం' అనుకొన్నాడు.*
*కానీ, ఆ రాత్రి వర్షం కురిసింది..*
*ఇంద్రునికి అవమానంతో పట్టరాని కోపము వచ్చింది.*
*అందరినీ పిలిపించాడు.*
*"చల్లగాలి వీచింది మహారాజా!" అన్నాడు వరుణుడు...*
*"కప్పలు అరవడం వల్లే వీచాను" అన్నాడు పవనుడు...*
*"మిణుగురు పురుగులు మిణుకు మిణుకు మని మెఱవడం వల్లనే అరిచాము" అన్నవి కప్పలు..*
*అప్పుడు మిణుగురు పురుగులు.. "మేము మాత్రం అస్సలు బయటకు రాలేదు" అన్నవి...*
*ఇంద్రునికి ఏమి జరిగిందో పాలుపోలేదు.. నారదునికి విన్నవించారు. నారదుడు ఆ రాత్రి ఏమి జరిగిందో చెప్పాడు.*
*"ఆరోజు పగటిపూట పొలంలో తన పని పూర్తి కాకపోతే రాత్రి కూడా రైతు తన భార్యా పిల్లలతో కలసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు.. ఆ దీపాల మిణుకు మనే వెలుగు చూసి కప్పలు మిణుగురు పురుగులనుకొని పొరపాటు పడ్డాయి.. కప్పలు అరవడంతో చల్లటి గాలి వీచింది... దానితో వర్షం కురిసింది" అని చెప్పాడు...!*
==================
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
No comments:
Post a Comment