Monday, April 28, 2025

 చలాచల బోధ పార్ట్ 2.
జడ వస్తువులకు మూలము మూలప్రకృతి.
చైతన్యానికి మూలం నిర్గుణ బ్రహ్మ, లేక నిర్గుణ తత్త్వము.
నేనుకు మూలం అవ్యక్త వ్యక్తిత్వముగా నున్న నిర్గుణ బ్రహ్మ.
ఈ మూలాలు భ్రాంతి.
బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని అన్నప్పుడు జగత్కారణ బ్రహ్మ అటువంటి మిథ్యా జగత్తును సృష్టించే దోషము ఆ బ్రహ్మలోనే ఉన్నది.అలాగే ఆ బ్రహ్మమే శుద్ధ సత్వ మాయలో ఈశ్వరునిగాను,మలిన సత్వ మాయలో అనేక జీవులుగాను ప్రతిఫలించి అదే సమయంలో ఆ ప్రతిబింబ జ్ఞానంతో తాదాత్మ్యం చెందుచున్నందు వలన మనకు ప్రాప్తించిన బ్రహ్మ జ్ఞానం వలన ఏమి ప్రయోజనము?
కావున జగత్కారణ బ్రహ్మ మాయావరణము నందుండుట చేత మాయాతీతము మరియు చిత్ తత్త్వములకు గాని జడ తత్త్వములకు గాని,చిత్-జడ తత్త్వములకు గాని మూలము కానటువంటి పరతత్త్వము, లేక శుద్ధ నిర్గుణ తత్త్వమే మనకు తిరిగి రానటువంటి, లేక పునరావృతం కానటువంటి మోక్షము! పునరావృతి లేనటువంటి మోక్షమును పరమపదము అని అంటారు.పునరావృతి ఉన్న మోక్షమును సాయుజ్యము అని అంటారు.వివిధ మతముల ప్రకారము అది సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులుగా చెప్పబడేవన్నీ పునరావృతి ఉన్నటువంటి ముక్తులే! అయితే వారు బ్రహ్మ యొక్క ఆయుష్కాలము వరకు జన్మించరు.మరొక కల్పములో అదే బ్రహ్మ సంకల్పం వలన ఆ బ్రహ్మ తిరిగి ప్రతి బింబ తాదాత్మ్యతను పొంది మరల జీవుడవుతాడు.
కావున సాధకుడు బ్రహ్మ జ్ఞానముతో బాటు,అచల బోధ కూడా విని శుద్ధ నిర్గుణ తత్త్వమును లక్ష్యించ వలెను.
      సశేషం!

No comments:

Post a Comment