*భార్యలు చేయకూడని కొన్ని విషయాలు చూద్దాం*
*1. భర్తను గురించి ఎప్పుడూ నలుగురిలో మాట్లాడకుండటం.*
*మీ భర్తలో మీకే తెలిసిన భలహీనతలు ఉండొచ్చు వాటి గురించి*
*మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నం చేయకండి. చాల మంది స్త్రీలకు కుటుంభంలో చిన్న విషయం జరిగినా వెంటనే తల్లికో, తోబుట్టువుకో చెప్పుకుంటారు.*
*అది అంతటితో ఆగితే*
*సరి కాని వాళ్ళు సమయం చూసుకొని మీ భర్త దగ్గర ప్రస్తావించే ప్రయత్నం చేస్తారు.అది ప్రయివేట్ గా మాట్లాడితే సరి కాని కొద్ది మంది అందరి ముందు మాట్లాడి*
*రచ్చ రచ్చ చేయడమో లేదా హే ళన చేయడమో చేస్తే ఆయన పరువు పోతుంది..!*
*2.ఆయన పరువే కదా పోనియ్ అని అనుకోకండి. ఆయన పరువు పొతే ఆయనతో పాటు మీది కూడా పోతుంది అన్న విషయం గుర్తుంచుకోండి..!*
*3. ఎప్పుడు మీరు అది గుర్తు పెట్టు కోరు ఇది గుర్తు పెట్టుకోరు అని పదే పదే నిందించకండి. తన పనులతో*
*పాటు ఇంటి విషయాలు కూడా చూడాలంటే కుదరకపోవచ్చు.*
*గృహ సంభంద భాద్యతలలో పడి మర్చిపోవచ్చు అర్ధం చేసుకోండి..!*
*4. మీ అవసరం కోసం, మీ కోరికల చిట్టా తెరవడానికి శృం గారాన్ని*
*వాడకండి. మీ మీద ఏహ్య భావం కలిగే అవకాశం ఉంది..!*
*5. మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు సరిదిద్దుతారా అని ఏవ్యక్తి గురించో , పుస్తకం గురించో వెతక్కండి. వాటివల్ల ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంది. మీకు ఆ విషయమై*
*పశ్చాతాపం ఉంటే మీరే ముందు క్షమాపణ చెప్పండి. మీతప్పు కాక మీ సహచారుడిదే తప్పైతే ఆయనకు ఏమి జరిగింది*
*ఎలా జరిగిందో ఒక ఉత్తరం రాయండి..!*
*6. ఎక్కువ మంది భార్యలు భర్తలను తిట్టేది డబ్బు విషయం దగ్గరే. తిట్టి కసురుకునే కన్నా అతనితో*
*కూర్చోండి అతనికి తెలియకుండా ఒక నెల ఒక డ్రాఫ్ట్ తయారు చేసి చూపించి మీ మార్గంలో అయితే మీరేమి చేసేవారో*
*చెప్పి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేయండి.*
*7. మీ ఇద్దరు మాట్లాడుకునేప్పుడో , లేదా బయట వారు అంటే మీ* *స్నేహితులో చుట్టాలో ఇంటికి వచ్చినప్పుడు అతని మాటలు కూడా మీరే మాట్లాడకండి. మీ*
*భర్తను కూడా మాట్లాడనీయండి. అతని నోరు మీరయ్యే పరిస్థితి కలిగితే బయటివారి ముందు అతను చులకన*
*అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.*
*8. మీరు మైండ్ రీడర్ లాగా ప్రవర్తించకండి.*
*తను చెప్పాలనుకున్నది మీరనుకున్నది కాదేమో. మీరే ముందు మైండ్ రీడర్ లాగా గెస్ కొడుతూ మాట్లాడితే*
*ఆయనకు మీతో పంచుకోవాలి అని అనిపించిన విషయం కూడా చెప్పాలని పించదు.*
*9. మీ భర్తే కాదు , ఏ మనిషి కూడా మైండ్ రీడర్ కాదు.మీకు ఏదైనా కావాల్సివచ్చిన , ఏదైనా చెప్పాలనుకున్న*
*పంచుకోండి. అతడు ఇలా చేస్తాడో లేదో చూద్దాం అని మీతో మీరే పోటి పెట్టుకోకండి. మనుషులు భవిష్యత్తును తెలుసుకునే దేవతలు కారు.*
*10. ఎప్పుడైనా బయటి విషయాలు ఒత్తిడి వల్ల మీ భర్త చాలా కోపంగా ఉంటే అతన్ని కదిలించకండి. అతను నిమ్మలించే*
*వరకు అతన్ని అలా వదిలేయండి. లేదంటే ఆ కోపం మీపై చూపించేస్తే మీరు హర్ట్ అవుతారు.*
*11. మీ భర్త బంధువుల గురించిన తప్పుడు మాటలు ,వాళ్ళపై లేనిపోనివి చెప్పకండి మీ మీద నమ్మకం పోయే ప్రమాదముంది.*
*12. ఒక మంచి పని గురించి ఆలోచిస్తూ మీ సలహా* *అడిగినప్పుడు మీరిలా కాదు ఇలా చేయండి అని మీకు తెలిసిన విషయమైతే మీ నేర్పు ప్రదర్శించి అతన్ని నొప్పించకండి.*
*13. ఈ భూమ్మీద మీ భర్తను మించిన తోపు ఇంకొకరు లేరని భావించండి, అప్పుడు మీ భర్తను మించిన క్వాలిటీస్ ఏవి మీకు వేరేవారిలో కనిపించవు. తద్వార పతాకం మి భర్తను చులకనగా చూసే భావన మీలోంచి తొలిగి పోతుంది.*
*14. మీ భర్త మీద ఇష్టం పోయినా సరే ! తిరిగి ఆ ఇష్టాన్ని అంతకు రెట్టింపు పెంచుకోండి, కొంచెం కష్టమైన సరే మీ భర్తని ప్రేమించడానికి ప్రయత్నించండి one side love ఐన పరవాలేదు. అందువల్ల మీ భర్త తప్పుచేసినా మీకంతగా కొపం రాకపోవొచ్చు.*
*మంచి స్నేహితురాలిలా మెత్తగా తెలుసుకునేలా చెప్పండి.*
*ఇది మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటాను.*
Sekarana
No comments:
Post a Comment