Tuesday, April 29, 2025

 🌻 *బంధమోక్షములకు మనసే కారణం*🌻

*ఒక కొలనులో ఒక చిన్న రాయి వేసినప్పుడు, ఆ రాయి పడినటువంటి స్థానములో చిన్నచిన్న అలలు తయారయి ఆ అలలు మనకు కనిపించినను, కనిపించకపోయినను కొలనంతా వ్యాపించిపోతాయి.*
 
*అదేవిధముగానే, మన మానస సరోవరమునందు సంకల్పమనే ఏ చిన్న రాయిని వేసిననూ దాని ప్రభావము శరీరమంతా వ్యాపించిపోతుంది. చెడ్డ సంకల్పమనే రాయిని ఈ మనస్సనే కొలనులో వేస్తిమా... చెడ్డ చూపే వస్తుంది, చెడ్డ పలుకే వస్తుంది, చెడ్డ శ్రవణమే చేస్తాము, చెడ్డ ప్రదేశమునకే ఈ కాళ్ళు నడుస్తాయి.*
 
*అదేరీతిగా, ఇందులో మంచి సంకల్పమనే రాయి వేస్తే అది సర్వేంద్రియములను మంచికార్యములందే ప్రవేశింపజేస్తుంది. దీనిని పురస్కరించు కొనియే "మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" అన్నారు. కనుక, మనస్సుయొక్క మర్మాన్ని గుర్తించడమే మన ప్రథమ కర్తవ్యము. మనస్సుయొక్క రహస్యాన్ని గుర్తిస్తే, అదే మనకు మోక్షము.*

*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*

🦚 🙏🕉️🙏 🦚

No comments:

Post a Comment