Tuesday, April 29, 2025

 తాను ఉండడమే - శబ్దం.
తాను లేకుండడమే - మౌనం.  

రమణాశ్రమం లో వేదపారాయణ సమయంలో  వేసే ధూపం రూపంలో రమణుడు తన భక్తులందరినీ అలా మొత్తంగా ఒకేసారి కావలించుకున్నట్టు ఉంటుంది...🙏🏻

పడమటి కిటికీలగుండా ప్రసరించే సూర్య కిరణాలు...
అవి రమణానుగ్రహప్రసార కిరణాల్లా ఉంటాయి...

చెవికి వింపైన వేదనాదం...
కంటికి సొంపైన సుందరదృశ్యం...
ఇవే రమణ భక్తులకు వ్యసనం...

మళ్ళీ ఎప్పుడొస్తామో....!
అని ప్రతి ఒక్కరూ తిరుగుప్రయాణంలో అనుకుంటూనే ఉంటారు. 

"రమణాశ్రమం పుట్టినిల్లులా ఉంటుంది అందరికీ...

నిజమే. భగవాన్ ను అంతగా స్వంతం చేసుకుంటేగాని, భక్తి ఫలించదు.

No comments:

Post a Comment