🕉️ శ్రీ గురుభ్యోనమః*
*ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻*
*నేను ఎవరు ?*
*1. నేను ఎవడను ?*
సప్త ధాతువుల చేత ఏర్పడిన స్థూలదేహం నేను కాను. శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలనే పంచ విషయాలను వేర్వేరుగా తెలుసుకునే శ్రోత ( చెవి ), త్వక్ ( చర్మం ), చక్షు ( కన్ను ), జిహ్వ ( నాలుక ), ఘ్రాణము ( ముక్కు ) లనే ఐదు జ్ఞానేంద్రియాలు నేను కాను. వచన, గమన, దాన, మలవిసర్జన, ఆనందములనే ఐదు కార్యములు చేసే వాక్, పాద, పాణి, పాయు, ఉపస్థలనే ఐదు కర్మేంద్రియాలు నేను కాను. సకల విషయాలను, సర్వ వృత్తులను వదిలి విషయ వాసనలతో మాత్రము కూడి ఉండే అజ్ఞానము ( గాఢనిద్ర, సుషుప్తి ) నేను కాను.
*2. పై చెప్పినవన్నియు 'నేను' గానిచో, అప్పుడు నేను ఎవడను ?*
వీటన్నిటినీ కాదని ( నేతి చేసి ), ప్రత్యేకముగ నిలుచు ఎరుకయే *'నేను'*
*3. ఎరుక స్వరూపమేమి ?*
ఎరుక స్వరూపము సచ్చిదానందము.
*"భగవాన్ శ్రీ రమణ మహర్షి"*
🙏🌷🙏
No comments:
Post a Comment