[5/4, 08:13] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి.*
*- స్వామి వివేకానంద*
[5/4, 08:13] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
రాజటధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభధ్రసం
యోజకుడైన చక్రి యట యుగ్రగదాధరుడైన భీముడ
య్యాజికి దోడువచ్చునట యాపద గల్గుటిదేమిచోద్యమో !
*భావము & వివరణ:*
అంపశయ్య పైనున్న భీష్మపితామహులను చూడడానికి పాండవులను తీసుకొని శ్రీ కృష్ణ పరమాత్మ వెళతారు. అప్పటికి ఉప పాండవులను అశ్వథ్థామ సంహరిచేసాడు , మరి పుత్రశోకంతో బాధపడుతున్న పాండవులను పెద్దవాడైన భీష్ముడు పరామర్శించాలి కదా , ఆయన వారితో ఎలా మాట్లాడారో చూడండి.
ధర్మజుడైన యుధిష్ఠరుడు రాజుగా ఉండగా ,ధన్వి,సురరాజ పుత్రుడు ఐన ధనంజయుడు ఈ ధర్మనిష్టా పరాయణుడైన యుధిష్ఠరునకు అండగా ఉండగా, ఆ ధనుంజయుని చేతిలో శత్రు భయంకరమైన గాండివం వంటి విల్లు ఉండగా,సమస్త ప్రపంచానికి రక్షకుడైన శ్రీ కృష్ణ పరమాత్మ వీరికి సారధిగా (జీవన సారధిగా) ఉండగా ,ఉగ్రగదాధరుడైన భీముడు కూడా ఇక్కడే ఉండగా,ఈ పాండవులకు ఇటువంటి ఆపదలు కలిగాయంటే ఇది కాలమహిమ కాక మరేమి . నాయనా,కాలము యొక్క మహత్యము చాలా చాలా విచిత్రమైనది ,ఎంతటి వారైనా కాలము లో కష్టములను అనుభవించక తప్పదు, ఆ సమయంలో భగవంతుని ప్రార్ధిస్తూ వాటిని ఎదుర్కొనే శక్తిని పెంపొందిచుకోవాలి అని తన మనుమలను ఊరడించాడు భీష్మపితామహుడు.పాండవులకే తప్పని కష్టములు మనకి తప్పుతాయా అండీ, మనము కూడా ఆ భీష్మపితామహుల మాటలను మననం చేసుకుంటూ ఆ కాలానుగుణంగా వచ్చే కష్టములను తట్టుకునే శక్తిని మనకు కృప చేయమని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ వాటిని ఎదుర్కొనేందుకు సంసిధ్ధులమవ్వాలి .
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
[5/4, 08:13] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*నవ్వాలి చిట్టిపాపల్లారా*
*- డా. వాసా ప్రభావతి*
నవ్వాలి చిట్టిపాపల్లారా
నవ్వాలి ముద్దుగుమ్మల్లారా
మీ నవ్వుల జల్లులలో
ముంగిళ్ళు గుమగుమలాడాలి !
మీ నవ్వుల వెన్నెలలో
చంద్రుడు దోబూచులాడాలి !
మీ నవ్వుల దివ్వెలలో
చుక్కలు మిలమిల మెరవాలి 1
మీ నవ్వుల పొంగుల్లో
సంద్రాలె పన్నీటిస్నానాలు చెయ్యాలి !
మీ నవ్వుల పువ్వులె
మాలలుగా గుచ్చి
గాంధితాత మెడలో వేయండి
పొందండి కోటి దీవెనలు !
[5/4, 08:13] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*అడ్డుకట్ట వేయడం*
అదుపు చేయడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒక ప్రవాహాన్ని ఆపడానికి అడ్డుకట్ట వేయడం అందరికీ తెలిసిందే. ఆ అడ్డుకట్టతో నీటి ప్రవాహాన్ని అదుపుచేసినట్లే ఒకరు మరొకరిని అదుపులో పెట్టే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వాడి దూకుడుతనానికి వాళ్ల నాన్న అడ్డుకట్ట వేసి ఓ మంచి పనిచేశాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.
[5/4, 08:13] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు*
రౌతు అనగా గుర్రపు స్వారీ చేసేవాడు. అలాంటి రౌతు మెత్తనివాడైతే గుర్రము అతని ఆదేశాలని సరిగా పాటించదు. అదే విధంగా అధికారంలో ఉన్న వ్యక్తి మెత్తనివాడైతే అతని కింద పని చేసేవాళ్ళు సరిగా పనిచేయరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.
*రౌతు మెత్తగా వుంటే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది.* అనగా నిదానంగా నడుస్తుంది. అదే రౌతు గట్టి వాడైతే... నాలుగు దెబ్బలు తగిలిస్తాడు. దాంతో అది పరుగు అందుకుండుండి. ఏపని చేసేటప్పుడైనా కొంత కఠినంగా వుండాలని ఉద్దేశించినది ఈ సామెత.
No comments:
Post a Comment