*గురుబోధ:*
ఎన్నో జన్మల సంస్కారము, పుణ్యఫలం ఉంటే కానీ సద్గురువుల ఆశ్రయం పొందలేము. ఒకవేళ పొందినా దైవానుగ్రహం లేకపోతే నిలబెట్టుకోలేము. కొందరు తమ పాపం పెరిగి గురువులను అనుమానించడం, అవమానపరచడం చేసి భ్రష్టులవుతారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ తన గురువైన శ్రీ సమర్థ రామదాసు గారి దర్శనం కోసం, మంత్రోపదేశం తీసుకోవడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ వారి దర్శనం దొరకలేదు. సమర్థులు ఎంతో పరీక్షించారు. అయినా నిరాశ చెందకుండా శివాజీమహరాజ్ మొండిగా ప్రయత్నించి చివరికి వైశాఖ శుక్ల నవమి నాడు దర్శనం చేసుకుని మంత్రోపదేశం తీసుకున్నారు. వారి ఇరువురి కలయిక వల్లనే మన సనాతన ధర్మము, ఆలయాలు ఈ మాత్రం అన్నా ఉద్ధరించబడ్డాయి. అదే క్షణికోద్రేకం లేదా రాజునన్న అహంకారం శివాజీ మహరాజ్ కి ఉండి ఉంటే వారు గురువులను కలిసేవారా? ఇంతటి అఖండ భారతదేశం మనకు దక్కేదా? అందుకే శివాజీ మహారాజ్ మనకు ప్రాత:స్మరణీయుడు. ఆధ్యాత్మికసాధనలో ఎంతో సహనం అవసరం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
No comments:
Post a Comment