*శ్రీ భగవత్ రామానుజాచార్యులు ...*
*తానాన తిరుమేని*
శ్రీరంగనాథుని పతిగా పొందిన ఆండాళ్ ఆయనలోనే లీనమైపోయింది. అందరూ చూస్తుండగానే ఆకాశంలోకి ఎగిరి వెళ్లిపోయిన వారు, విగ్రహాల్లో లీనమైపోయేవారు, నీటిలో మునిగి అంతర్థానం అయ్యేవాళ్లు, పూలవానలో కనిపించకుండా పోయేవాళ్లు… ఇటువంటి భక్తులెందరో భారతదేశ చరిత్రలో కనిపిస్తారు. కొందరు యోగులు తమను తాము వృక్షాలుగా, శిలలుగా మార్చుకున్న ఘట్టాలు కూడా అనేకం ఉన్నాయి. భగవద్రామానుజులు ఆ కోవలోకి వస్తారు. సామాన్యశకం 1137 పింగళ నామ సంవత్సరం మాఘ శుద్ధ దశమినాడు తనను తాను చరమశ్రీ విగ్రహంగా మలచుకున్నారు. ఆ విగ్రహాన్ని ‘తానాన తిరుమేని’ గా వ్యవహరిస్తారు. శ్రీరంగంలోని వసంతమంటపంలో విగ్రహంగా కనిపిస్తున్నది ఒకనాటి రామానుజుల భౌతిక దేహమేనని చెబుతారు.
*శేషావతార రూపమశేష జనౌఘాఘహరణ చరణాబ్జమ్ శ్రీభాష్యకార మమలం కలయే రామానుజం కృపాసింధుమ్*
సముద్రమంత తన అపార కరుణ చేత అశేష జనుల పాపాలను హరించడానికి… శ్రీమన్నారాయణుని శయ్య అయిన ఆదిశేషుడే…. భగవద్రామానుజులుగా, శ్రీభాష్యకారులుగా రూపమెత్తాడు. ఆయన చరణారవిందాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను...
No comments:
Post a Comment