పేదరికం లో ఉన్నాం అని విసుక్కుని ,డీలా పడి, అమ్మా నాన్న బాగా కష్టపడచ్చు కదా అని ఇంట్లో వాళ్ళని తిట్టుకుని ,డబ్బున్న వాళ్ళని చూసి అసూయపడి ,చదువు ను నిర్లక్ష్యం చేసి, బాగా చదివే వాళ్ళని చూసి వాళ్ళ మొహం లే అని తీసిపారేయలేదు ఈ చిచ్చరపిడుగు "బండారు ప్రవల్లిక".
తను ఆరో తరగతి చదివే టైం లో ప్రైవేట్ స్కూల్లో చదువుతుండగా, కరోనా తో తండ్రి చనిపోయాడు. తల్లి షాపింగ్ మాల్ లో పని చేస్తూ ,విశాఖ భీమిలి సమీపం లో కస్తూర్బా గాంధీ స్కూల్లో వేసింది.
తొమ్మిదో తరగతి లో ఉండగా కొంతమంది ఎడ్యుకేషన్ టీమ్ అధికారులు వచ్చి,ఆన్లైన్ కోర్సుల్లో మీ వయసుకు తగినట్టు కొన్ని చిన్న చిన్న వృత్తి నైపుణ్య కోర్సులు ఉంటాయి .ఎలాగూ మీకు కంప్యూటర్, ఇంటర్నెట్ సహకారం ఉంది ఇక్కడ. ఒక గంట ,రెండు గంటలు మీవి కాదు అనుకుని ,ఇన్ఫోసిస్ లాంటి కొన్ని సంస్థలు అందిస్తున్న ఆన్లైన్ కోర్సులు చేయండి. లైఫ్ లో చదువుతో పాటూ ఏదో ఒక నైపుణ్యం ఉంటే ఎప్పటికైనా మీకు ఉపయోగమే అని చెప్తే ...ఓ 20 మంది పిల్లలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకుని మొదలుపెట్టారు.
ఆన్లైన్ లో కోర్సులు తక్కువ టైం లో ఎలా చెయ్యొచ్చు, సర్టిఫికేట్ ఎలా సాధించచ్చు చెప్పారు.మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోడం దగ్గర నుండి అన్నీ నేర్పారు.ఈ బళ్లో టీచర్లు కూడా పిల్లలకి వాళ్ళు ఎంత సాయం చేయగలరో అంతకు మించి చేశారు.
ప్రవల్లిక గట్టిగా చెయ్యాలి అనుకుంది అంతే ఏకం గా 175 కోర్సులు చేసింది .సంవత్సరం లో రోజుకి రెండు గంటలు కేటాయించింది శ్రద్ధగా....
అంతే ....చిన్న వయసులో 175 కోర్సులు చేసిన అమ్మాయిగా నిలిచింది.
ఇన్ఫోసిస్ సంస్థ ప్రత్యేకం గా అభినందించింది. డిస్నీ ,హాట్స్టార్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.
ఇంత చేసిన ఈ అమ్మాయి పదోతరగతి లో ఏమైనా తక్కువ మార్కులు తెచ్చుకుంది అనుకున్నారా....567 మార్కులు తెచ్చుకుంది 600 కి..
ఐఎఎస్ చేయడం తన లక్ష్యం అంది..అదే నేనూ కోరుకుంటున్నా..
దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉంది..ముఖ్యం గా దేశాన్ని ఇలాంటివాళ్లే నడిపించేది.
నిజం గా గెలవాలంటే ..సాధించాలంటే...ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ..కావాల్సింది ముందు తన మీద తనకి నమ్మకం .ఈ బంగారానికి కావలసినంత ఉంది..
నీ గురించి రాయడానికి,ఇలాంటి చాలా గొప్ప విషయాలు అందరికీ అందించేంత కొండంత అభిమానం ,గుండె తడి ఉంటే చాలు మాలాంటి అందరికీ..
.....
All the Best Pravallika 💐💐💐...- కొండంత అభిమానం తో...Vydehi Murthy
ఎప్పుడూ రాసేదే..పిల్లలకి ఇలాంటివి చూపించండి... ప్లీజ్🙏
కానీ తల్లి తండ్రులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి....
మీ పిల్లలకు ఇలాంటి కథనాలు చూపించి స్పూర్తి నింపండి కానీ కంపేర్ చేసి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయకండి...
❤️❤️💐💐🙏🙏

No comments:
Post a Comment