Tuesday, May 6, 2025

 "మహిమాన్విత సీతా దేవి"

సీతయాః చరితం మహత్
అసలు సీత లేనిదే
రామాయణం లేదు....!!

రామాయణంలో 
ఏ ఘట్టం తీసుకున్నా
సీతమ్మ ఘనత స్పష్టం....!!

నాగటి సాలులో
జనక మహారాజుకి దొరికిన 
అయోనిజ...!!

హరుని విల్లును అవలీలగా
పక్కకు తోసిన 
మిథులాధీశుని తనయ...!!

నోము ఫలాన
జగదభిరాముడిని
పరిణయమాడి
అయోధ్యకు యేతెంచిన
రామ చక్కని సీత...!!

కైకమ్మ మాటకై
కారడవుల పాలైనా
అడవినే 
అంతఃపురంగా భావించి 
జానకి రాముడి వెంట నడిచి
పతి సేవలో తరించిన పుణ్యవతి...!!

విధి వక్రించి 
రావణుడి చెరలో బందీ యైనా...
ఆత్మ స్థైర్యాన్ని వదలక
పతి నామస్మరణతో 
కాలం గడిపిన సహనశీలి...!!

పోరాటపటిమే తప్ప 
పలాయినవాదం సరికాదని
ఆంజనేయుడికి 
అశోక వనంలో బోధ చేసిన జ్ఞానవంతురాలు...!!

రావణ చెరనుండి
విడుదల అనంతరం
అభిరాముడి శంకను తీర్చిన
అగ్నిపునీత...!!

అల్పుని మాటనే 
జనవాక్యమని నమ్మి
కోదండరాముడే స్వయంగా అడవులకు పంపినా....

స్థిర చిత్తంతో 
వాల్మీకి ఆశ్రమాన
లవకుశులకు జన్మనిచ్చి
ప్రయోజకులను చేసిన
లోక పావని....!!

అశ్వమేధ యాగ సమయాన
పిల్లలను శ్రీరాముడికి అప్పగించి
తల్లి భూదేవిలో ఐక్యమైన
"మహిమాన్విత సీతా దేవి"....!!

,,జై శ్రీరామ,,

No comments:

Post a Comment