Saturday, May 3, 2025

 *🌺☘శ్రీ రమణుల బోధ:*  *శ్రీ గురుదేవాయ నమః!🪷✍️  ఒక భక్తుడు: మీకు కలలు వస్తాయా? అని అడిగాడు.  భగవాన్:* *నిద్రపోతే కదా! కలలు వస్తాయి! అని అన్నారు.    భక్తుడు: అయితే మీరు ఎప్పుడూ మేల్కొనే ఉంటారా?*  *భగవాన్: "నిద్రపోయే వాళ్ళు కదా! మేల్కొనేది!" అని జవాబు ఇచ్చారు!*          *జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థ ఆవలిది బ్రాహ్మీ స్థితి. అదే జాగ్రత్ సుషుప్తి.* *భగవాన్ ఎప్పుడూ ఉండేది ఆ స్థితిలోనే.            భక్తుడు:  "మీరెప్పుడూ నిద్రపోరని కదా! అన్నారు? మీరు గురక పెడుతుంటే విన్నాను!" అని అన్నాడు.*  *భగవాన్: "నిజమే! నేనూ విన్నాను!" అని అన్నారు భగవాన్.* *శ్రీ రమణులు సాక్షీ మాతృలుగా సమస్త భువనాలలోని సకలాన్ని గమనిస్తూనే ఉంటారు!*
*భగవాన్ రమణ మహర్షి.*🪷✍️

No comments:

Post a Comment