ఫాలోవర్స్ పెరగడం లేదనే బాధతో.. | Jaisimha | Square Talks
సోషల్ నెట్వర్కింగ్ యప్స్ ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో పాత స్నేహితులని కలుసుకోవడం కోసం దీన్ని ఎక్కువగా వాడేవారు అండ్ దాని తర్వాత మ్యూచువల్ ఫ్రెండ్స్ త్రూ కొత్త ఫ్రెండ్స్ కూడా అయ్యేవాళ్ళు అంటే ఎక్కడో చోట ఒక చిన్న కనెక్షన్ ఉండేది అది కాస్త నెమ్మదిగా సోషల్ స్టేటస్ గా మారింది. ఆబవియస్లీ ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని షేర్స్ వచ్చాయి ఎన్ని కామెంట్స్ వచ్చాయి అనే దాని గురించి తెలియకుండానే ఒక సోషల్ స్టేటస్ లా మారిన అది ఆ తర్వాతఇగ అని అండ్ కొత్త కొత్త యప్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ఎక్కువగా ఆతృత పడుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది తీసుకొని వచ్చింది చాలామంది వాళ్ళ జీవితాల్లో సో రీసెంట్ గా చెప్పాలంటే మీషా అగర్వాల్ అని చెప్పేసి 24 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి నేను చెప్పాలంటే రెండు రోజుల్లో తన పుట్టిన రోజు ఉంది కానీ కానీ ఈ రెండు రోజుల ముందే తను సూసైడ్ చేసుకుంది. కారణం ఏంటంటే ప్రెజెంట్ తనకి 3,59,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆ ఫాలోవర్స్ కొంచెం తక్కువ అవ్వడం వల్ల అండ్వన్ మిలియన్ ఫాలోవర్స్ అవుతారో అవ్వరో అని చెప్పేసి చాలా చాలా డిప్రెషన్ కి లోనై లాస్ట్ కి సూసైడ్ చేసుకోండి. నిజంగా అంటే ఒక చిన్న సోషల్ నెట్వర్కింగ్ యప్ అనేది మన జీవితాలని నిర్ణయిస్తుందా? దీని గురించే ఇవాళ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే నేను మీ పవన్ కృష్ణ మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్ అండ్ దీని గురించి ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు హలో సర్ హలో సర్ మీకు పరిస్థితి అర్థమయింది. చూస్తుండగానే అంటే ఒక 24 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి నేను చెప్పాలంటే తనకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. తనకి మంచి రీచ్ ఉంది కొంచెం ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ అనేది అవుతూ ఉంటుంది యునో ఈ ఫాలోవర్స్ అనేది. ఆ ఒక్క చిన్న కారణాల వల్ల అంటే తను సూసైడ్ చేసుకోవడం కరెక్టే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫాలోవర్స్ గాని లేకపోతే ఈ లైక్స్ గానీ మనం మన జీవితాలు మన వాల్యూని నిర్ణయిస్తాయా పురాణాల్లో తీసుకున్నప్పుడు త్రిశంక స్వర్గం అని ఒక కథ ఉంటుంది మనకి ఈ త్రిశంకుడు ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నాకు స్వర్గానికి వెళ్ళాలని ఉంది శరీరంతోనే అని చెప్తాడు విశ్వామిత్రుడు తన శక్తితో పంపిస్తాడు కానీ అక్కడికి వెళ్తే ఇంద్రుడు ఏం చేస్తాడుంటే పైనుంచి తోసేస్తాడు తోసేసినప్పుడు తల కిందిగా కాళ్ళు మీదకి పెట్టుకొని పడిపోతూ ఉంటాడు. పడిపోతున్నప్పుడు త్రిశంకు పడిపోతున్నాడు అని తెలుసు విశ్వామిత్రుడు మళ్ళీ తన శక్తితో అతన్ని అక్కడే ఆపేస్తాడు. సో ఇప్పుడు భూమి కాకుండా ఇది స్వర్గం కాకుండా మధ్యలో ఆగుతాడు. మధ్యలో కూడా తల కిందకి కాళ్ళు పైకి ఉంటాయి. మ్ ఇప్పుడు ఈ త్రిశంక్ స్వర్గం లాగా తయారైంది సోషల్ మీడియా అనేది. మ్ ఓకే అది రియలా కాదు పోనీ పూర్తి అబద్ధం అందామా అంటే అబద్ధం కూడా కాదు. ఎందుకు అబద్ధం కాదు అంటే డిజిటల్ వరల్డ్ అనేది నిజం కాదు నిజానికి డిజిటల్ వర్డ్స్ లో మనం ఫ్రెండ్స్ అంటున్న వాళ్ళు ఫ్రెండ్స్ కాదు ఫాలోవర్స్ అంటున్న వాళ్ళు ఫాలోవర్స్ కాదు వెల్ విషర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు వెల్ విషర్స్ కూడా కాదు అవును ఓకే అక్కడంతా ఆ ఏమంటారు మనకు రియల్ బాండ్ లేకుండా ఒకరితో ఒకరికి ఎమోషనల్ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకుండా ఏదో మనం పెట్టే ఒక పోస్ట్ నచ్చేసి వాళ్ళుఏదో లైక్ చేస్తారు షేర్ చేస్తారు లేకుంటే కామెంట్ చేస్తారు. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు అయితే సబ్స్క్రైబ్ అవుతారు. YouTube అయితే సబ్స్క్రైబ్ అవుతారు Instagram అయితే ఫాలోవర్ గా ఫాలో బటన్ నొక్కుతారు ఇట్లా జరుగుతూ ఉంటది. ఇది జరిగినప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు సోషల్ మీడియాలో రెండు వైపులా చూడాల్సి ఉంటది. సోషల్ మీడియాలో మనం ఇంతకాలం చర్చించింది ఏంటంటే వాడుతున్న వాళ్ళ సమస్యను గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మిషా అగర్వాల్ కంటే ముందు మనం ఎక్కువ వరకు మాట్లాడేది ఏంటంటే సోషల్ మీడియాని వాడుతున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఫస్ట్ అఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యంగా జరిగేది ఏంటంటే సోషల్ మీడియాలో టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే ఓకే సోషల్ మీడియా అది Facebook అయినా Instagram అయినా YouTube అయినా ఏదైనా సరే మనం అవసరానికి మించి చాలా టైం గడిపేస్తాం. మనకు అవసరం ఉన్న దాని కోసం అక్కడ వెళ్లి వెతుక్కొని వీడియో చూడడమో లేకపోతే ఏదైనా చేయడం వరకు ఓకే కానీ మనకు అక్కడిదాకా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతావి ముఖ్యంగా షాట్స్ అండ్ రీల్స్ వచ్చినాక 30 సెకండ్స్ వన్ మినిట్ లోపు మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం ఒక్కొక్కసారి ఎన్ని చూసామో తెలదు 100 షాట్స్ 100 రీల్స్ చూడొచ్చు 150 రీల్స్ చూడొచ్చు అవి వెళ్ళిపోతూ ఉంటాయి పోన దానికి ఒకదానికి ఒకటి లింక్ ఉందా అంటే లింక్ కూడా ఉండదు పోనీ ఏమనా ఉపయోగం ఉందా జీవితంలో అంటే ఏం లేదు ఏదో ఒక చిన్న కామెడీ బిట్ వస్తది ఆ తర్వాత ఇంకొకటి ఏదో బూతుది వస్తది ఆ తర్వాత ఇంకోటిఏదో భక్తిది వస్తది. మనం ఏదో ఎక్సో చూస్తే అవి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వస్తూఉంటాయి. అల్గరిథం అలానే ఇవన్నీ మొత్తం చివరికి ఏమవుతుంది వాడేవాడికి టైం వేస్ట్ అవుతుంది. వాడేవాడికి టైం వేస్ట్ అనేదే మనం ఇంతకాలం గుర్తించిన సమస్య దీనికి ఇంకో కోణం ఉంది అనేది ఇప్పుడు కొత్తగా తెలిసింది ఇప్పుడు మనకి ఏంటి మిషా అగర్వాల్ అనే అమ్మాయి షి ఇస్ జస్ట్ 24 ఇయర్స్ ఇంకా రెండు రోజులు అయితే బర్త్ డే రాబోతుంది. ఏప్రిల్ 24 న సూసైడ్ చేసుకుంది. 24 ఇయర్స్ అమ్మాయికి ఒక పెద్ద లైఫ్ యంబిషన్ ఏంటి అంటే తర్వాత వాళ్ళ సిస్టర్ చెప్పింది ఏంటంటే ముఫ్తి అగర్వాలని ఆ అమ్మాయి లైఫ్ యంబిషన్ ఏంటి అంటే సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లయెన్సర్ గా మారాలి.వ మిలియన్ అందులో మొదటి స్టెప్ ఏంటంటేవన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఓకే ఈవన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తే పర్లేదు. నేను తెచ్చుకోగలనో లేదో అనే డిప్రెషన్ కి లోన్ అయింది. ఈ తెచ్చుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుందా నిజంగా అంటే లేదు ఓకే మన కంటెంట్ బాగున్నా ఒక్కోసారి చూడకపోవచ్చు. రెండోది మన కంటెంట్ బాగున్నా పక్కవాళ్ళ కంటెంట్ ఇంకా బాగుంటే కూడా మనం చూడకపోవచ్చు. మన కంటెంట్ ఎంత బాగున్నా సరేఇ లో వాడు ప్రమోట్ చేయకపోతే అది వాడి చేతిలో ఉంటది బికాజ్ అది ప్రైవేట్ యప్ ఓకే YouTube లో కూడా అంతే కొన్ని మంచి వీడియోస్ కి చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి. కొన్ని చెత్త వీడియోస్ ఉంటాయి బూతులు ఉంటాయి లేకపోతే ఏమ అసలు పర్పస్ లేని వీడియోస్ కొన్ని ఉంటాయి. వాటికి ఎక్కువఎక్కువ వ్యూస్ వస్తాయి సో వ్యూస్ ఎన్ని రావాలి ఆ వ్యూస్ ద్వారా మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనేది మన చేతిలో లేదు. కంప్లీట్ గా 90% YouTube లేదాఇగ నడిపించే కార్పొరేట్ కంపెనీ ఏదైతే ఉందో వాడి చేతిలో ఉంటది. వాడు రాసే అల్గరిథం ప్రకారం వెళ్తూ ఉంటది వీడియో ఇట్లా చేస్తే తప్పకుండా సబ్స్క్రైబర్స్ వస్తారని ఏదైనా రూల్ ఉందా ఇప్పటికి ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరికన్నా దగ్గరన్నా సక్సెస్ సీక్రెట్ ఏమన్నా ఉందా ఏం లేదు సో బై ఛాన్స్ వస్తారు కొన్నిసార్లు లేదు కొన్నిసార్లు మనం చేసిన కంటెంట్ నచ్చి వస్తారు. ఏదైనా సరే ఈ సబ్స్క్రైబర్స్ వస్తే జరిగేది ఏంటి? కొన్ని ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ మిషా అనే అమ్మాయి మిషా అగర్వాల్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు అని డిప్రెషన్ కి లోనే చనిపోయారు. మ్ ఒకవేళ వచ్చిఉంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయి ఉంటే ఏంటి లాభం వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే గుర్తుపడతారు జనాలు ఇన్ఫ్లయెన్సర్ అవుతే ఏమవుతది గుర్తుపడతారు. స్టార్డం వస్తుంది స్టార్ డమ్ అనొద్దు దాన్ని నేను ఏమంటాను అంటే జస్ట్ రికగ్నిషన్ వస్తది. స్టార్డం అనేది చాలా పెద్ద పదం. ఓకే ఈ సోషల్ మీడియా యప్స్ ఏమి లేనప్పుడు రాజేష్ కన్నా అమితాబ్ బచ్చన్ ని కూడా జనాలు గుర్తుపట్టేవాళ్ళు మరి అది ఎట్లా వచ్చింది వాళ్ళు ఒక 30 40 ఇయర్స్ కష్టపడితే వచ్చింది. మ్ ఏదైనా సరే నరేంద్ర మోడీ అనే ఆయన ఫస్ట్ 50 ఇయర్స్ ఎవరో మనకు తెలియదు ఆయన 51 ఇయర్ లో సీఎం ఆఫ్ గుజరాత్ అయ్యాడు. అప్పటి నుంచి మనకు తెలుసు ఈరోజు 73 ఏళ్ల వయసులో ఆయన ఎవరు అంటే ప్రపంచం మొత్తం గుర్తుపడుతుంది. సో సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎంత ఈజీగా వస్తే అంత ఈజీగా పోతది. ఓకే సడన్ గా గుర్తొస్తే సడన్ గా మనల్ని గుర్తుపట్టడం మొదలు పెడితే దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతది. ఆ మధ్య ప్రియా ప్రకాష్ వారియర్ అన ఒక అమ్మాయి వచ్చింది. సడన్ గా ఆమె ఎంటర్ అయిన వెంటనే పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఏంటి వింక్ గర్ల్ అని చెప్పేసి ఆమె కన్ను కొట్టింది. అంతే ఆమె ఎంబిబిఎస్ చేయలేదు సివిల్స్ పాస్ అవ్వలేదు ఏం చేయలేదు. నిజానికి ఆమె కూడా ఉద్దేశపూర్వకంగా చేయలేదు ఏదో ఒక సినిమా ట్రైలర్ లో భాగంగా అది ఆ కన్నుగొట్టిన సీన్ బయట వచ్చింది. జనాలు విపరీతంగా వైరల్ చేసేసింది ఆమె ఆమె చాలా పెద్ద స్టార్ అయిపోతది అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు సినిమాలు ఏం లేవు ఆమె చేతిలో ఎప్పుడు రెగ్యులర్ గా నెలకో రెండో మూడో ఫోటో షూట్ చేస్తూ ఉంటది. అక్కడ ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తుంటాయి తప్ప సినిమాలో ఎక్కడ కనిపించట్లేదు. అట్లా సోషల్ మీడియాలో మనకి ఎప్పుడు సడన్ గా మనం వైరల్ అవుతాం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఒకవేళ వైరల్ అయినా కూడా దాని వల్ల వచ్చే లాభం కూడా నిజంగా ఏమ ఉండదు. కొంతమందికి మాత్రం డబ్బులు వస్తాయి. ఓకే కొన్ని పెద్ద పెద్ద YouTube ఛానల్స్ తీసుకున్న లేదుఇంట మనఇస్గ లో ఇన్ఫ్లయన్సర్స్ ని తీసుకున్న కొలాబరేషన్ ద్వారా లేకపోతే ప్రమోషన్ ద్వారా కొన్ని ప్రాడక్ట్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా అది మళ్ళీ గొడవ అయింది కదా ఈ మధ్య బెట్టింగ్ యప్స్ ప్రమోట్ చేసి కొంతమంది చాలా మంది కేసుల్లో ఎరుక్కున్నారు అవును అంటే ప్రమోట్ చేసి డబ్బులు వస్తాయి కదా అని తొందరపడి ఏదంటే అది ప్రమోట్ చేసినా కూడా మళ్ళీ ఆ ప్రకారం మనం ఇబ్బంది పడాల్సి వస్తది. సో ఈ ఇన్స్టా ఇన్ఫ్లయన్సర్స్ కెరీర్ అనేది ఒక బబుల్ లాగా ఉంటది. అది బబుల్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతదో ఇది అంత ఫాస్ట్ గా పెరుగుతది కానీ పేలిపోయే అవకాశం ఎక్కువఉంది. ఓకే మనం ఒక సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఐపిఎస్ో ఒక ఇంజనీరో డాక్టరో రైటరో ఇట్లాంటివి అయితే లేదు ఈవెన్ ఒక సినిమా స్టార్ అయినా సరే సినిమా యాక్టర్ అయినా సరే అదొక కెరీర్ గా భావించొచ్చు. ఇన్ఫ్లయెన్సర్ అనేది అట్లా కాదు. జస్ట్ జనాలు సడన్ గా మన వైపు అట్రాక్ట్ అవుతే అది లక్ లేదు మన టాలెంట్ కూడా ఉండొచ్చు మన టాలెంట్ ఎంతఉన్నా సరే కొన్ని లక్షల మందిని ప్రతిరోజు ఎంటర్టైన్ చేస్తూ ఉండడం అనేది సాధ్యం కాదు వాళ్ళకి నచ్చకపోతే తగ్గిపోతారు సబ్స్క్రైబర్స్ అటువంటి దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు నేను స్టార్టింగ్ లో త్రిశంక్ స్వర్గం అని చెప్పింది అందుకే అన్నమాట ఇక్కడ అంతా తలకిందులుగా ఉంటది. రియల్ లైఫ్ లో ఏది సక్సెస్ో అది ఇక్కడ సక్సెస్ గా కనిపించదు. మనం ఇక్కడ మంచి నీతి వాక్యాలో లేదంటే మంచి విషయాలు పాజిటివ్ విషయాలు చెప్తే ఎవరు చూడరు నెగిటివ్ మాత్రం చాలా ఫాస్ట్ గా వెళ్తది. హమ్ ఓకే ఈ మధ్యకాలంలో మనకొక అలేఖ్యా పికల్స్ అనే గొడవ మీద కూడా చాలా మాట్లాడుకున్నాం అవును మాట్లాడుకున్నప్పుడు ఆ పికల్స్ వాళ్ళు బూతులు తిట్టారు అనేది మనం ఎక్కువ మాట్లాడం కానీ యాక్చువల్లీ వాళ్ళు కూడా ఇన్ఫ్లయెన్సర్స్ే అదే అంటే నా ఉద్దేశం కూడా ఇప్పుడు ఇది ఇన్ఫ్లయెన్సర్స్ అనేది ఇదొక టాక్సిసిటీ అనేది సొసైటీ మీద అవుతుంది ఫాలోవర్స్ మీద అవుతుంది అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లయన్సర్స్ మీద కూడా అవుతుంది. అవును ఆహ అంటే ఇప్పుడు ఇన్ఫ్లయన్సర్స్ వాళ్ళు ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నామ అని అనుకుంటున్నారు. కానీ ఇన్ఫ్లయెన్స్ చేసే క్రమంలో వాళ్ళు కూడా ఇన్ఫ్లయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న అలేక చిటీ పికల్స్ ముచ్చట్లో కూడా వాళ్ళుఇగ లో రీల్స్ వీడియోస్ పాటలు పాడుతూ దాని మీద డాన్సులు చేస్తూ పాపులర్ అయ్యారు. తమ పాపులారిటీని పికల్స్ అమ్మకాడనికి వాడుకున్నారు. అమ్మాయిలు కదా సహజంగా కొంత గ్లామర్ ఉంటుంది కాబట్టి మీ ఫాలోవర్స్ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోయారు బాగా పెద్దన పెరిగిపోయారు. అంతవరకు అంతా బాగుంది కానీ వన్స్ వాళ్ళు ఒకసారి బూతులు మాట్లాడిననే ఆడియో బయట వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబర్స్ పడిపోవడం మొదలయింది. వాళ్ళఇగ మీద కూడా ప్రాబ్లం పడింది వాళ్ళ పికల్స్ బిజినెస్ మీద కాదు వాళ్ళు Instagram ఫాలోయింగ్ మీద కూడా దెబ్బ పట్టింది. ఆ టైంలో డిప్రెషన్ కి లోన్ అవ్వద్ది. ఇప్పుడు మిషా అగర్వాల్ అనే అమ్మాయి ఏమైంది నిజానికి ఆమె మీద కాంట్రవర్సీ కూడా ఏం లేదు ఈ అలైక్య పికల్స్ విషయంలో కాంట్రవర్సీ జరిగింది కానీ మిషా అగర్వాల్ విషయంలో కాంట్రవర్సీ ఎక్కువ లేదు. కానీ ఎందుకో ఆమెకు ఇన్ఫ్లయెన్సర్స్ తగ్గిపోయారు. ఇన్ఫ్లయెన్సర్స్ కి బోర్ కొట్టడం కావచ్చు ఇంకో బెటర్ ఆప్షన్ ఏదైనా ఉండడం కావచ్చు చాలా మంది ఇక్కడ ఇంక అంటే మొహమాటం లేకుండా చెప్పుకుంటే చాలా మంది సో కాల్డ్ ఇన్ఫ్లయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో రియల్ టాలెంట్ రియల్ నాలెడ్జ్ రియల్ సొసైటీకి ఏదో ఒకటి ఇస్తూ ఇన్ఫ్లయెన్స్ చేసే వాళ్ళు కొందరే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆ చూడడానికి అందంగా ఉంటారు కొంతమంది గ్లామరస్ కంటెంట్ ఎక్కువ గ్లామర్ గ్లామర్ గ్లామర్ ని ఉపయోగించి ఫాలోయింగ్ పెంచుకుంటారు. గ్లామర్ ని ఉపయోగించి ఫాలోయింగ్ పెంచుకున్నప్పుడు ఎంత తొందరగా వస్తారో అంతే తొందరగా వెళ్ళిపోతారు రేపు ఇంకో కొత్త అమ్మాయి వస్తుంది. ఆ కొత్త అమ్మాయికి కూడా వీళ్ళందరూ అటు షిఫ్ట్ అయిపోతారు. సో ఇవన్నీ టెంపరరీ అనే విషయం మొదటి నుంచి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. రైట్ రెండోది ఏంటంటే ఇప్పుడు నేను అదే మరి మన అలేకపికల్స్ విషయంలోనే వాళ్ళు కూడా తర్వాత మేము హాస్పిటల్ లో ఉన్నామ అని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో వదిలడం జరిగింది. అంటే దీని వల్ల డిప్రెషన్ కి లోనే వాళ్ళు హాస్పిటల్ లో పడ్డారు అది నిజమయ ఉంటే మాత్రం ఈ ప్రెజర్ ఎంతుంది ఇన్ఫ్లయన్సర్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ పోతదేమో అనే భయం అనే ప్రెజర్ ఎంత ఉంది అనేది ఆ తర్వాత రణ్వీర్ అలహాబాది అని చెప్పేసి బీర్ బైసిప్స్ అనే ఒక అవును ఆ ప్లాట్ఫామ్ కదా ఛానల్ ఉంది దాన్ని నడిపి అతను కూడా ఒక దగ్గర వెళ్లి బూతులు మాట్లాడితే అది చాలా పెద్ద గొడవ అయింది. సుప్రీం కోర్టు దాకా వెళ్లి ఇప్పటికి కేస్ నడుస్తుంది కేస్ నడుస్తుంది అవును అతను ఇండియా దాటి వెళ్లొద్దు అని చెప్పి కోర్టు రూల్ కూడా పెట్టింది పాస్పోర్ట్ తీసేసుకుంది పోలీసులకు ఉమ్ ఇంత పెద్దగా ఇష్యూ అయిన తర్వాత అబ్బాయి నిజానికి డిప్రెస్ అవ్వలేదు పర్సనల్లీ అయి ఉండొచ్చు తను కూడా ఏమంటారు చాలా డిప్రెస్ అయ్యి ఒకటి రెండు వీడియోలు పెట్టడం జరిగింది Instagram లో అయినా సరే బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు మళ్ళీ తన వీడియోలు తను చేసుకుంటున్నాడు. అవును స్పిరిచువాలిటీ అది ఇది అని తను చేస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఫాలోయింగ్ వచ్చినప్పుడు ఎక్కువ ఎగసైట్ అవ్వద్దు. ఫాలోయింగ్ సడన్ గా పోయి మనం ఏదైనా కాంట్రవర్సీలో ఎరుక్కున్నప్పుడు కూడా చాలా ఫీల్ అయిపోయి ఇంకా అదే ప్రపంచానికి ది ఎండ్ అన్నట్టుగా భావించేసి మ్ సీరియస్ డిెసిషన్స్ ఏవి తీసుకోకూడదు అన్నమాట రైట్ ఇవన్నీ కాకుండా అసలు మనకు డిజిటల్ వరల్డ్ లో ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు రియల్ వరల్డ్ లో ఉన్న వాళ్ళతో చర్చించాలి ఇప్పుడు మిషా అగర్వాల్ సూయిసైడ్ చేసుకోకముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గాని రియల్ ఫ్రెండ్స్ తనతో చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కాలేజీ నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో గానీ వీళ్ళు రియల్ తన చుట్టూ ఉండే మనుషులతో గానీ వీళ్ళు ఎవరు కాకుంటే ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవడం గానీ ఇవి ఏమైనా చేసి ఉంటే సూయిసైడ్ అనే నిర్ణయం తీసుకోకపోయి ఉండేవాడు. మ్ సో మనం డిజిటల్ వరల్డ్ అనేది ఒక ఫేక్ వరల్డ్ ఆ ఫేక్ వరల్డ్ లో నుంచి పుట్టే డిప్రెషన్ ను తట్టుకోవాలి అంటే రియల్ సపోర్ట్ ఉండాలి మనకి ఫేక్ ని ఎదుర్కోవాలంటే రియల్ సపోర్ట్ ఉండాలి. ఆ రియల్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఆర్ ఎక్స్పర్ట్స్ దగ్గర దొరుకుతుంది రైట్ అయితే సార్ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ కూడా ఉంది ఇది శ్రేష్ట శ్రేష్ట జహా అని చెప్పేసి ఒక సోషల్ ఇన్ఫ్లయెన్సర్ ఉన్నారు. అయితే రీసెంట్ గా ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ హీట్ సిచువేషన్స్ మధ్యలో యుద్ధ వాతావరణం ఇదంతా జరుగుతున్న టైంలో ఆవిడ వచ్చి కొంచెం ఇండియాకి యాంటీగా కొంచెం కొన్ని వివాదాస్పద వ్యాఖ్యాలు చేయడం జరిగింది. అయితే వెంటనే తనఇ హ్యాండిల్ కూడా వెంటనే ఇండియా బ్లాక్ చేయడం జరిగింది. అయితే కట్ చేస్తే దీని గురించి ఒక ఎంక్వైరీ చేస్తే 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి అండ్ ఎవ్రీ మంత్ షి ఇస్ ఎర్నింగ్ అరౌండ్ లైక్ ₹1 00ా000 లక్ష రూపాయలు మినిమం తన Instagram హ్యాండిల్ నుంచి తను సంపాదిస్తాడు. సో అంటే ఒక ఇక్కడ మనం ఆలోచిస్తే అంటే సామాజికంగా కూడా వీళ్ళకి కొంత లిమిటేషన్స్ అనేది అవసరం. అంటే మీరు మీరు అన్నట్టు తన సొంత లైఫ్ లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళకి డిప్రెషన్ లోకి వెళ్ళకుండా ఒక పేషెంట్స్ అనేది అవసరం. అట్ ది సేమ్ టైం లిమిటేషన్స్ కూడా ఉండాలంటారా ఆ లిమిటేషన్స్ ఉంటే ఎంతవరకు ఉండాలి అంటే సామాజిక పరంగా ఇప్పుడు శ్రేష్టజా అనే ఆమె ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లం ఉన్న టైంలో ఆ ఇండియాకి వ్యతిరేకంగానో ప్రైమ్ మినిస్టర్ కి వ్యతిరేకంగానో మాట్లాడి ఉంటే అది తప్పు ఆమె పాయింట్ వాాలిడ్ పాయింట్ అయినా సరే పొలిటికల్ విమర్శలు చేయడానికి ఒక టైం అంటూ ఉంటది దేశం మొత్తము పాకిస్తాన్తో యుద్ధం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు అస్ ఏ ఇన్ఫ్లయన్సర్ పర్సనల్ ఒపినియన్ ఎవరైనా చెప్పొచ్చు బికాజ్ మనని ఫాలో అయ్యే వాళ్ళు 10 మందో 20 మందో 100 మందో ఉంటారు కాబట్టి ఓకే బట్ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు చాలా బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే మనము ఒక మాట మనం చెప్తే వేరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే వేరు అదే మాట దేశ ప్రధానమంత్రి చెప్తే వేరు ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఇన్ఫ్లయెన్స్ చేయగలుగుతారు. మామూలు విషయమైనా సరే దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి చెప్తే దానికి వాల్యూ ఎక్కువ ఉంటది దాని ప్రభావం ఎక్కువ ఉంటది. రైట్ అట్లా ఇన్ఫ్లయన్సర్స్ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన చేతిలో ఒక ప్లాట్ఫామ్ ఉంది మమ్మల్ని నమ్మి ఫాలో అయ్యే ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మేము ఏదైనా వాగుతామ అంటే కుదరదు. య ఓకే అండ్ చేసే ఒక్కొక్కసారి మీరు చెప్పింది కరెక్ట్ కూడా అయి ఉండొచ్చు ఇన్ఫ్లయన్సర్ చెప్పింది కరెక్ట్ కూడా అయి ఉండొచ్చు కానీ కరెక్ట్ టైమా కాదా అనేది కూడా ఇంపార్టెంట్ ఓకే కరెక్ట్ టైం లో చెప్పాలి కరెక్ట్ బాట చెప్పాలి ఈ రెండిట్లో చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే దీని మీద డబ్బులు వస్తున్నాయి కదా డబ్బులు ఎందుకు ఇస్తుంది ఆ మీడియా ప్లాట్ఫామ్ Instagram లో అయితే డైరెక్ట్ డబ్బులు రావు YouTube లో వస్తాయి బట్ Instagram లో వేరే వాటిలలో ఏంటంటే ప్రమోషన్ చేసినందుకు వస్తూ ఉంటాయి. డబ్బులు వస్తున్నప్పుడు మన ఆ ఏమంటారు నైతికత కోల్పోకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ మోరల్ ఆ స్టాండ్ అనేది మనక ఒకటి ఉండాలి. స మనం మన ఇంకొక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. పెద్ద పెద్ద స్టార్స్ ఒక్కొక్క సినిమాకి కోట్లు కోట్ల రూపాయల రెమునిరేషన్ తీసుకునే వాళ్ళు కూడా గుట్కాలు పాన్పరాగులు లేదంటే టొబాకోని ప్రమోట్ చేయడము లేకపోతే వాటర్ బాటిల్స్ ప్రమోట్ చేస్తున్న నెపంతోని ఆ మందు మందుకు సంబంధించిన బ్రాండ్స్ ఓకే మందు ప్రమోట్ చేయొద్దు కాబట్టి వాటర్ బాటిల్ ప్రమోట్ చేస్తున్నాం అంటారు. యాక్చువల్లీ ఆ బ్రాండ్ మందు అది మందు ఉంటుంది సో దాన్ని చెప్పకుండా వీళ్ళు చేస్తుంటారు. ఇటువంటి అన్ని పనులు చేసి ఆ ఏమంటారు లీగల్లీ తప్పు కాదు కాబట్టి మేము చేస్తున్నామ అని చెప్తే మనం ఏమ అనలేము కానీ మోరల్లీ కొన్ని కరెక్ట్ ఉండవు. మనల్ని ఆదరించి పెద్ద స్టార్ గా మార్చిన సమాజానికి మనం స్వీట్ బాగా షుగర్ వేసేసిన కూల్ డ్రింక్స్ తాగండి అవి తాగి ఒబెసిటీతో ఇబ్బంది పడండి లేకపోతే డయాబెటిక్ అయిపోండి అని చెప్తే అది మోరల్ ఎంతవరకు రైట్ సో ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ప్రమోట్ చేయడం ఎట్లానో ఇన్ఫ్లయెన్సర్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తది అంటే ఇన్కమ్ కొంత మొదలైన తర్వాత ఇన్కమ్ తో పాటు పేరు కూడా వస్తుంది. ఓకే బయట కొన్ని గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి వీళ్ళకంటే చాలా ఎక్కువ ఇన్కమ్ ఉంటది. ఓకే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అక్కడక్కడ చేసే వాళ్ళకి లీగల్ గా ఇల్లీగల్ గా వచ్చే డబ్బులు కలిపితే ఒక నెలకి చాలా డబ్బులు వస్తాయి వాళ్ళకి కానీ వాళ్ళకి పేరు రాదు. వాళ్ళని వాళ్ళ గల్లి దాటి పక్క పక్క గల్లికి వెళ్తే కూడా ఎవరు గుర్తుపట్టారు. ఈ ఇన్ఫ్లయెన్సర్స్ కి ఏమవుతుంది అంటే డేంజరస్ కాంబినేషన్ ఏంటి అంటే ఒకటి పేరు వస్తుంది రెండోది డబ్బులు వస్తున్నాయి. ఈ పేరు డబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుంది లైఫ్ స్టైల్ మారిపోతుంది. వీళ్ళందరూ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్స్ గానీ ఆ చిన్న చిన్న ఏమంటారు ఆర్టిస్టులు ఉంటారు కదా ఇప్పుడు రకరకాల ఓటిటీస్ YouTube ఇక్కడంతా వచ్చిన తర్వాత సినిమాలోనే కనిపించాల్సిన అవసరం లేదు ఆర్టిస్ట్ులు ఎక్కడైనా కనిపించే అవకాశం వచ్చేసింది వెబ్ సిరీస్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ రియాలిటీ బిగ్ బాస్ లాంటి షోస్ లో పాల్గొన్న వాళ్ళు వీళ్ళందరికీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే వన్స్ ఒకసారి రికగ్నిషన్ అండ్ కొంత డబ్బు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక కార్ కొంటారు డ్రైవర్ ని పెట్టుకుంటారు కాస్ట్యూమ్స్ రోజు ఒకసారి వేసిన కాస్ట్యూమ్ మళ్ళీ వేయరు. లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మ్ ఓకే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయినప్పుడు ఒక ఏమంటారు ఒక కరీనా కపూర్ లేదంటే ఒక ప్రియాంక చోప్రా లాగా లైఫ్ స్టైల్ మారిపోయినప్పుడు వాళ్ళంతా డబ్బులు రావు. అవును డబ్బులు రానప్పుడు ఏమవుతది ప్రెజర్ కి లొంగిపోయి రాంగ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తది. బెట్టింగ్ యప్స్ లాంటివి ప్రమోట్ చేయాల్సిన అవసరం అప్పుడే వస్తది అన్నమాట. అవును మనం పెట్టుకున్న టార్గెట్ లైఫ్ స్టైల్ కి మనక వచ్చే ఇన్కమ్ మ్యాచ్ అవ్వనప్పుడు ఏ పని పడితే ఆ పని చేయాలనిపిస్తుంది. అవును అప్పుడు మోరల్ గా మనం హై స్టాండ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. రైట్ అయితే సర్ ఇప్పుడు ఇది ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ సోషల్ స్టేటస్ అనేది ఒక న్యూ నార్మల్ లాగా అయిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలకి రియాలిటీకి దూరంగా వర్చువల్ కి చాలా దగ్గరగా అవుతున్నారు వీళ్ళు అండ్ ఈ మూమెంట్ లో పేరెంట్స్ కూడా వాళ్ళక కొంచెం రియాలిటీ ఏంటనేది చెప్పాల్సిన దగ్గర చెప్పకుండా వాళ్ళు కూడా ప్రోత్సహించడం ఎందుకంటే వాళ్ళక కూడా మనీ వస్తుంది చిన్న పిల్లల అకౌంట్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ చిన్న పిల్లల అకౌంట్స్ లో కూడా కొన్ని అకౌంట్స్ చూసినప్పుడు అంటే అవసరం లేని చోట కూడా కొంతమంది పిల్లలతోని స్కిన్ షో చేయించడానికి తల్లిదండ్రులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సొసైటీ మీద ఈ సోషల్ యప్స్ అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒక దీనినుంచి బయట పడాలంటే ఏం చేయాలి ఒకవేళ వదిలేస్తే ఎలాంటి సిచువేషన్స్ ఇంకా చూడాల్సి ఉంటుంది రేపు మామూలుగా మన దగ్గర పేరెంట్స్ ఎప్పుడు అవుతారు అంటే పిల్లలు పుట్టగానే పేరెంట్స్ అయిపోతారు. ఓకే వాళ్ళకి దాని గురించి ప్రత్యేకమైన ఏమంటారు ప్రిపరేషన్ ఏమి ఉండదు. పెళ్లి చేసుకుంటారు చాలామంది పెళ్లి తర్వాత లిస్ట్ లో సెకండ్ సెకండ్ ఆప్షన్ సెకండ్ థింగ్ ఏంటి పెళ్లి తర్వాత పిల్లల్ని కని సో పిల్లల్ని కనేస్తారు కానీ పిల్లల్ని కనే ముందు ఈ పిల్లల్ని ఎలా పెంచాలి తమ పిల్లలు ఫ్యూచర్ లో ఎట్లా ఉంటే బాగుంటుంది పిల్లలకు తమ నేర్పించాల్సిన వాల్యూస్ ఏంటి ఇటువంటివి ఏవేటి బేస్ విషయంలో కూడా క్లారిటీ ఉండదు. ఓకే ఆ మరీ పేదవాళ్ళ అయితే ఏంటి వాళ్ళకి లైఫ్ ఏమంటారు ఎవ్రీ డే బ్రెడ్ అండ్ బటర్ స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పొద్దున్న లేస్తారు పనికి వెళ్ళిపోతారు ఆ పిల్లలు కూడా వాళ్ళు పెరగాల్సిన పద్ధతిలో పెరిగేస్తారు అక్కడ పెద్దగా అవకాశం లేదు అంటే పేరెంట్స్ దృష్టి పెడదాం అనుకున్నా కూడా చాలా మినిమం టైమే వాళ్ళు స్పెండ్ చేయగలుగుతారు. రైట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి రెండు ఫలానా కాలేజీలు ఉంటాయి దాంట్లో తీసుకపోయి పడేసి జైల్లో వేసినట్టుగా వాళ్ళని ఇంజనీర్ డాక్టర్ చేయడం తప్ప జీవితంలో ఇంకేం లేదు. ఉమ్ ఓకే తమ పిల్లల్లు వీళ్ళు యాక్చువల్ గా మిడిల్ క్లాస్ లో చాలా కొంతమంది పరిస్థితి ఏంటంటే వాళ్ళకు కొడుకు పుడితే కొడుకు పుట్టినట్టు కాదు ఇంజనీర్ పుట్టాడు అని అర్థం బిడ్డ పుడితే డాక్టర్ పుట్టింది అని అర్థం ఈ కొడుకు పిల్లల్ని డాక్టర్ ఇంజనీర్ లేదంటే సివిల్స్ లేదంటే సిఏ ఇటువంటి నాలుగు టార్గెట్స్ ఉంటాయి అవి చేపించి ఒక మంచి ఇన్కమ్ సోర్స్ తో వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేయడం తప్ప వీళ్ళకి ఇంకొక వేరే ఉద్దేశం లేదు. ఓకే ఓకే వాళ్ళకి ఇది మంచిది ఇది చెడు ఇది చేయాలి ఇది చేయొద్దు ఇట్లాంటివన్నీ చెప్పే టైం మిడిల్ క్లాస్ పేరెంట్స్ కి ఉండట్లేదు. రిచ్ సూపర్ రిచ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటి వాళ్ళ ఇంట్లలో పేరెంట్స్ కి పేరెంట్స్ వ్యాపకాలు వాళ్ళకి ఉంటాయి. ఆ పొద్దుంట అఫీషియల్ వర్క్ ఉంటది సాయంత్రం అయితే పార్టీలు ఉంటాయి ఈవినింగ్ ఏమంటారు వీకెండ్ వస్తే ఇంకో ప్రాబ్లం ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోతుంటారు. ఈ మొత్తం కలిపి సంవత్సరంలో పిల్లలతో వాళ్ళు గడిపేది ఎంత చాలా తక్కువ సమయం ఉంటది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు పూణేలో జరిగింది కదా 17 ఏళ్ల పిల్లోడికి లక్షల రూపాయల విలువైన కార్ ఇస్తే వాడు విపరీతంగా మధ్యం తాగేసి రాష్ డ్రైవింగ్ చేసి చాలా మందిని చంపడం జరిగింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో రాష్ డ్రైవింగ్ లో కార్లు వేసుకొని తిరిగే వాళ్ళందరూ రిచ్ కిడ్స్ లేదంటే సూపర్ రిచ్ కిడ్స్ యాక్చువల్లీ టూ డేస్ బ్యాక్ కూడా 14 ఇయర్స్ అమ్మాయి అంటే 14 ఇయర్స్ అమ్మాయి బాగా తాగింది. ఒక లగ్జరీ కార్లో వెళ్లి ఇద్దరిని గుద్ది చంపేసింది. అవును అండ్ తను చాలా బాగా ఏడ్చింది నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి అని చెప్పి ఏడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 14 ఇయర్స్ అమ్మాయికి అంత పెద్ద లగ్జరీ కార్ ఎక్కడి నుంచి వచ్చింది తనకి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది తాగడం ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ అదే అంటున్నాను అవి ఎందుకు చేస్తుంది అంటే ఒక ఆ 14 ఇయర్స్ అమ్మాయి కార్ తీసుకొని మందు తాగి రోడ్డు మీదకి వస్తుందని పోలీసులకు గాని ముఖ్యమంత్రికి గాని తెలియదు కదా మ్ అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం అది రోడ్డు మీదకి వచ్చాక పట్టుకోగలుగుతాడు ఎవరైనా కానీ రోడ్డు మీదకి రాకముందు ఆపాల్సింది ఎవరు తల్లి తండ్రి ఎక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు బిజీ ఇంట్లో వాళ్ళకి టైం లేదు పార్టీలు ఏమంటారు పండుగలు లేదంటే టూర్స్ ఇవన్నీ కాకుండా ఫారెన్ ట్రిప్స్ ఇవన్నిటి మధ్యలో పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేరు రెండోది ఏంటంటే తమ పిల్లలు కొన్ని తప్పులు చేస్తే వాటిని గొప్ప లైఫ్ స్టైల్ గా ఫీల్ అవుతున్నారు. ఓకే పబ్బుకి వెళ్ళాలి పబ్బుకి వెళ్ళడం అనేది ఒక చాలా గొప్ప విషయంగా భవించే మన యొక్క సొసైటీ కూడా ఉంది. పబ్బుకి వెళ్ళొద్దా అంటే వెళ్ళొద్దుఅని కాదు పబ్బుకి వెళ్ళాలా వద్దా అనే సమస్య పక్కన పెడితే పబ్బుకి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అద అదే అట్లా చేయకపోతే మనం వెనకబడిపోయి ఉన్నామ అని భ్రమల్లో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లల చేత కొన్ని రకాల పనులు చేయించి పేరెంట్స్ే మురిసిపోతున్నారు. ఓకే బాగా డబ్బు ఉన్న వాళ్ళు మనం చెప్పినట్టు ఖరీదైన కార్లు బైక్స్ కొనించడము ఆ అంటే వాళ్ళ తగ్గట్టుగా చేస్తుంటారు తప్పులు అంత డబ్బులు లేని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కెమెరా నో సెల్ ఫోన్ లోనో షాట్స్ రీల్ చేసేసి పిల్లల చేత కొత్తగా సినిమా ఏ పాట వస్తే ఆ పాట మీద డాన్స్ చేయిస్తుంటారు. ఆ డాన్స్ చేస్తున్నప్పుడు ఆ డాన్స్ ఒరిజినల్ హీరోయిన్ ఏం చేసింది హీరో ఏం చేసిండో అదే వీళ్ళ చేత మళ్ళీ రిపీట్ చేసించే తొందరలో అటువంటి రివీలింగ్ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా వాడిస్తుంటారు. ఇవి వద్దు అని చెప్పాలని పేరెంట్స్ అని మనం అనుకుంటున్నాం కదా యాక్చువల్ గా వద్దుని చెప్పి పిల్ల పిల్లలు అంటే కూడా వినని పరిస్థితిలో పేరెంట్స్ ఉన్నారు. లేదు లేదు వేసుకోమని చెప్పి పేరెంట్స్ే పిల్లల చేత వేయించే స్థితిలో ఉన్నారు. రైట్ ఓకే పిల్లలు ఏ డ్రెస్ వేసుకోవాలి అనే విషయంలో పేరెంట్స్ కి క్లారిటీ లేదు. పేరెంట్స్ తాము తామ చిన్నప్పుడు చేయలేకపోయిన అన్నీ కూడా వాళ్ళ చేత చేపించేస్తున్నారు. దాన్ని ఒక గొప్పది సక్సెస్ గా ఫీల్ అవుతున్నారు. రైట్ రైట్ అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఈ సోషల్ నెట్వర్కింగ్ యప్స్ అనేది కూడా జీవితంలో ఒక భాగం మాత్రమే ఈవెన్ దో దాన్ని ఒకవేళ డిజిటల్ స్టార్స్ గా అవి దాని మీద మనీ ఎర్న్ చేయాలనుకున్నా కూడా ఓకే మంచిదే ఒక కెరియర్ గా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు డిజిటల్ స్ట్రీమ్ ని కూడా అయితే జీవితంలో ఒక భాగం కావాల్సింది జీవితం అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకునేదాకా వెళ్తుంది. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పటి యువత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వాళ్ళని ఆ గైడ్ చేస్తున్న వాళ్ళ గార్డియన్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫైనల్ గా డిజిటల్ దీంట్లో ఇన్ఫ్లయెన్సర్స్ అవ్వడం అనేది కెరియర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అదేదో సరదాగా మొదలుపెట్టి మనకు వర్కవుట్ అయితే ఒక సస్టైనబుల్ ఇన్కమ్ దాని మీద వస్తే తర్వాత మనం ఫుల్ టైం లో దాని మీద ఉండొచ్చు కానీ ఎవరు కూడా మొదలు పెట్టేటప్పుడే దీని మీదే నేను బ్రతికేస్తానుఅని మొద మొదలు పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే మన దగ్గర పర్టికులర్ టాలెంట్ గానీ లేదంటే జనాల్ని ఆకర్షించే శక్తి గాని ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్నా కూడా మన రీచ్ పెరిగి మనకు అదే నేను చెప్పినట్టుగా ఈ ఫాలోవర్స్ తగ్గిపోతారేమో పెరగట్లేదేమో ఇట్లాంటి ప్రెజర్ కి లోన్ అవ్వకుండా అందులో ఇన్కమ్ తక్కువ వచ్చినా సరే నేను మాత్రం నేను తీసుకున్న స్టాండ్ మీదే నిలబడతాను సొసైటీకి హామ్ చేయకుండా ఉండగలుగుతాను అనే నమ్మకం ఉంటే అక్కడికి వెళ్లొచ్చు. అంత తెలివి ఈఇగ్ర వాడే టీనేజర్స్ కి ఉంటుందా ఎక్స్పీరియన్స్ ఉంటుందా అంటే ఉండదు. వాళ్ళని పేరెంట్స్ గైడ్ చేయాలి మనం చెప్పుకున్నట్టు ఏమవుతుంది పేరెంట్స్ కి టైం లేదు పేరెంట్స్ చెప్పినా వినట్లేదు పిల్లలు వాళ్ళకు బయటఉన్న ఫ్రెండ్స్ ఆ గ్రూప్స్ అంటే బయటఉన్న ప్రపంచాన్ని చూసి వాళ్ళు కూడా వినట్లేదు. సో ఇదంతా ఒక విషయస్ సర్కిల్ అన్నమాట. సో నిజంగా ఆ పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల మీద కన్సర్న్ ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచి బిఫోర్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఆ ఏజ్ నుంచే ఈ సెల్ ఫోన్ అడిక్షన్ అనేది గాని సోషల్ మీడియా అడిక్షన్ అనేది గాని లేకుండా చేయాలి ఓకే దానికి ఫస్ట్ బానిసలు అవ్వకపోతే తర్వాత దాన్ని వాడుకోవాలా వద్దా అనేది మన ఇష్టం. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది దానికి బానిసలు అయిపోతున్నారు. ఎప్పుడు చాలా చిన్నప్పటి నుంచి రెండు మూడేళ్ల పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. వాళ్ళక 10 ఏళ్ళ వచ్చేసరికి సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసిపోతుంది. 15 20 ఇయర్స్ కి వచ్చేసరికి ఇన్ఫ్లయెన్సర్స్ అవ్వాలన్న కుతువలం పెరుగుతుంది. ఇన్ఫ్లయన్సర్స్ అవ్వడం అనేది ఫుల్ టైం కెరీర్ అయితే కాదు. ఎవరికో ఒక 10 మందికి వర్కవుట్ అవ్వచ్చు కానీ సమాజానికి డాక్టర్లు అవసరం, ఇంజనీర్లు అవసరం, పొలిటీషియన్లు అవసరం, సినిమా నటులు అవసరం అంతే తప్ప ఇన్ఫ్లయెన్సర్స్ అవసరం లేదు. ఉ మనం నచ్చితే 10 మందికి మనం ఇన్ఫ్లయెన్సర్ అవుతాం. ఇన్ఫ్లయెన్సర్ అవ్వడం అనేది ఎప్పుడు కూడా యడెడ్ అంతే తప్ప దానికోసమే మనం కష్టపడితే మాత్రం ఇన్సెక్యూరిటీ వచ్చి ఆ ఇన్సెక్యూరిటీ లో నుంచి పొరపాట్లు చేసే అవకాశం ఉంది. రైట్ సార్ థాంక్యూ సో మచ్ సర్ మొత్తానికి అయితే ఆ ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ జనరేషన్ లో ఈ సోషల్ మీడియా లేకపోతే సోషల్ నెట్వర్క్ ఇన్ఫ్లయెన్స్ అనేది ఎంత డీప్ గా ఉంది అండ్ దానినుంచి ఎలా బయటపడాలి అండ్ ఎంత అవసరం అనే దాని గురించి చాలా చక్కగా విశ్లేషించారు థాంక్యూ సో మచ్. సో ఏం చెప్పాలంటే ఇది చాలా చిన్న విషయం అంటే సోషల్ నెట్వర్కింగ్ యప్స్ అనేది మన జీవితంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే సో దీని గురించి మీరు ఇంతలా చాలామంది ఇంతలా ఆలోచించి ప్రాణాలు తీసుకునేంతవరకు వెళ్ళకూడదని మళ్ళీ మనస్పూర్తిగా కోరుకుంటున్నా అట్ ది సేమ్ టైం మీ ఆ సొసైటీలో అంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ యప్స్ కి బాగా బానిస అయిపోయి ఉంటే మాత్రం వెంటనే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇప్పించండి కుదిరితే ఈ వీడియో చూయించండి అండ్ మీ విలువైన మీ కామెంట్స్ ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment