[8/9, 19:42] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే...ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా...ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు.*
[8/9, 19:42] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
విషం జిమ్ము నాగుకు క్షీరం పోదుము గాని.! నీడనిచ్చు
మానుకు సలిలంబోయక నరుకున్.!! కీడుసేయు వారికి
మేలున్-మేలు సేయువారికి కీడున్ తగదే.!!! నన్
పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా.!!!!
*భావం:-* విషం
ఉన్న కూడా పామును పూజిస్తాం. కాని మనకు నీడనిచ్చే
చెట్లను నీరు పోయాక పోగా నరుకుతాము..!! కీడు చేసే
పాముకు పూజలు చేసి సృష్టి మనుగడకు కారణమైన చెట్లను
నరకడం తప్పు సుమా..
[8/9, 19:42] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*కత్తినూరు తున్నాడు*
కోపంగా వున్నాడు:
ఉదా: వాడు నాపై కత్తి నూరు తున్నాడు.
*కత్తివేటు*
నిరోధించటం,
అభివృద్ధికి భంగం కలిగించటం,
చంపటం
[8/9, 19:42] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు*
ఆపదలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్మరించి, ఆపదల నుంచి బయటపడ్డ నాడు దేవుని మరవటం అన్నది స్వార్థం, అవకాశవాదం అని ఈ సామెత ద్వారా తెలుయుచున్నది. ఎవరికైనా ఆపదలోనె దేవుడు గుర్తుకి వస్తాడు. అన్ని సక్రమంగా జరుగు తుంటే దేవున్ని మరిచిపోతారు. ఇది మానవ నైజం. ఆ విధంగా పుట్టినదె ఈ సామెత.
[8/9, 19:42] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*⏱️ గడియారం పాట⏰*
టిక్కు టిక్కు గడియారం
టిక్ టిక్ టిక్ టిక్ గడియారం
పన్నెండంకెల గడియారం
పదుగురు మెచ్చిన గడియారం.
🕰️గోడకు తగిలిన గడియారం
గంటలు గొట్టును గడియారం.
⏲️టేబులెక్కిన గడియారం
అలార మిచ్చును
గడియారం.
చేతికి బెట్టిన గడియారం
అందమిచ్చును గడియారం.
మూడు ముండ్లు గల గడియారం
ముచ్చట గొలిపే గడియారం
చిన్న ముల్లు గంటలను జూపును
పెద్ద ముల్లు నిమిషాలను జూపు
మూడవ ముల్లు సెకండ్ల తెలుపుచు
సమయము చక్కగ చూపించు.
*రచన : సంగీత విశారద శ్రీ మునుగంటి పురుషోత్తమాచారి.*
[8/9, 19:42] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*
*గాడిద సలహా🐴*
*డా॥ ఎం. హరికిషన్ - 9441032212*
ఒక రోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువుకు పోయింది.
అప్పుడే అక్కడికి వచ్చిన ఒక గాడిద పిల్లి ఎలా చేపలు పడతాదా అని చూడసాగింది.
కాసేపయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుకుంది.
నెమ్మదిగా దానిని బైటికి తీయసాగింది.
అంతలో అది చూసిన గాడిద "పిల్లిబావా... అంత చిన్న చేప నీకు ఏం సరిపోతుంది?
దానిని వదిలెయ్యి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో కుప్పలు కుప్పలు ఉన్నాయి”
అనింది.
ఆ మాటలు విని పిల్లి ఆ చిన్న చేపను నీళ్ళలోకి వదిలి మరలా గాలం వేసింది.
కొంచంసేపటికి ఇంకొంచం పెద్ద చేప గాలానికి చిక్కుకుంది.
దానిని చూసి గాడిద నవ్వి... “ఇది కూడా ఏమంత పెద్దగా లేదు. ఇంత కంటే
మంచి చేపలు అందరూ ఆనందంగా పట్టుకొని పోతావుంటే నువ్వు ఇంత చిన్న చేపను
పట్టుకొని పోతే నవ్వరా” అనింది.
ఆ మాటలు విని ఆ చేపను కూడా వదిలి వేసింది పిల్లి. ఈసారి మొదటి చేప
కన్నా చిన్న చేప పడింది. “ఛీ... ఛీ” అంటూ వికారంగా మొహం పెట్టింది గాడిద. పిల్లి
సిగ్గుపడి దానిని కూడా వదిలి వేసింది.
మరలా గాలం వేసింది.
ఈసారి ఎంత సేపున్నా ఒక్క చేప కూడా పడలేదు.
నెమ్మదిగా చీకటి పడింది.
ఆకలితో పిల్లి కడుపు నకనకలాడిపోసాగింది. ఒల్లతా నీరసంగా ఇపోయింది.
“అబ్బ నాకు ఆకలి అవుతూ వుంది. రేపు కలుద్దాం” అంటూ చెరుకు తోట వైపు
వెళ్ళిపోయింది గాడిద.
పిల్లి చుట్టూ చూసింది. జంతువులన్నీ దొరికిన చేపలను హాయిగా తింటున్నాయి.
“అయ్యో... అనవసరంగా ఒక పెద్ద చేప కోసం దొరికిన మూడు చేపలను
వదులుకుంటినే. ఆ మూడు కలిపితే ఎంత పెద్దగయ్యేవి. హాయిగా కడుపు నిడిపోయేది.
ఆ గాడిద మాటలు విని ఈ రోజు తిండి లేకుండా పడుకొవలసి వచ్చింది" అనుకుంటూ
బాధగా వెళ్ళిపోయింది పిల్లి.
[8/9, 19:42] +91 79819 72004: *✅ తెలుసుకుందాం ✅*
*🛑నెయ్యి మండనేల? Ghee burns Why?*
🟢పాలల్లోనే పెరుగు, వెన్న, నెయ్యి దాగున్నాయి. ఒక వస్తువు మండే స్వభావాన్ని ప్రదర్శించాలంటే దాన్ని వెలిగించినా లేదా నిప్పు పెట్టిన వెంటనే మండాలి. అందుకు ముందుగా దానికి తగినంత ఉష్ణోగ్రత ఉండాలి. అంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా ఇంధనాలు (fuels) మండవు. పాలల్లో నీటి శాతం 80 శాతం కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాల మీదకు అగ్గిపుల్ల పెడితే అగ్గిపుల్ల ఆరిపోతుంది. దీనికి కారణం అగ్గిపుల్లలో ఉన్న వేడిని పాలలో ఉన్న నీరు సంగ్రహించడమే. ఎంత మంట పెట్టినా పాలలో ఉన్న నీరు కొంచెం మాత్రమే వేడెక్కుతుంది. మహా అయితే 100 డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుకుంటుంది. పాలలో నీరు ఉన్నంత వరకు పాల ఉష్ణోగ్రత అంతకు మించి ఎదగదు. కాబట్టి పాలు మండలేవు. వెన్న ఓ విధమైన ఎమల్షన్. అంటే అది రెండు ద్రవాల మిశ్రమణం. అందులో నీరు ఎక్కువ, వెన్న శాతం తక్కువ. కాబట్టి వెన్నకు మంట పెట్టినా అందులో నీరు ఆ మంటలోని ఉష్ణాన్ని సంగ్రహించి ఆవిరవుతూ వెన్న మండడానికి కావలసిన ఉష్ణోగ్రతను చేరకుండా అడ్డుకుంటుంది. ఇక నెయ్యి అంటే నీటి శాతం దాదాపుగా ఏమీ లేని నూనె పదార్థం. ఇలాంటి నెయ్యికి నిప్పు పెట్టినా, మంట తాకినా నెయ్యి ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. నెయ్యి బాష్పీభవన ఉష్ణోగ్రత (boiling point) చాలా ఎక్కువ. అంటే అంతవరకు మంట ద్వారా ఉష్ణోగ్రతకు పెంచగలం. కానీ ఆ లోగానే అది గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి మండడానికి అవసరమైనంత ఉష్ణోగ్రత రావడం వల్ల మండుతుంది.
No comments:
Post a Comment