Sunday, August 10, 2025

 *_ఆయన విధానమే_*
*_అవధానం..!_*
_____________________
_తిరుపతి వేంకట కవులలో_
_ఒకరైన చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి జయంతి.._
______________________

ఆ కడుపులో అక్షరాలు..
ఆ గడపలో అవధానాలు..
పాండిత్యంతో సాంగత్యం..
పద్యాల్లో అంతులేని మహత్యం..
ఇలాంటి ఎన్నో 
గమ్మత్తులు..మత్తులు
చెళ్లపిళ్ళ వారికే చెల్లునన్నది
అక్షరసత్యం..!

ఆయనలో శ్రీనాథుని 
వంటి ప్రతిభ..
అది గని మురిసింది
ప్రతి రాజసభ..
ఎక్కువ చూసిన ఆస్థానాన్ని
పొగిడిన నోరే
తక్కువ చేసిన రాజప్రాసాదాన్ని తెగిడింది..
ప్రశంసలైనా..శాపనార్థాలైనా
పాండితీ ప్రకర్షే..!

విజయనగర సంస్థానాధిపతి
ఆనందగజపతికీ
లేదట మినహాయింపు..
దర్శనమిప్పించని దివాను
నిగ్రహం తప్పిన 
చెళ్లపిళ్ల ఆగ్రహం...
అక్షరాలుగా పేర్చితే..
కవితగా పేల్చితే..
*_రాజతిపండితుండట_*
*_బరాబరియౌనట_* 
*_మంత్రి రాజుతో.._*
*_దీజనమొప్పునట్టి కవిధీరులు_*
*_తిర్పతి వెంకటేశులా రాజును_*
*_చూడబోయిరట_*
*_రాజును_* 
*_దర్శనమీయలేదటౌ రా.._*
*_జగమందు లోకులను_*
*_నా యపకీర్తికి దాళజెల్లునో!_*
ఇదీ దివానుపై
దావానలం తీరు..
చెళ్లపిళ్ల వారి
పాండితీ హోరు..
అవమానపడిన సరస్వతీపుత్రుని నోరు..!

విశాఖలోని గోడే గజపతికీ
అలాంటి నిరసనే..
తీవ్ర పద ప్రదర్శనే..
*_సంగర శక్తి లేదు.._*
*_వ్యవసాయము_* 
*_సేయుట సున్న.._*
*_సంతలో సంగిడి వేసి_*
*_యమ్మటది యంతకుమున్నె_*
*_హుళక్కి ముష్టికిన్.._*
ఇలా సాగదా కవితాగ్రహం..
దెబ్బతింటే 
పండితుని అహం..!

ఔను మరి..
తక్కువగా సాగిందా
చెళ్లపిళ్ల వారి పాండితీయజ్ఞం
పుట్టిన ఊరి నుంచి 
కాశీ వరకు..
సంధానాలు..అవధానాలు..
సమాధానాలు..
విద్యాదానాలు..
ఎన్నెన్నో జమానాలు..
అందీ అందని నజరానాలు..
*_పాండవోద్యోగ విజయాలు_*
రాయక మునుపు
తన ఉద్యోగసద్యోగాలు..
కలిసీ కలిసిరాని యోగాలు..
అవద్గానాల్లో ప్రయోగాలు..
ఎదురు నిల్చిన వారికి
కుదిరిన రోగాలు..!

దివాకర్ల తిరుపతి శాస్త్రి 
చేరికతో ఒకరు ఇద్దరై..
తిరుపతి వేంకటకవులై..
దివాకర్ల అస్తమించినా
వీడని జంటగా..
కవితల పంటగా..
వాగ్దేవి ఆరాధనలో
బ్రతుకే పండగా..!

*_చెళ్లపిళ్ల మాట రసగుల్ల.._*
*_మెచ్చినది జగమెల్ల.._*
*_కొండొకచో పలుకు ములుకైనా.._*
*_గుచ్చుకున్న వారికీ_* *_అదోలాంటి_* 
*_తీపి బాధే.._*
*_తిట్టూ పడికట్టే.._*
*_ఎంతటి ప్రత్యర్ధి గాని_*
_*ఆ ప్రకర్ష ముందు తీసికట్టే..!*_
*_పట్టుపడితే ఉడుంపట్టే.._*
*_అవధానానికి కూర్చుంటే_*
*_గంటలు గంటలు బాసింపట్టే..!_*

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
     _విజయనగరం_

No comments:

Post a Comment