Sunday, August 10, 2025

 https://www.facebook.com/share/v/1594B522PZB/

సమాజ సేవ చేసే వాళ్ళను చూసాను గానీ సమాజంలో ఉన్నా పేదలు కోసమే సేవ చేస్తున్న... తమిళ్ 
యాక్టర్ స్టార్ హీరో సూర్య సార్..... రియల్లీ గ్రేట్....
🔥🙏🌹😍

సూర్య కన్నీళ్లు..... ఇంట్లోకి వర్షం నీళ్లు పాములు కరెంటు లేదు కులాయిత కలెక్షన్ కూడా లేదు....
సమాజం నాకెంతో ఇచ్చింది.. మరి సమాజానికి నేనేం ఇచ్చాను? అని ఆలోచించేవారు కొద్దిమందే ఉంటారు. వారిలో తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) ముందు వరుసలో ఉంటాడు.
నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్న సంకల్పంతో సూర్య.. అగరం పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు. తమిళనాడులో పేద, వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది. ఇటీవలే ఈ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

నా జీవితం ఓ సినిమా కథ
ఈ కార్యక్రమంలో ఓ యువతి.. అగరం ఫౌండేషన్‌ వల్ల తన జీవితమే మారిపోయిందని స్పీచ్‌ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. నాపేరు జయప్రియ. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. నా జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. మొదట్లో ఆ సంతోషం అన్న పదమే మా జీవితాల్లో లేదు. అదెందుకో మీకు చెప్తాను. ఇదొక సినిమాకథలా అనిపించొచ్చు. మాది చిన్న ఊరు. ఆ ఊరి పేరు అగరం. ఆ గ్రామంలో ఓ తాగుబోతు తండ్రి ఉండేవాడు.

పూరి గుడిసెలో జీవితం
అతడితో తాగుడు మాన్పించలేక భార్య మౌనంగా ఏడుస్తూ ఉండేది. వీరికి ఇద్దరు కూతుర్లు. వాళ్లది మట్టి గోడలతో కట్టిన ఇల్లు (పూరి గుడిసె). తాటాకులే ఇంటి పైకప్పు. వర్షం వచ్చిందంటే నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చేవి. ఆ ఇంటికి పాములు చుట్టాల్లా తరచూ వస్తుండేవి. ఇదే నా జీవితం. కరెంటు లేదు. ఇంటికి మంచినీటి కనెక్షన్‌ లేదు. కానీ చదువుకోవాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉండేది. చదువులోనూ ముందుండేదాన్ని. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదాన్ని.

నెక్స్ట్‌ ఏంటి?
కొంతకాలానికి మేమున్న ఇల్లు కూలిపోయింది. అమ్మానాన్న నిరుపేదలు. ఏమీ చేయలేకపోయారు. చూస్తుండగానే 12వ తరగతి పూర్తి చేశాను. కాలేజీ టాపర్‌గా నిలిచాను. తర్వాతేం చేయాలో తోచలేదు. మా మేడమ్‌ అగరం ఫౌండేషన్‌ నెంబర్‌ ఇచ్చింది. వాళ్లు నాకు సాయం చేస్తారంది. 2014లో అగరం ఫౌండేషన్‌కు కాల్‌ చేశాను. అప్పుడే నా జీవితం ఆనందంగా ముందుకుసాగింది.

గోల్డ్‌ మెడల్‌
మంచి కాలేజీలో చేర్పించారు. కెరీర్‌ గైడెన్స్‌ ఇచ్చారు. అన్నా యూనివర్సిటీ నుంచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాను. తర్వాత టీసీఎస్‌లో చేరాను. కొంతకాలానికి ఇన్ఫోసిస్‌కు మారాను. నాకున్న ఏకైక కల సొంతిల్లు. నేను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టాలి. అందులో అమ్మానాన్న ప్రశాంతంగా నిద్రించాలి. అగరం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. పెద్ద ఇల్లు కట్టాను.

గర్వంగా చెప్తున్నా
ఒకటి కాదు ఇప్పుడు నాకు రెండు ఇండ్లున్నాయని గర్వంగా చెప్తున్నాను. దీనంతటికీ కారణం అగరం ఫౌండేషన్‌. ఆడపిల్లలకు చదువెందుకు అని ఇప్పటికీ కొందరు అంటుంటారు. అమ్మాయిలను చదవనివ్వండి. చదివితేనే కదా ఏదో ఒకటి చేయగలం అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమె విజయాన్ని అభినందిస్తూ లేచి చప్పట్లు కొట్టాడు.
8000 లో ఒక్కొకరిది ఒక్కొక కథ అందులో ఒకటి..
జయప్రియ అనే అమ్మాయి తన విజయగాథను చెప్పినప్పుడు సూర్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. 
నా పేరు కడలూరుకు చెందిన జయప్రియ. నేను 2014 బ్యాచ్ విద్యార్థిని. ప్రస్తుతం నేను చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేను ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద బహుళజాతి సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్‌లో టెక్నాలజీ లీడ్‌గా పనిచేస్తున్నాను.ఇప్పుడు నా కథ చెబుతాను. నా జీవితం 80ల నాటి సినిమాలా మొదలవుతుంది. నా గ్రామం మరియు ఇల్లు చాలా చిన్నవి. నా ఇల్లు నగరానికి దూరంగా, చెట్లు మరియు మొక్కల మధ్య ఉంది. అది మట్టి గోడల ఇల్లు. కొంచెం వర్షం పడితే, నీరు వెంటనే లోపలికి వచ్చేది. అప్పుడప్పుడు, పాములు మరియు బల్లులు అతిథులుగా వచ్చేవి. అమ్మ నాన్న పెద్దగా చదువుకోలేదు. అలా ఉన్న మా ఇంటిని కూడా కొందరు కబ్జా చేశారు.రోడ్ పైకి వచ్చేసాం. మేము ఇద్దరం ఆడపిల్లలు ఆ సమయంలో మాకు ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితీ లో ఉన్నాం. నేను ప్లస్ టూలో మంచి మార్కులు తెచ్చుకుని పాసయ్యాను. నేను స్కూల్లో టాపర్‌ని. కానీ ఆ తర్వాత, ఏమి చేయాలో నాకు తెలియలేదు. చదువు ఆపేద్దాం అనుకున్నాను.అప్పుడే మా స్కూల్ టీచర్ ఒకరు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు.సూర్య agaram ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడు ఇంకా అంత వల్లే చూసుకుంటారు అని . ఆరోజు ఆ ఒక్క ఫోన్ నా జీవితాన్నే మార్చేసింది.ఇప్పుడు మా అమ్మ రెండు ఇళ్ళకు యజమానరురాలు.

ఈ వీడియో
పొద్దున్నే రెండు సార్లు చూశాను.

మళ్లీ
11 గంటలకు మరో రెండు సార్లు.

లంచ్ అవర్ తరువాత
మరో రెండు సార్లు.

తాను చదివించిన పిల్లలు,
ఒక్కరొక్కరుగా స్టెతస్కోపులు మెడలో వేసుకుని వేదిక మీదికి వస్తుంటే
నటుడు సూర్య కన్నీళ్లు ఉగ్గ పట్టుకొని చూస్తున్న దృశ్యం
గుండెల్లో ఏదో ఒక రకమైన ఉద్విజ్ఞతని కలిగించింది.

మిత్రుడు సుబ్బారావు అంటున్నారు
' ఎంత సంపాదిస్తే మాత్రం ఇంత తృప్తి కలుగుతుంది'

నిజం
చదువు విలువ తెలియడం కూడా మనిషి తనమే అనుకుంటాను.
మనుషులందరూ మనుషులైతే, 
ఎంత బాగుంటుందని కూడా అనుకుంటాను.

సూర్య ఒక గొప్ప నటుడే కాదు.
ఒక గొప్ప మంచి మనిషి.

బతుకులో నటించడం విశేషం కాదు.
నటనలో కూడా బతకడం ఉంటే దాని కతే వేరు.

ఎవరిని అనీ ఏమి ప్రయోజనం ఉండదు. 
ఆ సంస్కారం అమ్మ నుంచే రావాలి.
సూర్య వంటి కుమారులని కన్న 
గొప్ప తల్లుల వల్లే ఈ దేశం ఇంకా ఉనికిలో ఉంది.

డియర్ సూర్యా
మీరూ, మీ ఆశయంలో సగభాగమైన జ్యోతిక గార్లు
నిండు నూరేళ్లు వర్ధిల్లాలి.

No comments:

Post a Comment