*భర్త భార్యని చంపుతున్నాడు*, భార్య భర్తని చంపుతున్నది, పిల్లలు తల్లిని చంపుతున్నారు, తల్లి పిల్లల్ని చంపుతున్నది, కోడళ్ళు అత్త మామల్ని చంపుతున్నారు, అత్త మామలు కోడల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. ఎందుకో మానవ సంబంధాలు మసక బారుతున్నాయి. ఎటు పోతుందో ఈ లోకం, నిజమైన సంబంధాలు చేదు అవుతున్నాయి ఆన్ లైన్ సంబంధాలు తీపి అవుతున్నాయి, సామాజిక మాద్యమాలు విపరీత ప్రభావాలు చూపుతున్నాయి, మనుషుల్లో సిగ్గు తగ్గింది, మర్యాద తగ్గింది, కుటుంబాల్లో గొప్యత తగ్గింది, సంసారాలు వీధి కెక్కాయి, చీకటి లో ఉండాల్సినవి వెలుగులోకి వచ్చాయి, వెలుగులో ఉండాల్సినవి చీకటి లోకి వెళ్లాయి, నేటి ప్రాపంచిక మోజులో యువత విలువలు తగ్గించుకున్నది, భయం తగ్గించుకున్నది, బాధ్యత తగ్గించుకున్నది, బరి తెగించడం అలవాటు చేసుకున్నది, నేడు సమాజం లో అమ్మతనం అవమాన పడుతున్నది, కుటుంబ వ్యవస్థ మసక బారుతున్నది, పిల్లలు కి తల్లి దండ్రులు భారం అవుతున్నారు, తల్లి దండ్రులకు పిల్లలు భారం అవుతున్నారు, టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం వింత పోకడలు పోతున్నది, పెరుగుట విరుగుట కొరకే అని అంటారు, మనుషు ల్లో టెక్నాలజీ వాడకం, అది ఎటువైపు తీసుకు పోతుందో. అంతరించి పోతున్న ఆత్మీయతలు, కనుమరుగు అవుతున్న ఆప్యాయతలు, కానరాని బంధుత్వాలు, కష్టం అనిపిస్తున్న బంధాలు, అంతరించి పోతున్న మానం, మర్యాదలు, ఎటు పోతుందో లోకం, ఏమై పోతుందో మానవ జీవనం. అంతా అగమ్య గోచరం అయ్యింది. ఒక బాటసారి ఆవేదన.
No comments:
Post a Comment