Sunday, August 10, 2025

 *ఊడ్చిన నేల నుంచే  AGM కుర్చీ వరకు*:- ప్రతిక్షా టోండ వాల్కర్ జీవిత కథ ఇది. ఆమెది ఒక అసాధారణ సాహసం. చిన్న వయస్సు లోనే పేదరికాన్ని చూసింది. 20 ఏళ్లకే విధవైంది. జీవితం లో అంధకారం నిండినా, ఆశను అంగీకరించింది. ఆమె మొదటి అడుగు ఎక్కడంటే SBI లో ఊడ్చే ఉద్యోగం. కానీ ఆమె కలలు చిన్నవిగా లేవు. పని చేస్తూ చదువుకుంది. చదువుతూ ఉద్యోగాన్ని మెట్టెక్కింది. మెస్సెంజర్ నుండి క్లర్క్, క్లర్క్ నుండి ట్రైనీ ఆఫీసర్, చివరకు అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) గా ఎదిగింది. ఆమె సాఫల్యం మనందరికీ ఒక గొప్ప సందేశం. నీ స్థితి, నీ భవిష్యత్తు కాదు. నీ నిశ్చయమే నిజమైన మార్గం. ప్రతిక్షా వంటి మహిళలు, నిజం గా మన దేశానికే గర్వకారణం.

No comments:

Post a Comment