Sunday, August 10, 2025

 *చిన్ననాటి మధుర జ్ఞాపకాలు*:-

టెలిఫోన్ ఆపరేటర్:- 2541900 నా అండి మీరు హైదరాబాద్ ట్రంకాల్ బుక్ చేశారు, అది నో రిప్లై వస్తుందండి, కాల్ వెయిటింగ్ లిస్టులో పెట్టమంటారా క్యాన్సిల్ చేసేయ మంటారా?  బహుశా టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుండి ఆపరేటర్ మిమ్మల్ని ఇలా మాట్లాడినటువంటి సందర్భాలు గతంలో గుర్తుండే ఉంటాయి. అప్పట్లో ఎవరితో నైనా టెలిఫోన్ లో మాట్లాడాలంటే, మన ఫోన్ నుంచి టెలిఫోన్ ఎక్స్చేంజికి ట్రంక్ కాల్ బుక్ చేసుకోవాలి. వాళ్లకి లైన్స్ క్లియర్ అయిన తర్వాత, ప్రయారిటీని బట్టి మీ ట్రంకాల్  కలిపేవారు. ఆరోజుల్లో గంటలకొద్దీ ఫోన్ దగ్గర ట్రంకాల్ కోసం ఎదురు చూడాల్సినటువంటి స్థితి. కాల్ దొరికిన వాడు అదృష్ట వంతుడు, దొరకని వాడు దురదృష్టవంతుడు. ఒక్కోసారి ముఖ్యమైన సమాచారం అందించాలనుకుంటే ట్రంకాల్ దొరక్కపోతే పోస్ట్ ఆఫీస్ నుంచి టెలిగ్రామ్ పంపించి విషయాన్ని తెలియ జేయాల్సి నటువంటి పరిస్థితి ఉండేది.  ఈ రోజుల్లో ఏ వ్యక్తి తోటైనా ఏ దేశంలో ఉన్నా, క్షణాల్లో వాళ్లతో వీడియోలో మాట్లాడేసే అత్యాధునిక మైనటువంటి పరిజ్ఞానం రావడం మనం చూస్తూ ఉన్నాం కదా.

No comments:

Post a Comment