*హిందూ ధర్మం - 25*
--------------------------------
*మహాభారతం - గ్రహణాలు*
మహాభారత యుద్ధం నవంబరు 22, BCE.3137 న ప్రారభమైంది. ఈ విషయంలో ఖగోళశాస్త్రానికి సంబంధించిన ఋజువు కూడా మహాభారతంలో ఉంది.
గ్రహకూటములు సామన్యమైనవి కావు అవి ప్రతి దశాబ్దం, శతాబ్దంలో ఏర్పడేవి అంతకంటే కావు. కొన్ని ఇప్పటి వరకు అసలు ఏర్పడనే లేదు. కొన్ని కేవలం వేలఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరిగే అపూర్వసంఘటనలు. ఖగోళ వింతలు అత్యంత అరుదుగా జరుగుతాయి.
భూమి నీడ చంద్రుని మీద పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా ఒక్క పూర్ణిమ రోజున మాత్రమే ఏర్పడుతుంది. ఒక శతాబ్దం (100 సంవత్సరాలు)లో 150 గ్రహణాలకు పైగా ఏర్పడతాయి. వాటిలో కొన్ని సంపూర్ణ చంద్రగ్రహణాలు కాగా, కొన్ని పాక్షిక చంద్రగ్రహణాలు.
సంపూర్ణచంద్రగ్రహణం అధికంగా 2 గంటలు, పాక్షిక చంద్రగ్రహణం 4 గంటలు కొనసాగే అవకాశం ఉంటుంది. BCE.3500 నుంచి BCE.700 మధ్య సుమారు 4350 చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి.
అట్లాగే చంద్రుడి నీడ భూమిపై నుంచి వీక్షిస్తున్న ప్రాంతంలో పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఒక శత్బాదంలో దాదాపు 240 సూర్యగ్రహణలు ఏర్పడుతాయి. BCE.3500 నుంచి BCE.700 వరకు సుమారు 6960 సూర్యగ్రహణాలు ఏర్పడ్డాయి. సూర్యగ్రహణం అమావాస్య రోజునే ఏర్పడుతుంది. ఈ గ్రహణాల్లో కొన్ని పాక్షికం కాగా, కొన్ని సంపూర్ణ సూర్యగ్రహణాలు.
సంపూర్ణసూర్యగ్రహణం అత్యధికంగా 8 నిమిషాలు, పాక్షికం 115 నిమిషాలకు వరకు జరుగుతుంది.
అందువల్ల గ్రహణాలను ముఖ్యంగా నమోదు చేశారు వ్యాసమహర్షి.
మహాభరతంలోని భీష్మ పర్వం మరియు ఉద్యోగపర్వంలో ఇటువంటి కొన్ని సంఘటనలు నమోదు చేశారు.
వాటిలో ఒకటి శని రోహిణి నక్షత్రంలో, అంగారకుడు జ్యేష్ఠా నక్షత్రంలో ఉండగా, 2 గ్రహణాలు ఏర్పడ్డాయి, కృత్తికా నక్షత్రంలో చంద్రగ్రహణం, జ్యేష్ఠాలో సూర్యగ్రహణం.
వీటి ప్రత్యేకత తరువాయి భాగంలో తెలుసుకుందాం.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment