Saturday, September 27, 2025

 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*


*శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం*

⚜️ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి.

⚜️  మహా విష్ణు దేవతలందరి లో ఉత్తమోత్తమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు..చక్రీ సర్వోపగతుండు.ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును.

⚜️  ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది.

⚜️  పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి.

⚜️  జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది. 

⚜️  మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.

⚜️  ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది.

⚜️  ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు.

⚜️  శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. ...... 

⚜️ జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది...


*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*

No comments:

Post a Comment