*ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం విధిలీల*
*వెంట ఏ బంధమూ... రక్త సంబంధమూ... తోడుగా రాదుగా తుదివేళ*
*మరణమనేది ఖాయమనీ... మిగిలెను కీర్తి కాయమనీ*
*నీ బరువూ... నీ పరువూ... మోసేదీ...*
*ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ...*
*రాజనీ... పేదనీ, మంచనీ... చెడ్డనీ... భేదమే ఎరుగదీ యమపాశం*
*కోట్ల ఐశ్వర్యమూ... కటిక* *దారిద్ర్యమూ... హద్దులే చెరిపెనీ మరుభూమి*
*మూటలలోని మూలధనం... చేయదు నేడు సహగమనం*
*నీ వెంట... కడకంటా... నడిచేదీ... ఆ నలుగురూ... ఆ నలుగురూ...*
*చిత్రం :* ఆ నలుగురు (2004)
*సంగీతం :* ఆర్.పి.పట్నాయక్
*రచన :* చైతన్య ప్రసాద్
*గానం :* ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment