Wednesday, September 24, 2025

 ""'"మంచిమాటే  మనశ్శాంతికి మందు"""

మాటలలోని మాధుర్యము ఎంతటి వారినైనా ఆకట్టుకుంటుంది. అందుకే """నోరు  మంచిదయితే ఊరు మంచిదవుతుందంటారు.""

""" మాటలాడ నేర్చి మనసు రంజిలజేసి,
పరగ బ్రియము చెప్పిబడలకున్న,
నొకరి సొమ్ము లూరక వచ్చునా,
విశ్వధాభిరామ వినురవేమ"""

ఇక్కడ కవి మాటలలో నేర్పుని ప్రదర్శిస్తు మాటలతో ఇతరులను రంజిల్ల చేసిన ఎదుటివారి నుండి మనకి కావలసిన రాజకార్యాలు నెరవేరుతాయిగానీ ఊరక ఏదీ రాదు కదా అని ప్రశ్నిస్తున్నాడు.నిజమే ఎదుటివారి సహాయసహకారాలు కావాలంటే మాటల మధురిమతో ఎదుటి వారి హృదయాలు గెలవగలగాలి.

అసలు  మనము మాట్లాడే విధానమే ఉన్నతముగ యుండాలని రామాయణము కిష్కిందాకాండములో రాముని ద్వార తెలియవస్తున్నది. హనుమని సన్యాసి రూపములో గమనించి అతని మాటలలోని మాధుర్యాన్ని మెచ్చుకుంటూ తమ్ముడైన లక్ష్మణుని తో 

 ఓ సోదరా ! మాటల మాధుర్యం గమనించాలంటే ఈ సన్యాసి మాటలు విను.

"(" గీతీ శీఘ్రీ,శిరఃకంపీ,తథా లిఖిత పాఠకః,
     అనర్ధజ్ఞోల్పకంఠశ్చ, షడతేపాఠకాధమాః"".

మాట్లడేటప్పుడు రాగాలు తీసేవాడు,వేగముగ మాట్లాడేవాడు,తలను కదిలిస్తూ మాట్లాడేవాడు,వ్రాసిన దానిని చూసి చదివేవాడు,కంఠస్థము చేసి అప్పచెప్పేవాడు,అర్ధము తెలుసుకోకుండ మాట్లాడేవాడు,ఈ ఆరుగురిని పాఠకాధములని లోకములో వ్యవహరిస్తారు.)

రామాయణం కిష్కింధాకాండలో మొదటిసారిగ హనుమంతులవారు సాధు వేషములో వచ్చి శ్రీరామలక్ష్మణులతో సంభాషిస్తుంటే హనుమంతులవారి గురించి రాముడు లక్ష్మణునితో ఇలా అంటాడు.

"న ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా
  అన్వేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్.(03-31),

లక్ష్మణా! ఇతనిని గమనించు.ఈతడు మాట్లాడునప్పుడు ముఖమునందును, కనులలోను, ఫాలభాగమునందును,మరియు తదితర అవయవములయందును ఎట్టి వికారములు కనుపడుటలేదు"".అని తెలియచేస్తూ
 మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలనే విషయము తెలియచేస్తున్నాడు.

""అనయా చిత్రయా వాచా త్రిస్థానవ్యంజనస్థయా,
కస్య నా~రాధ్యతే చిత్తమ్ ఉద్యతాసేః అరేరపి""04-34),

ఓ సోదరా! ఈతని మాటలు వ్యాకరణ సమ్మతములు,ఒక క్రమములో సాగినవి.ఈతని వచనములన్ని స్వరస్థానములలో(స్వరస్థానములు మూడు1)వక్షఃస్థలము,2)కంఠము,3)శిరస్సు)పలుకుచున్నాడు.అందుకనే ఈతని మాటలమాధుర్యత నన్ను  ముగ్ధుని చేసిందని హనుమని మెచ్చుకున్నాడు.

అలా మారుతి తన మాటల మాధుర్యముతో రామునంతటివానిని  ఆకట్టుకున్నాడు.అది మనము గమనించుకోవాలి.కనుక మారుతి తన ప్రభువైన సుగ్రీవుని కార్యము తన మాటల నైపుణ్యముతో ఎలా చక్కపెట్టాడో గమనించుకుంటు  రామాయణ పారాయణ చేయగలగాలి.

జై శ్రీరామ్   జై జై శ్రీరామ్.🙏🚩

No comments:

Post a Comment