Sunday, September 28, 2025

 *గీత లోని పరమార్థం తెలుసు కుందాము.*


1. *మనిషి శరీరం కణాలతో తయారయింది, అవి ప్రతి క్షణం మారుతున్నాయి అయినప్పటికీ “నేను నేనే” అనే భావన మారదు.*

2. *బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అన్నీ శరీర స్థితుల మార్పులు మాత్రమే; ఆత్మ అనే సూత్రం స్థిరంగా ఉంటుంది.*

3. *మరణం అనేది శరీరం మార్పు మాత్రమే శరీరంలోని పదార్థం తిరిగి ప్రకృతిలో కలుస్తుంది, కానీ చైతన్యం (ఆత్మ) మరో శరీరంలో కొనసాగుతుంది.*

4. *గీతా 2.13 చెబుతున్న సూత్రం ఏమిటంటే: దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి*

*చిన్ననాటి శరీరం పోయింది యవ్వన శరీరం కూడా మారిపోయింది వృద్ధాప్యం వస్తుంది ఇవన్నీ శరీర మార్పులు మాత్రమే. మరణం కూడా అలాగే శరీరం మారుతుంది, కానీ జీవాత్మ కొత్త శరీరంలోకి వెళ్తుంది. ఇది తెలిసినవాడు భయపడడు,* *గందరగోళానికి లోనుకాడు.*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁📖🍁 🙏🕉️🙏 🍁📖🍁

No comments:

Post a Comment