🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀```
నేడు...
ఇంద్రకీలాద్రిపై... ```
జగన్మాత
*కాత్యాయని దేవి*```
గా దర్శనం```
➖➖➖✍️
*అవర్షిసఞ్జ్ఞం పురమస్తి లోకే కాత్యాయనీ తత్ర విరాజతే యా।ప్రసాదదా యా ప్రతిభా తదీయా సా ఛత్రపుర్యాం జయతీహ గేయా ॥౧॥*
*త్వమస్య భిన్నైవ విభాసి తస్యాస్తేజస్వినీ దీపజదీపకల్పా । కాత్యాయనీ స్వాశ్రితదుఃఖహర్త్రీ పవిత్రగాత్రీ మతిమానదాత్రీ ॥ ౨॥*
*బ్రహ్మోరువేతాలకసింహదాఢోసుభైరవైరగ్నిగణాభిధేన ।*
*సంసేవ్యమానా గణపత్యభిఖ్యా యుజా చ దేవి స్వగణైరిహాసి ॥ ౩॥*
*గోత్రేషు జాతైర్జమదగ్నిభారద్వాజాఽత్రిసత్కాశ్యపకౌశికానామ్ ।*
*కౌణ్డిన్యవత్సాన్వయజైశ్చ విప్రైర్నిజైర్నిషేవ్యే వరదే నమస్తే ॥ ౪॥*
*భజామి గోక్షీరకృతాభిషేకే రక్తామ్బరే రక్తసుచన్దనాక్తే ।*
*త్వాం బిల్వపత్రీశుభదామశోభే భక్ష్యప్రియే హృత్ప్రియదీపమాలే ॥ ౫॥*
*ఖడ్గం చ శఙ్ఖం మహిషాసురీయం పుచ్ఛం త్రిశూలం మహిషాసురాస్యే ।*
*ప్రవేశితం దేవి కరైర్దధానే రక్షానిశం మాం మహిషాసురఘ్నే ॥ ౬॥*
*స్వాగ్రస్థబాణేశ్వరనామలిఙ్గం సురత్నకం రుక్మమయం కిరీట్మ ।*
*శీర్షే దధానే జయ హే శరణ్యే విద్యుత్ప్రభే మాం జయినం కురూష్వ ॥ ౭॥*
*నేత్రావతీదక్షిణపార్శ్వసంస్థే విద్యాధరైర్నాగగణైశ్చ సేవ్యే ।*
*దయాఘనే ప్రాపయ శం సదాస్మాన్మాతర్యశోదే శుభదే శుభాక్షి ॥ ౮॥*
*ఇదం కాత్యాయనీదేవ్యాః ప్రసాదాష్టకమిష్టదమ్ ।*
*కుమఠాచార్యజం భక్త్యా పఠేద్యః స సుఖీ భవేత్ ॥ ౯॥*
```
జగజ్జనని కాత్యాయని అవతారంలో పూజ చేసి తరించండి.```
*కాత్యాయని దేవి*
➖➖➖✍️
*కాత్యాయని దేవిని పూజిస్తే వివాహ సంబంధిత సమస్యలను దూరం చేస్తుందా?*```
*అమ్మవారిని పూజించి చూడండి అన్నీశుభాలే!
*నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు.
*క్రమంగా ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది.
*ఈ తొమ్మిది రూపాలలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది. మంగళ దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది.
*ఆమే కాత్యాయయుని కుమార్తె, కాత్యాయనీ.
*కాత్యాయనీ దేవి నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది. ఇందులో ఆమె తన ఎడమ వైపు పై చేతిలో కమలాన్ని, మరో చేతిలో కత్తిని కలిగి ఉంటుంది. అదేవిధంగా, కుడి చేతులు అభయ మరియు వరద ముద్రలతో కూడుకుని ఉంటాయి. పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనమిస్తుంది.
*కాత్యాయనీ దేవిని పూజించబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడింది.
*వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాత్యాయనీ దేవిని పూజించడం ద్వారా ఫలితాలను పొందగలరని సలహా ఇవ్వబడింది.
*వివాహ విషయాలలో ఆలస్యం, భార్యా భర్తల మధ్య తరచుగా విభేదాలు, సరైన భాగస్వామిని కనుగొనలేక పోవడం, వంటి సమస్యలు నవరాత్రి వేళల్లో ఆమెకై ఉపవాసం పాటించడం ద్వారా తొలగించబడుతుందని చెప్పబడింది.
*ఆమె వర్ణనలు కాళిక పురాణాలలో కూడా కనిపిస్తాయి. కాత్యాయనీ దేవి కూడా ఆదిశక్తి అంశగా పరిగణించబడుతుంది. కావున భయాన్ని త్యజించడం కోసం కూడా కాత్యాయనీ దేవిని పూజించడం జరుగుతుంది.
*పన్నెండవ గృహంతో సంబంధం ఉన్న దేవతగా కాత్యాయనీ దేవిని కొలవడం జరుగుతుంది.
*జ్యోతిష శాస్త్రం ప్రకారం, కాత్యాయనీ దేవి జన్మ కుండలి చార్ట్ లో బృహస్పతి గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.
*అంతేకాకుండా ఆమెను బ్రహ్మ మండల ఆదిశక్తి దేవి' అని కూడా పిలుస్తారు. గోకులంలోని గోపికలు, కృష్ణుని ప్రేమను పొందుటకై
ఈ దేవతకు ప్రార్ధనలు చేశారని చెప్పబడింది. భగవత్ పురాణంలో వారు యమునా నదిలో స్నానం చేసి, ధూప దీపాలతో, పువ్వులు మరియు నైవేద్యాలను సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్పబడింది.
*ఈ ఉపవాసాలు చేయడం ద్వారా, క్రమంగా దోషాలు తొలగిపోయి వివాహ మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పబడింది.
*దేవీ నవ రాత్రులలో కాత్యాయని దేవీని పూజ చేయడం వివాహాది సమస్యలతో భాదపడేవారికి అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పబడుతుంది.
🌻 *వివాహానికి సంబంధించిన సమస్యల నివారణ కొరకు సూచించబడిన కాత్యాయని దేవీ మంత్రాలను కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి :
```
*1. ముందస్తు వివాహానికి సూచించబడిన కాత్యాయనీ మంత్రం:
*ఓం కాత్యాయనీ మహామయే, మహాయోగిన్యాధీశ్వరీ !*
*నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః !!*
*2 . వివాహ ఆలస్యానికి సూచించదగిన కాత్యాయని మంత్రం :
*హే గౌరీ శంకర్ అర్ధాంగి యధా త్వాం శంకర్ ప్రియా !*
*తథా మమ్ కురు కల్యాణి కంటకం సుదుర్లభం !!*
*3. వివాహ సమస్యల నుండి బయట పడేందుకు :
*హే గౌరీ శంకర్ అర్ధంగిని యథా త్వం శంకర ప్రియ !*
*తథా కమ్ కురు కల్యాణి కంత్ కాంత్ సుదుర్లభమ్ !!*
*4. ఆలస్యమైన వివాహాలకు కాత్యాయనీ సూర్య మంత్రం :
*ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !*
*వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!*
*5. కోరుకున్న భాగస్వామి కోసం సూచించదగిన కాత్యాయనీ మంత్రం :
*ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !*
*వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!*
*6. మంచి వివాహ జీవితానికి ఉద్దేశించిన కాత్యాయనీ మంత్రం :
*ఓం షంగ్ శంకరాయ సకల్ జన్మర్జీత్ పాప్ విధ్వామ్స్ నాయ్ !*
*పురుషార్ద్ చౌతుస్టాయ్ లాభయ్ చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ !!*
*ధ్యాన శ్లోకం:
*చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా|*
*కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ ||...*✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment