*శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర శారదీయ (దసరా) శరన్నవరాత్రి మహోత్సవాలు*
తేదీ.28.09.2025 ఆదివారం
*ఏడవరోజు శ్రీశైలం,బాసర లో కాళరాత్రి అలంకార దర్శనం*
*నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రిగా పూజిస్తారు*
“కాళ” అనగా మృత్యువు, “రాత్రి” అంటే అజ్ఞానం, చీకటి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది కావున అమ్మవారికి కాళరాత్రి అనే పేరు వచ్చింది
ఈ అమ్మవారు చాలా భయంకరంగా శత్రు సంహారిణి గా ఉంటుంది. నల్లని రూపం, పొడవాటి జడలు కట్టిన కేశాలు, మెడలో పుర్రెలు, రక్తం తాగుతున్నట్టుగా, చతుర్భుజాలతో,గాడిద వాహనం తో భయం కలిగించేలా ఉంటుంది
కానీ భక్తులకు ఆమె అభయప్రదాత. కాళికాదేవి శనిగ్రహానికి అధిపతి. ఈమె తన ఒక కుడిచేతి వరద ముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది
*నైవేద్యం : కదంబం (కిచిడి)*
కాళరాత్రి దేవి ధ్యాన శ్లోకం :
*ఏకవేణీ జపాకర్ణపురా నగ్నా ఖరస్థితా | లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా | వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ*
No comments:
Post a Comment