*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🔸కష్టమంటే🔸*
*అందరూ అతి సులభంగా పలికే మాట- కష్టం. కష్టమంటే ఏమిటో సరైన నిర్వచనం చాలామందికి తెలియక అలా అనేస్తారు. నిజమైన కష్టం ఏదో తెలిసేవరకు ప్రపంచంలో ప్రతి పనీ కష్టమైనదిగానే అనిపిస్తుంది. అందరూ కష్టాలు అనుభవిస్తున్నామనే భావిస్తారు. కష్టం అనేది ఒక మానసిక భావన, ఒక అనుభూతి. ఒక అనుభవం. వ్యక్తి, వయసు, ఆలోచనా సరళిని బట్టి కష్టం స్థాయి మారుతూ ఉంటుంది.*
*ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుందని- మానసిక శాస్త్రవేత్తల నిర్వచనం.. మనసు పెట్టి ఇష్టపూర్వకంగా పనిచేస్తే కష్టం ప్రసక్తే ఉండదు. వయసు, స్థాయి, ఆలోచనా విధానాల్లో మార్పులు వచ్చేకొద్దీ కష్టం తాలూకు నిర్వచనం, లక్షణం, రూపం మారిపోతూ ఉంటాయి. అప్పులు, యాచనల్లాంటివి చేయవలసి రావడం, రోగాలు చుట్టుముట్టడం, దొంగల పాలుకావడం* *ఏ పనీ కలిసిరాకపోవడం, వృద్ధాప్యంలో బాధలు అనుభవించడం, సరైన తోడు కాని సలహాలను ఇచ్చేవారు కాని లేకపోవడం, పేదరికం అనుభవించడం... ఇలాంటి ఎన్నింటినో కష్టాలుగా పేర్కొంటారు.*
*భగవంతుణ్ని ఎపుడూ స్మరించక పోవడమే మహా పాపం అని, ఆ పాపమే కష్టాలకు కారణమని భాగవతంలో పోతన చెప్పాడు. అంటే, భగవంతుడి స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయని విశ్వాసం కలిగి ఉండాలని అంతరార్థం. గత జన్మలో చేసిన పాపాలు సైతం కష్టాలుగా పరిణమిస్తాయని పౌరాణికులు చెప్పేమాట. పరిశీలిస్తే జీవితంలో ప్రతిపనీ కష్టంతో ముడివడి ఉన్నదే. లక్ష్యసాధన కోసం చేసే ప్రయత్నాలు, విషయ సేకరణ, వస్తు- ధన సంపాదన, వాటిని నిలబెట్టుకోవడం, భద్ర పరచడం ఇలా ప్రతిపనీ కష్టమే.*
*కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించడానికి ఉత్తు అవకాశం ఉంటుందనేది సత్యం. కష్టం చేయనిదే ఫలితం ఉండదు. కాబట్టి కష్టేఫలీ అనే నానుడి గుర్తు పెట్టుకోవాలి. నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే నీకు ఏదీ అందుబాటులోకి రాదు. అవసరమైనవాటిని అందుబాటులోకి తెచ్చుకోవాలంటే కృషి, కష్టం ప్రధానం అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.*
*మనిషి గొప్పతనాన్ని, విలువను అంచనా వెయ్యాలంటే సుఖసంతోషాలతో గడుపుతున్నప్పుడు కాదు. కష్టాలు కలిగినప్పుడే అది సాధ్యం. ఎందుకంటే అలాంటప్పుడే ఆ వ్యక్తి సమర్థత పూర్తిగా తెలిసి సరైన అంచనాకు దొరుకుతాడు. అతడి మనసు అసలు రూపు బయటపడేది అలాంటప్పుడే.*
*ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితాలను పొందినవారికే జీవితంలో విలువ ఉంటుంది. మన జీవితం కూడా మంచి, చెడు విషయాల సమతుల్యతతో జరుగుతుంది. నువ్వెంత కష్టపడి పని చేస్తున్నావో చెప్పవద్దు. ఎంత పని పూర్తి అయ్యిందో చెప్పు, జీవితంలో ఒక కష్టం దాటి వచ్చిన తరవాత నువ్వు అనుభవించే ఆనందంతో పోటీపడే అనుభూతి ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. కాబట్టి కష్టాలను ఇష్టంగా ఆహ్వానించు అంటాడొక కవి.*
*కష్టం విలువ ఒకరు చెబితే తెలిసేది కాదు. అనుభూతి చెందితేనే తెలుస్తుంది. నిజానికి ఎదుటివారు పడే కష్టం ఇతరులకు తేలికగా, చులకనగా అనిపిస్తుంది. ఎదుటివారి సానుభూతి, లేదా సహాయం వస్తుందేమోననే ఆలోచనతో ఎదురు చూడటం మంచిది కాదు. దాని బదులు మీ దృష్టిని లక్ష్యం మీదే ఉంచి దాన్ని సాధించే నిరంతర ప్రయత్నం సాగాలి. అలా చేసిననాడు ఆత్మవిశ్వాసంతో కష్టాలను అధిగమించిన తరవాత వచ్చే ఆనందపు రుచిని అనుభవిస్తారు. ఆ రుచి వర్ణనాతీతం.*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
No comments:
Post a Comment