Friday, September 26, 2025

 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…

            *భక్త జన రక్షకుడు*
               ➖➖➖✍️
```
శ్రీనివాసన్ పరమాచార్య స్వామి వారికి గొప్ప భక్తుడు.
అతని నాలుగేళ్ల కుమారుడు విశాఖన్ మూడవ అంతస్తు ఇంటి నుండి చూస్తూ క్రిందకు పడిపోయాడు.
ఆ పడడంతోనే మూర్చిల్లాడు. వెంటనే పిల్లాణ్ణి రాయపేట్ ఆసుపత్రికి తీసుకునివెళ్ళారు. కాని వారికి అతనిపై ఎటువంటి నమ్మకము లేదు.

పిల్లాడి శరీరానికి వెలుపల ఎటువంటి గాయం కాలేదు. లోపలివైపు ఏమైనా దెబ్బ తగిలిందేమో అని డాక్టర్లు తలను, ఇతర భాగాలను ఎక్స్ రే తీసి చూశారు.

కాని వారికి ఎటువంటి గాయము కనబడలేదు. అంతేకాక ఎముకలు కూడా ఏవి విరగలేదని రూఢి అయ్యింది.

విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు.

అంత ఎత్తు నుండి క్రిందకు పడుతున్నప్పుడు పిల్లవాడి శరీరం కొన్ని చెట్టుకొమ్మలకు తగలడంతో అక్కడక్కడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి. డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు.

సాయింత్రం ఆరుగంటలప్పుడు పిల్లాడికి మెలకువ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి గొణుగుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు.

“నాన్నా! మూడో అంతస్తు నుండి క్రిందకు తొంగి చూస్తుండగా పడిపోయాను. నువ్వు రోజూ పూజ చేసే చిత్రపటంలోని ‘పెరియవా’ నన్ను రెండు చేతులతో పట్టుకున్నారు. నా నుదుటిపై కుంకుమ, విభూది కూడా పెట్టారు నాన్న” అని చెప్పాడు.

అక్కడ చుట్టూ ఉన్నవారు ఈ విషయం విని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

అప్పుడే కంచికి వెళ్ళి తిరిగొచ్చిన పక్కింటి వ్యక్తి శ్రీ హరిహర అయ్యర్, పరమాచార్య అనుగ్రహాన్ని నిజం చేస్తూ, ప్రసాదం ఇచ్చాడు.

శ్రీనివాసన్ ఎప్పుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినా, స్వామివారు శీనివాసన్ ని, “మూడో అంతస్తు నుండి పడిపోయిన విశాఖన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎన్నో తరగతి చదువుతున్నాడు?” అని అడిగేవారు.

మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా మనలని సదా సంరక్షించేవారు, పరమ దయాళువు అయిన మన మహాస్వామివారు.

కరుణాసముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.✍️```

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
 “కంచిపరమాచార్యవైభవం”🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment