🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🙏 *కాళరాత్రి దేవి* 🙏
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రిగా పూజిస్తారు. *“కాళ”* అనగా మృత్యువు, *“రాత్రి”* అనగా అజ్ఞానం లేదా చీకటి.
మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది కనుక అమ్మవారికి కాళరాత్రి అనే నామం వచ్చింది.
ఒకానొకప్పుడు శంభునిశంభుల సోదరుడు స్వర్గం మీద దండెత్తగా, ఇంద్రుడు అతనిని సంహరిస్తాడు. ఇంద్రుడి మీద ప్రతీకారం కోసం శంభునిశంభులు, రక్తబీజాక్షుడితో కలిసి స్వర్గం మీదికి దండెత్తి, ఇంద్రున్ని ఓడించి స్వర్గం కైవసం చేసుకుంటారు. శంభునిశంభులు, రక్తబీజాక్షుడు, మహిషాసురుడి భృత్యులు మరియు అతని సన్నిహితులు కూడా!
ఇంద్రుడు కైలాసం చేరుకొని సహాయార్థం పార్వతీదేవిని ప్రార్ధిస్తాడు. పార్వతిదేవి తన అంశతో ఒక్క స్వరూపం సృష్టించి యుద్ధానికి పంపుతుంది. ఆమె, శంభునిశంభులు పంపించిన చాలా మంది రాక్షసులను చంపుతుంది. కానీ చండ్, ముండ్, రక్తబీజాక్షులను చంపడానికి ఆమె శక్తి సరిపోదు.
అటు పిమ్మట జరిగిన కాత్యాయనిదేవి, మహిషాసురు ల యుద్ధం గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాం! మహిషాసురుడు, తన భృత్యులైన చండ్, ముండ్, రక్తబీజు లను ముందుగా యుద్ధానికి పంపుతాడు.
చండ ముండాసురులను వధిస్తుంది గనుక అమ్మవారికి *చాముండేశ్వరి* అని నామము కూడా కలదు.
రక్తబీజుడు, బ్రహ్మ దేవుడు గురించి చాలాకాలం తపస్సు చేసి, ఆయనను ప్రసన్నం చేసుకొని, తన శరీరంలో నుంచి నేల మీద పడిన ప్రతి రక్తపు బొట్టు నుంచి మరొక రక్తబీజుడు ఉద్భవించే వరం కోరుకుంటాడు.
యుద్ధం సమయంలో నేల రాలిన రక్తబీజాసురుడి రక్తం నుండి వేల సంఖ్యలో రక్తబీజులు జన్మించ సాగారు. అప్పుడు కాత్యాయనిదేవి, కాళీని ఆవాహన చేస్తుంది. కాళికాదేవి రక్తబీజాసురుడి రక్తం నేల రాలకుండా అతని శరీరంలోని చివరి బిందువు వరకు త్రాగి రక్తబీజాసురుడిని వధిస్తుంది.
ఈ స్వరూపంలో అమ్మవారు చాలా భయంకరంగా, శత్రుసంహారిణి గా ఉంటుంది. నల్లని రూపం, పొడవాటి జడలు కట్టిన కేశాలు, మెడలో పుర్రెలు, రక్తం తాగుతున్నట్టుగా, చతుర్భుజాలతో, గాడిద వాహనం కలిగి భీతిని కలిగించేటట్లు ఉంటుంది. కానీ భక్తులకు ఆమె అభయప్రదాత.
కాళికాదేవి శనిగ్రహానికి అధిపతి. జాతకంలోని శని దోషాలను తొలగించుకోవడానికి కాళికాదేవి ఆరాధన ప్రాముఖ్యంగా చేస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆమె సరిసమానంగా చేస్తుంది. పారిజాత పూలు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి.
కాళరాత్రి దేవి ఆలయం వారణాసిలోని కాళికా గల్లీ లో ఉంది.
నమ్మిన భక్తులకు ఎల్లప్పుడూ శుభాలనే చేకూరుస్తూ, భయాన్ని కూడా పోగొట్టే అవతారం గనుక, కాళరాత్రి అవతారంలోని అమ్మవారికి శుభంకరీ అని మరొక పేరు.
*కాళరాత్రి దేవి అవతారం లోని వివిధ అంశాల వైశిష్ట్యం క్రింద తెల్పబడ్డాయి :*
*నల్లని రూపం :*
మనసులోని చీకటిని పారద్రోలుతుంది.
*గాడిద :*
బలమైన, ఖచ్చితమైన అడుగులు
*ఇనుప ఖడ్గం :*
దుష్ట శక్తులపై తీక్షణమైన వేటు
*మెరుపు :*
వజ్రం లాంటి శక్తి
*కుడి చేతులు :*
శుభాలనే చేకూరుస్తూ, భయాన్ని పోగొట్టటం
*అపరిమితమైన జుట్టు :*
రౌద్రం, క్రూరత్వానికి చిహ్నం
*కాళరాత్రి దేవి ధ్యానం :*
కరాలవందన ఘోరం ముక్తకేశి చతుర్భుజమ్
కాళరాత్రిమ్ కరళింక దివ్యం విద్యుతమల విభూపితామ్
దివ్యం లాహవజ్ర ఖద్గ వమొఘోర్ధ కరంబుజమ్
అభయం వరదం చైవ దక్షిణద్దగ పర్ణికం
మమ్ మహమేఘ ప్రభం శ్యామం తేక్ష చైవ గర్దభరుధ ఘోరదంశా కరాలస్యం పినొన్నత పయోధరమ్ సుఖ ప్రసన్న వదన స్మేరన్న సరోరుహం ఏవం సచియంటాయెత్ కాళరాత్రిమ్ సర్వకం సమృద్ధిదాం
*కాళరాత్రి దేవి స్తోత్రం :*
హిమ కాళరాత్రి శ్రీమ్ కరలి చా క్లిం కల్యాణి కలావతి
కలమట కళిదర్పధ్ని కమదిష కుపాన్విత క్లీమ్ హ్రీం శ్రీం మంత్రవర్లేన కలకంటకాఘటిని
కమాబిజాజపండ కామబీజస్వరూపిణి
కుమతిఘ్ని కులినర్జినషిని కుల కామిని
కృపమాయి కృపదర కృపాపర కృపగము
🙏 *శ్రీ మాత్రే నమః*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment