🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...
*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
```
*నిత్యకర్మకు ఫలితం ఉండదు.
*రోజూ స్నానం చేయడం, రోజూ పూజా మందిరం శుభ్రం చేయడం, వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు. చేయకపోతే దోషాలుంటాయి.
*రోజూ ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు.
*నైమిక్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథినాడు చేసేటటువంటి పని.
ఆ తిథినాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది.
*దీపావళి పండుగనాడు తెల్లవారు ఝామున తలస్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినట్లే. ఎందుకంటే గంగ ఆ రోజున భూమండలంలో అన్ని నీళ్ళల్లోకి వస్తుంది.
అందుకని ’జలే గంగా’, ’తైలే లక్ష్మీ’ - ఒంటికి నూనె రాసుకుంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆరోజున.
అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నైమిక్తిక తిథినాడు చేసేపనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి.
*నిత్యం చేసే కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం.
కాబట్టి నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు. నైమిక్తిక కర్మ పరమ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం.
ఇదీ నిత్యకర్మకీ, నైమిక్తిక కర్మకీ తేడా.✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment