A Lesson Every Parent Must Learn — Khalil Gibran #subscribe #subscribemychannel #shorts #philosophy
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_oNKzsX5zf4
Transcript:
(00:07) ఒక తండ్రి తన కొడుకుని చూసి ఇలా అనుకుంటాడు వీడు నా కొడుకు వీడు నా బ్లడ్ [సంగీతం] కానీ ఖలీల్ జిబ్రాన్ ఒక మాట చెప్పాడు. మీ పిల్లలు మీ సొత్తు కాదు అంటే పిల్లలు మీ ఇంట్లో పుట్టారు. మీ వల్ల ఈ లోకంలోకి వచ్చారు. [సంగీతం] కానీ వాళ్ళు మీకోసం పుట్టలేదు. ఈ విషయం చాలా మంది అర్థం చేసుకోరు. మీరు వాళ్ళకు జన్మ ఇచ్చారు.
(00:28) అంతే వాళ్ళ జీవితానికి యజమాని మీరు కాదు పిల్లవాడు మీ ఆస్తి కాదు [సంగీతం] మీ ఇష్టం వచ్చినట్టు నడిపించే బొమ్మ కాదు అతనికి తన ఇష్టం ఉంటుంది. తన ఆలోచనలు ఉంటాయి. తన జీవితం ఉంటుంది. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు. వాడు నా కొడుకు నేను చెప్పిందే [సంగీతం] చేయాలి అని ఆమె నా కూతురు నేను అనుకున్నట్టే ఉండాలి అని కానీ ఖలీల్ జిబ్రాన్ చెప్పేది వేరే.
(00:48) [సంగీతం] పిల్లలకు కూడా వాళ్ళ సొంత జీవితం ఉంటుంది. వాళ్ళ సొంత కలలు ఉంటాయి. వాళ్ళు ఎలా జీవించాలో చివరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. తల్లిదండ్రులు చేయాల్సింది దారి చూపించడం ప్రేమ ఇవ్వడం మంచి విలువలు [సంగీతం] నేర్పించడం అంతే ఖలీల్ జిబ్రాన్ ఒక అందమైన పోలిక చెప్పాడు. తల్లిదండ్రులు విల్లు లాంటివారు పిల్లలు బాణాల లాంటివారు విల్లు పని బాణాన్ని ముందుకు పంపడం అంతే [సంగీతం] బాణం ఏ దారిలో వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలి అది బాణం ప్రయాణం అలాగే తల్లిదండ్రుల [సంగీతం] పని పిల్లలకు మంచి పెంపకం ఇవ్వడం మంచి విలువలు నేర్పించడం ధైర్యం ఇవ్వడం [సంగీతం] కానీ వాళ్ళ జీవితాన్ని పూర్తిగా
(01:26) నిర్ణయించడం కాదు చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడే పొరపాటు చేస్తారు ఇదే చదువు [సంగీతం] ఈ ఉద్యోగమే చెయ్ నేను చెప్పిందే విను అని పిల్లల జీవితాన్ని తమ చేతుల్లో పెట్టుకోవాలని చూస్తారు. కానీ [సంగీతం] ప్రతి పిల్లవాడికి తనకు నచ్చిన దారి ఉంటుంది. తన సొంత కల ఉంటుంది. తన [సంగీతం] జీవితం ఉంటుంది. విల్లుతో బాణాన్ని ఎప్పటికీ పట్టుకొని ఉంచలేరు.
(01:46) అలాగే [సంగీతం] పిల్లల్ని కూడా జీవితాంతం మీ ఇష్టానుసారం నడిపించలేరు. వారికి దారి చూపండి. [సంగీతం] కానీ వారి దారిని మీరు ఎంచుకోకండి. బాణం వేగంగా వెళ్లాలంటే విలుకాడు ముందుగా విల్లును వెనక్కి లాగుతాడు. అలాగే ఒక తండ్రి కూడా బలంగా ఉండాలి. బాధ్యత నుంచి పారిపోకూడదు. పిల్లలకు ధైర్యంగా అండగా నిలవాలి కానీ ఆ బలం పిల్లలను కట్టిపడేయడానికి కాదు [సంగీతం] వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇదే చాలా మంది గుర్తించలేని తేడా పిల్లలను గట్టిగా పట్టుకోవడం బలం కాదు సరైన సమయంలో వాళ్ళను నమ్మి ముందుకు పంపించడం నిజమైన బలం నా బిడ్డ తన దారిని కనుక్కోగలడు అనే నమ్మకం ఉండాలి. అలాంటి
(02:23) నమ్మకం ఉన్న తండ్రి [సంగీతం] పిల్లల జీవితాన్ని నియంత్రించడు. వాళ్ళ జీవితానికి బలమైన పునాది మాత్రమే వేస్తాడు. అదే ఖలీల్ జిబ్రాన్ చెప్పిన తండ్రి ప్రేమ. బంధించే ప్రేమ కాదు ఎదిగేలా చేసే ప్రేమ. ఖలీల్ జిబ్రాన్ చెప్పిన సందేశం ఇదే. మీ పిల్లవాడు [సంగీతం] మీ కలను నెరవేర్చడానికి పుట్టలేదు. మీకు దొరకని జీవితాన్ని జీవించడానికి పుట్టలేదు.
(02:46) మీ పేరు నిలబెట్టే సాధనం కూడా కాదు. అతను [సంగీతం] జీవితం పంపిన ఒక బాణం. తన దిశలో తన వేగంతో తన గమ్యం వైపు ఎగరాల్సిన బాణం. మీ పని [సంగీతం] ఆ బాణాన్ని ఆపడం కాదు. దానికి బలం ఇవ్వడం, ధైర్యం ఇవ్వడం, ప్రేమ ఇవ్వడం అంతే [సంగీతం] ఎందుకంటే పిల్లలను సొంతం చేసుకునే తండ్రి గొప్పవాడు కాదు. పిల్లలను స్వేచ్ఛగా ఎదగనిచ్చే తండ్రే [సంగీతం] నిజమైన తండ్రి.
No comments:
Post a Comment