Wednesday, August 5, 2026

What is Spiritual Ego? | Material Ego vs Spiritual Ego | Himalayan Yogi Sadanandagiri Maharaj

What is Spiritual Ego? | Material Ego vs Spiritual Ego | Himalayan Yogi Sadanandagiri Maharaj

Author Name:Sree Souravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ulrYxiv1djI



Transcript:
(00:18) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ సౌరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరొక్కసారి మన అదృష్టం సంత సదానందగిరి మహారాజ్ వారు హిమాలయ యోగి వారు రుద్ర ప్రయాగవాసి వారు మనతో ఎంతో జ్ఞానాన్ని పంచుకుంటూ ఉన్నారు మరొక్కసారి వారితో సజ్జన సాంగత్యం చేసే మహాభాగ్యం కలిగింది.
(00:45) నమస్కారం బాబా హరిం బాబాగారు చాలామందిలో చూస్తున్నప్పుడు ఉద్యోగ రీత్యా కానియండి జీవితంలో ఉన్నప్పుడు భౌతికమైనటువంటి విషయాల్లో వాళ్ళు అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఆధ్యాత్మిక అహంకారం అని చెప్తూ ఉంటారు. ఈ భౌతిక అహంకారము ఆధ్యాత్మిక అహంకారం ఒకటేనా అలాగే ఆధ్యాత్మిక అహంకారం అంటే ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి ఎలా బయట పడాలి ఆధ్యాత్మిక అహంకారం అంటే ఏంటి భౌతిక అహంకారం ఆధ్యాత్మిక అహంకారం ఒకటేనా గం గణపతయే నమః ఐయం సరస్వతయే నమః శ్రీ గురుభ్యో నమః మా గురువు గారైనటువంటి మహంతి హేమాల గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనసులో
(01:30) తలుచుకొని నిరవి టీవీ నుంచి సౌరవి టీవీ గా మారబోతున్నటువంటి ఈ మధుర క్షణాలలో మళ్ళీ ఆ సౌరవి టీవీ పేరు మీద మొదటి ఇంటర్వ్యూగా మేము మళ్ళీ పానుగోవడం మాకు మహర్భాగ్యంగా ఉంది. అహంకారము సృష్టి ఆదిలో నుంచే అహంకారం అన్న పదం ఒకటి వస్తుంది. ఏమీ లేని దానిలో నుంచి వ్యక్తము అవ్యక్తము నుంచి వ్యక్తము వ్యక్తము తర్వాత నుంచి అహంకారం అనేది వస్తుంది అని అంటారు.
(02:04) ఆ అహంకారం సత్వతమో రజోగుణ సంబంధముగా మళ్ళీ మారి మళ్ళ తర్వాత తర్వాత తర్వాత సృష్టిక్రమం అహంకారము అంటే ఒక మనిషి ఇంకా నాకన్నా గొప్పవాడు లేడు అనుకునే స్థాయికి చేరుకున్నప్పుడు దాన్ని సాధారణ అహంకారం అంటాం. ఒక ఉద్యోగం ఉంటాడు తన పై ఆఫీసర్ దగ్గర మెప్పు పొందేదానికి మెప్పు పొందాడు అంటే తన చిన్న ఉద్యోగులు పక్కన ఉద్యోగుల అందరితో నేను చూడు మీకన్నా గొప్ప అని అనుకోవడం అహంకారం వస్తుంది లౌకికం ఇలానే ఆధ్యాత్మికంలో కూడా ఒక స్థాయికి చేరిపోయినాక ఇంకా నాకంతా తెలుసు అని ఎప్పుడైతే ఎవడైనా అనుకుంటాడో అప్పుడు వాడిని మేము ఆధ్యాత్మిక అహంకారి
(02:49) అనేసే పదంతో పిలుస్తాం మా ఉత్తరాదిలో ఇది ఎక్కువ మా దిక్కు మనుషులే కొంచెం కోపంగా ఉంటారు మాటలు కరుగా ఉంటాయి అది వేరే కానీ నాకే అంతా తెలుసు మిగతా అందరూ నాకన్నా తక్కువ అని ఎవడైతే భావిస్తూ ఉంటాడో వాడిని మేము ఆధ్యాత్మిక అహంకారి అని అంటాం. అది సహజంగా కొంతమందికి ఒక స్టేజ్లో ప్రతి ఒక్క సాధకుడికి వస్తుంది. ఒ గురువు దగ్గర ఉన్నటువంటి 10 మంది శిష్యుల్లో ఓ గురువు ఒక శిష్యుడి మీద కొంచెం అభిమానం ఎక్కువ చూపిస్తే ఆ శిష్యుడికి ఆ అహంకారం అనేది వస్తుంది.
(03:28) మహా మహా గొప్పవాడైనటువంటి మహాభారత వీరుడు ద్రోణాచార్యుడు ఆయనకు కూడా ఆధ్యాత్మిక అహంకారం ఒకసారి తగిలింది. ఆ తగిలిన పాపానికే ఏకలవీడి దగ్గర ఏలు తీసుకోవడం ఆ పాపానికి చేతిలో ధనుర్బాణాలు ఉన్నంతవరకు చావు లేని మహావాడైనటువంటి ద్రోణాచార్యుడు పతనానికి కారణమే. కారణం ఆధ్యాత్మిక అహంకారం. ఆ కథ ఏంటి బాబా ద్రోణుడు దృపదుడు ఒకప్పుడు విద్యాభ్యాసం చేసుకుంటూ ఉన్నప్పుడు గురుకులంలో సహ విద్యార్థి తర్వాత దృపదుడు రాజయపోయినాడు రాజకులస్తుడు ఈయన మామూలుగా బయటిక వచ్చాడు జీవిక కష్టమైంది కృపాచార్యుని చెల్లెలు కృపిని
(04:16) పెళ్లి చేసుకున్న తర్వాత అశ్వద్ధామకు పాలిచ్చేదానికి కూడా లేని పరిస్థితి ఆవు లేని స్థితి ఇప్పుడు నా సహవిద్య విద్యార్థి అయినటువంటి వాడు రాజుగా ఉన్నాడు కదా వాడి దగ్గరికి పోయి కొన్ని ఆవులు అడుగుతాము అని వెళ్ళాడు అక్కడ పాటించాల్సిన ఒక ధర్మం పాటించాలి సభలో రాజు కూర్చొని ఉన్నప్పుడు హే రాజన్న అనాల్సిందే తప్ప ఎంత ప్రాణ స్నేహితుడైనా ఏరా బాగున్నావా అని అనకూడదు.
(04:45) ఈయన ఎక్కడ ఆ మాట అన్నాడు. దృపదుడికి వచ్చినోడు తన మిత్రుడు అని తెలిసిన సాయం చేయాలని ఉన్న సభా మర్యాద భంగం జరిగింది అన్న బాధతో కోపం వచ్చి నువ్వు ఎవడో నాకు తెలియదు పో అన్నాడు. నిండు సభలో నన్ను అవమానించావు నిన్ను నేను ఓడగొడతాను అని మనసులో ఒక ప్రతిజ్ఞ పెట్టుకున్నాడు. పాండవులప్పుడు కౌరవులు చిన్న పిల్లలు అబ్బంతి బావిలో పడడము ఈయన తీయడము ఈయనను కృపాచార్యుడు మాకు గురువుగా ఉండని భీష్ముడు చెప్పి వీళ్ళద్దరికీ కుల గురువుగా పెట్టాడు.
(05:20) దాంట్లో అర్జునుని ఈయన బాగా గమనించాడు. లోకైక వీరుడు అయతాడు విద్యాభ్యాసం అంతా అయిపోయినాక కౌరవులు అడుగుతారు గురుదక్షణగా ఏమి ఇస్తామ ఏం కావాల ఆ దృపద రాజును ఓడిచ్చి బంధించి నా దగ్గరికి తీసుకురండి అంటాడు. కౌరవులు పోతారు ముందు వీళ్ళు అహకారులే దృపదుడు తక్కువడేం కాదు వాళ్ళను కొట్టి పంపిస్తుంది అప్పుడు పాండవుల్లో భీమార్జునులు ఇద్దరైపోతారు అర్జునుడు తన ధనుష్ కౌశలంతో వాడిని ఓడిచ్చి బంధించి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడేస్తాడు ఏమయ్యా దృత మహారాజా నా కళ్ళ దగ్గర ఎందుకు పడ్డావు నీ రాజ్యం పోయింది ఇప్పుడు నాదఅది నా శిష్యుడు జయించి
(06:03) తీసుకొని వచ్చాడు నేను ఇప్పుడు నీకు ఇచ్చేస్తాను స్నేహిత ధర్మంగా తీసుకో అంటాడు. ఈ అవమానాన్ని దృపదుడు పగలో పెట్టుకుంటాడు. నన్ను ఇంత ఇచ్చేశడు ఆ ద్రోణుని చంపేలాంటి వీరుడు నాకు పుట్టాలి నన్ను ఓడిచ్చిన ఈ అర్జునుడు నాకు అల్లుడు అయ్యేటట్లు నాకు పుత్రిక కావాలి అని యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో నుంచే దృష్టమ్యుడు ద్రౌపది ఇద్దరు యజ్ఞ సంభవం అంటే ఒక్క అహంకారం ఎంత పెద్ద కథ నడిచేదానికి కారణభూతమైంది.
(06:39) ఈ పక్క దృపదుడేమో పాండవుల దిక్కు ఉండిపోయాడు. ద్రోణాచార్యుడు ఆ పక్క ఉండిపోయాడు. దృష్టదిడు పుట్టిందే అందుకు ఈయన అస్త్ర సన్యాసం చేసి అశ్వద్ధామ అతః అని చెప్పినాక అస్త్ర సన్యాసం చేసి కూర్చొని అప్పటికే ఆయన ప్రాణాలు వెళ్ళిపోయాయి. కపాల మోక్షం అయిపోయింది కానీ ఈయన స్థిరచ్చేదనం చేస్తాడు. అర్జునుడే వద్దని తిడుతాడు తప్పు ఒ గురువు అస్త్ర సన్యాసం చేసినవాడిని చంపకూడదు ఆయన ముందే చచ్చిపోయాడు చంపకూడదు అయినా వీడు పోయి వీడు పుట్టిందే ఎందుకు ఆ తల తెగ కొట్టేస్తున్నారు ఒక్క చిన్న అహంకారం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి ఎక్కడికి పోయి ఎంతెంత దూరానికి
(07:19) పోయింది గురువులలో కూడా చాలామందిలో అహంకారం అనేది ఉంటుంది. ఉండాలి కూడా అట్లా లేకపోయినప్పుడు నేను నువ్వు సమానమే అన్నప్పుడు గురు శిష్య బాంధవ్యం అనేది సరిగ్గా నడవదు. నేను గురువే గురువుగానే ఉండాలా నువ్వు శిష్యుడు శిష్యుడిగానే ఉండాలా నువ్వు ఉత్తమ శిష్యుడిగా మారినాక నా గురు స్థానానికి నువ్వు రావాలా నాక నిన్ను మించిన గురువు కావాల అని గురువు ఎప్పుడు మనసులో అనుకుంటుంటాడు.
(07:49) కానీ ఉత్తమ శిష్యుని తయారు చేయాలంటే కొంచెం అహంకార ప్రదర్శన చేసినప్పుడే ఆ గురువు శిష్యుడు కంట్రోల్ లో ఉంటాడు. కొద్దివరకు అవసరం అది మితిమీరిపోయి నాకే అంతా తెలుసు నన్ను అందరూ ఇట్లా అనాలా నన్ను అందరూ అట్లా అనాలా అనే స్థితిలోకి పోతే అది ఆ అహంకారం వాళ్ళనే దెబ్బతీస్తుంది. మనిషిని దెబ్బ తీసేది బయటిది ఎక్కడో కాదు వాడి అహంకారమే వాడిని దెబ్బతీస్తుంది.
(08:19) రావణాసురుడికి లేనిదేమి సాక్షాత్తు బ్రహ్మవంశ సంజాతుడు సకల వేద విద్యా పారంగతుడు సంగీత పారంగతుడు లక్షల వయసు ఉన్నటువంటి వాడు నన్ను ఎవరఏం చేస్తారు నేను ఏం చేసినా సరే అనే ఒక ఆ అహంకారం అది రాజసిక అహంకారం అంతటి రావణాసురుడు 43 ఏళ్ల రాముని చేతిలో చనిపోవాల్సి వచ్చింది. దాని వెనకల శాపాలు కారణాలు అయన్నీ వేరే కానీ ప్రతి ఒక్కడు తన ముందు చచ్చిపోతున్న మహా మహా సైన్యధ్యక్షులను 100 మందిని పంపిస్తాడు.
(09:01) సొంత తమ్ముడు పోతాడు కొడుకు పోతాడు ఇంద్రజిత్ ఎవ్వరూ మిగలకుండా లాస్ట్ వరకు కూడా అహంకారాన్ని పోగొట్టుకు ఆఖరికి కుంభకర్ణుడు పోయే ముందర అన్నా నువ్వు చేసింది తప్పు ఇప్పుడైనా ఛాన్స్ ఉంది నువ్వు వెళ్లి సీతమ్మను అప్ప చెప్పేస్తే రాముడు క్షమిస్తాడు అని అంటాడు. నేను ఇంతా చేసి ఇంతా పోగొట్టుకొని నా కొడుకే పోయినాడు ఇప్పుడు నేను తగ్గేది పోతే నేను కూడా పోతాను తప్ప నేను వదలను అంటాడు అహంకారం మనిషిని అంత గట్టిగా పట్టేస్తుంది.
(09:35) అహంకారాన్ని ఒకసారి గుర్తుంచుకోగలిగితే నన్ను ఎవరేమో అన్నారు నా మాట విన్నంతవరకు వాడు మంచోడు ఆహా ఓహో నాకు వ్యతిరేకంగా కొంచెం రాంగానే వాడు తడ్డ వాడు అన్నది తప్పు వాడు ఏం మాట్లాడినా తప్పే కనబడుతుంది. ఎందుకంటే [గురకలు] ఇక్కడ మనలో కూడా కొంచెం ఆ అహంకారం అనేది లేసింది. ఎవరిలో ఏ రూపంలో ఎప్పుడు అహంకారం పైకి లేస్తుందో అది వాని పతనానికి కారణభూతం అయింది.
(10:09) అయితే సాధన చతుష్టయాలు అంటారు కదా సాధన చేతుయాలు మనసు బుద్ధిగా మారుతుంది బుద్ధే చిత్తముగా మారుతుంది చిత్తం మనసు అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ మనసు ఎప్పుడు ఏ ఇదిగా మారుతుంది అంతా మనసే అంటారు మనసులోనే ఈ నాలుగు ఉన్నాయి అంటారు ఎలా ఈ సాధనా చతుష్టయ అందుకే మనసుకు ఇంకో పేరు అంతఃకరణము కరణములు అనలేదు అంతఃకరణము అనే ఏకవచనమే వాడారు అక్కడ ఉన్నది ఒక్క మనసే సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు దాని పేరు మనస్సు ఏది చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని నిశ్చయాత్మకమైనటువంటి ఆలోచనలు చేసేటప్పుడు దాని పేరు బుద్ధి
(10:53) గత జన్మల సంస్కారాలను పట్టి ఇట్లాగనే చేసి తీరాలని తోస్తూ ఉంటుంది ఒకటి అది చిత్తం చిత్త ప్రవృత్తి అంటారు నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు దాని పేరు అహంకారం అహం ఆకారం [గురకలు] అందుకే నేను చాలా చోట్ల చెప్తుంటాను అహంకారంతో ఉండద్దండి అహం భావంతో ఉండండి అహం భావం అన్నా అహంకారం అన్నా ఒకటే అర్థం అనుకుంటారు. చీమకు ఏనుగుకు ఉన్నంత వ్యత్యాసం ఆకారాన్ని చూపించుకుంటూ చెప్పేది అహంకారం నిన్ను పొగిడినంత సేపు నువ్వు మంచిగా ఉండి నిన్ను ఏదో నీలో ఉన్న ఒక్క లోపాన్ని ఎత్తి
(11:38) చూపించినప్పుడు వెంటనే నువ్వు వాళ్ళు చెడ్డోడు అనే రిటాక్ట్ కావడం అహంకారం ఎందుకంటే నన్ను వాడు అన్నాడే నేను ఈ నేను అనడంతోనే అహంకారం మొదలైింది అహంకారం కానీ అహం భావం అహం అంటే అనే అచ్చు అక్షరాల దగ్గర నుంచి మొదలు పెడితే హల్లులలో హ అంతం ఆ హ అంటే అక్షరం అక్షరాలు అక్షరాలు అంటే ఏంటి క్షరములు లేనటువంటివి ఆ క్షరములు లేని ఆత్మ స్వరూపం నాలో ఉంది అన్న భావనతో ఆ అహం భావనతో ఉన్నప్పుడు అహం నేను అక్షర పురుషున్నని
(12:24) అన్న భావనతో ఉన్నప్పుడు అహంకారం మన దరి చేరే అవకాశమే లేదు. ఎందుకంటే ఉన్నది ఇదే ఆత్మ ఇదే ఆత్మ సర్వాత్మ ఎదురుగు మనిషిలో ఉన్నది అదే ఆత్మ ఇంతవరకు నువ్వు పొగిడింది అదే ఆత్మను నీకు వ్యతిరేకమైపోయిన వెంటనే తివిమర్శించేది అదే ఆత్మను ఎవరిని విమర్శిస్తున్నావ్ ఎక్కడ మొదలైతుంది అక్కడ అహంకారం మొదలైంది అని అనుకుంటున్నామే ఇంకొకడిని అహంకారి అని చెప్తున్నావ అంటే నీలో కూడా అహంకారం మొదలైనట్లు ఒక మనిషి ఇంకో మనిషిని వాడు అట్లా నన్ను అన్నాడు వాడు అన్నాడు కాబట్టి నేను అన్నాను ఈ మాట అంటాడు మరి వాడికే అహంకారం అని చెప్పి చెప్పి వాడు నన్ను అన్నాడు
(13:09) అనేసి ఒక మనిషిని చులకన భావంతో ఆయన అనాల్సిన చోట వాడు అనగలుగుతాండమ అంటే మనలో ఆ అహంకార స్థాయి వచ్చినప్పుడే కదా మనం అనగలుగుతాడం అంతా సమానం అన్నట్టు అంటే ఎక్కడ మానవుడిలో ఒక లోపం అంటే తనకు అనుకూలంగా అన్ని జరుగుతున్నప్పుడు అంతా ఎంత మంచోళ్ళు తన మాట కాదన్నట్లుగా నువ్వు తక్కువ అని నువ్వు చేస్తున్నది తప్పు అని ఎత్తి చూపించిన వెంటనే వాడు మనకు చెడ్డవాడు.
(13:40) ఈ భావన ఎందుకు వస్తుంది నీలో కొంచెం ఏ మూలం ఇంకా అహంకారం ఉంది. నా బుద్ధికి ఇట్ల తోచింది ఆయన బుద్ధికి అట్లా తోచింది వాడు అట్లా అనుకుంటున్నాడు ఆయన అట్లా అనుకుంటాడో సరే ఆయనది ఓకే ఆయన దృష్టితో చూస్తే అది ఓకే ఆయనకు నీ దృష్టితో చూస్తే నీకు ఓకే అయింది. నీ దృష్టికి సరి కానంత మాత్రం చేత ఆయన చెప్పింది తప్పు రైటు అనేదానికి లేదు.
(14:05) ఆ విచక్షణ స్థాయికి పోయినప్పుడు ఎవరిని మనం ఇంకోళ్ళను విమర్శించము ఇంకోళ్ళు మనల్ని విమర్శిస్తే కూడా విమర్శను మనం తీసుకోం. ఎప్పుడైతే మనం విమర్శ తీసుకోకుండా పోతామో మనలో అహంకారం తగ్గిపోయి అహం భావం పెరిగిపోతా వస్తుంది. సాధన చేసేటప్పుడు ఒక సిద్ధుల వైపు వెళ్తాం కదా బాబా సిద్ధులు కానీ కొన్ని మనం అన్న మాటలు కానీ జరుగుతూ ఉంటాయి.
(14:34) జరుగుతున్నప్పుడు తెలియకుండానే నేను అంటే వచ్చేస్తుంది ఇదే అహంకారం వచ్చేస్తుంది నేను అంటే అవుతుంది లేకపోతే నేను చెప్తే అవుతుంది అనే దాని మీద వెళ్ళిపోయి కొన్ని ప్రామిసులు చేస్తూ ఉంటారు అంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో కర్మ అనుభవించాలి వాడికి ఏదో రోగం రూపంలోనో ఏదో రూపంలో ఉంటుంది. ఆ నీకు రోగం తగ్గుతుంది నేను ఉన్నాను కదా అంటారు. ఆ రోగాలు వీళ్ళకు వచ్చిన సందర్భాలు కూడా నేను కొన్ని గమనించాను.
(15:04) అవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఎందుకు దీంట్లో శక్తి ఎలా మార్పు జరుగుతుంది ఒకొకరి నుంచి ఒకరి ప్రాణశక్తి ఎలా ట్రాన్స్ఫర్ అయి వాళ్ళ కర్మ వీళ్ళు అనుభవించేటట్టు ఎలా జరుగుతుంది అహంకారంతో ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు నా వరకు నాకు తెలిసి 1950స్ ప్రాంతం వరకు ఇటువంటి శక్తి ప్రసరణ ఇంకొకళ్ళది తీసుకోగలిగిన స్థాయి సాధనలు ఉండేటివి లైక్ రమణ మహర్షి అరవిందో అరవిందో కూడా జబ్బు పడ్డాడు అంటే ఇంకొకళ జబ్బులు తీసుకొని పడ్డాడు.
(15:40) రమణ మహర్షికి క్యాన్సర్ రావడానికి కూడా ఎంతో మంది వేరే కథ చెప్తారు. ఆయన అతి ఇష్టుడైన మనిషికి రావాల్సిన దాన్ని ఈయన తీసుకొని ఆయన బాగపెట్టాడు. ఈ తీసుకోవడం అంటే ఏంటి ఒక మనిషి అత్యంత ప్యూర్ గా ఉండుకుంటూ ఉన్నప్పుడు తన ఆరా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. తన లోనిచ్చి కొంచెం ఆరాను అక్కడికి సప్లై చేసేస్తాడు.
(16:07) ఈ మంచి ఆరా అక్కడ పోయినాక అక్కడఉన్న బ్యాడ్ ఆరా ఉండలేక బయటికి వస్తుంది. అది వచ్చినాక ఎక్కడికి రావాల ఇక్కడ ఆరా తగ్గింది అని ఆ నెగటివ్ ఆరా ఇక్కడ వచ్చి పాజిటివ్ లో చేరుకుంటుంది. అది అందరికీ సప్లై చేయరు. అది కూడా ఆ రెండు ఈ రెండు జీవుల మధ్య ఈ ట్రాన్స్మిషన్ జరిగిన ఇద్దరు జీవుల మధ్య జన్మ జన్మల బంధం ఉండి ఆయనకి ఇంకా బతకాల్సి ఉంది ఆ రోగంతో ఆయన చావకూడదు ఈయన చావాలని రాసి పెట్టి ఉన్నప్పుడు ఆ ట్రాన్స్మిషన్ అనేది జరిగిపోతా ఉంటుంది.
(16:42) అక్కడ సంకల్ప శక్తి పనిచేస్తుంది. సంకల్ప శక్తితో తన ఆరాను అక్కడ పంపుతారు. ఆరా మీకు తెలిసిన సంగతే ఆరా ఎంత ప్యూర్ గా ఉంటే మనిషి అంత ప్యూర్ గా ఉంటాడు. ప్రతి మనిషికి ఆరా అతని చుట్టూ ఒక ఆరు అంగుళాల ఎక్స్ట్రాగా ఉంటుంది నార్మల్ మనుషులకు సాధకులకు ఒకటి రెండు అడుగులు ఉంటుంది. మహా మహా వాళ్ళకు కొన్ని వందల అడుగులు కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంది.
(17:08) ఈ ఆరా మిషిన్లు వచ్చిన కొత్త కాలంలో పుట్టపర్తి సాయిబాబాను ఆరా టెస్ట్ చేయాలని ఆయన పర్మిషన్ తీసుకున్నారు. ఆయన నవ్వి నా ఆరా కొలత ఏముంది నాకు ఆరానే లేదు అన్నాడు ఆయన నిగూడంగా చెప్పాడు అంటే నా ఆరా నువ్వు కొలవలేవు అని చెప్పాడు. ఈయన వినకుండా నేను చూస్తాను అన్నాడు. ఆ మిషన్లో 200 300 600 అడుగులు పోతానే ఉంది అది ఆ మిషన్ పరిధి అయిపోయింది.
(17:38) ఆయన ఆర పోతాను పుటపర్తి సాయిబాబు అది అది యశంతహాలు కట్టిన కొత్త టైంలో ఒకాయనతో జరిగిన రియల్ సంఘటన ఆయన ఆశ్రమంలో వాళ్ళు ఎందుకు అట్లా ఉండగలుగుతారు మరి సాయిబాబాకు లక్షల కోట్ల మంది భక్తులు కోటేశ్వరుడు భక్తులు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు రాష్ట్రపతి కూడా దీని శంకరదయాల్ శర్మ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు మరి ఆయనక ఎంత అహంకారం ఉండాలా ఒకవేళ ఆయన గనుక అహంకారం ఉంటే ఈ ఆకర్షణ శక్తి ఈ సంకల్ప శక్తి ఆయనలో నుంచి పక్కకు పోతుంది.
(18:16) ఈ అరలో ఏదో ఒకటి ఉండగలుగుతుంది అహంకారం అనేది ఉన్నప్పుడు ఈ మిగతా పవర్స్ అన్నీ పక్కకు పోతాయి. అది పవర్ ఉపయోగించడం కాదు ఒక మంచి సత్సంకల్పంతో వాడితో ఇంకా లోకంతో పని ఉంది. వాడు దాన్ని తట్టుకోలేడు. ఐ కెన్ అని చెప్పేసి తీసుకుంటారు. ఆ తీసుకున్నది ఒక్కొకసారి వీళ్ళకు ప్రాణాంతకం అయిపోతుంది. రామకృష్ణ విషయంలో వేరే ఆయన ఎవరిది తీసుకోలేదు ఎవడు పెట్టలేదు ఆయన కర్మను గమనించాడు.
(18:51) తాను ఇంతకుముందు చేసిన కర్మలు ఈ జన్మలోనే పరిపక్వం చేసుకోవాలా అని దాన్ని మాన్పాల అనుకుంటే మానుకోగలడు ఆయన. అమ్మవారిని అడిగితే అమ్మ మానేస్తుంది మనిపించేస్తుంది కానీ ఆయన దానికి పోలేదు. ఈ జన్మలోనే ఆ కర్మను అనుభవించాల అన్నాడు రమణ మహర్షి కూడా అలా విన్నారు కానీ నాకు తెలిసి రమణ మహర్షి భక్తుడు ఒకళ చెప్పిన దాని ప్రకారం రమణునికి అత్యంత ఇష్టమైన ఒకాయనకు రావలసిన ఆ క్యాన్సర్ను రమణమూర్తి రమణ గారు తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనేసి ఒక వినికడి అయితే సాధనలో సిద్ధత్వం సాధనలో బుద్ధత్వం సిద్ధికి బుద్ధికి వ్యత్యాసం ఏంటి ఒక వ్యక్తి బుద్ధి పరిపక్వత చెందాడు సాధనలో
(19:38) పరివర్తన చెందాడు బుద్ధిపరంగా ఒక వ్యక్తి సిద్ధులను పొందాడు బుద్ధి సిద్ధి అనేది అంటే వినాయకుడికి సిద్ధి బుద్ధి సైత వినాయకుడు ఈ రెండు ఒక వ్యక్తి దగ్గర ఉండవు రెండు ఉంటే వాళ్ళు మహాత్ముడు అవుతాడు అంటే ఎంత పెద్ద గురువైనా ఎవరైనా సిద్ధత్వాన్ని బుద్ధత్వాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి బుద్ధే ప్రధానం బుద్ధి బాగున్నప్పుడే సిద్ధులు కలుగుతాయి బుద్ధిని సరైన రీతిలో ఉపయోగిస్తే [నవ్వు] సిద్ధులు కలుగుతాయి.
(20:10) ఆ కలిగిన సిద్ధులను బుద్ధి ఉపయోగించి సత్కర్మలకు ఉపయోగిస్తే క్షేమము లాభము అదే వినాయకుడి కాన్సెప్ట్ ఆయన కొడుకుల పేర్లు క్షేమము లాభము సిద్ధి బుద్ధి భార్యలు ఆయన పేరేమో వి నాయకుడు ఇంకో నాయకుడు లేనివాడు గణాలకు అధిపతి గణాలు అంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోప మదమోహ మాత్సర్యాలు ఈర్షా ద్వేష అసూయాలు ఇన్నీ మనలో ఉన్న గణాలు ఈ గణాలు అన్నిటికీ ఆయన అధిపతిగా ఉండి బుద్ధిని ఎక్కువ వాడాడు కాబట్టి ఆయనకు సిద్ధులు కలిగాయి.
(20:46) ఎటువంటి సిద్ధులు కలిగాయి క్షేమము లాభము భగవద్గీతలో కృష్ణుడు యోగ క్షేమం వహమ్యహం అంటాడు. క్షేమం అంటే ఏంటి మీ దగ్గరికి మీరు అనుకోకుండానే ఒక వస్తువు వద్ది మీ దగ్గర ఉండిపోవడం ఆ ఉన్న వస్తువు మళ్ళీ వెళ్ళిపోకుండా ఉండడం లాభం క్షేమం లాభం లాభం వచ్చింది వచ్చిన లాభం ఖర్చయపోకుండా మీ దగ్గరే ఉన్నప్పుడు అది క్షేమం ఆ వినాయకుడికి ఆ పేర్లు అట్లా పెట్టారు.
(21:21) మన బుద్ధిలు ఏంటంటే మనం పెళ్లిళ్లు చేసుకొని అల్లాడుతున్నాం కాబట్టి పెళ్లి లేని దేవుళ్ళకు కూడా పెళ్లిళ్లు పెట్టేస్తాం. వల్లి దేవసేన కళ్యాణం అంటారు. ఆయన దేవతల సైన్యానికి అంతా అధిపతి అందుకని పెద్ద భార్య పేరు దేవసేన తారకాసుర సంహారం జరగాల అంటే శివకుమారుడికే కావాల ఆ శివకుమారుడికి సమస్త దేవతా గణాలు సైన్యధ్యక్షత ఆయనకు వహింప చేయాల గణపతి శివగణాలకు మాత్రమే అధిపతి కానీ కుమారస్వామి తారకాసుర సంహారం అప్పుడు సకల దేవతలు తానను ఆయనను సైన్యాధ్యక్షుడిగా వరించారు.
(22:02) దేవసేన పెద్దవారి వరించారు వళ్ళ దేవసేన వల్లి తిరుతలిలో తిరువన్నమలిలో ఆయన శివ క్షేత్రాల్లో గొప్ప క్షేత్రము పలని ఆయన బాల రూపంలోనే ఉంటాడు. మ్ ఆయనక అక్కడ పెళ్లి అయినట్లు లేదు. మళ్ళీ [గురకలు] ఇక్కడ వేరే వేరే క్షేత్రాల్లో పెళ్లి అయినట్లుగా చూపిస్తారు కథలు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఆయన పేరు కుమార కన్య కుమారి అనేసి కన్యకుమారి కుమారి అన్నా కన్య అన్న ఒకటే ఆమె ఎప్పుడూ 16 ఏళ్ల వయసులోనే ఉండిపోయింది కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఉండింది కాబట్టి కన్యా కుమారి అనేసి ఆ తల్లికి పేరు
(22:46) ఈయన కుమారస్వామి ఎప్పుడు కుమారుడు మరి అట్లాంటి ఆయనకు కూడా మనం ఈ రెండిటిని కలిపాం ఆ రెండిటి అనుకల నిగుడా అర్థం ఏంటంటే దేవసేన ఆయనను అల్లుకొని నిలబడింది దేవసేన వల్లి కన్యాకుమారి వచ్చింది కన్యాకుమారి లో అమ్మవారు ఆ సముద్రం నుంచి రక్షణ ఇస్తూ ఉంటే ఆ సముద్రంలో ఉండే పడవలో వచ్చే ఆ గుడిని ఆమెకున్న ఆ ముక్కు పురక ఆ అది రాత్రిపూట లైట్ హౌస్ లాగా కనపడి ఇక్కడ లైట్ హౌస్ ఉందని పడవలు వచ్చేసేటివి అంట ఆ బండరాళ్ళు గుద్దుకొని లక్షల కోట్ల సంపదలు సముద్రం పాలు అయిపోయేటివి.
(23:27) అందుకని బ్రిటిష్ వాళ్ళు దానికి ఎదురుగా గోడ కట్టాలని చూశారు. మన పంతులు ఆగమ శాస్త్రం వాళ్ళు వాళ్ళక ఒక మాట చెప్పారు. అమ్మ ఎప్పుడూ సముద్రం వైపు చూడబట్టి ఈ మూడు సముద్రాలు పొంగి ముందుకు రావడం లేదు. లేకుంటే కన్యాకుమారి అనేదే ఉండకుండా సముద్రంలో కలిసిపోతుంది. అప్పుడు అమ్మ చూస్తూనే ఉండాల మీరు గోడ కట్టకండి అన్నారు.
(23:50) మళ్ళీ గోడ కట్టకపోతే ఈ రాత్రి పూట ఈ ముక్కు పుడక వెలుగు మాకు లైట్ హౌస్ లాగా కనపడి బ్రష్టు పట్టించేస్తుందయ్యా అనిఅంటే ఉభయ తారకంగా ఈ ముక్కు పుడక వరకు గోడ కట్టారు మీరు లోపల పోయి క్యూలో లోపలికి పోయేటప్పుడు మీకు ఒక గోడ కనపడుతుంది. అమ్మవారి గుడి లోపలికి పోయేటప్పుడు ఈ ఎదురుక గోడ మన మెడ వరకు ఉంటుంది. లోపల ఉన్న విగ్రహానికి ముక్కు వరకు ఇక్కడ ఆమె స్థానంలో నిలబడి గనుక చూస్తే ఆమె కళ్ళు మాత్రమే సముద్రాన్ని చూస్తాడు ఈ ముక్కు పడక వరకు గోడ అడ్డం ఉంటుంది.
(24:22) అయితే కొన్ని క్షేత్రాలలో ఒక విచిత్రమైనటువంటి ఆగమ పరంపరలో అంటే స్థపతులు నిర్మించినటువంటి ఆలయాల్లో మనం చూసుకుంటే ఇప్పుడు కన్యాకుమారి వచ్చింది కాబట్టి పక్కనే ఉన్నటువంటి తిరుచందూరు కానియండి అలా కొన్ని ఆలయాల్లో చాలా అద్భుతం ఉంటుంది. ఆ అద్భుతమైన ఆలయాల్లో ఈ అద్భుతాలన్నీ శిల్పులు చేసినయే కదా అవి దేవతలకి ఆపాదించాలా శిల్పులకు ఆపాదించాలా ఆలయ నిర్మాణం అంటే దేవతా నిర్మాణమే కానీ ఒకచోట మనకి సుచంద్రంలో చూస్తే మనకి ఇట్లా సంగీతం సరిగమ పదస స్తంభాలు హంపీలో కూడా ఉన్నాయి
(25:08) అట్లాంటి విచిత్రమైనవి అంటే ఆ టెంపుల్ కి గొప్పతనం రావడానికి అలా నిర్మించారా లేకపోతే దేవతల గొప్పతనం అనది అక్కడ స్థల శక్తి ముందు ముఖ్యము స్థలం ఈ స్థపతులు ఏ స్థలంలో అటువంటి శక్తి ఉందో గమనించి అక్కడ ఆ శక్తిని ఇంకా ఎంచాంటి చేసేదానికి ఎటువంటి రాళ్లతో తెచ్చి నిర్మాణం చేస్తే బాగుంటుంది అని లెక్కలు వేసుకొని అటువంటి నిర్మాణాలు చేస్తున్నారు.
(25:35) అందుకే మీకు తంజావూరు బృహదీశ్వరాలయం దానికి పునాది తీయలేదు పునాది లేదు అక్కడ పైనే కట్టబడింది మొత్తం అంతా రాయి 800 టర్న్ల రాయి ఆ పైన శిఖరం మీద ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఎక్కించారు ఏది ఇదంతా సైంటిఫికల్ ప్రాబ్లం వేదమాట కానీ వాళ్ళకు అక్కడ ఆ స్థల ప్రభావం తెలుసు ఒక ముని ఋషి తపస్సులు చేసిన చోటు వాళ్లకు దేవతలు ప్రత్యక్షమైన ఆ చోటుకు ఆ స్థల ప్రభావం వస్తుంది.
(26:07) వాళ్ళు అటువంటి ప్రదేశాలలోనే ఈ ఉత్తమమైన ఆలయాల నిర్మాణాలు జరుగుతాయి. అందుకే ఇప్పుడు ఆధునికనే ఆలయాలు నిర్మించాలంటే కూడా ఆ వాస్తు ప్రదేశాన్ని మొత్తము శుద్ధీకరణ చేస్తారు. అక్కడ ఏ శక్తి లేకుండా శక్తి వచ్చేదానికి అక్కడ యజ్ఞయాగదులు చేస్తారు. అవి చేసిన తర్వాత చేస్తే ఆ గుడి ప్రాముఖ్యతలోకి వస్తుంది. కానీ ఆ గుడి అక్కడ ప్రాముఖ్యతలోకి వస్తుందని ముందే వాళ్ళకు తెలుసు ఆ స్థల శక్తి కనుక్కొని అటువంటి చోట్లనే నిర్మాణం చేస్తారు.
(26:40) ఇప్పుడు విజయనగరం దగ్గర సూర్యనారాయణ అరసవెల్లి అదంతా కట్టి ఒక 600 సంవత్సరాలే అప్పటికీ ఈ స్థాపత్య శక్తి ఎంత బాగుందో చూడండి సంవత్సరంలో కొన్ని ప్రత్యేక దినాలలో ఆ సూర్య కిరణాలు సూర్యుడి పాదాల దగ్గర నుంచి పై వరకు వస్తాయి. అంటే బయట చేసిన ఆ నిర్మాణ వ్యవహారము ఆ కిటికీలు ఆ ద్వారాలు అక్కడ ఉదయించే సూర్యుడు ఏ దిక్కు నుంచి వస్తే ఆ కిరణాలు అక్కడికి వచ్చి పడతాయో ఇవన్నీ లెక్క చూసుకున్నారు.
(27:11) అక్కడ ఆ నిర్మాణం చేశారు. వీళ్ళు చేసినాక ఆ శక్తి రాలే ఆ శక్తి అక్కడ ఉంది అని కనుక్కున్న తర్వాత అక్కడ నిర్మాణం చేస్తే ఆ శక్తి ప్రస్పుటమై బయటికి వచ్చింది. సరిగమ మండపాలు హంపీలో ఉన్నది అయితే గనుక ఆ శ్రీకృష్ణదేవరాయ మహానుభావుడు అక్కడ ఎప్పుడూ సంగీత నాట్యాలు కచేరీలు నడిపేవాడు 24 గంటలు ఆ రోజు వినపడే నాదాలు నాదాలు నాదాలు ఆ రాళ్లుు జీర్ణించుకున్నాయి అందుకనే ఆ స్తంభాలకు వచ్చాయి.
(27:46) ఆధునిక కాలంలో శ్రీ గణపతి సచ్చిదానందుల వారు ఒకసారి హంపీకి పోయి ఆ సరిగమ పందాల లాంటి స్తంభాల మండపం తన ఆశ్రమంలో మైసూరు ఆశ్రమంలో కట్టాల అని కట్టించారు. కానీ వీళ్ళు రాళ్ళతో అటువంటి నిర్మాణం అయితే చేశారు కానీ ఆ రాళ్లకు ఆ సంగీత శక్తి రాలే ఈయన అంతా నిర్మాణం అయిపోయి గుడి ఓపెన్ చేసినాక కట్టకు బట్ట కట్టి కట్టిన టంగు టంగ అంటాందగానే సరిగమ అనలే వీళ్ళంతా ఆయన్ని ఎగతాలి చేశారు.
(28:20) ఆయన అప్పుడు ఒక ఏడు రోజులు రాత్రింబవళ్ళు ఆడ ఆ మండపంలో వీణ వాయించాడు. ఏళ్ల నుంచి రక్తం వస్తున్న ఏడు రోజుల తర్వాత దాన్ని వాయించమన్నాడు అది ఇప్పుడు సరిగమ పదనిస అంటా అంటే ఒక వ్యక్తి ఒక మంచి సాధకుడు మంచి సంకల్పంతో చేస్తే రాయికి కూడా ప్రాణం వస్తుంది రాయిలో నుంచి సంగీతం వస్తుంది. మానవుని సంకల్ప శక్తి బలీయంగా ఉంటే అంత గొప్పగా ఉంటుంది ఆయన ఉత్తమమైన సాధకుడు కాబట్టి మంచి కోసం అది చేశడు అక్కడ కొంచెం అహంకారం కూడా ఉంది మళ్ళీ మీరు అన్నారు మొదటి సబ్జెక్ట్ అక్కడ లాంటిది నేను ఇక్కడ చేయాల
(29:07) అనుకున్నాడు అది పలకలే కానీ ఇది ఆధ్యాత్మిక అహంకారం దాన్ని అక్కడ రప్పింప చేయగలిగినాడు. ఎందుకు అహంకారంతో కాదు నేను చేసినాను అని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆ అనుభూతి పొందాలి. రెండవది సాధకుడు ఎవడైనా పట్టుదలతో ఏదనా సాధించవచ్చు అని లోకానికి నిరూపణ చేసేదానిి ఆయనలాగా అంత సాధన ఎవరు ఈ కాలంలో చేయగలరు. పోతాంది జనరేషన్స్ కలి ప్రవేశం ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే ఆ చెప్పానే 1950 ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అవధూతలు మహానుభావుల శక్తులు ఇప్పుడు అంతగా పని చేయని స్థితికి వస్తు
(29:55) పని చేయని స్థితికి వస్తాడు అది కారణం అయితే ఈ సాధనలో సాధనలో క్షేత్రాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్షేత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఆ క్షేత్రం వల్ల ఒక వ్యక్తి ఎలా ఉంటుంది ఒక గురువు అయినా సరే క్షేత్రాల్లో చాతుర్మాస దీక్షలు చేస్తుంటారు. ఎందుకు ఆ క్షేత్రాల్లో చాతుర్మాస దీక్షలు చేస్తుంటారు. ఎందుకని ఇప్పుడు కొంతమంది నేను చూసినప్పుడు వెళ్ళినప్పుడు ఫలాని స్వామీజీ ఫలాని క్షేత్రంలో చాతుర్మాస దీక్ష అనేసి అంటుంటారు.
(30:34) ఎందుకు ఆ క్షాత్ర మాస్ట దీక్షలో పలాని పర్టికులర్ క్షేత్రాల్లోని చేస్తుంటారు వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుంది క్షేత్రము గురువుకి ఎలా ఉపయోగపడుతుంది క్షేత్రము సాధకుడికి ఎలా ఉపయోగపడుతుంది క్షేత్రం స్థిర క్షేత్రం అదే అయితే చలక్షేత్రం ఇది కృష్ణ భగవానుడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఇది క్షేత్రము అని అంటున్నాడు కదా ఈ దేహం అనేది ఒక క్షేత్రం ఆ పుణ్యక్షేత్రానికి ఈ క్షేత్రానికి కాంటాక్టివిటీ సరిగ్గా ఉన్నప్పుడు ఈయన చేసే సాధనలు అక్కడ తొందరగా పరిపుష్టం అవుతాయి.
(31:10) ఇవి ఎక్కడ నాకు జరుగుతాయిరా బాబు అని చెప్పేదానికి చాతుర్మాస దీక్ష ఒకే చోట నాలుగు నెలలు ఉండి చేసేదానికి ఈ సంవత్సరం ఇక్కడ చేస్తే ఇంకో సంవత్సరం ఇంకో చోట చేస్తూ పోతారు. ఏదో ఒక క్షేత్రంలో ఈ క్షేత్రానికి ఆ క్షేత్రానికి కాంటాక్టివిటీ వచ్చేస్తుంది. అక్కడ ఆయన కోరుకున్న సంకల్పాలు తీరుతాయి. అందుకని ఈ చాతుర్మాస దీక్షలో క్షేత్ర దర్శనాలు చేస్తుంటారు. పాతకాలంలో ఉన్నది తీర్థ క్షేత్రాలు రెండే తీర్థాలు అంటే నదీ పరివాహక ప్రాంతాలు క్షేత్రాలు అంటే పుణ్యక్షేత్రాలు పూరి జగన్నాథ క్షేత్రము తిరుమల క్షేత్రము బద్రీ కేదారు ఇంకఎన్ని ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాద శక్తిపీఠాలు
(31:56) [గురకలు] స్వయంభు నారసింహ క్షేత్రాలు ఇన్నీ మహత్తరమైనటువంటి వైబ్రేషన్స్ ఉన్న ప్రదేశాలు ఆ వైబ్రేషన్ తో మీ వైబ్రేషన్ ట్యూన్ కావగలగాలి. అక్కడ మనకు ఏ ఆటంకాలు లేకుండా సాధన పరిపుష్టంగా తొందరగా ఫలిస్తుంది. అందుకని పూర్వకాలంలో ఈ చాతుర్మాస వ్రతము అని పెట్టి ఈ సంవత్సరం ఈ క్షేత్రము ఇంకో సంవత్సరం ఇంకో క్షేత్రమ అని తిరిగి నాలుగు నెలలు అక్కడ ఉంటే ఆ నాలుగు నెలల్లో ఈ క్షేత్రానికి ఆ క్షేత్రానికి ఒక కాంటాక్టివిటీ అనేది కుదిరితే వాళ్ళ సాధనలు పరిపుష్టమైతే వస్తాయి.
(32:35) సాధించి పొందేది సాధన ద్వారా పొందేది కాబట్టి దాని సాధన చేసేవాడిని సాధకుడు అంటాడు. సిద్ధుల కోసం ప్రయత్నించి సిద్ధులు పొందిన వాడిని సిద్ధుడు అంటాం. దైవానుగ్రహం నాకు కావాలని తపించి తపించి తపించి కూర్చున్న వాడిని తపస్వి అంటాం. మాటలు అనేదాన్ని ఎంత తగ్గించుకొని ఇతరుల గురించిన ఆలోచనలు కూడా మనసులో రానేని స్టేజ్లోకి తీసుకొని పోయిన వాడిని మౌని అంటాం నోటితో మౌనం కాదు అక్కడ మనసు మౌనం కావాలి నోటి మౌనం అందరూ పాటిస్తారు కానీ మనసులో వాడు అట్లా అన్నాడు వాడు
(33:19) ఇట్లా అన్నాడు ఆమె అట్లా అనింది వీడు ఇట్లా అనింది లోపల ఇది చింగరవంగ దీన్ని మౌనం చేయగలిగితే వాడు నిజమైన మౌని తపస్వి మౌని ఋషి ద్రష్ట ఆయా పద్ధతులను బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిలు మార్త పేర్లు మాడతారు చాలా సంతోషం బాబా చాలా మంచి విషయాలు చెప్పిన అంతా మా గురు కటాక్షం చాలా సంతోషం ఇప్పటివరకు అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందాం మరొక్కసారి మరొక విశిష్టతితో కలుసుకుందాం అంతవరకు సెలవ నమస్కారం

No comments:

Post a Comment