PRATIKULA VEDAM
23 hours ago
మీరు ఏనాడైనా ఆలోచించారా? ఒక మనిషి తనని తాను గొప్పవాడు అని నిరూపించుకోవడానికి, ఎందుకు ఎదుటివాళ్ల బట్టలని, ఆభరణాలని reference గా తీసుకోవాలి? The answer lies in a historical inferiority complex.
🟠Point No.1
19th century కి వెళ్దాం. British వాళ్లు India కి వచ్చినప్పుడు, వాళ్ళు suits, boots వేసుకునేవాళ్లు. మనవాళ్లు ధోవతి కట్టుకుని, చెవులకి కుండలాలు, చేతులకి కడియాలు వేసుకునేవాళ్లు. అప్పుడు ఆ British colonizers మన మగాళ్లని చూసి ఏమన్నారో తెలుసా? Effeminate అన్నారు. అంటే "వీళ్ళు ఆడవాళ్ళ లాగా ఉన్నారు, వీళ్ళకి పౌరుషం లేదు, వీళ్ళు weak" అని ఎద్దేవా చేశారు. వాళ్ళ దృష్టిలో pants వేసుకోవడం masculinity, flowing garments కట్టుకోవడం, ఆభరణాలు వేసుకోవడం weakness.
అప్పటివరకు రాజుల్లా బతికిన మన మగాళ్ళ ego ఆ దెబ్బకి కుప్పకూలిపోయింది. ఒక తెల్లవాడి ముందు తాను weak అయిపోయాడు. ఇప్పుడు ఆ crushed ego ని ఎక్కడో ఒకచోట satisfy చేసుకోవాలి కదా? అప్పుడే వాళ్ళు తమకంటే కింద ఉన్న ఆడవాళ్ళ మీద ఆధిపత్యం మొదలుపెట్టారు. *"నేను వాడి ముందు weak అవ్వొచ్చు, కానీ నీ ముందు నేను దేవుడ్ని. ఎందుకంటే నీ చేతికి గాజులు ఉన్నాయి, నా చేతులు ఖాళీగా ఉన్నాయి"* అని ఒక false superiority ని క్రియేట్ చేసుకున్నారు.
అంటే "నేనేమీ గాజులు తొడుక్కోలేదు" అనే ఈ famous dialogue, మన పౌరుషానికి సింబల్ కాదు.. ఒక బానిస తన యజమానిని చూసి నేర్చుకున్న inferiority complex కి నిదర్శనం.
⚪Point No. 2
Gym లో 100 kg lift చేయగానే, కండలు పెంచగానే అది strength అనుకుంటున్నారు. తప్పు. అది కేవలం 'Force'. Nature దృష్టిలో అసలైన strength అంటే 'Survival'. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు అన్నదే అసలైన బలం.
Demographers అండ్ Biologists prove చేసిన ఒక mind-blowing fact ఏంటంటే.. 1943 Bengal Famine కరువు సమయంలో కానీ, 1918 Spanish Flu టైంలో కానీ.. extreme starvation, జబ్బులు వచ్చినప్పుడు మగాళ్ల కంటే ఆడవాళ్ళే ఎక్కువ survive అయ్యారు.
ఎందుకంటే, మగాడి body కేవలం బరువులు మోయడానికి మాత్రమే design అయ్యింది. కానీ ఒక స్త్రీ శరీరం, harsh conditions ని, starvation ని తట్టుకుని నిలబడేలా biologically superior గా evolution చెందింది. తిండి లేకపోయినా తన శరీరంలో ఉన్న reserves ని వాడుకుని అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా బతకగల capacity ఆ గాజులు వేసుకున్న చేతులకే ఉంది. ఊరికే రోడ్డు మీద గొడవ పడటం పౌరుషం కాదు, ప్రాణాలకే ముప్పు వచ్చినప్పుడు ప్రకృతికి ఎదురొడ్డి నిలబడటమే అసలైన బలం. Now tell me, who is biologically stronger?
🟢Point No. 3
ఇక psychological strength గురించి మాట్లాడుకుందాం. ఒక average కుటుంబంలో మగాడికి job పోయినా, business లో పెద్ద దెబ్బ తగిలినా వాడు ఏం చేస్తాడు? Maximum మంది depression లోకి వెళ్తారు, alcohol కి బానిస అవుతారు, లేదా గదిలో కూర్చుని society కి ముఖం చూపించలేక కుమిలిపోతారు. వాడి ego ఆ failure ని తట్టుకోలేదు.
కానీ అదే ఇంట్లో, ఆ భర్తకి ఏదైనా అయితే, ఆ "చేతకాని గాజులు వేసుకున్న" స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఏడుపు దిగమింగుకుని, బయటికి వెళ్లి, చీర పైకి కట్టి, ఏదో ఒక చిన్న పనికి వెళ్ళైనా సరే, ఆ కుటుంబాన్ని నిలబెడుతుంది. పిల్లల్ని చదివిస్తుంది. ఒంటరిగా ఒక సామ్రాజ్యాన్నే నిర్మిస్తుంది.
అక్కడ ego ఉండదు, responsibility ఉంటుంది.
నిజమైన బలం ఉన్నవాడు, తన బలాన్ని నిరూపించుకోవడానికి పక్కవాడి దుస్తులని కించపరచాల్సిన అవసరం లేదు. లోపల డొల్లతనం ఉన్నవాడు మాత్రమే, పైకి అరిచి తన భయాన్ని కవర్ చేసుకుంటాడు.
ఇకపై ఎవడైనా, "నేనేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదు" అనే Statement వాడితే... వాడి అజ్ఞానాన్ని చూసి జాలి పడండంతే.
https://m.youtube.com/post/UgkxpeLTvkYnkfAKE_vtjErEPKPjITyC93rf
No comments:
Post a Comment