Wednesday, August 5, 2026

Premikula Roju Hero Kunal Singh De@th Mystery | What Really Happened in 2008? || Uday Decodes

Premikula Roju Hero Kunal Singh De@th Mystery | What Really Happened in 2008? || Uday Decodes

Author Name:Uday Talks Real Stories

Youtube Channel Url:https://www.youtube.com/@UdayTalksRealStories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5EfmZo1Vbiw



Transcript:
(00:06) హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేస్ తంబ్నెల్ లో చూస్తే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటది. మనం ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో ఆ హీరో క్రేజ్ ఇప్పటి వాళ్ళకి పెద్దగా తెలియదు కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అతను నటించిన ఫస్ట్ మూవీ తోటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం పరిచయం అయిపోయిండు అండ్ అతని సాంగ్స్ మాత్రం ఇప్పటికీ కూడా ఎంతో మంది కొన్ని వందల సార్లు వినే ఉంటారు.
(00:29) ఆ పాటలు కూడా నేను స్టార్టింగ్ లోనే కొన్ని స్క్రీన్ పైన ప్లే చేస్తా చూడండి. వాను కనులదానా దాండి ఆటలు వాడ సరదా పాటలు పాడ సో ఇదే సాంగ్ టు డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ కార్లో వెళ్తుంటే కూడా ప్లే చేసిండు అది విన్న తర్వాత ఈ హీరో గురించి కొంచెం టాపిక్ రావడంతోటి ఇతని గురించి కూడా నేను రీసర్చ్ చేయడం మొదలు పెట్టిన అప్పుడే ఒక షాకింగ్ విషయం తెలిసింది.
(00:52) నాకు అప్పటివరకు ఇతను ఒక సస్పిషియస్ కండిషన్ లో చనిపోయిండని తెలియదు. అదేదో యాక్సిడెంట్ లో చనిపోయిండు అని అనుకున్నా కానీ ఆ విషయాలు తెలిసిన తర్వాత లిట్రలీ నేను కూడా షాక్ అయిపోయినా అండ్ కోర్టు కూడా అసలు ఆత్మహత్య అని చెప్పినా కూడా వాళ్ళ తండ్రి మాత్రం కొన్ని విషయాలు బయటికి తెచ్చి అవన్నీ మీడియా ముందు పెట్టిండు అండ్ అవి చూసిన తర్వాతనే ఇతని చావు పైన ఎన్నో అనుమానాలు కూడా వచ్చినాయి.
(01:12) సో అవన్నీ ఏంటిదో మనం ఈరోజు ఈ వీడియో లో క్లియర్ గా తెలుసుకుందాం. ఆ రోజు ఫిబ్రవరి 6 2008 ముంబైలోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్ లో నుంచి ఎక్జాక్ట్లీ రాత్రి 9:30 నిమిషాలకి ఆ అపార్ట్మెంట్ 16 ఫ్లోర్ లో నుంచి ఒక అమ్మాయి బాల్కనిీ దగ్గరికి వచ్చి ఎవరైనా రండి ఎవరైనా రండి అని గట్టిగా అరవటం మొదలు పెట్టింది. ఆమె మాటలు విన్న ఆ అపార్ట్మెంట్ లోనే కొందరు పైగా కింద ఉన్న సెక్యూరిటీ గార్డ్ తో సహా వెంటనే ఆ అమ్మాయి అరిచిన ఫ్లోర్ దగ్గరికి వచ్చారు.
(01:41) అండ్ కొద్ది క్షణాల్లోనే ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ ముందు చాలా మంది గుమ్ముడిపోయారు. అండ్ వీళ్ళందరూ ఆ డోర్ ని కొడుతుంటే ఈ అమ్మాయి ఆ డోర్ దగ్గరికి వచ్చి నాకు ఈ డోర్ ఓపెన్ చేయడానికి రావట్లేదు ఎలాగైనా బ్రేక్ చేసుకొని రండి అని ఇంకా గట్టిగా అరవటం మొదలు పెట్టింది. సో ఆ అమ్మాయికి ఏమన్నా జరుగుతుందేమో అని భయపడి కొందరు వెంటనే ఒక కార్పెంటర్ ని పిలిపించి ఆ డోర్ ని బద్దల కొట్టి లోపలికి ఎంటర్ అయ్యారు.
(02:01) అంతే అలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ రూమ్లో జరిగిన ఇన్సిడెంట్ ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అండ్ ఇంకొన్ని గంటలలోనే అదే ఇండియాలో ఒక సెన్సేషన్ కేస్ గా మారింది. బాలీవుడ్ కి సతరంగి దునియా వో దునియా జహా అదేంటో కాదు వాళ్ళు ఎంటర్ అయిన హాల్ లోనే ఒక ఫ్యాన్ కి ఒక మనిషి వేలాడుతూ కనిపించిండు.
(02:24) అలా వేలాడుతూ కనిపించిన వ్యక్తి మరెవరో కాదు మనం స్టార్టింగ్ లో ఒక మంచి మూవీ గురించి మాట్లాడుకున్నాం కదా ప్రేమికుల రోజు అని ఆ మూవీ హీరో కుణాల్ సింగ్ గారే సో అది చూసిన వెంటనే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అతని కాళ్ళు గ్రౌండ్ కి టచ్ అవుతూ ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే కొద్ది క్షణాల్లోనే పోలీసులు కూడా అక్కడికి వచ్చేసి ఆ బాడీని మొత్తం ఎగ్జామిన్ చేయడం మొదలు పెట్టిరు.
(02:46) అండ్ అలా అతను చనిపోయే టైం కి ఆ రూమ్లో ఉన్నది ఆ ఒక్క అమ్మాయి మాత్రమే. అసలు అంత హిట్టు కొట్టిన ఆ హీరో నిజంగానే చనిపోయిండా లేదంటే ఎవరైనా చంపిరా అది హత్యనా ఆత్మహత్యనా మరి అతను చనిపోయే కొద్ది క్షణాల ముందే ఆ రూమ్లో ఉన్న ఆ అమ్మాయి ఎవరు మరి ఆ అమ్మాయి అతన్ని ఎందుకు ఆపలేకపోయింది ఆ అమ్మాయికి అతనికి ఏంటి సంబంధం సో కోర్టు పోలీసులు ప్రతి ఒక్కరు ఇది ఆత్మహత్య అని తేల్చినా కూడా ఆ కుణాల్ సింగ్ గారి తండ్రి మాత్రం ఇది ఆత్మహత్య కాదు అని చివరికి సిబిఐ దాకా వెళ్లిండు మరి సిబిఐ కూడా ఏం చెప్పింది అండ్ కోర్టు ఫైనల్లీ ఏం జడ్జిమెంట్ ఇచ్చింది మరి ఇతని
(03:21) కేస్ లో ఏం జరిగిందో ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కేస లో ఏం జరిగిందో చూద్దాం. [సంగీతం] [సంగీతం] అండ్ ఈ కేస్ డీటెయిల్స్ తెలుసుకునే ముందే కుణాల్ సింగ్ గారి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. యాక్చువల్ గా కుణాల్ సింగ్ గారికి చిన్నప్పటి నుంచే సినిమాలు చేయాలన్నా గాని సినిమాల్లో యాక్ట్ చేయాలన్నా కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు వాళ్ళ నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్ చిన్నప్పటి నుంచే అతన్ని చూస్తూ పెరిగిండు కాబట్టి అతనికి కూడా ఇలా ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉండేది. అందుకోసమే అతను
(03:54) చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ పైన కూడా ఫోకస్ చేసేవాడు. అతను సెప్టెంబర్ 29, 1976 లో హర్యానాలో జన్మించిండు. అలా అతని లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తూ ఉండేది. కానీ కొన్ని అవకాశాలు మనకి ఎప్పుడు ఏ విధంగా వస్తాయో ఎవరికీ అర్థం కాదు. సో సేమ్ అదే విధంగా కుణాల్ గారి లైఫ్ లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఒకరోజు కుణాల్ సింగ్ బెంగళూర్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళిండు.
(04:18) అలా షాప్ బయట క్యాజువల్ గా నిలబడి దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నాడు. సేమ్ అదే టైంలో అటు నుంచి వెళ్తున్న ఒక తమిళ్ డైరెక్టర్ అతని పేరు ఖదీరు అతను అటు సైడ్ వెళ్తున్నప్పుడే సడన్ గా ఇతన్ని చూసిండు. ఎందుకో ఇతన్ని చూసిన తర్వాత అతని ఫీచర్స్ గాని అతని ఫేస్ గట్ గాని ఇతనికి బాగా నచ్చింది. ఇతను నా నెక్స్ట్ సినిమాలో హీరోగా నటిస్తే బాగుంటుందేమో అని అనుకొని అతను ఏమీ ఆలోచించకుండా కార్ పక్క ఆపేసి డైరెక్ట్ కుల్ సింగ్ దగ్గరికి వెళ్లి నీ ఫిజిక్ గాని నీ లుక్ గాని చాలా బాగుంది.
(04:44) నేను ఒక డైరెక్టర్ ని నా నెక్స్ట్ సినిమాలో గనుక నువ్వు హీరోగా నటిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేస్తే ఇతని గురించి ఆల్రెడీ కుణాల్ కి తెలుసు కాబట్టి ఇతను ఒక పెద్ద డైరెక్టర్ే వచ్చి మనల్ని అడిగిండు ఇంత మంచి అవకాశం మనం వదులుకోవద్దు అనుకొని ఏమి ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పిండు. అలా వాళ్ళద్దరి మధ్యల అగ్రీమెంట్ కూడా ఓకే అయింది.
(05:03) అలా మొత్తానికి అతని ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. అండ్ తెలుగులో అది ప్రేమికుల రోజు అండ్ వేరే స్టేట్ లో వేరే లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీ ఎంతలా హిట్ అయిపోయిందంటే అప్పుడున్న కాలేజీ స్టూడెంట్స్ గాని స్కూల్ స్టూడెంట్స్ గాని అసలు చాలా కనెక్ట్ అయిపోయారు. అతని లాగానే హెయిర్ స్టైల్ చేపించుకోవడం కూడా మొదలు పెట్టారు. అండ్ అతనికి ఒక పెద్ద పెద్ద స్టార్లకి ఉండే క్రేజ్ ఒక్కటే మూవీ తోటి వచ్చేసింది.
(05:23) సో అలా ఆ మూవీ హిట్ అవ్వడం తోటి ఇంక అతనికి అతను ఇంక నేను చాలా సక్సెస్ అయిపోయినా ఇంక ఇదే జీవితం అనుకున్నంత నమ్మేసిండు. అలా ఆ సినిమా తోటి అతనికి ఎన్నో అవకాశాలు కూడా వచ్చినాయి. ఒక మంచి స్టార్ లాగా గుర్తింపు కూడా పొందిండు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా ఈ స్టార్డమ క్రేజ్ అనేది నైట్ కి నైట్ రావడం అనేది ఒక పెద్ద అదృష్టమే అది ఎవరికి పడితే వాళ్ళకి కూడా రాదు కానీ ఈ స్టార్డమ ని నిలబెట్టుకోవడం అనేది ఇంకొక పెద్ద యుద్ధం అది దాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు.
(05:55) సేమ్ అదే సిచువేషన్ ఇప్పుడు కుణాల్ సింగ్ గారికి కూడా ఎదురయింది. అండ్ ఈ ప్రేమికుల రోజు మూవీ తర్వాత తమిళ్లో నుంచి అతనికి చాలా అవకాశాలు వచ్చినాయి అండ్ స్టార్టింగ్ లో ఆడియన్స్ కూడా అతనికి చాలా కనెక్ట్ అయిపోయారు కానీ మెల్లమెల్లగా అతని మూవీస్ కూడా చూడడం తగ్గించిరు. అతనికి ఉన్న క్రేజ్ కూడా మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది.
(06:12) అండ్ దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రేమికుల రోజు తర్వాత అతను ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ఏది కూడా పెద్దగా హిట్ కాలేదు అండ్ పెద్దగా కలెక్షన్లు కూడా రాలేదు. సో అందుకోసం మెల్లమెల్లగా ఇతనికి అవకాశాలు రావడం కూడా తగ్గిపోయినాయి. అలా మెల్లగా అతని కెరీర్ మొత్తం డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది బయటోళ్ళకి ఒక చిన్న విషయమే కానీ అనుభవించే అతనికి లిటరల్లీ ఇది ఒక నరకం లాగా అనిపించింది.
(06:35) ఎందుకంటే ఒక యాక్టర్ గా అతనికి ఛాన్సెస్ రావట్లేదు. అతను తీసిన సినిమాల్లో కూడా ఏది పెద్దగా ఆడలేదు. అలా అంత క్రేజ్ చూసిన అతను ఒక్కసారిగా ఎవరు కూడా అతని గురించి మాట్లాడుకోకపోయేసరికి అతను మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయిండు. అలా అతని కెరీర్ డౌన్ అవ్వడం తోటి అతను మెంటల్ గా కూడా చాలా బాధపడడం మొదలు పెట్టిండు. ఈ ఫైనాన్షియల్ గా కూడా స్ట్రగుల్ అవుతూఉన్న టైంలో అతని పర్సనల్ లైఫ్ అనురాధ అనే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకుండు అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అప్పటికే ఇలా ఫ్యామిలీలో కూడా మెల్లమెల్లగా గొడవలు మొదలైనాయి.
(07:02) అండ్ అదే టైం లో అతను ఫ్యామిలీతో కలిసి ముంబైలో సెటిల్ అయిండు. బయటకి చూస్తే అతన్ని ఎవరైనా హే అతనికి ఏముంది పెద్ద స్టార్ అయిపోయేటప్పుడు బాగా సంపాదించే ఉంటాడు అతని కెరీర్ కూడా మొత్తం సెటిల్ అయిపోయింది అని అనుకున్నారు. అలా అతనికి మొత్తం ఛాన్సెస్ తగ్గిపోయేసరికి ఇక్కడి నుంచి కూడా అవకాశాలు రాకపోయేసరికి ఫైనల్లీ అతనే ఒక డిసిజన్ తీసుకుండు అదేందంటే నాకు వేరేవాళ్ళు అవకాశం ఇవ్వడం ఏంది నేనే ఒక సినిమా చేసి నేనే ఎందుకు యాక్టింగ్ చేయొద్దు అని అనుకున్నాడు.
(07:28) అందుకోసం అతను అప్పటివరకు చేసిన సేవింగ్స్ అండ్ ఇంకా అప్పులు కూడా తీసుకొచ్చి అతను సొంతంగా బాలగిరి అనే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి యోగి అనే ఒక హిందీ సినిమాని స్టార్ట్ చేయడం మొదలు పెట్టిండు. అందుకోసం మంచి మంచి యాక్టర్లను కూడా తీసుకున్నాడు. సో అలా గడుస్తున్న అతని లైఫ్ లో అలా ఆ మూవీ గురించి అతను ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉన్నాడు.
(07:49) అయితే ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 6, 2008 నాడు ఇలా మూవీ పైన చాలా బిజీ అయిపోయిండు. అదే టైం లో ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న గొడవలు రావడం తోటి అతని భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది అంటే మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. అలా ఆమె వెళ్ళిన టూ డేస్ తర్వాత ఇతను చేసే ఫిలిం లో కొందరి టీమ్ ని కూడా అతని ఫ్లాట్ కి పిలిపించుకొని ఆ మూవీ గురించి కూడా మొత్తం డిస్కస్ చేసిండు.
(08:10) అదే టైం కి ఆ మూవీలో యాక్ట్ చేసే హీరోయిన్ కూడా లావినా భాటి అనే అమ్మాయిని కూడా ఆ ఫ్లాట్ కి పిలిపించుకొని వీళ్ళ మధ్యలో మొత్తం మూవీ గురించి డిస్కషన్ జరిగింది. సో అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పేమెంట్ విషయంలోనో మరి వేరే స్క్రిప్ట్ విషయంలోనో తెలియదు కానీ ఈ కుణాల్ కి లావినా మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందంట. ఆ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సరే వీళ్ళద్దరు మాట మాట అనుకున్నారు ఆమె కూడా వెళ్ళిపోదాం అనుకొని అదే ఇంట్లో ఉన్న వాష్రూమ్ లోకి వెళ్ళింది.
(08:34) అలా వెళ్ళిన ఒక 10 నిమిషాల తర్వాత ఆ అమ్మాయి బయటికి వచ్చి చూసేసరికి ఆ హాల్ లో అతను ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించిండు. అది చూసిన అమ్మాయి టెన్షన్ భయంతోటి గట్టిగా బాల్కనీ దగ్గరికి వెళ్లి అరుచుకుంటూ అందరినీ పిలిచేసరికి అందరూ వచ్చి కూడా ఆ ఫ్లాట్ ముందుకు చేరి అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను స్టార్టింగ్ లోనే చెప్పిన.
(08:52) సో అలా ఆ బాడీని చూసిన తర్వాత అతని బాడీ పక్కన ఇలాంటి ఆత్మహత్య నోట్ ఉంటది కదా అది కనిపించలేదు అండ్ పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత ఫారెన్సిక్ టీం కూడా వచ్చింది మొత్తం ఎగ్జామిన్ చేస్తుంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఈ లావినా అనే అమ్మాయికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందుకోసం ఆమెని కూడా తీసుకెళ్లి వాళ్ళ స్టైల్ లో వాళ్ళు బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ అమ్మాయి చెప్పిన మాటలు బట్టి ఇదంతా ఒక హత్య కాదు ఆత్మహత్యనే అనుకొని పోలీసులు కూడా ఈ కేస్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేసిరు.
(09:21) కానీ ఈ కునాల్ వాళ్ళ తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ కాబట్టి అతనికి ఎందుకో ఇదంతా ఆత్మహత్యలాగా అనిపించట్లేదు కచ్చితంగా హత్యనే అనుకుంటున్నా అని చెప్పేసి కొన్ని ఎవిడెన్సెస్ చూపించిండు. అవేంటో క్లియర్ గా చెప్తా చాలా ఫోకస్ గా వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇతనిది ఒక మొబైల్ ఉంటది. ఆ మొబైల్ లో ఈ చనిపోయే కొన్ని గంటల ముందే వీళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ తోటి మాట్లాడిండు.
(09:42) అతనితోటి మాట్లాడి నీకు ఇంకొద్ది సేపట్లో నేను పేమెంట్ కూడా చేసేస్తా ఈ మూవీ మొత్తం మనం ఫైనల్ చేసేద్దాం. సో ఎలాంటి పని పెట్టుకోకుండా ఈ మూవీ మీదనే ఫోకస్ చేయని అతనితో చాటింగ్స్ ఇవన్నీ మాట్లాడింది ఉంది. ఒకవేళ నా కొడుకు నిజంగానే చనిపోవాలని అనుకుంటే అతను ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటివి పెట్టుకోడు కదా అని అదొకటి అండ్ ఇంకొకటి ఏంటి అనింటే ఇతను చనిపోయేటప్పటికి ఇతని కాళ్ళు మొత్తం గ్రౌండ్ కి టచ్ అయిపోతున్నాయి.
(10:05) అతను ఆల్మోస్ట్ 6ఫట్స్ ఉంటాడు. సో అలా వేలాడుతున్న టైంలో ఏదనా ఒక సిచువేషన్ లో కచ్చితంగా కాళ్ళు ఫ్లోర్ కి ఆనుతున్నప్పుడు కచ్చితంగా కాళ్ళు కింద పెడతాడు. అలా చనిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని అతనిది ఖచ్చితంగా ఆత్మహత్య అయితే కాదు అని రెండోది చెప్పిండు అండ్ మూడోది ఏంటి అంటే ఎవరన్నా వేలాడితే అంటే హ్యాంగ్ చేసుకొని చనిపోయిండు అంటే కచ్చితంగా వాళ్ళకి ఇట్లా వి ఆకారంలో ఉంటది ఎందుకంటే బాడీ వెయిట్ మొత్తం కింద పడుతుంది కాబట్టి కానీ ఇతని విషయంలో ఫారెన్సిక్ రిపోర్ట్స్ లో ఇచ్చింది అయితే హారిజాంటల్ గా ఉన్నాయి అంటే ఎవరో వెనకాల నుంచి గట్టిగా గొంతు
(10:36) నులిమి చంపేసి ఉంటారు. అందువల్లనే అతనికి ఇలాంటి అచ్చులు పడ్డాయి అని చెప్పిండు. సో థర్డ్ వన్ అది అండ్ ఇంకొకటి ఏంటి అంటే అతను చనిపోయే టైం కి ఇతని మెడ దగ్గర గాని చేతిలోకి గాని కొన్ని గాయాలు కూడా కనిపించినాయి అండ్ అవి కచ్చితంగా ఆత్మహత్య అయితే చేసుకునేది కాదు కచ్చితంగా ఎవరో ఒకరు అతన్ని చంపడానికి ట్రై చేసిరు అని అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ఇతను చనిపోవాలి అనుకుంటే కచ్చితంగా ఏదైనా ఒక నోట్ అయితే రాసిస్తాడు అలాంటిది కూడా ఏం దొరకలేదు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ అబ్బాయి చనిపోయే టైం కి ఆ రూమ్లో ఉన్నది ఆ లావినా అనే అమ్మాయి మాత్రమే ఆ అమ్మాయి డోర్
(11:09) తీయడానికి ఎందుకు ట్రై చేయలేదు అండ్ అదే టైం లో మేము ఎంటర్ ఎంటర్ అయినప్పుడు ఆ అమ్మాయి ముఖంలో కొంచెం టెన్షన్ కూడా పెద్దగా లేదు. ఏదో కవర్ చేయడానికి ఎవరితోటో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. సో దాన్ని కూడా కన్సిడర్ చేయండి అని అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే ఇతను ఎప్పుడైతే చనిపోయిండో ఆ అపార్ట్మెంట్ లో కరెక్ట్ అదే రోజు సిసీ కెమెరాస్ కూడా పని చేయలేదంట.
(11:28) అండ్ ఆ టైంలో ఎవరో సస్పిషియస్ గా ఎంటర్ అయినట్టు కూడా కనిపించిందంట. సో ఇవన్నీ విషయాలు ఈ కుణాల్ సింగ్ వాళ్ళ తండ్రి కోర్టు ముందల పెడితే హైకోర్టు కూడా వెంటనే ఇతను చెప్పిన వాటిన్నిటిని కన్సిడర్ చేసుకొని ఈ కేస్ ని 2009 లో సిబిఐ కి హ్యాండ్ ఓవర్ చేసింది. అండ్ అంతేకాకుండా ఈ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఈ కేస్ మళ్ళీ ఓపెన్ చేసి అప్పుడు ఇతని చావు పైన ఇంకా అనుమానాలు ఇంకా చాలా ఎక్కువ అయిపోయినాయి.
(11:51) ఇలా సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ కేస్ ని స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా ఒక్క క్లూ కూడా వాళ్ళు కలెక్ట్ చేయలేకపోయారు అండ్ ఫైనల్లీ ఇది ఒక ఆత్మహత్య అని డిక్లేర్ చేసేసిరు. అండ్ తండ్రి మాత్రం కచ్చితంగా ఇది ఆత్మహత్య కాదని చెప్పిండు. కానీ కోర్టుకు కావాల్సింది ఎవిడెన్సెస్ అండ్ ఈ ఫారెన్సిక్ టీం చెప్పిన విషయాలు ఏంటి అంటే ఒక్కోసారి అతని కాళ్ళు గ్రౌండ్ కి టచ్ అయినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది.
(12:14) ఒంటి పైన ఉన్న గాయాలు కూడా అతను చనిపోయే టైంలో తగిలించుకున్నవే అందుకే అతను చనిపోయి ఉంటాడు అని చెప్పేసి ఫైనల్లీ ఇదొక ఆత్మహత్య అని కేస్ అయితే క్లోజ్ చేశరు అండ్ కోర్టు కూడా ఇది ఆత్మహత్య అని ఈ కేస్ ని రిజెక్ట్ అయితే చేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది ఇది కచ్చితంగా హత్యనే ఎందుకంటే వాళ్ళ తండ్రి ఇన్ని విషయాలు బయటికి పెట్టిండు దానికి ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వాలి అని కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సిబిఐ ఇన్వాల్వ్ అయింది అంటే కచ్చితంగా వాళ్ళు ఎలాంటి ఎవిడెన్సెస్ ని టాంపర్ చేయడానికి అయితే ఉండదు. సో కచ్చితంగా ఇది వాళ్ళయతే
(12:44) ఆత్మహత్య అని చెప్పిరు కాబట్టి కోర్టు కూడా కేసఅయితే క్లోజ్ చేసేసింది. సో ఇదంతా మనకి చూసిన తర్వాత ఫైనల్లీ కోర్టు ఈ పోలీస్ వాళ్ళు సిబిఐ టీం మొత్తం చెప్పింది ఏంటి అంటే అతను ఈ ఫైనాన్షియల్ గా బాగా అప్పుల్లో కూరుకోపోయి అతనికి సక్సెస్ రాక బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అండ్ ఈ మూవీ కూడా పోతే నా పరిస్థితి ఏంటి అని భయపడిపోయి ఫైనల్లీ అతను రాంగ్ డిసిజన్ అయితే తీసుకొని ఆత్మహత్య చేసుకుండు అని అయితే చెప్పిరు.
(13:10) సో ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది అయితే ఒక సైడ్ కరెక్టే కాకపోతే అండ్ అతని కాళ్ళు గ్రౌండ్ కి టచ్ అవ్వడం అండ్ అతను చనిపోయే ముందు ఈ ఈ మ్యూజిక్ డైరెక్టర్ తోటి మాట్లాడడం ఇవన్నీ వాళ్ళ ఫాదర్ రేస్ చేసిన తర్వాత ఇతని చావు పైన ఇంకా అనుమానాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఈ సోషల్ మీడియాలో ఎన్నో విధాలుగా ఇది ఖచ్చితంగా హత్యనే అన్నట్టు ప్రూవ్ చేయడానికి ఏవేవో ఆర్టికల్స్ కూడా రాశరు.
(13:32) అండ్ వాటిలో అన్నీ కూడా వాళ్ళు ఫిక్షన్ గా అంటే వీళ్ళు క్రియేట్ చేసుకొని అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చుఅని ఈ కేస్ గురించి బాగా అడ్జశరు తప్ప దీంట్లో కూడా అఫీషియల్ రికార్డ్స్ మాత్రం ఎక్కడ కూడా లేవు. నేను కూడా బాగా వెతికిన ఏమన్నా చిన్న అఫీషియల్ ప్రూఫ్ గటంగా దొరికితే దీన్ని హైలైట్ చేద్దామని బట్ సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎవిడెన్స్ ని టాంపర్ చేయడం అంటే ఉండదు కాబట్టి వాళ్ళందరూ ఫైనల్లీ ఇదొక ఆత్మహత్య అని మాత్రం ఈ కేస్ ని క్లోజ్ చేసేసిరు.
(13:56) మరి మీరేమనుకుంటున్నారు ఇవన్నీ విన్న తర్వాత ఇది కచ్చితంగా హత్య ఉండొచ్చా లేదంటే ఆత్మహత్య ఉండొచ్చా ఎవరి మీద డౌట్ ఉందో అనుకుంటారో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు నా వర్షన్ ఏంటి అంటే 90% అయితే ఇది ఆత్మహత్య అనే అనుకుంటున్నా మరి ఇంకొక 10% ఉండొచ్చేమో అని కూడా అనుకుంటున్నా ఎందుకంటే అండ్ అతని కాల్ డేటా రికార్డ్స్ లో కూడా అతను ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుండు.
(14:15) ఒకవేళ చనిపోయే అబ్బాయి కచ్చితంగా ఫ్యూచర్ ప్లాన్స్ ఉండవు. అండ్ నోట్ మాత్రం కచ్చితంగా రాస్తాడు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళని కూడా చూసుకోవాలి అని ఉంటది కదా సో ఇది చూసి అయితే ఆత్మహత్య కాదు అని అనిపించింది కానీ ఈ సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత అది కచ్చితంగా ఆత్మహత్య అనిపించింది.
(14:35) సో ఇతని కేస్ గురించి ప్రతి ఒక్కరు అంటే ఈ చిన్న చిన్న ఇన్ఫ్లయెన్సర్స్ గానిీ యూట్యూబర్స్ గాని మూవీ యాక్టర్స్ గాని సెలబ్రిటీస్ గాని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జీవితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి. మీరు ఒక చిన్న వీడియో క్లిక్ అయింది నేను ఫేమస్ అయినా నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు చాలా సపోర్ట్ వచ్చింది అని నెత్తికఎక్కి కూర్చొని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే మాత్రం లేనిది కూడా చూపించుకొని నేను మొత్తం హైలైట్ కావాలని చూపిస్తే మాత్రం చివరికి నష్టపోయేది మీరే లేనప్పుడు ఎలా ఉన్నారో ఉన్నప్పుడు కూడా అదే విధంగా
(15:05) ఉండడానికి ట్రై చేయండి. మీరు షో ఆఫ్ చేసినంత మాత్రాన మీకు పెద్ద వచ్చేది ఏమీ లేదు. సో మీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ షో ఆఫ్ లు చేయండి. సో చూశరు కదా జస్ట్ 31 ఇయర్స్ కే కుణాల్ సింగ్ గారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కొని అతని ప్రాణాలు కూడా తీసుకునే స్టేజ్ కి వెళ్ళిపోయిండు. కేస్ గురించి మీరు మొత్తం విన్నారు కదా మరి మీ ఒపీనియన్ ఏంటి ఇది నిజంగానే ఆత్మహత్యనా లేదంటే హత్యనా మీరు ఏమనుకుంటురో విత్ క్లియర్ పాయింట్స్ తో సహా కింద కామెంట్ చేయండి అండ్ వాలిడ్ అనిపిస్తే దాన్ని పిన్ కూడా చేస్తా అండ్ ఈ స్టోరీ గనుక మీకు
(15:35) నచ్చితే ఈ కేస్ గురించి ఎక్స్ప్లనేషన్ గనుక మీకు నచ్చితే ఇప్పుడు కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది జర హైప్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెక్స్ట్ ఎవరి కేస్ పైన ఎక్స్ప్లనేషన్ కావాలో కింద కామెంట్ లో చెప్పండి. ఆ కేస్ గురించి డీకోడ్ చేసి మరి క్లియర్ గా తెలుసుకుందాం. సో [గురకలు] నెక్స్ట్ ఇంకొక కేసు తో కలుస్తా అప్పటివరకు ఇక్కడ రెండు వీడియోలు పెడతా చూసేయండి ఉంటా జాగ్రత్త బాయ్

No comments:

Post a Comment