Wednesday, August 5, 2026

 పార్థివలింగారాధన సర్వ శ్రేష్ఠము. ఎందుకంటే మనం పృథ్వీగత జీవులం. అందుకు పృథ్వియందున్న పరమేశ్వర శక్తిని ఆరాధన చేస్తే ఈ పార్థివమైన శరీరములు కూడా ఉత్తమమైన స్థితిని పొందుతాయి. అందుకే పార్థివ లింగారాధన సర్వ శ్రేష్ఠము అని ఆగమాలు చెప్తున్నటువంటి విషయం. 

ఈ పార్థివ లింగారాధన చేయవలసిన పధ్ధతి కూడా శ్రేష్ఠమైన మన్నును తీసుకోవాలి. అది నదీ మృత్తిక, అందులో మళ్ళీ శ్రేష్ఠం గంగా మృత్తిక, పుట్టమన్ను ఇలాంటివి తీసుకుని ‘శ్రీ హరాయ నమః’ అంటూ ఆ మట్టిని సేకరించాలి. ‘శివాయ నమః, మహేశ్వరాయ నమః’ మొదలైన నామాలతో లింగంగా తయారు చేసి ఆ లింగం చేసేటప్పుడు కూడా లింగం వేరుగా పానవట్టం వేరుగా చేయరాదు. ఖండంగా చేయరాదు. అఖండంగా చేయాలి. అయితే నెయ్యి మొదలైనవి కొంత రాసినట్లైతే అభిషేకం చేసినప్పుడు నిలుస్తాయి. ఆవిధంగా గట్టి పరచి ఆవాహన మొదలైన శాస్త్ర విధితో చేస్తూ పూజించవచ్చు.           *ఆధ్యాత్మిక కుటుంబం*

No comments:

Post a Comment