ఓం నమో భగవతే వాసుదేవాయ
వర్షం వచ్చి ఉరుములు, మెరుపులు పిడుగులు పడే సమయంలో మనకు కలిగే భయం తీరడానికి అర్జునుడికి ఉన్న పదిపేర్లు పెద్దలు చదువుకోమంటారు.
వీటి వెనుక భారత కథ ఇది. విరాట నగరంలో పాండవుల అజ్ఞాత వాసం పుర్తి కాబోతున్న సమయం, ఉత్తర గోగ్రహణ సందర్భం. ఆయుధాల కోసం ఉత్తర కుమారుడితో కలిసి బృహన్నల (అర్జునుడు) శమీ వృక్షం దగ్గరికి వస్తాడు. కౌరవులను ఎదుర్కోవడానికి ఉత్తర కుమారుడు భయపడుతుంటే తన పదిపేర్లు చెప్పి, అతని భయం పోగొట్టి విశ్వాసం కలిగిస్తాడు.
ఆ పదిపేర్లూ ఇవి.
అర్జునః, ఫల్గునః, పార్థః, కిరీటీ, శ్వేతావాహనః, బీభత్సో, విజయో, కృష్ణః, సవ్యసాచీ, ధనంజయః
ఈ నామాలకు అర్థాలు ఇవి అర్జునుడు అంటే తెల్లనివాడు, ఫల్గుణుడు అంటే ఫల్గుణ నక్షత్రంలో, మాసంలో పుట్టినవాడు, పృథ (కుంతీదేవి) కుమారుడు కనుక పార్థుడు, యుద్ధంలో అతని కిరీటం (కీర్తి) బాగా ప్రకాశిస్తుంది కనుక కిరీటి, తెల్లని గుర్రాలు పూన్చిన రథం కలవాడు కనుక శ్వేత వాహనుడు, అతను యుద్ధం చేసే రీతిని బట్టి భీభత్సుడు, ఎప్పుడూ విజయం అతడినే వరిస్తుంది గనుక విజయుడు, మిక్కిలి ఆకర్షణీయమైన వాడని తండ్రి పెట్టిన పేరు కృష్ణుడు, కుడిచేత్తోనే కాదు ఎడమచేత్తో కూడా ధనస్సును వేయగలడు గనుక సవ్యసాచి, ధనం మీద మోజు లేదు కనుక ధనంజయుడు.
ఈ పది పేర్లూ, వాటి అర్థాలు చెప్పుకుంటే ఏ భయమైనా తీరి పోతుంది.
శుభంభూయాత్
Source - Whatsapp Message

No comments:
Post a Comment