Monday, October 18, 2021

జ్ఞాన సాధన

💫 జ్ఞాన సాధన 🎊

మనం ఒక చోటకి వెళ్ళాలనుకున్నాం. అడ్రస్ తేలిస్తే నేరుగా త్వరగా వెళ్లొచ్చు.  కానీ నీకు చోటు తెలుసు కానీ అడ్రస్ తెలీదు, అప్పుడు దారిన పోయే వారందరిని ఎటెళ్ళాలని అడుగుతూ పోవాలి. దారి తప్పితే గమ్యం చేరలేం.

అలాగే జ్ఞాన సాధన కూడా ! గమ్యం చేరడానికి మార్గం తెలిస్తే ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా గమ్యాన్ని చేరవచ్చు.

ఆ మార్గాన్ని చూపే వాడే గురువు. అయన చెప్పిన మాట మీద శ్రద్ధ ఆసక్తి ఉండాలి. గురువుగారు చెప్పినదే వేదం. కాబట్టి గమ్యం చేరతావా లేదా అన్నది సాధన మీద ఆధారపడి ఉంటుంది.

కొందరు గురువు లేకుండా సాధనచేస్తే దారి తప్పే ప్రమాదముంది. గమ్యాన్ని చేరడం దుస్సాధ్యం.

గురువు అనుగ్రహంతోనే అహంకారం పోయి అజ్ఞానం తొలగి పరిపూర్ణ జ్ఞానం లభిస్తుందని పెద్దలు చెబుతారు.

మనిషి జీవితం దుఃఖమయం >
తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వ జన్మ జ్ఞానం ఉండడంతో అయ్యో పుణ్యం సాధన చేయకుంటిని అని దుఃఖిస్తాడు.

ఈ గర్భస్తు నరకం నుండి ఎప్పుడు బయటపడితే మళ్ళీ పదార్థ ప్రపంచంలో పడతానని  దుఃఖిస్తాడు.

బయటకి రాగానే కన్నీళ్ళు పెట్టుకుంటూ పూర్వ జ్ఞానం పోయిందే అని  దుఃఖిస్తాడు.

తల్లి పాలకోసం ఆకలితో  దుఃఖిస్తాడు.

శిశు ప్రాయంలో ఏది చెప్పాలన్నా ఏడుపు తప్ప వేరే మార్గం లేదు.

బాల్యం వచ్చేసరికి విద్య బుద్ధులు నేర్పించడానికి పాఠశాలకు పంపుతారు. విషయం పెరుగుతుందని దుఃఖిస్తాడు.

యవ్వనం రాగానే ఆకర్షణ మొదలవుతుంది ప్రేమ కోసం దుఃఖిస్తాడు.

ఉద్యోగం రాలేదని దుఃఖిస్తాడు.

ఇక్కడ విచారణ చేయాలి ఎందుకు ఎలా జరుగుతోందని అప్పుడే జ్ఞానం కలుగుతుంది. అంతేకాని ఆత్మహత్య చేసుకోరాదు.

పెళ్ళిచేస్తే స్వేచ్ఛ పోయినదని దుఃఖిస్తాడు.

భార్య, బిడ్డలు మాట వినలేదని దుఃఖిస్తాడు.

పక్కవాళ్ళ కంటే మనం తక్కువగా ఉన్నామని దుఃఖిస్తాడు.

వృద్ధాప్యం వచ్చాక నావారు నన్ను చూడలేదని దుఃఖిస్తాడు.

ఆఖరికి మరణ సమయంలో కూడా ఈ వదలడం ఇష్టం లేక అందరి మీద మమకారం పెంచుకుని అయ్యో వాళ్ళకు ఓ దారి చూపించకుండా పోతున్నానని దుఃఖిస్తాడు.

మనస్సు ఈ ప్రపంచంలో ఎన్నోజన్మలు  అనిత్యమైన సుఖాల  కోసం తిరిగి తిరిగి అలసిపోయి చివరికి ఇవేవి నిత్యం కాదని పరమాత్మా వైపుకి తిరుగుతుంది మనస్సు అదే భక్తి అప్పుడు శాంతి తృప్తి లభిస్తాయి.

ఇన్నాళ్ళు నేను నాది అని అహంకార మమకారాలు పెంచుకున్నాను ఇప్పుడు తెలిసింది నేను కాదు, నాది కాదు. అంతా పరమాత్మే ! నేను కేవలం నిమిత్త మాత్రుడను అనే భావన కలుగుతుంది అదే శరణాగతి. మన భక్తికి మెచ్చి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

మనం బయట ప్రపంచాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని  వెతికి తెలుసుకుంటాము, కానీ బయట వెతకాల్సిన అవసరం లేదు.

మనలోనే ప్రపంచం ఉంది, పరమాత్మా ఉన్నాడు. కాబట్టి మన గురించి మనం తెలుసుకుంటే చాలు.  బంధం, మోక్షము  కూడా మనలోనే ఉన్నాయి. అంతర్ముఖత చెందాలి అప్పుడు విచారణ, అన్వేషణ మొదలవుతుంది ! ఇందుకు ముందుగా గురువు గారిని ఆశ్రయించాలి.

🙏🇮🇳😷🔮💉🎊🪴🦚🐍

సేకరణ

No comments:

Post a Comment