Friday, October 15, 2021

మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి పాటించవలసినవి..

మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి పాటించవలసినవి..

విలువ లేని చోట మాట్లాడకు

గౌరవం లేని చోట నిలబడకు

ప్రేమ లేని చోట ఆశ పడకు

నీకు నచ్చని విషయాలకి క్షమాపణ చెప్పకు

నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు

నిర్లక్ష్యం వున్న చోట
ఎదురు చూడకు

అలక్ష్యం వున్న చోట
వ్యక్త పరచకు

వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు

ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు

చులకనగా చూసే చోట చొరవ చూపకు

జాలి పడి ఇచ్చే ప్రేమకి
జోలి పట్టకు

భారం అనుకునే చోట భావాలు పంచుకోకు

దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు

నిజాయతీ లేనిచోట
నిముషం కూడా వృధా చేయకు

ఆత్మాభిమానం లేని చోట
దనం ఉన్నా నిలబడకు

ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు

కళ్ళతో చూసిందే నమ్ము చెప్పుడు మాటలు వినకు

నీది కాని దేని మీదా ప్రేమ,అభిమానం పెంచుకోకు

శుభ మధ్యాహ్నం💐

సేకరణ

No comments:

Post a Comment