Wednesday, October 20, 2021

నేటి మంచిమాట. ఎదుటి వారిలో లోపం...

నేటి మంచిమాట.
ఎదుటి వారిలో లోపం కానీ,లోపాలు కానీ కనిపిస్తున్నాయి అంటే,అంతకన్నా పెద్ద లోపం,లోపాలు మనలో ఉన్నట్టే.ఇది నిజంగా నిజం.ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ...ఈ అలవాటు క్రమేణా పెరిగి పెద్దదై గ్రహపాటుగా మారి చివరికి మెడకు చుట్టుకుంటుంది.అది మరో చెడు అలవాటుకు కారణం అవుతుంది.
ఆత్మొద్దరణకు అవరోధం అవుతుంది.జన్మ వృదా అవుతుంది.

కాస్త గమనిస్తే గ్రహించ వచ్చు ఇది.ఏదో భాష బాగుందనో,ప్రాస కలుస్తుందనో కాదు రాసింది.అర్దం చేసుకోవటానికి. ఏ కొందరిలోనో తప్పితే దాదాపు అందరిలో కనిపిస్తుంది ఈ లోపం.(అలా అని ఇది లోపమేగా అంటే ఎవరేమి చెయ్యగలరు).

ఇది ఆ మహాత్ముడు గ్రహించే అదేనండి మన తాత గారు ,🙊🙉🙈 చెడు అనకు, చెడు వినకు,చెడు కనకు అని అపుడే చెప్పారు.

కానీ మనకు అర్దం కాలేదో,అవసరం అనిపించ లేదో కానీ ఈ రోజు ఇలా సమాజానికి వైరస్ లాగా అంటుకుని ఎన్నో సమస్యలకు కారణం అయి చివరికి ఆ సమస్యల నుండి బయట పడటానికి ఎంతో విలువైన సమయం,సంపద,శ్రమ ఖర్చు వృదా అవుతుంది. ఇది మనం అందరం చూస్తున్నాం.

ఇక మారతారు అందరూ మారతారు. క్రమంగా మారి తీరుతారు.మనం కూడా అలా మారిన వాళ్ళమే కదా.🙊🙉🙈

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment