Monday, October 25, 2021

నేటి జీవిత సత్యం. మీరు ఒక 'వ్యక్తి ' లా కాకుండా కేవలం ఒక జీవిలా ఉండటం.. నిజానికి మీరు అదే.

నేటి జీవిత సత్యం. మీరు ఒక 'వ్యక్తి ' లా కాకుండా కేవలం ఒక జీవిలా ఉండటం.. నిజానికి మీరు అదే.

మానవ శరీరంతో శిశువు ఈ భూమ్మీదకి వచ్చినప్పుడు మిగతా ప్రాణుల్లా కొద్ది రోజుల్లో తన కాళ్ళపై తాను నిలబడి స్వతంత్రంగా బ్రతకలేదు. ఈ శిశువుకి కావలిసినవి మంచి పోషణ, శిక్షణ. ఈ రెండిటితో రూపుదిద్దుకుంటుంది. ఇది కుటుంబ వాతావరణంలోనే సాధ్యమౌతుంది. అందుకే కుటుంబం అవసరం వచ్చింది. మనిషి ఎదుగుదలకి కుటుంబం యొక్క మద్దతు ఉండి తీరాలి. దురదృష్ట్ట వశాత్తూ చాలామందికి ’కుటుంబం’ మద్దతు కన్నా అడ్డంకి అవుతోంది. ఎదుగుదలకి సహాయపడటం పోయి ఒక చిక్కువలయంలా తయారౌతుంది. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తరచు ఇటువంటి ఇబ్బంది కరమైన పరిస్థితులలో ఇరుక్కుంటారు. దీనికి కారణం కుటుంబం కాదు, కుటుంబాన్ని మీరు పట్టుకున్న విధమే .

మన శ్రేయస్సుకోసం ఏర్పరుచుకున్నదాన్నే మనకి ప్రతికూలంగా అవటానికి ఉదాహరణ కుటుంబం. ఒక్క కుటుంబం విషయంలోనే కాదు వేరే విషయాలలో కూడా ఇలా జరగడం మామూలైపోయింది. ఉదాహరణకి సిరి సంపదలు ఆనందాన్ని తెచ్చిపెడతాయి, కానీ ఎంతోమంది శ్రీమంతులను చూస్తున్నాము, తమ సిరే వారి పాలిట శాపమయింది. విద్య కూడా అంతే, ప్రస్తుతం ఈ భూమిని దోచుకుంటున్నది ఈ విద్యావంతులే కదా? మానవాళిపై కురిసిని ఈ వరాలన్నిటినీ కూడా మనపాలిటి శాపాలుగా మార్చుకున్నాము, ఈ శాపం ఏకంగా మన ఉనికికే ఎసరు పెట్టింది.

నిజానికి కుటుంబం మనకు అన్నివిధాలుగా ఒక మద్దతుగా ఉండాలి, అంతే కానీ ఒక అడ్డుగోడలా మారకూడదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా ఇలా జీవితంలో చిక్కుకు పోవడమనేది, మీ చుట్టూ ఉన్నవారి వల్ల జరగటంలేదు మీ అంతరంగం గురించి మీరేమీ చేయకపోవటమే దానికి కారణం. మీ అంతరంగం కొంత పరిపక్వత, పూర్ణత చెంది స్వతహాగా పూర్ణ జీవిగా భాసిల్లితే, మీకు మరొకర్ని పట్టుకుని వేళ్ళాడే అవసరం తగ్గుతుంది.

ఇలా ఆధారపడవలసిన అవుసరం, ఈ నిర్బంధం, మనశ్రేయస్సు కు అవుసరమైనవే హాని చేయటం, దీనికంతటకీ కారణం అసంపూర్ణ వ్యక్తిత్వం. మీరు రెండు మొక్కల్ని మట్టిలో పక్కపక్కనే నాటారనుకోండి, రెండూ విడి విడిగా, రెంటీకీ కావలసినంత సూర్య రశ్మి వచ్చేలా పెరగాలన్న ఇంగితం వాటికి ఉన్నట్లు మీరు గమనిస్తారు. రెండూ అదే భూమిలో వేళ్ళూనుతాయి, వాటికి అక్కడనుంచి వెళ్ళిపోయే స్వాతంత్ర్యం కూడా లేదు, అయినా రెండూ ఒక పూర్తి ప్రాణిగా బ్రతుకుతాయి, ఒక పరి పూర్ణ ప్రాణిగా బ్రతుకుతాయి. మీరు కూడా అలాగే ఒక పరి పూర్ణ జీవరాశిలా ఇక్కడ కూర్చుంటే ఆ పరిపూర్ణతను అనుభవిస్తారు, అంతే కానీ వ్యక్తిత్వంతో కూర్చుంటే తీవ్రమైన అసంపూర్ణత మిమ్మల్ని పీడిస్తుంది, ఫలితంగా ఎవరో ఒకర్ని పట్టుకుని వేళ్ళాడాలని అనిపిస్తుంది

అయితే సంపూర్ణ వ్యక్తిత్వమంటూ ఏదైనా ఉందా? లేదు, అటువంటిదేదీ లేదు. ఒక జీవి సంపూర్ణంగా ఉండగలడు కానీ అతని వ్యక్తిత్వం ఎప్పుడూ పరిపూర్ణత చవి చూడలేదు. వ్యక్తిత్వం ఎప్పుడు అసంపూర్ణంగానే ఉంటుంది, అది దాని సహజ గుణం. అందుకే మీరు వ్యక్తిత్వం పై ఎంత పెట్టుబడి పెట్టినా దండగే, పైపెచ్చు మీలో అసంపూర్తి ,అభద్రతా భావం పెరిగి, పీడిస్తాయి.

మన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధం గాఢమయ్యేకొద్దీ విడిపోతామన్నభయం కూడా పెరిగిపోతుంది. జీవితంలో ఒకరినుంచి విడిపోవలసి వచ్చినప్పుడు మీ శరీరంలో ఒక భాగాన్ని ఎవరో నరికేస్తున్నంత బాధ. మీమ్మల్ని రెండుగా విడగొట్టినట్లు బాధపడతారు. నిజానికి మీమటుకు మీరు సంపూర్ణ జీవులు, మిమ్మల్ని మీరు పణంగా పెట్టుకునే అవసరం అంతకన్నా లేదు. కాకపోతే మీరు వ్యక్తిగా కాక కేవలం జీవిలా ఉండగాలిగితేనే ఇది సాధ్యమౌతుంది.
ధ్యానం అంటే అదే..మీరు ఒక 'వ్యక్తి ' లా కాకుండా కేవలం ఒక జీవిలా ఉండటం.. నిజానికి మీరు అదే.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment