Friday, October 15, 2021

ఇదే జీవిత సత్యం.

జీవితంలో మంచి స్నేహం దొరకడం గొప్ప వరం . ఎవరైతే మన నవ్వు వెనుక వున్న బాధను గుర్తిస్తారో , ఎవరైతే మన కోపం వెనుక వున్న ప్రేమను గుర్తిస్తారో , ఎవరైతే మన మౌనం వెనుక వున్న అర్థాన్ని గుర్తిస్తారో వారే మనకు నిజమైన స్నేహితులు . ఎవరూ రాయలేని విలువైన పుస్తకం లో పేజీ స్నేహం . మనం కొనలెంది , అరుదుగా దొరికే అదృష్టం స్నేహం . జీవితం అనేది ఒక గ్రంధాలయం అయితే అందులో అనుభవము అనేది ఒక పుస్తకము . అందులో పరిచయం , ప్రేమ , బంధం , స్నేహం , ఆరాటం , ఎదురు దెబ్బలు , కష్టాలు , సుఖాలు , విజయాలు , సన్మానాలు , సత్కారాలు , కీర్తి ప్రతిష్టలు , మనిషి యొక్క గొప్పతనం వారి వారి నడతను బట్టి విలువలు తో గల పేజీలు ఉంటాయి . ఆ పేజీలను జాగ్రత్తగా చదువుకొని మనం నడిచే ప్రవర్తన బట్టి మన భవిష్యత్తు ఉంటుంది . మన సంస్కారము బట్టి మన కుటుంబం ఎలాంటిదో తెలిసి పోతుంది , మనం మాట్లాడే మాటలు బట్టి మన స్వభావం ఎలాంటిదో తెలిసిపోతుంది , మనం చేసే వాదన బట్టి మన జ్ఞానం ఎంతటిదో తెలిసిపోతుంది , మన వినయ విధేయతలు బట్టి మన చదువు నేర్పిన విద్య ఎంతటిదో తెలిసిపోతుంది . జీవించడానికే పోరాడతారు కొందరు , పోరాడడానికే జీవిస్తారు కొందరు . జీవితంలో నటించేవారు కొందరు , నటిస్తూ జీవించేవారు కొందరు జివించినా పోరాడినా నటించినా దాని ఫలితం అనుభవించాల్సింది మనమే . అది అర్థం చేసుకొని ఫలాపేక్ష లేకుండా అవసరమైన చోట తమ సహాయ సహకారాలు అందిస్తే బాధలు అనే ఊబి లో
వున్నవారు ఒడ్డున పడతారు. వారి దృష్టిలో మనం దేవుడిలా కనిపిస్తాము . అదే మనకు సంతృప్తి . మనం చేసిన సహాయం మనం చెప్పకూడదు . సహాయం పొందిన వాళ్ళు చెప్పుకుంటే అది మనకు మంచిది . అందరికీ మంచి చేసే వాళ్ళు ముందుగా చేస్తానని చెప్పరు , చేసిన తరువాత నేనే చేసేనని కూడా చెప్పరు . అటువంటి వారిని మనమే గుర్తించాలి , గౌరవించాలి . ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి . అది కింద పడకుండా వుండాలంటే గాలి కావాలి . .. కానీ ఆ రెండూ ఎవరికీ కనబడవు . మంచి వాళ్ళు చేసే సహాయం కూడా అంతే . ఇది అందరికీ చెప్పాల్సిన పని లేదు , అందవలసిన వాళ్లకు అందితే చాలు అనుకుంటారు. దైవం అంటే గుడిలో వుండే విగ్రహం కాదు ... ప్రతి మనిషి గుండెల్లో వుండే మంచి మనస్తత్వం . ఇదే జీవిత సత్యం . సర్వే జనా సుఖినోభవంతు . శుభోదయం ... Ss

సేకరణ

No comments:

Post a Comment