నేటి జీవిత సత్యం. ఎప్పుడూ ఏదో ఒక సమస్య...
ఒక కూతురు/ కుమారుడు చాలా చిరాగ్గా,కోపంగా,మొహం నిండా బాధతో తండ్రి దగ్గరికి వచ్చింది....
నాన్న..నా వల్ల ఇంక కావట్లేదు..
ఎప్పుడూ ఏదో ఒక సమస్య...
ఒకటి పోతే ఇంకోటి అన్నట్టు సమస్యలు వచ్చిపడుతూనే ఉన్నాయి...
పోరాడి పోరాడి అలసిపోయాను...
ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు...
అని తండ్రికి చెప్పుకుంది...
మీ తండ్రి ఒక chef కూతురిని చెయ్యి పట్టుకుని వంటింటికి తీసుకెళ్ళాడు...
మూడు గిన్నెల నిండా నీళ్ళు నింపి మూడు పొయ్యిల మీద పెట్టాడు...
నీళ్ళు మరగటం మొదలయ్యింది...
ఒక గిన్నెలో బంగాళదుంపలు(potatoes)....
ఇంకో గిన్నెలో కోడిగుడ్లు...
ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేసాడు....
పక్కన కుర్చీలలో ఇద్దరూ కూర్చున్నారు...
తండ్రి ఏమీ మాట్లడట్లేదు అని కూతురు కూడా మౌనంగా తండ్రి చేసేది చూస్తోంది...
నెమ్మదిగా ఆమె/అతనికి అసహనం మొదలయ్యింది..
ఇంకా ఎంతసేపు తండ్రి ఏమీ చెప్పట్లేదు అని...
ఒక ఇరవై నిముషాలు గడిచాక తండ్రి స్టవ్ లు ఆఫ్ చేసి బంగాళదుంపలు ఒక గిన్నెలోకి తీసాడు..
గుడ్లను ఇంకో గిన్నెలోకి తీసాడు...
ఒక పెద్ద గరిటెతో కాఫీ తీసి ఒక కప్పులో పోసాడు...
కూతురి/ కొడుకుని బంగాళదుంపలు ముట్టుకోమన్నాడు...
ముట్టుకుని చూసింది....
గుడ్లు ఎలా ఉన్నాయో పట్టుకోమన్నాడు...
పట్టుకుని చూసింది....
కాఫీ గ్లాసులో పోసిచ్చి తాగమన్నాడు..
వేడి కాఫీ ఊదుకుంటూ తాగింది..
కమ్మటి కాఫీ వాసనకి ..
విసుగ్గా ఉన్న ఆమె మొహాన చిన్న చిరునవ్వు విరిసింది....
ఇప్పుడు చెప్పు మూడు వస్తువులూ ...
వేణ్ణీళ్ళు అనబడే ఒకే పరిస్థితిని,ఒకే కష్టాన్ని ఎదుర్కొన్నాయి...
ముందు బలంగా,గట్టిగా ఉన్న బంగళా దుంపలేమో మెత్తగా,బలహీనంగా మారాయి...
లోపల ద్రవపదార్ధం (సొన) పెంకుతో కప్పబడి త్వరగా పగిలిపోగల సున్నితమైన గుడ్లేమో...
వేడినీళ్ళకి గట్టిగా,బలంగా తయారయ్యాయి...
కాఫీ గింజలేమో కమ్మటి కాఫీలాగామారాయి...
జీవితంలో కష్టాలు ఈ వేణ్ణీళ్ళలాంటివే...
ఆ కష్టాలకు లొంగిపోతున్నట్టే ఉండి వాటిని స్వీకరిస్తూనే కష్టాలను అందమైన,అనువైన ఫలితాలుగా ఎలా మలుచుకోగలమో అదే అసలైన జీవితం .
జీవితం అంటే కష్టాల రూపంలో పరీక్షలు..
బాగా అర్ధం చేసుకుని కష్టాన్ని
ఎలా లొంగదియ్యాలో ,
ఎలా పరిష్కరించాలో,
ఎలా సమాధానపరచాలో ఆ పరిశ్రమే,
ఆ సాధనే జీవితాన్ని ఒడిదుడుకుల్లో కూడా సామరస్యంగా,
కుదురుగా నడిపించుకునే ఓపికని,శక్తిని ఇస్తుంది.
ప్రయత్నించడమే గెలుపు రహస్యం ,మిత్రమా...!
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment