Monday, October 25, 2021

నేటి మంచిమాట. అదుపు పొదుపు మదుపు.

నేటి మంచిమాట.
అదుపు పొదుపు మదుపు.

పొదుపే కాదు అదుపు అనేది అందరికీ అవసరం అత్యవసరం కూడా.ముఖ్యంగా మాటలలో అదుపు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

నిత్యజీవితంలో మనం మాట్లాడే మాటలు ఎక్కువ భాగం వృథావే. అలా మాట్లాడే అలవాటు అదుపు తప్పి ఆపదలు తెస్తాయి తెస్తున్నాయి మనకు తెలుస్తున్నాయి కూడా.

మనం గమనిస్తే అర్దం అవుతుంది.మన ఇంట్లోనూ ఇరుగు పొరుగు వారిలోనూ బంధుమిత్రుల లోనూ సమాజం లోనూ ఈ అలవాటు బాగా విపరీతంగా పెరిగిపోయింది. తద్వారా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మళ్ళీ ఆ సమస్యలు సరిచేసుకోవడానికి ఎదుర్కోడానికి సంపద సమయము శ్రమ కాలం ఖర్చు అవుతుంది.

నిత్య జీవితంలో ఎదురయ్యే అన్నింటిలో అదుపు వుంటే అన్నీ ప్రయోజనాలే లాభాలే. అదుపు లేకపోవడానికి ప్రధాన కారణం ఆహారం. సరికాని ఆహారం తీసుకోవడం వల్ల మనసు ప్రేరేపితం అయి అదుపు తప్పుతుంది. అందుకే సరిఅయిన ఆహారం శాకాహారం శాంతాహారం సాత్వికమైన ఆహారం తీసుకుని మనసు అదుపులో ఉంచుకుని మహారాజులా జీవిద్దాం ఆనందంగా విహరిద్దాం.

మనం తినే ఆహారం శక్తిగా మారి అదుపు లేని మాటలు మాట్లాడటం వలనే అధిక శక్తి ఖర్చు అవుతుంది.అందుకే శ్వాస మీద థ్యాస తో ధ్యానం మౌనం శాకాహారం తీసుకుని అధికంగా ఆయుషు పెంచుకుని ఆనందంగా జీవిద్దాం.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment