ఈరోజు ఎందుకో అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ గురించి రాయాలనిపించింది. వ్రాస్తున్నా...
అమ్మకు ఏమీ తెలియదు
అలారం లేకుండా తెల్లవారు జామున నాలుగ్గంటలకే నిద్రలేవడం తెలుసు
అమ్మకు ఏమీ తెలియదు
నువ్వు నిద్రలేచేటప్పటికి నీకు బెడ్ కాఫీ ఇవ్వడం తెలుసు
అమ్మకు ఏమీ తెలియదు
నువ్వు స్నానం చేసి వచ్చేటప్పటికి నీకు టిఫిన్ రెడీ చేయడం తెలుసు
అమ్మకు ఏమీ తెలియదు
నువ్వు డ్రస్ చేసుకునేటప్పటికి నీకు లంచ్ బాక్స్ సిద్ధం చేయడం తెలుసు
అమ్మకు ఏమి తెలియదు
నీకు వేడి బువ్వ పెట్టి తను చద్దికూడు తినటం తెలుసు
అమ్మకు ఏమీ తెలియదు
నీకు జబ్బు చేస్తే శతకోటి దేవుళ్లకు మొక్కడం తెలుసు
అమ్మకు ఏమీ తెలియదు
నువ్వు విదేశాలకు ఆకాశంలో ఎగిరిపోతే నేలపై నిలుచుని టాటా చెప్పడం తెలుసు
అమ్మకు దూరమైన నాకు తెలుసు
అమ్మంటే లీడర్
అమ్మంటే ప్లానర్
అమ్మంటే ఎగ్జిక్యూటర్
అమ్మంటే టార్గెట్ అచీవర్
అమ్మంటే డాక్టర్
అమ్మంటే ఇంజనీర్
అమ్మంటే ఫిలాసఫర్
అమ్మంటే గైడ్
అమ్మంటే సహనం
అమ్మంటే త్యాగం
అమ్మంటే అన్నపూర్ణ
అమ్మంటే అమ్మలగన్నయమ్మ.
సేకరణ

No comments:
Post a Comment