ఒక చెట్టుకు ఓ గాడిద కట్టేయబడి ఉంది... దాని యజమాని రోజూ దాన్ని అలా కట్టేస్తూ ఉంటాడు...
ఓ రాత్రి ఆ చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది... ఇక ఆ గాడిద గట్టిగా ఒళ్లు విరుచుకుని, మరింత గట్టిగా ఓండ్రపెట్టి లోకంపై పడింది...
ముందుగా ఆ పక్కనే ఉన్న పొలాల్లో అడుగుపెట్టి, ఆ చేను అంతా తొక్కి, ధ్వంసం చేసింది... దీంతో చిర్రెత్తిన ఆ రైతు భార్య గాడిదను ఓ గొడ్డలితో నరికేసింది...
ఇది చూసి కోపం ఆపుకోలేక సదరు గాడిద యజమాని ఆ రైతు భార్యను వేటకొడవలితో నరికేశాడు... ఆమె భర్త ఊరుకుంటాడా...? ఓ గునపం తీసుకొచ్చి ఆ గాడిద యజమాని గుండెల్లో పొడిచాడు... వాడు వెంటనే చచ్చూరుకున్నాడు...
గాడిద యజమాని భార్య ఆగ్రహం పట్టలేక, కొంగు నడుంకు బిగించి కొడుకులను కేకేసింది... వాళ్లంతా కలిసి ఆ రైతు ఇంటికి నిప్పెట్టారు...
తన ఇంటిని మంటల్లో చూసి, ఆ బూడిదతో కళ్లు మండిపోయిన రైతు ఆ గాడిద యజమాని భార్యను, కొడుకులను వెంటాడి వెంటాడి చంపేస్తాడు...
తరువాత కాసేపటికి ఆవేశం తగ్గి, ఆ దెయ్యాన్ని అడుగుతాడు... ‘‘ఎందుకు ఇంతమంది చావుకు కారణమయ్యావు..?’’
దెయ్యం ఏమన్నదంటే..? ‘‘నన్ను అనవసరంగా నిందించకు... నేను ఒక్కరినైనా చంపానా..? చెట్టుకు కట్టేసి ఉన్న ఓ గాడిదను జాలితో విడిపించాను... అంతే... మీరే మీలో ఉన్న అసలు దెయ్యాలను స్వయంగా బయటికి తీసి, ఒకరికొకరు చంపుకున్నారు...’’
మీడియా, సోషల్ మీడియా కూడా అంతే... రోజుకో గాడిద కట్లు తెంపేసి, సమాజం మీదకు వదిలేస్తయ్... మనం వాదాలు, ద్వేషాలతో తన్నుకుంటూ, పాత స్నేహాల్ని కూడా చంపేసుకుంటూ ఉంటాం... కొత్త శత్రువుల్ని ఆహ్వానిస్తుంటాం... సో, బహుపరాక్... అసలు దెయ్యాలు ఎవరో అర్థమైంది కదా... జాగ్రత్త...!!!
.
.
(ఓ ఇంగ్లిష్ పోస్టుకు స్వేచ్ఛానువాదం... గతంలో చదివేసి ఉంటారా..? పర్లేదు, ఇది ఎన్నిసార్లు చదివితే అంత మంచిది... మనసులో బాగా ముద్రపడి మరింత జాగ్రత్తగా ఉంటారు...)
సేకరణ

No comments:
Post a Comment