Friday, October 22, 2021

నేటి మంచిమాట. బాధలు

నేటి మంచిమాట. బాధలు

బాధలు భగవంతుడికే తప్పనపుడు మనకెలా తప్పుతాయి.ఎందుకు తప్పాలి.అమ్మ ఎంత బాధపడి ఎంత బాధ భరించి మనలను ఈ భూమి మీదకు తెచ్చింది.

బాధలు వద్దు అనుకోవడమే అజ్ఞానం.బాధలను భరించగలగడమే జ్ఞానం.అపుడు మహా బలవంతుడుగా మారి మనం కూడా భాహుబలి అవుతాం.

ఏదైనా కోరుకోవాల్సి వస్తె బాధలను భరించగలిగే శక్తి కావాలి అని కోరుకోవాలి.నాటి నుండి నేటివరకు ఏ స్థాయిలో వున్నా,ఏ స్థితిలో వున్నా,ఏ పదవిలో వున్నా చిన్నవారైనా,శ్రీమంతులైనా అసలు బాధలు లేని వారు ఎవరైనా వున్నారా? కాస్తా గమనిస్తే బోధపడుతుంది.

సీతమ్మకి,శ్రీరాముడికి,శ్రీకృష్ణుడికి ఏ బాధలు రాలేదా ?వాటిని భరించి బయట పడలేదా?ఆనాటి నుండి ఈనాటి వరకు కీర్తించ బడటం లేదా?

మనకైనా ఇంతే. బాధలు వచ్చినపుడు కుంగరాదు.బాధలు లేనపుడు పొంగరాదు.ఇవి జీవితంలో భాగమే అని సర్దుకుంటే బాధల తీవ్రత తగ్గి బాగా తేలిక అవుతుంది.సామాన్యడి నుండి సజ్జనుడు వరకూ, గల్లీ నుండి ఢిల్లీ వరకు బాధలు లేనివారు లేరు,వుండరు అని తెలిసింది కదా!

మరి మనకి ఎందుకండీ ఈ బాధలు .అందుకే బాథలను వదిలేద్దాం బ్రహ్మాండంగా బ్రతుకుదాము.బలవంతులం అవుదాం.

బ్రతికుంటే బలుసాకు తిని అయినా బ్రతకొచ్చు అంటారు కదా! నిజంగా నిజమేనండి. బలుసాకో బచ్చలాకో,చుక్కకూరో ,తోటకూరో ,పాలకూరో గొంగూరో,చుక్కకూరో తిని చక్కగా, ఏంచక్కా హాయిగా,ఆరోగ్యంగా,ఆనందంగా బ్రతుకుదాం.శాకాహారం తిందాం.ధ్యానం చేద్దాం.ధన్యం అవుదాం.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment